Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోదశోధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : మహాపాతక సంఘా శ్చ పాతకాన్యపరాణ్యపి | నశ్యంతి మునిశార్దూల సత్యం సత్యం నచాన్యథా. 1

ఏకం భస్మ ధృతం యేన తస్య పుణ్యఫలం శృణు | యతీనాం జ్ఞానదం ప్రోక్తం వనస్థానాం విరక్తిదమ్‌. 2

గృహస్థానాం మునే తద్వ ద్ధర్మవృద్ధి కరం తథా | బ్రహ్మ చర్యాశ్రమస్థానాం స్వాధ్యాయ ప్రదమేవ చ. 3

శూద్రాణాం పుణ్యదం నిత్యమ న్వేషాం పాపనాశనమ్‌ | భస్మ నోద్ధూలనం చైవ తథా తిర్యక్త్రి పుండ్రకమ్‌. 4

రక్షార్థం సర్వభూతానాం విధత్తేవైదికీ శ్రుతిః | భస్మనోద్ధూలనం చైవ తథా తిర్య క్త్రి పుండ్రకమ్‌. 5

యజ్ఞత్వేనైవ సర్వేషాం విధత్తే వైదికీ శ్రుతిః | భస్మనోద్దూలనం చైవ తథా తిర్యక్త్రి పుండ్రకమ్‌. 6

సర్వ ధర్మతయా తేషాం విధత్తే వైదికీ శ్రుతిః | భస్మనోద్ధూలనం చైవ తథా తిర్యక్త్రి పుండ్రకమ్‌. 7

మాహేశ్వరాణాం లింగార్థం విధత్తేవైదికీ శ్రుతిః | భస్మనోద్ధూలనం చైవ తథా తిర్యక్త్రి పుండ్రకమ్‌. 8

విజ్ఞానార్థం చ సర్వేషాం విధత్తే వైదికీ శ్రుతిః | శివేన విష్ణునా చైవ బ్రహ్మణా వజ్రిణా తథా. 9

హిరణ్యగర్బేణ తదవతారై ర్వరుణాదిభిః | దేవతాభి ర్ధృతంభస్మ త్రిపుండ్రో ద్ధూలనాత్మకమ్‌. 10

ఉమాదేవ్యా చ లక్ష్మ్యా చ వాచా చాన్యాభిరాస్తికైః | సర్వస్త్రీభి ర్ధృతం భస్మ త్రిపుండ్రో ద్ధూలనాత్మనా. 11

యక్షరాక్షస గంధర్వ సిద్ధవిద్యాధ రాదిభిః | మునిభి శ్చ ధృతం భస్మ త్రిపుండ్రో ద్ధూలనాత్మనా. 12

పదుమూడవ అధ్యాయము

భస్మత్రిపుండ్రధారణ ఫలము

శ్రీనారాయణుడు డిట్లనెను : మునివర్యా! మహాపాతకరాసులు - ఇతర పాపము లన్నియు నీ భస్మధారణమున తప్పక పటాపంచలగును. భస్మము ధరించిన చాలును. వాని పుణ్యఫలము చెప్పనలవి కాదు వినుము. అది యతులకు జ్ఞానమును వనస్థులకు వైరాగ్యము గలిగించును. నారదా! అధి గృహస్థులకు ధర్మమార్గమును బ్రహ్మచారులకు స్వాధ్యాయము నొసంగ గలదు. ఇది శూద్రులకు పుణ్యప్రదము. ఇతరులకు పాపహరము - భస్మ త్రిపుండ్రధారణము సకల ప్రాణులను కాపాడు టకు జరుగును. ఒడలినిండ భస్మము పూసికొనుట - త్రిపుండ్రములు ధరించుట వేదసమ్మతము. యజ్ఞములం దెల్లరును భస్మధారణము చేయవలయును. భస్మధారణము - త్రిపుండ్ర ధారణము అన్ని ధర్మములకును కారణభూతమై యున్నవి. ఇది వేదసమ్మతము భస్మధారణము - త్రిపుండ్ర ధారణము శైవులకు గుర్తులు. ఇది వేద సమ్మతము. త్రిపుండ్ర - భస్మధారణము సకల విజ్ఞాసంపత్తి కొఱకు చేయవలయును. ఇది వేదసమ్మతము. శివుడు - శిష్ణువు - బ్రహ్మ - ఇంద్రుడు హిరణ్యగర్బుడు అతని యవతారములగు వరుణాదులు నెల్లరును భస్మమును - త్రిపుండ్రములను ధరింతురు. ఉమ - లక్ష్మి - సరస్వతియు ఆస్తి కులు - దేవతలు - సకల స్త్రీలును భస్మము - త్రిపుండ్రములు దాల్తురు. యక్షరాక్షసులు - సిద్ధ గంధర్వులు - మునులు నెల్లరును భస్మము త్రిపుండ్రములు ధరించిరి.

బ్రాహ్మణౖః క్షత్రియై ర్వైశ్యైః శూద్రైరపి చ సంకరైః | అపభ్రంశై ర్ధృతం భస్మ త్రిపుండ్రో ద్ధూలనాత్మనా. 13

ఉద్ధూలనం త్రిపుండ్రం చ యైః సమా చరితం ముదా | తఏవ శిష్టా విద్వాంసో నేతరే ముని పుంగవ. 14

శివలింగం మణిః సఖ్యం మంత్రః పంచాక్షర స్తథా | విభూతి రౌషదం పుంసాం ముక్తి స్త్రీవశ్య కర్మణి. 15

భునక్తి యత్ర భస్మాంగో మూర్ఖోవా పండితోపీవా | తత్ర భుంక్తే మహాదేవః సపత్నీకో వృషధ్వజః. 16

భస్మసంఛన్న సర్వాంగ మనుగచ్చతి యః పుమాన్‌ | సర్వపాతకయుక్తోపి పూజితో మానవోచిరాత్‌. 17

భస్మసంఛన్న సర్వాంగం యః స్తౌతి శ్రద్ధయాసహ | సర్వాపాతక యుక్తోపి పూజ్యతే మానవోచిరాత్‌. 18

త్రిపుండ్రధారిణ భిక్షాప్రదానేన హి కేవలమ్‌ | తేనాధీతం శ్రుతం తేన తేన సర్వమనుష్ఠితమ్‌. 19

యేన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మనా కృతమ్‌ | కీకటేష్వపి దేశేషు యత్ర భూతివిభూషణః. 20

మానవస్తు వసేన్నిత్యం కాశీక్షేత్రసమం హి తత్‌ | దుఃశీలః శీలయుక్తోవా యోగయుక్తోప్య లక్షణః. 21

భూతిశాసన యుక్తోవా స పూజ్యో మమ పుత్రవత్‌ | ఛద్మనాపి చరేద్యోహి భూతిశాసన మైశ్వరమ్‌. 22

సోపి యాం గతిమాప్నోతి న తాం యజ్ఞశ##తైరపి | సంపర్కాల్లీలయా వాపి భయాద్వా ధారయేత్తుయః. 23

విధియుక్తో విభూతిం తు సచ పూజ్యోయథాహ్యహమ్‌ | శివస్య విష్ణో ర్దేవానాం బ్రహ్మణ స్తృప్తికారణమ్‌. 24

బ్రహ్మ-క్షత్రియ-వైశ్య-శూద్రులు-సంకర జాతులు ఇతరులును త్రిపుండ్రములు ధరింతురు. మునివర్యా! సంతోషముతో భస్మము నొడలి నిండ పూసికొని త్రిపుండ్రములు ధరించువారే శిష్టులు - విద్వాంసులు. ఇతరులు కారు, ముక్తి కాంతవశ మగుటకు శివలింగము - మణి - మిత్రత్వము - పంచాక్షరీ మంత్రము - విభూతి - ఔషధము ననునవి పురుషులకు సాధన ములు. ఎచ్చట మూర్ఖడుగాని పండితుడుగాని భస్మము ధరించి భోజనము చేయునో - యచ్చట శివపార్వతులు భుజించు చున్నట్లు భావించవలయును. ఒడలినిండ భస్మము పూసికొని యెవడేని ఎచటికేని వెళ్ళినచో నత డెంతటి పాపాత్ముడైనను పూజనీయుడు గాగలడు. ఒడలినిండ భస్మము పూసికొని శ్రద్ధతో దేవుని సంస్తుతించువా డెంత పాపులలో పాపియైనను పూజనీయుడు గాగలడు. త్రిపుండ్రములు ధరించిన వారికి భిక్ష పెట్టువాడు - సర్వము చదివినవాడే - సర్వ మనుష్ఠించిన వాడేయగును. విభూతి పూసికొని త్రిపుండ్రములు దాల్చిన బ్రాహ్మణోత్తముడు మగధదేశములో నున్నను దాని నతడు కాశీ క్షేత్రముగ జేయగలడు. దుశ్శీలుడు - సుశీలుడు యోగయుక్తుడు - యోగరహితుడు నెవడైనను విభూతి ధరించినచో నతడు నా కుమారునివలె నెల్లెడల పూజ్యడగును. ఏదేని నెపముతోనైన విభూతి ధరించినచో అతడు పొందు నుత్తమగతులు - నూఱు యజ్ఞములు చేసినను లభ్యము గావు. భయముతోగాని - సహవాసమునగాని - లీలగగాని - యెవడేని భస్మధారణము చేసిన నతడు పుణ్యాత్ముడే. ఇంక విధిప్రకారము విభూతి ధరించువాడు నా వలె నెల్లెడల పూజనీయు డగును. అతడు బ్రహ్మ - విష్ణు - శివులకు ప్రీతిపాత్రు డగును.

పార్వత్యా శ్చ మహాలక్ష్మ్యా భారత్యాస్తృప్తి కారణమ్‌ | న దానేన న యజ్ఞేన న తపోభిః సుదర్లుభైః. 25

నతీర్థయాత్రయా పుణ్యం త్రిపుండ్రేణ చ లభ్యతే | దానం యజ్ఞాశ్చ ధర్మాశ్చ తీర్థయాత్రాశ్చ నారద. 26

ధ్యానం తప స్త్రీపుండ్రస్య కళాం నార్హంతి షోడశీమ్‌ | రుథా రాజా స్వచిహ్నాంకం స్వజనం మన్యతే సదా. 27

తథా శివ స్త్రీపుండ్రాకం స్వకీయమివ మన్యతే | ద్విజాతి ర్వాన్యజాతిర్వా శుద్ధచిత్తేన భస్మనా. 28

ధారయే ద్యస్త్రీపుండ్రాంకం రుద్రస్తేన వశీ కృతః | త్యక్తసర్వాశ్రమాచారో లుప్తసర్వక్రియోపి సః. 29

సకృత్తిర్య క్త్రిపుండ్రాకం ధారయేత్సోపి ముచ్యతే | నాస్య జ్ఞానం పరీక్షేత న కులం న వ్రతం తథా. 30

త్రిపుండ్రాంకిత భాలేన పూజ్య ఏవ హి నారద | శివమంత్రాత్పరో మంత్రో నాస్తితుల్యం శివాత్పరమ్‌. 31

శివార్చనా త్పరం పుణ్యం న హి తీర్థం చ భస్మనా | రుద్రాగ్నే ర్యత్పరం వీర్యం తద్బస్మపరికీర్తితమ్‌. 32

ధ్వంసనం సర్వదుఃఖానాం సర్వపాప విశోధనమ్‌ | అంత్యజో వాధమో వాపి మూర్ఖోవాపండితోపివా. 33

యస్మిన్దేశే వసేన్నిత్యం భూతిశాసన సంయుతః | తస్మి న్సదాశివః సోమః సర్వభూతగణౖర్వృతః. |

సర్వతీర్థైశ్చ సంయుక్తః సాన్నిధ్యం కురుతేన సదా. 34

ఏతాని పంచ శివమంత్ర పవిత్రితాని భస్మాని కామ దహనాంగభూషితాని |

త్రైపుండ్రకాణి రచితాని లలాటపట్టే లుంపంతి దైవలిఖితాని దురక్షరాణి. 35

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే త్రయోదశోధ్యాయః.

అతడు భారతీ - లక్ష్మీ - పార్వతులకును ప్రీతిపాత్రు డగును. దుర్లభములైన దానము - యజ్ఞము - తపము - తీర్థయాత్ర అను వానిలో దేనితోనైనను త్రిపుండ్రధారణమున గల్గు పుణ్యము లభించదు. నారదా! దానము - ధర్మము - యజ్ఞము - తీర్థ సంసేవనము - ధ్యానము తపము నివన్నియును త్రిపుండ్రధారణములోని పదారవ వంతునకును సరిపోలజాలవు. రాజముద్ర గల దన భటుని రాజు తనవానిగ భావించును. అటులే శివుడును త్రిపుండ్రధారిని తనవానిగ భావించును. బ్రాహ్మణుడుగాని యితరుడుగాని నిర్మలచిత్తముతో భస్మమును త్రిపుండ్రములను ధరించినచో నట్టివానికి రుద్రుడు వశు డగును. సర్వాశ్రమ ధర్మములు - సర్వ కర్మములు విడనాడినవాడును ఒకేయొక్కసారి త్రిపుండ్రములను ధరించనిచో నత డన్ని పాపములనుండి ముక్తు డగును. ఇందుల కతని కులము - జ్ఞానము - వ్రతమును పరీక్షింప నవసరము లేదు. నారదా! త్రిపుండ్రములు నొసట నడ్డముగ దాల్చిన యట్టివాడు పూజ్యు డగును. శివమంత్రమును మించిన మంత్రము శివుని మించిన దైవమును శివార్చనకు మిన్నయగు పుణ్యమును భస్మమువంటి పుణ్యతీర్థమును లేవు. రుద్రాగ్నియొక్క పరమవీర్యమే భస్మమని ప్రసిద్ధి గాంచినది. ఈ భస్మము సర్వపారహరము. దుఃఖశోక శమనము - అంత్యజుడుగాని - నీచుడుగాని - పండితుడు గాని - మూర్ఖుడు గాని విభూతి ధరించి యెచ్చట వసించునో యచ్చోటికి శివుడు పార్వతితో సర్వభూత గణములతో సర్వతీర్థములతో గూడి వచ్చియుండును. కామదహనుడైన శివు నంగములనుండి యుద్బవించి పంచశివ మంత్రములచే పవిత్రితమై విరాజిల్లు భస్మమును త్రిపుండ్రములుగ నేపుణ్యశీలుడు తన నెన్నుదట ధరించునో వాని నొసట వ్రాయబడిన బ్రహ్మవ్రాత చెఱిగిపోవును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకాదశ స్కంధమున పదుమూడవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters