Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్దశో ధ్యాయః

వచింత్య మనసా కృత్యం గాధీసూను ర్మహాతపాః | ప్రకల్ప్య యజ్ఞసంభారా న్మునీ నామంత్రయ త్తదా. 1

మునయ స్తం మఖం జ్ఞాత్వా విశ్వామిత్ర నిమంత్రితాః | నాగతాః సర్వ ఏవైతే వసిష్ఠేన నివారితాః. 2

గాధిసూను స్తదాజ్ఞాయ విమనా శ్చాతిదుఃఖితః | అజగామాశ్రమం తత్ర యత్రాసౌ నృపతిః స్థితః. 3

తమాహ కౌశికః క్రుద్ధో వసిష్ఠేన నివారితాః | నాగతా బ్రాహ్మణాః సర్వే యజార్ధం నృపసత్తమ. 4

పశ్య మే తపసః సిద్ధిం యథా త్వాం సురసద్మని | ప్రాపయామి మహారాజ వాంఛితం తే కరోమ్యహమ్‌. 5

ఇత్యుక్త్వా జల మాదాయ హస్తేన మునిసత్తమః | దదౌ పుణ్యం తదా తసై#్మ గాయత్రీ జప సంభవమ్‌. 6

దత్త్వాథ సుకృతం రాజ్ఞే తమువాచ మహీపతిమ్‌ | యథే ష్టం గచ్చ రాజర్షే త్రివిష్టప మతం ద్రితః. 7

పుణ్యన మమ రాజేంద్ర బహుకాలార్జితేన చ | యాహి శక్రపురీం ప్రీతః స్వస్తి తేస్తు సురాలయే. 8

ఇత్యుక్త పతి విప్రేంద్రే త్రిశంకు స్తరసా తతః | ఉత్పపాత యథా పక్షీ వేగవాం స్తపసో బలాత్‌. 9

ఉత్పత్య గగనే రాజా గతః శక్ర పురీం యదా | దృష్టో దేవగణౖస్తత్ర క్రూర శ్చాండాల వేషభాక్‌. 10

పదునాల్గవ అధ్యాయము

త్రిశంకు వృత్తాంతము

అపుడు మహాతపస్వియగు విశ్వామిత్రుడు తన మదిలో నాలోచించుకొని యజ్ఞ ద్రవ్యములు కూర్చుకొని మునుల కాహ్వానములు పంపెను. మునులెల్లరును విశ్వామిత్రుని మంత్రితులై యాగముగూర్చి వినిరి. కాని వసిష్ఠుడు వారింపగ వారు యాగమునకు వెళ్ళలేదు. ఇదంతయును విశ్వామిత్రుడు విని మనసు కలతజెందగ బాధపడి త్రిశంకు రాజున్న చోటి కరిగెను. ''రాజా! వసిష్ఠుడాటంకము చేయగ బ్రాహ్మణు లెల్లరును నీ యజ్ఞమునకు వచ్చుట మానివేసిరి. ఐన నేమి నేను నాతపశ్శక్తి వలన నిన్నపుడే స్వర్గమున కంపి నీ కోర్కి దీర్చగలను. అని మునివరుడు దోసిట నీళ్ళు దీసికొని గాయత్రితో నభిమంత్రించి తన గాయత్రీ జప పుణ్య మతనికి ధారపోసెను. ముని రాజునకు తన పున్నెము ధారపోసి రాజా! నీ విపుడు స్వేచ్ఛగ స్వర్గమున కేగుము. రాజేంద్రా! నేనెంతయో కాలము శ్రమము వెచ్చించి సంపాదించిన గాయత్రీ జప పుణ్య మున స్వర్గమేగుము. అట నీకు మేలగునని మునియనెను. విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే త్రిశంకుడు ముని తపో బలముతో పక్షివలె పైకెగిరెను. అట్లు రాజు స్వర్గ పురమున కెగయగనే దేవగణములు క్రూర చాండల రూపముననున్న రాజును చూచిరి.

కథితోసౌ సురేంద్రాయ కోయ మాయాతి సత్వరః | గగనే దేవన ద్వాయో ర్దుర్దర్శః శ్వపచాకృతిః. 11

సహసోత్థాయ శక్ర స్త మపశ్య త్పురుషాధమమ్‌ | జ్ఞాత్వా త్రిశంకు మపి స నిర్బర్త్స్య తరసాబ్రవీత్‌. 12

శ్వపచ క్వ సమాయాసి దేవలోకే జుగుప్సితః | యాహి శీఘ్రం తతో భూమౌ నాత్ర స్థాతుం తవోచితమ్‌. 13

ఇత్యుక్తః స్ఖలితః స్వర్గా చ్ఛక్రేణామిత్ర కర్శన | నిపపాత తదా రాజా క్షీణపుణ్యో యథామరః. 14

పున శ్చు క్రోశ భూపాలో విశ్వామిత్రేతి చాసకృత్‌ | పతామి రక్ష దుఃఖార్తం స్వర్గా చ్చలిత మాశుగమ్‌. 15

తస్య త్ర్కందితం రాజ న్పతతః కౌశికో మునిః | శ్రుత్వా తిష్ఠేతి హోవాచ పతంతం వీక్ష్యభూపతిమ్‌. 16

వచనా త్తస్య సత్రైవ స్థితో సౌ గగనే నృపః | మునే స్తపః ప్రభావేణ చలితోపి సురాలయాత్‌. 17

విశ్వామిత్రోప్యపః స్పృష్ట్వా చకారేష్టిం సువిస్తరామ్‌ | విధాతుం నూతనాం సృష్టిం స్వర్గలోకం ద్వితీయకమ్‌.

తస్యోద్యమం తథా జ్ఞాత్వా త్వరిత స్తు శచీపతిః | తత్రాజగామ సహసా మునిం ప్రతి తు గాధిజమ్‌. 19

కిం బ్రహ్మ న్ర్కియతే సాధో కస్మాత్కోపసమాకులః | అలం సృష్ట్యా ముని శ్రేష్ఠ బ్రూహి కిం కరవాణి తే. 20

దేవతలింద్రున కిట్లనిరి. దేవతవలె వాయువేగమున నాకాశమున చండాల రూపమున వచ్చువాడెవడు? ఇంద్రుడు వెంటనే లేచి వచ్చుచున్న పురుషాధముని జూచి యతనిని త్రిశంకునిగ నెఱిగి తిరస్కారముతో నిట్లనియెను. ఓరి చండాలుడా! ఈ కంపుగొట్టు రూపముతో దేవలోకమున కేల వచ్చుచున్నావు? నేలమీదికి వెళ్ళుము. ఇచట నుండుటకు నీవు తగవు. రాజా! అటు లింద్రునివలన పున్నెము నశించిన అమరునివలె త్రిశంకుడు స్వర్గసీమనుండి క్రిందపడు చుండెను. అపుడు విశ్వామిత్రా : కాపాడుకాపాడుము. దుఃఖార్తితో స్వర్గమునుండి క్రిందపడుచున్నాను. అని రాజు బిట్టురోదించెను. అట్లు పెద్దగ నేడ్చుచున్న రాజుని గని విశ్వామిత్రముని ఆగుమాగుమని పలికెను. త్రిశంకుడు స్వర్గమునుండి భ్రష్టుడైనను మరల ముని తపః ప్రభావమున నాకాశమున నడుమ నాగెను. అపుడు విశ్వామిత్రు డచట రెండవ స్వర్గలోకము నిర్మింపదలచి యజ్ఞము చేయుటకు నీరుముట్టి సంకల్పించెను. ముని పూనిక తెలిసికొని యింద్రుడు త్వరితముగ విశ్వామిత్రుడున్నచోటికేగి యిట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా! సాధూ! మునివర్యా! ఈ కోపమేమి? ఈ చేయునదేమి ఇక నీ ప్రతిసృష్టి చాలించుము. నీకేమి కావలయునో కోరుము.

విశ్వామిత్రః స్వం నివాసం మహీపాల చ్యుతం తద్బువనా ద్విభో |

నయస్వ ప్రీతియోగేన త్రిశంకుం చాతి దుఃఖితమ్‌. 21

వ్యాసః : తస్య తం నిశ్చయం జ్ఞాత్వా తురాషా డతిశంకితః | తతో బలం విదిత్వోగ్రమోమిత్యో వాచ వాసవః. 22

దివ్యదేహం నృపం కృత్వా విమానవర సంస్థితమ్‌ | ఆపృచ్ఛ్య కౌశికం శక్రోగమ న్నిజపురీం తదా. 23

గతే శ##క్రే తు వై స్వర్గం త్రిశంకు సహితే తతః | విశ్వామిత్రః సుఖం ప్రాప్య స్వాశ్రమే సుస్థిరోభవత్‌. 24

హరిశ్చంద్రోథ తచ్చృత్వా విశ్వామిత్రోపకారకమ్‌ | పితుః స్వర్గమనం కామం ముదితో రాజ్యమన్వశాత్‌. 25

అయోధ్యాపతిః క్రీడాం చకార సహ భార్యయా | రూప¸°వన చాతుర్య యుక్తయా ప్రీతిసంయుతః. 26

అతీతకాలే యువతి ర్నసాగర్బవతీ హ్యభూత్‌ | తదా చింతాతురో రాజా బభూవాతీవ దుఃఖితః. 27

వసిష్ఠ స్యా శ్రమం గత్వా ప్రణమ్య శిరసా మునిమ్‌ | అన పత్య త్వజాం చింతాం గురవే సమవేదయత్‌. 28

దైవ జ్ఞోసి భవా న్కామం మంత్ర విద్యావిశారదః | ఉపాయం కురు ధర్మజ్ఞ సంతతే ర్మమ మానద. 29

అపుత్రస్య గతి ర్నాస్తి జానాసి ద్విజసత్తమ | కస్మా దుపేక్షసే జాన న్దుఃఖం మమ చ శక్తి మాన్‌. 30

కలవింకా స్త్విమే ధన్యా యే శిశుం లాలయంతి హి | మందభాగోహ మనిశం చింతయామి దివా నిశమ్‌. 31

ఇత్యా కర్ణ్య ముని స్తస్య నిర్వేద మిశ్రితం వచః | సంచిత్య మనసా సమ్యక్తమువాచ విధేః సుతః. 32

విశ్వామిత్రు డిట్లనియెను : ఓ విభూ ! త్రిశంకురాజు స్వర్గచ్యుతుడయ్యెను. దుఃఖించుచున్న త్రిశంకుని ప్రీతితో మరల నీ లోకమునకంపుము అనెను. విశ్వామిత్రుని తపోబల మింద్రునకు తెలియును. అందుచే నింద్రు డతనికెదురాడలే కటులే యని యంగీకరించెను. ఇంద్రుడు త్రిశంకుని దివ్యదేహునిగజేసి వామానమున గూర్చుండబెట్టి విశ్వామిత్రు ననుమతి పడసి స్వర్గమేగెను. ఇంద్రుడు త్రిశంకుని వెంటతీసుకొని స్వర్గమేగిన పిమ్మట విశ్వామిత్రుడు తన యాశ్రమములో సుఖము లతో నుండెను. విశ్వామిత్రుని మహోపకారమున తన తండ్రి స్వర్గమేగుట విని హరిశ్చందుడు సంతోషించి దేశమును చక్కగ నేలెను. అయోధ్యాపతియగు హరిశ్చందుడు సంప్రీతితో రూపము నిండుపరువము నేర్పగల తన భార్యతో సుఖముల తేలి యాడుచుండెను. ఎంత కాలమైనను రాణి గర్బిణి గాలేదు. అందులకు రాజు చింతాక్రాంతుడై లోలోన మిక్కిలి విచారించుచుండెను. ఒకనాడు హరిశ్చంద్రుడు వసిష్ఠాశ్రమముజేరి మునికి తలవంచి మనస్కరించి తనకు సంతానములేని లోటు వెల్లడించెను. ఓ ధర్మజ్ఞా! నీవు దైవజ్ఞుడవు. మంత్రవిద్యావిశారదుడవు. మానదా! నా సంతతి కేదైన నుపాయము తెల్పుము. ద్విజవర్యా! సంతులేనివానికి సద్గతులు లేవనుట నీకును దెలియును గదా! నీవు శక్తిమంతుడవు. నా దుఃఖ మెఱిగియు నీవేల యూరకున్నావు? నాకన్న పక్షు లెంతయో ధన్యములు. అవి పిల్లలను గని పెంచును. నేను భాగ్యహీను డను. అందుచే రేబవళ్ళు లోన కుమిలిపోవుచున్నాను. అని రాజు దుఃఖముతో బలుకగ విని వసిష్ఠముని తన మదిలో చక్కగ నాలోచించుకొని యిట్లనెను:

వసిష్ఠ ఉవాచ : సత్యం బ్రూషే మహారాజ సంసారేస్మి న్న విద్య తే |

అన పత్య త్వజం దుఃఖం యత్త థా దుఃఖ మద్బుతమ్‌. 33

తస్మాత్త్వ మపి రాజేంద్ర వరుణం యాసదాం పతిమ్‌ | సమారాధయ యత్నేన స తే కార్యం కరిష్యతి. 34

వరుణా దధికో నాస్తి దేవః సంతానదాయకః | తమారాధయ ధర్మిష్ఠ కార్య సిద్ధి ర్బవిష్యతి. 35

దైవం పురుషకార శ్చ మాననీయా విమౌ నృభిః | ఉద్యమేన వినా కార్య సిద్ధిః సంజాయతే కథమ్‌. 36

న్యాయ తస్తు నరైః కార్య ఉద్యమ స్తత్వ దర్శిభిః | కృతే తస్మి న్బవే త్సి ద్ధి ర్నాన్యథా నృప సత్తమ. 37

ఇతి తస్య వచః శ్రుత్వా గురో రమిత తే జసః | ప్రణమ్య నిర్య¸° రాజా తపసే కృతిని శ్చ యః. 38

గంగాతీరే శుభే స్థానే కృత పద్మాసనో నృపః | ధ్యాయ న్పాశధరం చిత్తే చచార దుశ్చరం తపః. 39

ఏవం తపస్యత స్తస్య ప్రచేతా దృష్టి గోచరః | కృపయాభూ న్మహారజ ప్రసన్న ముఖ పంకజః. 40

హరి శ్చంద్ర మువాచేదం వచనం యాదసాం పతిః | వరం వరయ ధర్మజ్ఞ తుష్టోస్మి తపసా తవ. 41

మహారాజా! నీవు పల్కినదంతయు నిజమే. ఈ సంసారమున సంతానము లేనివాడు పొందు దుఃఖము మరెవ్వడును పొందడు. కనుక రాజేంద్రా! నీవు వరుణదేవుని గొలుపుము. అతడు తప్పక నీ కోర్కి దీర్పగలడు. ఓ దర్మిష్ఠా! సంతాన మిచ్చుటలో వరుణుని మించిన దేవుడు లేడు. నీ వతని నారాధించుము. నీ కోర్చి తీరగలదు. రాజులు దైవమును-పురుషకారమును-రెంటిని పాటించవలయును. ప్రయత్నము లేనిచో ఏ కార్యమైనను నెఱవేరజాలదు. తత్వ మెఱిగినవారు న్యాయ ముగ తప్పక ప్రయత్నము చేయవలయును. రాజా! ప్రయత్నించిన సిద్ధించును. లేనిచో సిద్దించదు. అమిత తేజస్వియగు గురుని మాటలువిని యతనికి నమస్కరించి రాజు తపము చేయదలంచి వెడలెను. అతడు గంగాతీరమున మంచి యాశ్రమ మేర్పరచుకొని పద్మాసనమున వరుణుని ధ్యానించుచు తీవ్రముగ తపించెను. అట్లు రాజు తప మొనర్చుచుండగ ప్రసన్నముఖ కమలముగల వరుణుడు దయతో దర్శన మిచ్చెను. అపుడు వరుణుడు హరిశ్చంద్రునితో నిట్లనెను : దర్మజ్ఞా! నేను సంతో షించితిని. నీ తపము గొప్పది. ఏదేని వరము గోరుకొనుము.

రాజోవాచ : అనపత్యోస్మి దేవేశ పుత్రం దేహి సుఖప్రదమ్‌ |

ఋణత్రయాపహారార్థ ముద్యమోయం మయా కృతః. 42

నృపస్య వచనం శ్రుత్వా ప్రగల్బం దుఃఖితస్య చ | స్మితపూర్వం తతః పాశీ తమాహ పురతః స్థితమ్‌. 43

వరుణః : పుత్రో యది భ##వే ద్రాజ న్గుణీ మనసి వాంఛితః | సిద్ధే కార్యే తతః పశ్చా త్కిం కరిష్యసి మే ప్రియమ్‌. 44

యది త్వం తేన పుత్రేణ మాం యజేథా విశంకితః | పశుబంధేన తేనైవ దదామి నృపతే వరమ్‌. 45

రాజోవాచ : దేవ మే మాస్తు వంధ్యత్వం యజిష్యేహం జలాధిపమ్‌ |

పశుం కృత్వా సుతం పుత్రం సత్యమేత ద్ర్బవీమి తే. 46

వంధ్యత్వే పరమం దుఃఖమసహ్యం భువి మానద | శోకాగ్నిశమనం నౄణాం తస్మాద్దేహి సుతం శుభమ్‌. 47

వరుణః : భవిష్యతి సుతః కామం రాజన్గచ్చ గృహాయ వై | సత్యం తద్వచనం కార్యం యద్ర్బ వీషి మమాగ్రతః.

ఇత్యుక్తో వరుణనాసౌ హరిశ్చంద్రో గృహం య¸° | భార్యాయై కథయామాస వృత్తాంతం వరదానజమ్‌. 49

తస్య భార్యాశతం పూర్ణం బభూవాతి మనోహరమ్‌ | పట్టరాజ్ఞీ శుభా శైభ్యా ధర్మపత్నీ పతివ్రతా. 50

కాలే గతేథ సా గర్బం దధార వరవర్ణినీ | బభూవ ముదితో రాజా శ్రుత్వాదో హదచేష్టితమ్‌. 51

కారయామాస విధివ త్సం స్కారా న్నృపతి స్తదా | మాసేథ దశ##మే పూర్ణే సుషువే సా శుభే దినే. 52

తారాగ్రహబలోపేతే పుత్రం దేవసుతోపమమ్‌ | పుత్రే జాతే నృపః స్నాత్వా బ్రాహ్మణౖః పరివేష్టితః. 53

చకార జాతకర్మా೭೭దౌ దదౌ దానాని భూరిశః | రాజ్ఞ శ్చాతి ప్రమోదో భూ త్పుత్రజన్మసముద్బవః. 54

బభూవ పరమోదారో ధన ధాన్యసమన్వితః | విశేషదాన సంయుక్తో గీతవాదిత్ర సంకులః. 55

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే చతుర్దశోధ్యాయః.

రాజిట్లనియెను : దేవేశా! నేను ఋణత్రయము బాపుకొనుటకు ప్రయత్నించుచున్నాను. కనుక సుఖము గల్గించు నొక్క పుత్రుని ప్రసాదింపుము. అని రాజు కన్నీరు ప్రవహింపగపలుకగ విని వరుణుడు తన యెదుట నున్న రాజుతో నవ్వుచు నిట్లనెను: రాజా! నీవు కొరినట్లుగ గుణవంతుడగు పుత్రుడు గల్గినచో నీ కార్యము సిద్ధించిన పిమ్మట నాకేమి ప్రియము గూర్చగలవు? రాజా! నీవు నీ పుత్రుని పశువుగ బంధించి విచారము చెందక నా యజ్ఞము చేయుటకొప్పుకొన్నచో నీకుపుత్రుని ప్రసాదించగలను. రాజిట్లనెను : దేవా ! నాకు సంతాన హీనత్వము లేకున్ననంతే చాలు తప్పక నీకు యజ్ఞమొనర్ప గలను. నా కొడుకును పశువుగ చేయుదును. నా మాట నిజము. నమ్ముము. మానదా! ఈ ప్రపంచమున సంతానము లేకుం డుట భరింపరాని దుఃఖము. సుతుడు నరుల శోకాగ్ని చల్లార్చగలడు. కొడుకు నిమ్ము. వరుణుడిట్లనెను: రాజా! నీకు తప్పక సుతుడు గలుగగలడు. ఇక నీ యింటి కేగుము. నీవు నాతో బలికిన వాక్కును సత్యమొనరింపుము. అని వరుణుడు పలుకగ హరిశ్చంద్రుడు తన యింటికేగి వరుణుని వరప్రదానము గూర్చి తన భార్యకు తెల్పెను. ఆ రాజున కందాల భార్యలు నూర్గురు కలరు. వారిలో శైబ్య పట్టమహిషి. ధర్మపత్ని. పతివ్రత. కొంత కాలమున కావరవర్ణిని గర్బము దాల్చెను. ఆమెకు వేవిళ్లు గల్గుట విని రాజు ప్రమోదభరితుడయ్యెను. ఆమెకు రాజు యథావిధిగ సంస్కారము లొనరింపజేసెను. పిమ్మట పదవ నెలలో నొక శుభదినమున నామె ప్రసవించెను. అపుడు తారాబలము గ్రహబల మనుకూలముగ నుండెను. దేవకుమారుని బోలు కుమారుడు పుట్టగనే రాజు స్నానమాడి విప్రులను దర్శించెను. జాతకర్మాదులొనరించి భూరిదానము లొసగెను. పుత్ర జన్మమున రాజున కమితానంతము గల్గెను. ఆ సమయమున రాజు విశేష దానము లొనరించి యుదారముగ ధన ధాన్యములు దానముచేసి సంగీత నృత్య గోష్ఠులు జరిపించెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మందలి సప్తమ స్కంధమున పదునాల్గవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters