Sri Devi Bagavatham-2    Chapters   

అధ షోడశో7ధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : అథా తః శ్రూయతాం పుణ్యం సంధ్యో పాసన ముత్తమమ్‌ | భస్మధారణ మాహాత్మ్యం కధితం చైవ విస్తరాత్‌. 1

ప్రాతః సంధ్యా విధానం చ కథయిష్యామి తే7నఘ |

ప్రాతః సంధ్యాం స నక్షత్రాం మధ్యాహ్నే మధ్య భాస్కరామ్‌. 2

స సూర్యాం పశ్చిమాం సంధ్యాం తిస్రః సంధ్యా ఉపాసతే | తద్బేదానపి వక్ష్యామి శృణు దేవర్షి సత్తమ. 3

ఉత్తమా తారకోపేతా మద్యమాలుప్తాతారకా | అధమా సూర్యసహితా ప్రాతః సంధ్యా త్రిధా మతా. 4

ఉత్తమా సూర్యసహితా మధ్యమా7స్తమితే రవౌ | అధమా తారకోపేతా సాయం సంధ్యా త్రిధా మతా. 5

విప్రో వృక్షో మూలకాన్యత్ర సంధ్యా వేదః శాఖా ధర్మ కర్మాణి పత్రమ్‌ |

తస్మా న్మూలం యత్నతో రక్షణీయం ఛిన్నో మూలే నైవ వృక్షోన శాఖా. 6

సంధ్యా యేన న విజ్ఞాతా సంధ్యా యేనానుపాసితా | జీవమానో భ##వేచ్ఛూధ్రో మృతః శ్వాచైవజాయతే. 7

తస్మాన్నిత్యం ప్రకర్తవ్యం సంధ్యోపాసన ముత్తమమ్‌ | తదభావే7న్మకర్మాదా వధికారీ భ##వేన్నహి. 8

ఉదయా స్తమయాదూర్ధ్వం యావత్స్యాద్ఘటికాత్రయం | తావత్సంధ్యా ముపాసీత ప్రాయశ్చితాతం తతః పరమ్‌. 9

కాలాతిక్రమణ జాతే చతుర్ధార్యం ప్రదాపయేత్‌ | అథా వా7ష్ట శతందేవీం జప్త్వా77దౌ తం సమాచరేత్‌. 10

యస్మిన్కాలే తు యత్కర్మ తత్కాలా ధీశ్వరీం చతామ్‌ |

సంధ్యా ముపాస్య పశ్చాత్తు తత్కాలీనం సమాచరేత్‌. 11

గృహే సాధారణా ప్రోక్తా గోష్ఠే వై మధ్యమా భ##వేత్‌ | నదీతేరే చోత్తమా స్యా ద్దేవీ గేహేతదుత్తమా. 12

పదునారవ అధ్యాయము

సంధ్యోపాసన విధానము

శ్రీనారాయణ డిట్లనెను : భస్మధారణ విధానము గూర్చి విస్తారముగ చెప్పితిని. ఇపుడుత్తమోత్తమమై పుణ్యప్రదమైన సంధ్యోపాసనమును వివరింతును. శ్రద్దగ వినుము. అనఘా! నీ కిపుడు ప్రాతఃకాల సంధ్యా విధానము తెల్పుదును. నక్షత్రము లుండగ ప్రాతః సంధ్యను రవి నడినెత్తి నుండగ మధ్యాహ్నసంధ్యను సూర్యుడు గ్రుంకకముందే సాయంసంధ్య నిట్లు మూడుసంధ్యల నుపాసించవలయును. సురమునీ! సంధ్యల భేదములను సైతము తెల్పుదును వినుము. ప్రాతః సంధ్య - నక్షత్రము లుండగ చేయు టుత్తమము! తారకలు లేనిచో మధ్యమము సూర్యోదయమైన నధమమని చెప్పబడును. సాయంసంధ్యయును మూడు విధములుగ నలరారును. సూర్యుడున్నచో నుత్తమము. సూర్యుడుస్తమించిన మధ్యమము - నక్షత్రము లుదయించినచో నధమము. బ్రాహ్మణుడు - వృక్షము; సంధ్యలు - వేర్లు; వేదములు - కొమ్మలు; ధర్మ కర్మలు - ఆకులు; కనుక వేళ్లను జాగ్రత్తగ రక్షించవలయును. మూలము నష్టమైన చెట్టెక్కడిది? కొమ్మ లెక్కడివి? ఏ ద్విజుడు సంధ్య నెఱుంగడో సంధ్య నుపాసింపడో యతడు బ్రదికినంతకాలము శూద్రుడే. చచ్చి కుక్క యగును. కాన ప్రతినిత్యము సంధ్యోపాసనము చేయదగినది. అది చేయనివాడే పని చేయుటకు తగడు. ఉదయాస్తమయముల తర్వాత మూడు గడియల వఱకు సంధ్య నుపాసించవచ్చును. అంతకు కాలము మించినచో ప్రాయశ్చిత్తము చేసి కొనవలయును. కాలము నించినచో నాలుగవ యర్ఘ్య మీయవలయును. లేక నూట యెనిమిది మార్లు గాయత్రి జపించిన తర్వాత సంధ్య నుపాసించవలయును. ఏకాలములోనెట్టి కర్మ చేయవలసి వచ్చినను కాలాధీశ్వరియైన సంధ్యనుపాసించిన పిమ్మట కాల్య కృత్యములు దీర్చుకొనవలయును. సంధ్యావందన మింటిలో చేయుట సాధారణము; ఆవుల దొడ్డిలో మధ్యమము; నదితీరమం దుత్తమము; శ్రీదేవీ మందిరంబులం దుత్తమోత్తమము.

యతోదేవ్యా ఉపాసేయం తతో దేవ్యాస్తు సన్నిధౌ | సంధ్యాత్రయం ప్రకర్తవ్యం తదానంత్యాయ కల్పతే. 13

ఏతస్యా అపరం దైవం బ్రాహ్మణానాం న విద్యతే | న విష్ణూపాసమా నిత్యా న శివోపాసనా తథా. 14

యధా భవ స్మహాదేవ్యా గాయత్ర్యాః శ్రుతిచోదితా | సర్వ వేదసారభూతా గాయత్ర్యాస్తు సమర్చనా. 15

బ్రహ్మాదయో7పి నంధ్యాయాం తాం ధ్యాయంతి జపంతి చ |

వేదా జపంతి తాం నిత్యం వేదోపాస్యా తతః స్మృతా. 16

తస్మా త్సర్వే ద్విజః శాక్తానశైవా న చ వైష్ణవాః | ఆదిశక్తి ముపాసంతే గాయత్రీం వేదమాతరమ్‌. 17

ఆచాంతః ప్రాణమాయమ్య కేశవాదికనామభిః | కేశవ శ్చతథా నారాయణో మాధవ ఏవచ. 18

గోవిదదో విష్ణురే వాథ మదుసూదన ఏవచ | తివిక్రమో వామనశ్చ శ్రీధరో7పి తతః పరమ్‌. 19

హృషికేశః పద్మనాభో దామోదర అతం పరమ్‌ | సంకర్షణో వాసుదేవః ప్రద్యుమ్నో7ప్య నిరుద్దకః. 20

పురుషోత్త మాధోక్ష జౌ చ నారసింహో7చ్యుత స్తథా | జనార్దన ఉపేంద్రశ్చ హరిః కృష్ణో7ంతి మ స్తథా. 21

ఓం కారపూర్వకం నామ చతుర్విం శతి సంఖ్యయా |

స్వాహా7ంతైః ప్రాశ##యే ద్వారి నమో ంతైః స్వప్శ యోత్తధా. 22

కేశవాది త్రిభిః పీత్వా ద్వాభ్యాం ప్రక్షాళయోత్కరౌ | ముఖం ప్రక్షాళ##యేద్ధ్వా భ్యా ద్వాభ్యామున్మార్జనంతథా. 23

ఏకేన పాణిం సంప్రోక్ష్య పాదావసి శిరో7పి చ | సంకర్షణాది దేవానాం ద్వాదశాంగాని సంస్పృశేత్‌. 24

ఇదియును దేవ్యుపాసనమే. కనుక దేవీ సన్నిధానమందే మూడు సంథ్య లుపాసించుచున్న ననంత పుణ్యఫలములు కైవసము లగును. బ్రాహ్మాణులకు గాయత్రిని మించిన పరమదైవము వేరేలేదు. విష్ణు - శివుల నుపాసించుటనిత్వానుష్ఠేయములు కావు. శ్రీమహాదేవియగు గాయత్రి నుపాసించుటయే సకల వేదచోదితము - శ్రీమహాదేవియుగు గాయత్రి నుపాసింపుమని శ్రుతి ప్రేరేపించును! కాన గాయత్రి నుపాసించుట ముఖ్యము. బ్రహ్మది దేవతలే సంధ్యలయందు గాయత్రిని ధ్యానించి జపింతురు. వేదములును జపించును. కాన గాయత్రిని వేదోపాస్య గాయత్రి యందురు. ఇట్లు ద్విజు లెల్లరును పరాశక్తి వేదమాతయగు దేవి నుపాసించుటచే శాక్తులగుదురు కాని వైష్ణవులు - శైవులును శాక్తులుగారు. మొదట నాచమించి కేశవాదినామములచే ప్రాణాయామ మొనర్పవలయును. ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మధావాయ స్వాహా - ఓం గావిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయనమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓంవాసుదేవాయ నమః ఓం ప్రద్వుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓంశ్రీకృష్ణాయ నమః ఇట్టు లోంకారముతో కూడిన ఇరువది నాల్గు నామము లుచ్చరింపవలయును. స్వాహాంతమైన కేశవాది నామత్రయముతో నీరు త్రాగవలయును. పిదప నమః గల నామములతో నాయా యంగములను తాకవలయును. మొదటిది బొడ్డునకు చేరిన పిమ్మటద రెండవ మారు - మూడవ మారునిట్ల త్రాగవలయును. నాలుగైదు నామములతో నరచేతులు కడుగుకొనవలయును. హృషీకేశ యని నెడమచేతిని పద్మనాభయని పాదములను ప్రోక్షించవలయును. దమోదరయని శిరమును తాకి సంకర్షణ యని ముఖమును నడిమి మూడు వ్రేళ్లతోను వాసుదేవ - ప్రద్యుమ్న యనిబొటన - చూపుడు వ్రేళ్లతో ముకు పుటములను అనిరుద్ధ - పురుషోత్తమ యని - ఉంగరపు వ్రేళ్లతో కన్నులను అధోక్షజనారసింహ యని చెవులను అచ్యుత యని బొటన - చిటికేన వ్రేళ్లతో నాభిని జనార్దన అని యరచేత హృదయమును ఉపేంద్ర యని శిరమును ఓం హరయే నమః ఓం కృష్ణాయ నమః యని కుడి యెడమ భుజములను తాక వలయును.

దక్షిణ నోదకం పీత్వా వామేన సంస్పృశే ద్బధః | తావ న్న శుధ్వతే తోయం యావద్వామేన న స్పృశేత్‌. 25

గోకర్ణాకృతిహస్తేన మూషమాత్రం జలంపిబేత్‌ | తతో న్యూనాధికం పీత్వా సురాపానీ భ##వేద్ద్విజః. 26

సంహతాంగుళినా తోయం పాణినా దక్షిణన తు | ముక్తాంగుష్ఠ కనిష్ఠాభ్యాం శేషేణాచమనం విదుః. 27

ప్రాణాయామం తతః కృత్వా ప్రణవస్మృతి పూర్వకమ్‌ | గాయత్రీం శిరసా సార్ధం తురీయపద సంయుతమ్‌. 28

దక్షిణ రేచయే ద్వాయుం వామేన పూరితోదరమ్‌ | కుంభేన ధారయే న్నిత్యం ప్రాణాయామం విదుర్బుథా. 29

పీడయే ద్దక్షిణాం నాడీ మంగుష్ఠేన తథోత్తరామ్‌ | కనిష్ఠానామికాభ్యాం తు మధ్యమాం తర్డనీం త్యజేత్‌. 30

రేచకః పూరకశ్చైవ ప్రాణాయామో7థ కుంభకః | ప్రోచ్యతే సర్వశాస్త్రషు యోగిభిర్యతమానసైః. 31

రేచకః సృజతే వాయుం పూర్యేయేత్తు పూరకేణ తమ్‌ | సామ్యేన సంస్థితీర్య తత్కుంభకః పరికీర్తితః. 32

నీలోత్పల దళశ్యామం నాభిమధ్యే ప్రతిష్ఠితమ్‌ | చతుర్బుజం మహాత్మానం పూరకేచింత యేద్ధరిమ్‌. 33

కుంభ##కే తు హృదిస్థానే ధ్యాయేత్తు కమలాసనమ్‌ | ప్రజాపతిం జగన్నాథం చతుర్వక్త్ర పితామహమ్‌. 34

రేచకే శంకరం ధ్యాయే ల్లలాట స్థం మహేశ్వరమ్‌ | శుద్ధస్పటిక సంకాశం నిర్మలం పాపనాశనమ్‌. 35

పూరకే విష్ణుసాయుజ్యం కుంభ##కే బ్రహ్మణో గతిమ్‌ | రేచ కేన తృతీయం తుప్రాప్నుయా దీశ్వరం పరమ్‌. 36

కుడిచేత నీరు త్రాగునపు డెడమచేత నీరు తాకవలయును. ఎడమచేత తాకనంతవఱకు జలము శుద్ధము గాదు. ద్విజుడు తన చేతి నావు చెవియుట్లు చేసి మినిపగింజమునుగునంత నీరు త్రాగవలయును. ఎక్కువ తక్కువలు త్రాగిన నతడు సురాపాయి గాగలడు. కుడిచేతిలోని జలమును బొటన చిటికెన వ్రేళ్ళు వదలి తక్కిన వానితో త్రాగవలయును. పిదప నోంకారమును తన హృదయమందు సంస్మరించుచు చతుష్పాద్‌ గాయత్రిని జపించుచు ప్రాణాయామ మాదరించ వలయును. ఎడమ ముక్కుతో గాలిని పూరించి లోన కంభించి కుడి ముక్కుతో రెచింపవలయును. పండితులు దీనిని ప్రాణాయామ మందురు. కుడి ముక్కును బొటన - చిటికెన - ఉంగరపు వ్రేళ్లతో మూలయవలయును. నడిమి - చూపుడు వ్రేళ్లతో మూయరాదు. ఈపూరక - కుంభక - రేచకములనే ప్రాణాయామమని సకల శాస్త్రములందు విదేయమనస్కులగు - పరమ యోగులు చెప్పిరి. రేచకము వాయువును వదలును. పూరకము నింపును. అది లోన సామ్యము నొందుటే కుంభక మనబరగును. నీలకమలధళ సుందరుడు - చతుర్బుజుడు - మహానీయుడు నాభికమల మధ్యమున విరాజిల్లు చుండును. పూరకమం దట్టి హరిని కుంభకమందు హృదయమున కమలాసనుడు జగన్నాథుడు యగు నలువ ప్రజాపతి ధ్యానించవలయును. రేచక నుందున నెన్నొసట తేజరిల్లుచున్న మహేశుడు - శుద్ద స్పటిక సంకాశుడు - నిర్మలుడు పాపహరుడు - హరుడునైన శంకురుని ధ్యానించవలయును. పూరకమున విష్ణు సాయుజ్యమును కుంభకమున బ్రహ్మ ప్రాప్తియును రేచకమున శంకరుని పరమైశ్వర్యమును లభించును.

పౌరాణాచమనాద్యం చ ప్రోక్తం దేవర్శి సత్తమ | శ్రౌతమా చమనాద్యం చ శృణు పాపాపహ ంమునే. 37

ప్రణవం పూర్వ ముచ్చార్యం గాయత్రీంతు తదిత్యృచమ్‌ | పాదాదౌ వ్యాహృతీస్తిస్రః శ్రౌతాచమనముచ్యతే. 38

గాయత్రీం శిరసా సార్ధం జపేద్వ్యా హృ తిపూర్వికామ్‌ | ప్రతి ప్రణవ సంయుక్తాం త్రిరయం ప్రాణసంయుమః. 39

''సలక్షణంతు ప్రాణానామాయామం కీర్త్యతే ధునా | నానా పాపైకశమనం మహాపుణ్యఫల ప్రదమ్‌''

పంచాంగు ళీభిర్వాసాగ్రం పీడయేత్ర్పణవేన తు | సర్వ పాపహరా ముద్రా వానప్రస్థ గృహ స్ధయోః. 40

కనిష్ఠానామికాంగుష్ఠైర్యతే శ్చ బ్రహ్మచారిణః | ఆపోహిష్ఠేతి తిసృభిః ప్రోక్షణం స్యాత్కుశోదకైః. 41

ఋగంతే మార్జనం కుర్యాత్పాదాంతే వా సమాహితః | నవప్రణవ యుక్తేన ఆపోహిష్ఠేత్యనేన తు. 42

నశ్యే దఘం మార్జనేన సంపత్సర సముద్బవమ్‌ | తత ఆచమనం కృత్వా సూర్యశ్చేతి పబేదపః. 43

అంతః కరణ సంభిన్నం పాపం త్స్య వినశ్యతి | ప్రణవేన వ్యాహృతిభిర్గాయత్ర్యా ప్రణవాద్యయా. 44

ఆపోహిష్ఠేతి సూక్తేన మార్జనం చైవ కారయేత్‌ | ఉద్ధృత్య దక్షిణ హస్తే జలం గోకర్ణ వత్కతే. 45

నీత్వాతం నాసికాగ్రంతు వామకుక్షౌ స్మరేదఘమ్‌ | పురుషం కృష్ణవర్ణం చ ఋతంచేతి పఠేత్తతః. 46

ద్రుపదా వా ఋచం పశ్చాద్దక్షనాసాపుటచేన చ | శ్వాసమార్గేణ తం పాప మానయేత్కరవారిణి. 47

నావలోక్యైవ తద్వారి వామభాగే7శ్మని క్షిపేత్‌ | నిష్పాపం తు శరీరం మే సంజాత మితి భావయేత్‌. 48

నారదమునీ! నీ కింతవఱకును పూరాణాచమనము తెల్పితిని - ఇంక శ్రౌతాచమనము తెల్పెద నాలింపుము. ఓం కారము మొదట సుచ్చరించి పిదప మూడు వ్యాహృతులతోడి గాయత్రిని జపించి యచమించుట శ్రౌతాచమనము. రేచక పూరక కుంభకములందు ప్రతిసారి ప్రణవము - మూడు వ్యాహృతులు గాయత్రి - గాయత్రీ శిరమును (ఓమాపో జ్యోతీరసో మృతం బ్రహ్మభూర్బువస్సు వరోమ్‌) జపించిన ప్రాణాయామ మగును. ఇపుడు సలక్షణము - విలక్షణమునైన ప్రాణాయామమును తెల్పుదును. అది పెక్కు పాపరాసుల నశింపజేసి పూణ్యసంపదలు పెంపొందిచును. ఐదు వ్రేళ్లతో ప్రణవ ముచ్చరించును నాసాగ్రములను బంధించవలయును. ఇది పాపహర ముద్ర - గృహస్థ వానప్రస్థులకు వరము వంటిది. బ్రహ్మచారులు - యతులును - బొటన - చిటికెన - ఉంగరపు వ్రేళ్లతో ప్రాణములు నియమించవలయును. పిదప ''ఆపోహిష్ఠాది'' మూడు మంత్రములతో ముమ్మారు కుశోదకమును ప్రోక్షించుకొనవలయును. లేక మూడు ఋక్కులలోని తొమ్మిది పదాలకు మొదట ప్రణవము చేర్చి పలికి శరీరముపై మార్జనము చేసికొనవలయును. ఒక్కసారి చేసిన మార్జనమున సంవత్సర మంతట చేసిన పాప మంతయును నశించును. పిదప సూర్యశ్చయను మంత్రముతో జలము త్రాగవలయును దీనివలన నతని హృదయములోని పాపపంక మంతయు తొలగిపోవును. తర్వాత ప్రణవము - మూడు వ్యాహృతులతో గాయత్రి ప్రణవముతోడి ''ఆపోహిష్ఠా'' యను సూక్తమున మార్జన చేసికొనవలయును. ఆవు చెవివంటి పుడిసిట జలము తీసికొనవలయును. పిదప ఋతంచ సత్యమను మంత్రము చదువవలయును. పిదప ''ద్రుపదాదివ'' యను ఋక్కుచదువుచు కుడి ముక్కు శ్వాసనుండి పాపమును చేతి నీటిలోనికి తేవలయును. ఆ నీటిని చూడ కెడమ వైపున ఱాతిపై వదలవలయును. నా మేను పాపరహితమైనదని తలంచవలయును.

ఉత్థాయ తు తతః పాదౌ ద్వౌ సమౌ సన్నియోజయేత్‌ | జలాంజలిం గృహీత్వాతు తర్జన్యంగుష్ఠ వర్జితమ్‌. 49

వీక్ష్య భానుం క్షీపేద్వారి గాయత్ర్యా చాభిమంత్రితమ్‌ | త్రివారం మునిశార్ధూల విధిరేషో7ర్ఘ్య మోచనే. 50

తతః ప్రదక్షిణాం కుర్వాదసావాదిత్య మంత్రతః | మధ్యాహ్నే సకృదేవస్యా త్సంధ్యయోస్తు త్రివారతః. 51

ఈషన్నమ్రః ప్రభాతే తు మధ్యాహ్నే దండవత్థ్సితః | ఆసనే చోపవిష్ట స్తు ద్విజః సాయం క్షిపే దపః. 52

ఉదకం ప్రక్షిపే ద్యస్మాత్తత్కారణ మతః శృణు | త్రింశత్కోట్యో మహవీరా మందేహా నామరాక్షసాః. 53

కృతఘ్నా దారుణా ఘోరాః సూర్య మిచ్ఛంతి ఖాదితుమ్‌ | తతో దేవగణాః సర్వే ఋషయశ్చ తపోధనాః. 54

ఉపాసతే మహాసంధ్యాం ప్రక్షివంత్యుదకాంజలీన్‌ | దహ్యంతే దేన దైత్యాస్తే వజ్రీభూతేన వారిణా. 55

ఏతస్మా త్కారణా ద్విప్రాః సంధ్యాం నిత్యముపాసతే | మహా పుణ్యస్య జననం సంధ్యో పాసన మీరితమ్‌. 56

అర్ఘ్యాంగభూతమంత్రో7యం ప్రోచ్యతే శృణు నారద | యదుచ్ఛారణ మాత్రేణ సాంగం సంధ్యాఫలం భ##వేత్‌. 57

సోహ మర్కోస్మ్యహం జ్యోతి రాత్మాజ్యోతి రహం శివః |

ఆత్మజ్యోతి రహంశుక్ల సర్వజ్యోతీ రసో7స్మ్యహమ్‌. 58

ఆగచ్ఛ వరదే దేవి గాయత్రి బ్రహ్మరూపిణి | జాపానుష్ఠాన సిద్ధ్యర్థం ప్రవిశ్య హృదయం మమ. 59

ఉత్తిష్ఠ దేవి గంతవ్యంపునరాగమనాయ చ | అర్ఘ్యేఘ దేవి గంతవ్యం ప్రవిశ్య హృదయం మమ. 60

ఆ పిదప నిలుచుండి రెండు పాదములు సమముగ నుంచి బొటన చూపుడు వ్రేళ్ళు వదలిన నీచీ దోయిలిని గాయత్రితో నభిమంత్రించి సవితృదేవిని కనులార వీక్షంచుచు ముమ్మారర్ఘ్య మీయవలయును. నారదా! ఇది అర్ఘ్యమిచ్చు విదానము - పాపహరము. ఆ పిదప ''అసావాదితోయబ్రహ్మ'' యని జలమును ప్రదక్షిణించవలయును. మధ్యాహ్నమం దొకేమా రరఘ్య మీయవలయును. సంధ్యలందు ముమ్మారీయవలయును. ప్రభాతమున వినయముతో కొద్దిగ వంగియు మధ్యాహ్నమున దండమునలె నిలుచుండియును ముమ్మారీయవలయును. ప్రభాతమున వినయముతో కొద్దగ వంగియు మధ్యాహ్నమున దండమువలె నిలుచుండియును సాయంతనమున కూర్చోనియు నర్ఘ్యప్రదానము చేయవలయును. ఈ జలము వదలుకు కారణమోమో వినుము. మందేహులను మూడుకోట్ల మహావీర రాక్షసులు గలరు. వారుకృతఘ్నులు - ఘోర దార ణరూపులు - సూర్యుని మ్రింగదలతురు. కనుక నెల్ల దేవగణములు - ఋషులు - తాపసులు అర్ఘ్యప్రదానము చేయుచు శ్రీమహాసంధ్య నుపాసింతురు. వారి మంత్రపూతమైన జలము వజ్రమయమై రాక్షసులను కాల్చివేయును. ఈ కారణముననే విప్రులు నిత్యము సంధ్యోపాసన చేయుదురు. ఈ సంధ్యోపాసన పుణ్యము భాగ్యము నొసంగునందురు. నారదా! ఇపుడర్ఘ్యమున కంగభూతమైన మంత్రమును వినుము. దాని నుచ్చరించినంతనే సాంగమైన సంధ్యాఫల మబ్బును. నేనే సూర్యడను - సూర్యడేనేను - ఈ యాత్మయే పరంజ్యోతి - శివజ్యోతి - నేను హదయాంతరజ్యోతిని. నే నారని విశ్వజ్యోతిని నేనేశుక్లము - విశ్వరసాయనము. ఈ యాత్మయే పరంజ్యోతి - శివజ్యోతి - నేను హదయాంతరజ్యోతిని. నే నారని విశ్వజ్యోతిని నేనే శుక్లము - విశ్వరసాయనము. వరదాత్రీ! గాయత్రీదేవీ! పరబ్రహ్మ స్వరూపిణీ! రారమ్ము! నా జపానుష్ఠానము సిద్ధిచుటకు నాచిత్సుఖమైన హృదయములో ప్రవేశింపుము. తల్లీ! దేవీ! లెమ్ము! వెళ్ళి రమ్ము! దేవి! నా హృదయములో జేరి నా యర్ఘ్యములందు ప్రవేశింపుము.

తతః శుద్ధ స్థలే నైజామాసనం స్థాపయే ద్బుధః | తత్రారుహ్య జపే త్పశ్చా ద్గాయత్రీం వేదమాతరమ్‌. 61

అత్రైవ ఖేచరీ ముద్రా ప్రాణాయ మోత్తరం మునే | ప్రాతః సంధ్యా విధానే చ కీర్తితా ముని పుంగవ. 62

తన్నామార్థం ప్రవక్ష్యామి సాదరం శృణు నారద | చిత్తం చరతి ఖే యస్మాజ్జిహ్వా చరతి ఖే గతా. 63

భ్రవోరంతర్గతా దృష్టిర్ముద్రా భవతీ ఖేచరీ | న చాసనం సిద్ధసమం న కుంభసదృశో నిలః. 64

న కేఛరీసమా ముద్రా సత్యం సత్యం చ నారద | ఘంటావత్ర్పణ వోచ్చారాద్యాయుం నిర్జిత్యయత్నతః. 65

స్థిరాసనే స్థిరో భూత్వా నిరహంకార నిర్మమః | లక్షణం నారదమునే శృణు సిద్ధాసనస్యచ. 66

యోనిసాధనక మంఘ్రిమూల ఘటితం కృత్వా ద్డం విన్యసేత్‌ |

స్థాణుః సంయమితేం ద్రియో7చలదృశాలశ్యన్బ్రువోరంతరమ్‌ |

మేఢ్రేపాద మథైకమేవ హృదయం కృత్వా సమం విగ్రహమ్‌ |

తిష్ఠత్యేతదతీవయోగి సుఖదం సిద్దాసనంసప్రోచ్యతే. 67

ఆయుతు వరదాదేవీ అక్షరం బ్రహ్మసమ్మితమ్‌ | గాయత్రీం ఛందసాం మాతరిదం బ్రహ్మజుషస్వమే. 68

వయతహ్నాత్కురుతే పాపం తదహ్నాత్ర్పతి ముచ్యతే | యద్రాత్ర్యాత్కురుతే పాపం తద్రాత్ర్యాత్ర్పతి ముచ్యతే. 69

సర్వవర్ణే మహాదేవి సంధ్యావిధ్యే సరస్వతి | అజరే అమరే దేవి సర్వదేవి నమో7స్తుతే. 70

తేజోసీత్యాది మంత్రేణ దేవీ మావాహయేత్తతః | యత్కృతం త్వదనుష్ఠానం తత్సర్వం పూర్ణమస్తుమే 71

తతః శాప విమోక్షాయ విధానం సమ్యగా చరేత్‌ | బ్రహ్మశాపస్తతో విశ్వామిత్రస్య చ తథైవచ. 72

తర్వాత పండితుడు పవిత్ర స్థలమున సుఖాసమున గూర్చోని వేదమాతయగు గాయత్రిని జపించవలయును. మునివర్యా! ప్రాణాయామము తర్వాత ఖేచరీముద్ర వేయవలయును. ఆ ముద్ర ప్రాతఃకా సంధ్యయందు తప్పక వేయ వలయును. నారదా! ఖేచరీశబ్దము యొక్క అర్థము తెలుపుదును వినుము. చిత్త మాకాశమందు చరించునట్లు నాలుక యాకసమున చరించుటని దాని యర్థము. అట్లు నాలుక నుంచిన తర్వాత చూపు కనుబోమల నడుమ నిలుపవలయును. అదే ఖేచరీ ముద్ర. సిద్ధాసనమువంటి యాసమను - కుంభకమును బోలిన ప్రాణాయామమును ఖేచరీ సమానమైన ముద్రయును లేవు. ఇది నిత్య సత్యము సుమా! నారదా! ఘంటానాదము మ్రోగునట్లు ప్రణవ ముచ్చరించుచు వాయువును జయించవలయును. నారద ముని! సాధకుడు స్ధిరాసనమున గూర్చొని యహంకార మమకారములు వదలి జపించ వలయును. ఇపుడు సిద్ధాసన లక్షణములు వినుము. ఒక పాదమూలము వృషముల క్రిందను - వేరొక పాదమూలము లింగముపైని నుంచి ఏకాగ్రచిత్తముతో శరీరము నిట్టనిలువుగ స్థాణువువలె నుంచి యింద్రియములు గేలిచి చూపులు కదలించక కనుబొమల నడుమనే నిలిపి యుండ వలయును. ఇది యోగులకు సుఖప్రదమెన సిద్ధాసన మనబడును. పిదప దేవి నీ విధముగ నావాహనము చేయవలయును. వరప్రదాయినీ దేవీ! వేదమాతా! నాశ రహితమైన వేదాంత నిశ్చితమైన బ్రహ్మతత్త్వము మాకు బోధింప రమ్ము. పరబ్రహ్మతత్త్వ ముపదేశింపుము తల్లీ! దేవీ! నీ భక్తుడు పగలు చేసివ పాపము పగలే తొలగు గాక! రాత్రి చేసిన పాపము రాత్రియే తొలగుగాక! సర్వవర్ణాత్మికయు - మహాదేవియు - సంధ్యా విద్యా స్వరూపిణి యు - సరస్వతీ రూపిణియు - అజరామదేవియు - సర్వదేవియు నగు గాయత్రీదేవీ! నీకు నమస్కారములు తల్లీ! తేజోసియను మంత్రముతో గాయత్రి నావాహనము చేయవలయును. దేవీ! నిన్ను గూర్చి చేయు మాయనుష్ఠాన మంతయును పూర్ణమగు గాక! పిదప బ్రహ్మ - విశ్వామిత్రుల శాపములు తొలగుటకు వారిని చక్కగ విది విధానమున స్మరించవలయును.

వసిష్ఠశావ ఇత్యేత త్త్రి విధం శాపలక్షణమ్‌ | బ్రహ్మణః స్మరణ వైవ బ్రహ్మశాపో నివర్త్యతే. 73

విశ్వామిత్ర స్మరణతో విశ్వామిత్రస్యవ శావతః | వసిష్ఠ స్మరణాదేవ తస్యశాపరో వినశ్యతి. 74

హృత్పద్మమధ్యే పురుషం ప్రమాణం సత్యాత్మకం సర్వజగత్స్వరూపమ్‌.

ధ్యాయామి నిత్యం పరమాత్మ సంజ్ఞం చిద్రూపమేకం వచసా మగమ్యమ్‌. 75

అథ న్యాస విధిం వక్ష్యే సంధ్యాయా అంగ సంభవమ్‌ | ఓంకారం పూర్వ వద్యోజ్యం తతో మంత్రానుదీరయేత్‌. 76

భూరిత్యుక్త్వా చ పాదాభ్యాం నమ ఉత్యేవచోచ్చరేత్‌ | భువః పూర్వంతు జానుభ్యాం స్వః కటిభ్యాం నమో వదేత్‌. 77

మహర్నాభ్యై జనశ్చైవ హృదయాయ తత స్తపః | కంఠాయ చ తతః సత్యం లలాటం పరికీర్తయేత్‌. 78

అంగుష్ఠాఖ్యాం తత్సవితుస్తర్జనీభ్యాం వరేణ్యకమ్‌ | భర్గోదేవస్య మధ్యాభ్యాం ధీమహీత్యేవ కీర్తయేత్‌. 79

అనామాభ్యం కనిష్ఠాభ్యాం ధియో యోనః పధం వదేత్‌ | ప్రచోదయాత్కర వృష్ఠతలయోర్విన్యసేత్సుధిః. 80

బ్రహ్మత్మనే తత్సవితుర్హృదయాయ నమ స్తథా | విష్ణ్వాత్మనే వరేణ్యం చ శిరసేనమ ఇత్యపి. 81

భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై ప్రకీర్తితమ్‌ | శక్త్యాత్మనే ధీమహీతి కవచాయ తతః పరమ్‌. 82

కాలాత్మనే ధియోయోనో నేత్రత్రయ ఉదీరితమ్‌ | ప్రచోదయా చ్చ సర్వాత్మనే7స్త్రాయ పరికీర్తితమ్‌. 83

అక్షరన్యాస మేవాగ్రే కథ యామి మహామునే | గాయత్రీ వర్ణ సంభూత న్యాసః పాపహరః పరః. 84

మఱియు వసిష్ఠుని శాపమును గలదు. ఇట్లు శాపములు మూడు విధములుగ గలవు. బ్రహ్మను స్మరించుట వలన బ్రహ్మశాపము తొలగును. విశ్వామిత్రుని స్మరించినంతనే విశ్వామిత్ర శాపము పాయును. వసిష్ఠుని తలంచినంతనే వసిష్ఠుని శాపమునుతీరును. తరువాత హృదయకమలమందున విజ్ఞానజ్యోతివలె వెలుగొందు సత్యాత్మకుడు - విశ్వా జగత్స్వరూపుడు - నిత్యుడు - పరమాత్మ - చిద్రూపుడు - మాటల కందనివాడు నగు పురుషోత్తముని ధ్యానించుచున్నానని ధ్యానింపవలయును. ఇపుడు సంధ్య కంగభూతమైన న్యాసవిధిని చెప్పుదును. మొదట ప్రణవ ముచ్చరించి పిదప మంత్రము జపించవలయును. ఓం భూః పాదాబ్యాం నమః; ఓం భువః జానుభ్యాం నమః; ఓం సువః కటిబ్యా నమః; ఓం మహః నాభ్యై నమః; ఓం జనః హృదయాయ నమః; ఓం తపఃకంఠాయ నమః; ఓం సత్యం లలాటాయ నమః ఇది వ్యాహృతులతో అంగన్యాసము. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః; వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః; భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః; ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః; ధియోయోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః; ప్రచోదయాత్‌ సర్వాత్మనే కరతలకర పృష్ఠాబ్యాం నమః; అని గాయత్రితో కరన్యాసమొనరింపవలయును. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః; వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా; భర్గోదేవస్య రుద్రాత్మనే శిభాయై వషట్‌; ధీమహి సత్యాత్మనే కవచాయహుం; ధియోయోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్‌; ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్త్రాయఫట్‌; అని గాయత్రితో అంగన్యాసము. ఇపు డక్షరన్యాసము తెలుపుచున్నాను వినుము. గాయత్రీర్ణములతోడి న్యాసము సర్వ పాపహరము.

ప్రణవం పూర్వముచ్చార్య వర్ణన్యాసః ప్రకీర్తితః | తత్కా రమాదా వుచ్చార్యపాదాంగుష్ఠద్వయే న్యసేత్‌. 85

స కారం గుల్పయో స్తద్వద్వికారం జంఘయోర్న్యసేత్‌ | జాన్వోస్తుకారం విన్యస్య ఊర్వోశ్చైవ వకారకమ్‌. 86

రేకారం చ గుదే న్యస్య ణికారం లింగ ఏవచ | కట్యాం యకార మేవాత్ర భకారం నాభిమండలే. 87

గోకారం హృదయే న్యస్య దే కారం స్తనయోర్ధ్వయోః | వకారం హృదివిన్యస్య స్యకారం కంఠకూపకే. 88

ధీకారం ముఖదేశే తు మకారం తాలు దేశ##కే | హికారం నాసికాగ్రే తు ధికారం నేత్ర మండలే. 89

భ్రూమధ్యేచైవ యోకారం యోకారం చ లలాటకే | నఃకారంవై పూర్వముఖే దక్షిణ ముఖే. 90

చోకారం పశ్చిమముఖే దకారం చోత్తరేముఖే | యోకారం మూర్ధ్ని విన్యస్య తకారం వ్యాపకం న్యసేత్‌. 91

ఏతన్న్యాసవిధిం కేచి న్నేచ్ఛింతి జపతత్పరాః | తతో ధ్యాయేన్మహా దేవీం జగన్మాతరమంబికామ్‌. 92

భాస్వజ్జప ప్రసూనాబం కుమారీం పరమేశ్వరీమ్‌ | రక్తాంబుజాసనారూడాం రక్తగంధానులేపనామ్‌. 93

రక్తామాల్యాంబరధరాం చతురాస్యాం చతుర్బుజామ్‌ | ద్వినేత్రాం స్రుక్సువౌ మాలాం కుండికాంచైవ బిభ్రతీమ్‌. 94

సర్వాభరణ సందీప్తామృగ్వేదాధ్యాయినీం పరామ్‌ | హంసపత్రా మాహవనీయ మధ్యస్ధా బ్రహ్మదేవతామ్‌. 95

చతుష్పదా మష్టకుక్షిం సప్తశీర్షాం మహేశ్వరీమ్‌ | అగ్నివక్త్రాం రుద్రాశిఖాం విష్ణుచత్తాం తు భావయేత్‌. 96

మొదట ప్రణవ ముచ్చరించి 'త' త్తని రెండు కాలిబొటన వ్రేళ్లయందు న్యసించవలయును. 'స' కారమును గుల్ప మందును 'వి' కారము జంఘలందును 'తు' కారమును జానువులందును 'వ' కార మూరువులందును 'రే' కారము గుదమందును 'ణి' కారముమేఢ్రమందును 'య' కారము కటియుందును 'భ' కారము నాభియందును 'గో' కారము హృదయమున 'దే' కారము రేండు స్తనములందును 'వ' కారము హృదయములోను 'స్య' కారము కంఠమునందును 'ధీ' కారము ముఖమందును 'మ'కారము తాలువులందును 'హి' కారము నాసికయందు 'ధి' కారము నేత్రములందును 'యో' కారము భ్రూమధ్యమందు 'యో' కారము నొసట 'న'కారము ముందు మోమున 'వ' కారము కుడి మోమున 'చో' కారము పడమటి ముఖమున 'ద' కార ముత్తర ముఖ మున 'యా' కారము శిరమందు 'త' కారము వ్యాపకమందు న్యసింపవలయును. కొంధఱు జప పరాయణు లీ యక్షరన్యాస మున ఏయురు. ఆ పిదప జగన్మాత - మహాదేవీ - అంబికను ధ్యానింప వలయును. ఎఱ్ఱని గంధానులేపనములతో నెఱని కమలాసనమున శోభిల్లుచున్నదేవిని జపా కుసుమ ప్రభలు విరజిమ్ము పరమేశ్వరిని - కుమారిని - ఎఱ్ఱని పూమాలలు - వస్త్ర ములుదాల్చి - నలుమోములు - నంబుజములు - మూడు నేత్రములు - స్రుక్కు - స్రువములు - రుద్రాక్షమాల - కమండ లువుదాల్చిన దేవిని సర్వాభరణములతో తేజరిల్లు దేవి ఋగ్వేదధ్యాయుని - ఆహవనీయమధ్యమున విరాజిల్లు హంసవాహనయగు బ్రహ్మ దేవతను నాలుగు వేదములే నాల్గుపాదములు ఎనిమిదిదిక్కు - లెనిమిదికుక్షులుగ సప్త శాస్త్రమబులేడు శిరములుగ అగ్ని ముఖముగ రుద్రుడు శిఖగ విష్ణువుహృదయముగ విలసిలు గాయత్రిని ధ్యానించవలయును.

బ్రహ్మాతు కవచం యస్యాగోత్రంసాఖ్యాయనం స్మృతం |

ఆదిత్యమండలాంతఃస్దా ధ్యాయే ద్దేవీం మహేశ్వరీమ్‌. 97

ఏవం ధ్యాత్వా విదానేన గాయత్రీం వేదమాతరమ్‌ | తతో ముద్రాః ప్రకుర్వీత దేవ్యాః ప్రీతికరః శుభాః. 98

సంముఖం సంపుటంచైవ వితతం విస్తృతం తథా | ద్విముఖం త్రిముఖంచైవ చతుశ్కం పంచకం తథా. 99

షణ్ముఖాధోముఖంచైవ వ్యాపకాంజలికం తథా | శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్‌. 100

విలంబం ముష్టి కంచైవ మత్స్యం కూర్మం వరాహకమ్‌ | సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం వల్లవం తథా. 101

చతుర్వింశతి ముద్రాశ్చగాయత్ర్యాః సంప్ర దర్శయేత్‌ | శతాక్షరాంచ గాయత్రీం సకృదావర్తయేత్సుధీః. 102

చుతర్విం శత్యక్షరాణి గా యత్ర్యాః కీర్తితాని హి | జాతవేదస నామ్నీం చ ఋచముచ్చారయేదతః. 103

త్ర్యంబకస్యర్చ మావృత్య గాయత్రీ శతవర్ణకా | భవతీయం మహాపుణ్యా సకృజ్జప్యా బుధైరియమ్‌. 104

ఓంకారం పూర్వ ముచ్చార్య భూర్బునః స్వస్తథైవ చ | చతుర్విం శత్యక్షరాం చ గాయత్రీం ప్రోచ్చరేత్తతః. 105

ఏవం నిత్యం జపంకుర్యా ద్ర్బాహ్మణో విప్రపుంగవః | స సమగ్రం ఫలం ప్రాప్య సంధ్యాయాః సుఖ మేధతే. 106

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే షోడశో7ధ్యాయః.

బ్రహ్మకవచముగా సాంక్యాయన గోత్రమున బుట్టినదియు సూర్యమండల మధ్యమున విరాజుల్లుచున్నదియునగు మహేవ్వరిని గాయత్రిని ధ్యానించవలయును. ఈ ప్రకారముగ వేదమాత - గాయత్రిని ధ్యానించి పిదప గాయత్రీ ప్రీతికరము లగు శుభముద్రులు ప్రదర్శించవలయును. సుముఖము - సంపుటము - వితతము - విస్తృతము - ద్విముఖము - త్రిముఖము - చతుష్కమను - పంచకము. షణ్ముఖము - అధోముఖము - వ్యాపకాంజలికము - శకటము - యమపాశము - గ్రథితము - సముఖోన్ముఖము - విలంబము - ముష్టికము - మత్స్యము - కూర్మము - వరాహకము - సింహాక్రాంతము - మహాక్రాంతము - ముద్గరము - పల్లవమను ముద్రుల గాయత్రీదేవికి ప్రదర్శించవలయును. ఆ పిదప బుద్ధిశాలియగువాడు శతాక్షరా గాయత్రి నొకమారు జిపించవలయును. గాయత్రిలోని యక్షరము లిరువదినాల్గు ''జాతవేదసే'' మంత్రమందలి యక్షరములు నలువదినాలుగు ''త్ర్యంబక'' మంత్రమునందు ముప్పదిరెండవక్షరమలు మొత్తము నూఱువర్ణములగుట గాయత్రిశతాక్షరియన నొప్పెసగును. ఇది మహా పుణ్య భాగ్యప్రదము. బుధులు దీనినొకమారు జపించవలయును. ఆ తర్వాత ఓం భుర్బువస్సువః తత్స శతుర్వ రేణ్వం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌; అను గాయత్రీ మంత్రము జపించవలయును. ఈ విధముగ ప్రతి బ్రహ్మాణుడు ప్రతినిత్యమును ముమ్మారు శ్రీగాయత్రీ దేవిని జపించి సంధ్యాదేవి యొక్క సమగ్ర ఫలితములు పడసి నిత్య శాంతి సుకములు పొందవలయును.

ఇది శ్రీదేవిభాగవత మహాపురాణమందలి యేకదశస్కంధమున పదారవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters