Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకాదశో7 ధ్యాయః.

నారద ఉవాచ: త్రివిధత్వం కథం చాస్య భస్మనః పరికీర్తితమ్‌ | ఏతత్కథయ మేదేవ మహత్కౌతుహలం మమ. 1

నారాయణ ఉవాచ : త్రివిధత్వం ప్రవక్ష్యామి దేవర్షే భస్మనః శృణు| మహాపాపక్షయకరం మహాకీర్తికరం పరమ్‌. 2

గోమయం యోనిసంబద్ధం తద్ధస్తేనైవ గృహ్యతే | బ్రాహ్మైర్మంత్రై స్తు సందగ్ధం తచ్చాంతి కృదిహోచ్యతే. 3

సావధానస్తు గృహ్ణీయాన్నరోవై గోమయం తు యత్‌ | అంతరిక్షే గృహీత్వా తత్షడంగేన దహే దతః 4

పౌష్టికం త్సమాఖ్యాతం కామదం చ తతః శృణు | ప్రసాదేన దహే దేత త్కామదం భస్మకీర్తితమ్‌. 5

ప్రాతరుత్థాయ దేవర్షే భస్మవ్రతపరః శుచి | గవా గోష్ఠషు గత్వాతు నమస్కృత్వాతు గోకులమ్‌.6

గవాం వర్ణానురూపాణాం గృహ్ణీయా ద్గోమయం శుభమ్‌ | బ్రాహ్మణస్య చ గౌః శ్వేతా రక్తా గౌః క్షత్రియస్య చ. 7

పీతవర్ణా తు వైశ్యస్య కృపా శూద్రస్య కథ్యతే | పౌర్ణమాస్యా మమావాస్యా మష్టమ్యాం వా విశుద్ధధీః 8

ప్రాసాదేన తు మంత్రేణ గృహీత్వా గోమయం శుభమ్‌ | హృదయేన తు మంత్రేణ పిండీకృత్య తు గోమయమ్‌. 9

రవిరశ్మిసుసంతప్తం శుచౌదేశే మనోహరే | తుషేణ వా ఋసైర్వాసి ప్రాసాదేన తు నిక్షిపేత్‌. 10

అరుణ్యద్బవ మగ్నిం నాశ్రోత్రియాగారజం తు వా | తదగ్నౌ విన్యసే త్తం చ శివబీజేన మంత్రతః. 11

గృహ్ణీయా దథ తత్రా గ్నికుండా ద్బస్మ విచక్షణః | నవపాత్రం మాదాయ ప్రాసాదేన తు నిక్షిపేత్‌. 12

కేతకీ పాటలీ తద్వ దుశీరం చందనం తథా | నానా సుగంథి ద్రవ్యాణి కాశ్మీర ప్రభృతీని చ. 13

పదునొకండవ అధ్యాయము

భస్మధారణ విధానము

నారదు డిట్లనెను : దేవా! ఈ భస్మము ముత్తెఱంగులనుండు నంటివి. అదెట్లో నాకు వివరించి చెప్పుము. దానిని వినవేడుకగుచున్నది. నారాయణు డిట్లనెను : దేవా ! భస్మము మూడు విధములు. వివరింతును వినుము. అది పాపహరము - కీర్తికరము - శ్రేష్ఠము నైనది. ఆవుపేడ క్రిందపడకముందే చేతబట్టుకొని పంచబ్రహ్మ మంత్రములతో గాల్చి నచో నది శాంతికరమైన దగును. ఇది పౌష్టికభస్మ మనబడును. ఇక కామదమగు భస్మము గూర్చి వినుము. అట్టు పట్టిన పేడతో చేసిన పిడుకలు ప్రాసాద ''హౌమ్‌'' మంత్రముతో కాల్చి చేసినది కామదభస్మము. నారదా! ఈ భస్మవ్రతము చేయు వాడు వేకువనే లేచి శుచియై గోశాల కేగి గోకులమునకు నమస్కరించవలయును. గోవుల రంగును బట్టి యాయా వర్ణముల వారు పేడ గ్రహించవలయును. బ్రాహ్మణజాతి గోవు తెల్లగను క్షత్రియజాతి దెఱ్ఱగను వైశ్యజాతిది పచ్చగను శూద్రజాతిది నల్లగ నుండును. పున్నమి - అమావాస్య - అష్టమి తిథులందు ప్రాసాద మంత్రముతో గోమయము గ్రహించి ''హృదయాయ నమః'' యను మంత్రముతో దానిని శుద్ధి చేయవలయును. అందు ప్రాసాద మంత్రముతో తౌడు - పొట్టు కలిపి శుద్ధమైన చోట దాని నెండబెట్టవలయును. అరణి నిప్పులోగాని - శ్రోత్రియాగ్నిలోగాని దానిని శివబీజ మంత్రముతో భస్మము చేయవలయును. పిదప నేర్పుతో దాని నగ్నికుండమునుండి తీసి ప్రాసాద మంత్రముతో నొక పాత్రలో భద్రపఱచవలయును. తర్వాత మొగలి - పాటలి - ఉసిరిక - మంచిగంధము మున్నగు పరిమళ ద్రవ్యములను -

నిక్షిపే త్తత్ర పాత్రేతు సద్యోమంత్రేణ శుద్ధధీః | జలస్నానం పురా కృత్వా భస్మస్నాన మతః పరమ్‌. 14

జలస్నానే త్వశక్తశ్చ భస్మస్నానం సమాచరేత్‌ | ప్రక్షాళ్య పాదే హస్తౌ చ శిరశ్చేశాన మత్రతః. 15

సముద్ధూల్య తతః పశ్చాదాననం తత్పురుషేణ తు | అఘోరేణ తు హృదయం నాభిం వామేన తత్పరమ్‌. 16

సద్యో మంత్రేణ సర్వాంగం సముద్ధూల్య విచక్షణః | పూర్వవస్త్రం పరిత్యజ్య శుద్ధవస్త్రం పరిగ్రహేత్‌. 17

ప్రక్షాళ్య పాదౌ హస్తౌ చ పశ్చాదాచమనం చరేత్‌ | భస్మనోధ్ధూలనాభావే త్రిపిండ్రం తు విధీయతే. 18

మధ్యాహ్నాత్ర్పా గ్జలైర్యుక్తం పరతో జలవర్జితమ్‌ | తర్జన్యనామికామద్యై స్త్రీపుండ్రం చ సమాచరేత్‌. 19

మూర్ధ్నిచైవ లలాటే చ కర్ణే కంటే తథైవ చ | హృదయే చైవ బాహ్యోశ్చ న్యాసస్థానం హి చోచ్యతే. 20

పంచాంగుళై ర్న్యసేన్మూర్ద్ని ప్రాసాదేన తు మంత్రతః | త్ర్యంగుళై ర్విన్యసేద్బాలే శిరోమంత్రేణ దేశికః. 21

సద్యేనదక్షిణ కర్ణే వామదేవేన వామతః | అఘోరేణ తు కంఠే చ మధ్యాంగుళ్యా స్పృశేద్గుదమ్‌. 22

హృదయం హృయేనైవ త్రిభిరంగుళిభిః స్పృశేత్‌ | విన్యసే ద్దక్షిణ బాహౌ శిఖామంత్రేణ దేశికః. 23

వామబాహౌ న్యసే ద్ధీమాన్కవచేన త్రియంగుళైః | మధ్యేన సంస్పృశే న్నాభ్యా మీశాన ఇతి మంత్రతః. 24

బ్రహ్మవిష్ణుమహేశానా స్తిస్రో రేఖా ఇతి స్మృతాః | ఆద్యో బ్రహ్మా తతో విష్ణు స్తదూర్ధ్వం తు మహేశ్వరః. 25

ఏకాంగులేన న్యస్తం య దీశ్వర స్తత్ర దేవతా | శిరోమధ్యే త్వయం బ్రహ్మా ఈశ్వర స్తులలాటకే. 26

కర్ణయో రశ్వినై దేవౌ గణశస్తగలే తథా | క్షత్రియశ్చ తథా వైశ్యః శూద్రశ్చోధ్ధూలనం త్యజేత్‌. 27

సర్వేషామంత్య జాతీనాం మంత్రేణ రహితం భ##వేత్‌ | అదీక్షిత మనుష్యాణామపి మంత్రం వినా భ##వేత్‌. 28

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే ఏకాదశోధ్యాయః.

సద్యోజాతాది మంత్రములతో ఆభస్మపాత్రలో నుంచవలయును. తొలుత జలస్నానము చేసి పిదప భస్మస్నానము చేయవలయును. జలస్నానము చేయలేనివాడు భస్మస్నానము చేయవలయును. ఈశాన మంత్రముతో కాలుసేతులు కడుగు కొనవలయును. పిదప తత్పురుష మంత్రముతో ముఖమును అఘోర మంత్రముతో హృదయమును వామదేవ మంత్రముతో నాభిని సద్యోజాతాది మంత్రముతో సర్వాంగములను భస్మముతో పూయవలయును. తర్వాత మొదటి వస్త్రములు విడిచి శుద్ధమైనవి ధరించవలయును. అటు పిమ్మట కాలుసేతులు కడుగుకొని శుద్ధాచమనము చేయవలయును. ఈ విధముగ భస్మము పూసికొనినచో త్రిపుండ్రములైన ధరించవలయును. మధ్యాహ్నమునకు పూర్వము జలయుక్తముగ చేయవలయును. అనగా భస్మము తడిపి పూసికొనవలయును. మధ్యాహ్నము తర్వాత పొడి భస్మము పూసికొనవలయును. చూపుడు-నడిమి-యుంగరపు వ్రేళ్లతో త్రిపుండ్రములు ధరించవలయును. శిరము-నొసలు-చెవులు-కంఠము- హృదయము-బాహువులు ఇవి భస్మము ధరించు తావులు. ప్రాసాద మంత్రముతో నైదు వ్రేళ్లతో తలపైని మూడు వ్రేళ్లతో శిరో (స్వాహా) మంత్రముతో నొసటను భస్మము ధరించవలయును. నడిమివ్రేలితో సద్యోజాత మంత్రముతో కుడిచెవిని వామదేవ మంత్రముతో నెడమచెవిని అఘోర మంత్రముతో కంఠమును తాకవలయును. నమః మంత్రముతో గుండెను శిఖా (వషట్కార) మంత్రముతో కుడిభుజమును కవచ (హుం) మంత్రముతో నెడమ భుజమును ఈశాన మంత్రముతో తొడను తాకవలయును. ఈ మూడు రేఖలు బ్రహ్మ - విష్ణు - మహేశ్వర స్వరూపములు. ఇందు క్రిందినుండి మొదటిది బ్రహ్మ - రెండవది - విష్ణువు - మూడవది శివుడని యెఱుగవలయును. ఒకే వ్రేలితో గీసిన రేఖ కీశ్వరు డధిదేవత. శిరోమధ్యమున నున్న రేఖలకు గణపతియు నధిపతులు. క్షత్రియ - వైశ్య - శూద్రులు శరీర మంతట భస్మము పూసి కొనరాదు. అంత్యజు లందఱును మంత్రరహితముగనే భస్మమును పూసికొనవలయును.

దీక్షితుడు కానివాడును మంత్రరహితముగనే ధరించవలయును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకాదశ స్కంధమున ఏకాదశాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters