Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తదశో7ధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ: భిన్నపాదా తు గాయత్రీ బ్రహ్మహత్యాప్రణాశినీ |ఆభిన్నపాదా గాయత్రీ బ్రహ్మహత్యాం ప్రయచ్చతి. 1

అచ్చిన్నపాదా గాయత్రీజపంకుర్వంతి యే ద్విజాః | అధోముఖాశ్చ తిష్ఠంతి కల్పకోటిశతానిచ. 2

సంపుటైకషడోంకారాగాయత్రీ వివిధా మతా | ధర్మశాస్త్రపురాణషు ఇతిహసేషు సువ్రత. 3

పంచవ్రణవసంయుక్తాం జపే దిత్యను శాసనమ్‌ | జపసంఖ్యా7ష్ట భాగాంతే పాదో జప్య స్తురీయకః. 4

సద్విజః పరమో జ్ఞేయః పరం సాయుజ్యమాప్వుయాత్‌ | అన్యథా ప్రజపే ద్యస్తు స జపో విఫలో భ##వేత్‌. 5

సంపుటైకా షడోంకారా భ##వేత్సా ఊర్ధ్వ రేతసామ్‌ | గృహ స్ధో బ్రహ్మచారీ వా మోక్షార్థీ తురీయాం జపేత్‌. 6

తురీయ పాదో గాయత్ర్యాః పరోరజసేసావదోమ్‌ | ధ్యానమస్యప్రవక్ష్యామి జపసాంగఫల ప్రదమ్‌. 7

హృదివికసితపద్మం సార్కసోమాగ్నిబింబం ప్రణవమయ మచింత్యం యస్య పీఠం ప్రకల్ప్యమ్‌ |

అచలపరమ సూక్ష్మం జ్యోతిరాకాశసారం భవతు మమ ముదే7సౌ సచ్చిదానంద రూపః. 8

త్రిశూలయోనీ సురభిమక్షమాలాం చ లింగకమ్‌ | అంబుజం చ మహాముద్రా మితిసప్త ప్రదర్శయేత్‌. 9

యా సంధ్యా సైవ గాయత్రీ సచ్చిదానందరూపిణీ | భక్త్యా తాం బ్రహ్మణోనిత్యం పూజయేచ్చనమేత్తతః. 10

ధ్యాతస్య పూజాం కుర్వీత పంచభిశ్చోపచరాకైః | లంపృథి వ్యాత్మనే గంధర్పయామి నమోనమః. 11

హమాకాశాత్మనే పుష్పం చార్ప యామి నమోనమః | యంచ వాయ్వాత్మనే ధూపం చార్పయామి తతో వదేత్‌. 12

పదునేడవ అధ్యాయము

సంద్యావందన విధానము.

శ్రీనారాయణు డిట్లనెను : శ్రీగాయత్రీలోని పాదములను విడివిడిగ జపించినచో బ్రహ్మహత్యాదిపాతకమలు తొలగును. పాదములతో గలిపి యోకేమారు జపించిన బ్రహ్మహత్య గల్గును. పాదములు కలిపి గాయత్రి జపము చేయు బ్రహ్మణులు నూఱుకోట్ల కల్పముల వఱకు తలక్రిందులుగ పడియుందురు. సువ్రతా! పలు ధర్మశాస్త్ర పూరాణములందును ఇతిహాసము లందును ఏక ప్రణవ సంపుటముగ - ఆరు ప్రణవముల సంపుటముగ గాయత్రిని జపించవలయునని కలదు. గాయత్రిని పంచ ప్రణవమలు సంపుటముగచేసి జపించవలయు నను ననుశాసనము గలదు. గాయత్రి నెంత జపము చేతురో యందులో నెనిమిదవ వంతు తురీయ గాయత్రి జపించవయలును. అటు లుపాసించిన బ్రామ్మణుడే యుత్తముడు. అతడే దేవీసాయుజ్యమొందును. దానికి భిన్నముగ జపించినచో నంతయు నిష్పల మగను. ఊర్ధ్వరేతస్కులు గాయత్రి నారు ప్రణవములు చేర్చి జపించ వలయును. బ్రహ్మచారి - గృహస్థుడు - మోక్షార్థి వీరోంకారముగల తురీయపాదమను గూడ జపించవలయును. గాయత్రి నాలవ పాదము ''పరోరజసేసావదోమ్‌ '' దానిని సాంగముగ జపించిన ఫలప్రద మగును. ఇపుడు తురీయపాద ధ్యానము తెలుపుదును వినుము. 'చిదానందమగు హృదయమందు దివ్యకమలము వికసించియున్నది. సూర్యచంద్రాగ్నుల రూపమైన ప్రణవమందు దివ్యపీఠముగ విలసిల్లుచున్నది. అచలము - పరమము - సూక్ష్మజ్యోతి - గగనసారము - నగు సచ్చిదానంద స్వరూపము నాకానంద బ్రహ్మమును గూర్చుగాక ఈ తురీయపాదమునకు త్రిశూలము యోని సురభి ఆక్షమాల లింగము అంబుజము మహా ముద్ర యను నేడు ముద్రలు ప్రదర్శించవలయును. రాగారుణ సంధ్యయే గాయత్రి-సచ్చిదానంద స్వరూపిణి-బ్రాహ్మణుడు ప్రతినాత్య మట్టి సంధ్యను పరభక్తితో జపించవలయును. ధ్యానింపబడు దేవతను పంచోపచారములతో పూజించవలయును. ''లం'' పృథివ్యాత్మనే గంధం సమర్పయామి నమో నమః. ''హం'' ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి నమో నమః; ''యం'' వాయ్వాత్మనే ధూపం సమర్పయామి నమోనమః.

రంచ వహ్న్యాత్మనే దీపమర్పయామి తతో వదేత్‌ | వమమృతాత్మనే తసై#్మ నైవేద్యమపి చార్పయేత్‌. 13

యంరంలం వం హమితి చ పుష్పాంజలిమథార్ప యేత్‌ | ఏవం పూజాం విధాయాథ చాంతే ముద్రాః ప్రదర్శయేత్‌. 14

ధ్యాయేత్తు మనసా దేవీం మంత్ర ముచ్చారయేచ్చనైః | న కంపయేచ్చిరో గ్రీవాం దంత న్నైవప్రకాశ##యేత్‌. 15

విధినాష్టాత్తరశత మష్టావింశతి రేవ వా | ధశవార మశక్తో వా నాతో న్యూనం కదాచన. 16

తత ఉద్వాసయే ద్దేవీ ముత్తమేత్యనువాకతః | నా గాయత్రీం జపే ద్విద్వాన్‌ జలమధ్యే కథంచన. 17

యతః సాగ్నిముఖీ ప్రోక్తే త్యాహుః కేచి న్మహర్షయః | సురభిర్జా న శూర్పం చ కూర్మోయోనిశ్చ పంకజమ్‌. 18

లింగం నిర్వాణకం చైవ జపాంతే7ష్టా ప్రదర్శయేత్‌ | యదక్షర పదభ్రష్టం స్వర వ్యంజనవర్జితమ్‌. 19

తత్సర్వం క్షమ్యతాం దేవి కశ్ప ప్రియవాదిని | గాయత్రీ తర్పణం చాతః కరణీయం మహామునే. 20

గాయత్రీ ఛంద ఆఖ్యాతం విశ్వామిత్ర ఋషిః స్మృతః | సవితా దేవతా ప్రోక్తా వినియోగశ్చ తర్పణ. 21

భూర్త్యిక్త్వా చ ఋగ్వేద పురుషం తర్పయామి చ | భువ ఇత్యేత దుక్త్వా చ యజుర్వేద మథో వదేత్‌. 22

స్వర్వ్యాహృతిం స ముక్త్వా చ సామవేదం సముచ్చరేత్‌ | మహ ఉత్యేతదుక్త్వాంతే7థర్వవేదం చ తర్పయేత్‌. 23

జనః పదాంత ఇతిహాస పురాణ మితీరయేత్‌ | తపః సర్వాగమం చైవ పురుషం తర్పయామి చ. 24

''రం'' అగ్నితత్త్వాత్మనే దీపం మసర్పయామి నమో నమః; ''వం'' అమృత తత్తావత్మనే నైవేద్యం సమర్ప యామి యని నైవేద్య మర్పించవలయును. ''యం-రం-లం-వం-హం'' అని భక్తి పుష్పాంజలి దేవికి సమర్పించవలయును. ఇట్లు పూజావిది జరిపి పిదప ముద్రలు ప్రదర్శించవలయును. మొదట గాయత్రీదేవిని హృదయములో ధ్యానిచి పిదప మెలమెల్లగ మంత్రజపము చేయవలయును. అపుడు తల - మెడ కదలరాదు. పండ్లిగిలింపరాదు. నూట యెనిమిదిసార్లు గాని - ఇరువదెనిమిదిసార్లు గాని - కనీసము పదీసారులుగాని జపము చేయవలయును. అంతకు తక్కువగ నెప్పుడును చేయరాదు. ఆ తర్వాత ''ఉత్తమే శిఖరేజాతే'' యను ననువాకముతో గాయత్రి నుద్వాసన చేయవలయును. గాయత్రి జపమెప్పుడును నీటి మధ్యముండి చేయరాదు. (హరీతాదులు కొందఱు చేయవచ్చు ననిరి.) ఏలన కొందఱు మహర్షులు గాయత్రి నగ్నిముఖిగ తలంతురు. సురభి - జ్ఞానము - శూర్పము - కూర్మము - యోని - పంకజము - లింగము - నిర్వాణము - నను నెనిమిది ముద్రలను జపము చివర ప్రదర్శించవలయును. ఈ జపమందు స్వర - వ్యంజనములు - పదములును సరిగ నుచ్చరించినచో కశ్యప ప్రియవాదిని యగుగాయత్రీదేవీ! దాని నంతయును క్షమించుమని క్షమాపణము కోరవలయును. నారదా! తర్వాత గాయత్రీ తర్పణ మాచరించవలయును. దానికి గాయత్రి - ఛందము; విశ్వామిత్రుడు - ఋషి; సవిత - దేవత; తర్పణమున వినియోగమని పలుకవలయును. ఓం భూః బుగ్వేద పురుషం తర్పయామి. ఓం భువః యజుర్వేద పురుశం తర్పయామి. ఓం సువః సామవేద పురుషం తర్పయామి. ఓంమహః అథర్వవేద పురుషం తర్పయామి. ఓం జన - ఇతిహాస పురాణ పురుషం తర్పయామి. ఓం తపః సర్వాగమ పురుషం తర్పయామి.

సత్యం సత్యలోకాఖ్య పురుషం తర్పయామి చ | ఓం భూర్బూర్లోక పురుషం తర్పయామి తతోవదేత్‌. 25

భువశ్చేతి భువర్లోక పురుషం తర్పయామి చ | స్వర్గలోకపురుషం తర్పయామి తతః పరమ్‌. 26

ఓం భూరేకపదాం నామగాయత్రీం తర్పయామి చ | భువో ద్విపదాం గాయత్రీం తర్పయామీతికీర్తయేత్‌. 27

స్వశ్చ త్రిపదాం గాయత్రీం తర్పయామితతో వదేత్‌ | ఓం భూర్బవః స్వశ్చేతి తథా గాయత్రీం చ చతుష్పదామ్‌. 28

ఉషసీం చైవ గాయత్రీం సావిత్రీం చ సరస్వతీమ్‌ | వేదానాం మాతరం పృథ్వీ మజాంచైవ తు కౌశికీమ్‌. 29

సాంకృతి వై సార్వజితిం గాయత్రీం తర్పణ వదేత్‌ | తర్పణాంతే చ శాంత్యర్థం జాతవేదస మీరయేత్‌. 30

మానస్తో కేతి మంత్రం చ శాంత్యర్ధ వ్రజపేత్సుధీః | తతో7పి త్ర్యంబకో మంత్రః శాంత్యర్థః పరికీర్తితః. 31

తచ్ఛం యోరితి మంత్రం చ జపేచ్ఛాంత్యర్థమేవతు | ఆతోదేవా ఇతి ద్వాభ్యాం సర్వాంగ స్పరశనం చరేత్‌. 32

స్యోనాపృధివి మంత్రేణ భూమ్యైకుర్యాత్ర్పణామకమ్‌ | యథా విధిచ గోత్రాదీ నుచ్చరేద్ద్విజ సత్తమః. 33

ఏవం విధానం సంధ్యాయాః పాతఃకాలే ప్రకీర్తితమ్‌ |

సంధ్యాకర్మ సమాప్యాంతే7ప్యగ్నిహోత్రం స్వయంహునేత్‌. 34

పంచాయతనపూజాం చ తతః కుర్యాత్సమాహితః | శివాం శివం గణపతిం సూర్యం విష్ణుం తథా7ర్చయేత్‌. 35

పౌరుషేణ తు సూక్తేన వ్యాహృత్యా వా సమాహితః | మూలమంత్రేణ వా కుర్యాత్‌ హ్రీశ్చతే ఇతి మంత్రతః. 36

ఓం సత్యం సత్యలోకాఖ్య పురుషం తర్పయామి. ఓం భూః భూర్లోక పురుషం తర్పయామి. ఓం భువః భువర్లోక పురుషం తర్పయామి. ఓం సువః సువర్లోక పురుషం తర్పయామి. ఓం భూః ఏకపదాం గాయత్రీ తర్పయామి. ఓం భువః ద్విపదాం గాయత్రీం తర్పయామి ఓం స్వః త్రిపదాం గాయత్రీం తర్పయామి. ఓం భూర్బువస్సువః చతుష్పదాం గాయత్రీం తర్పయామి. ఆపిదప ఉషస్సుకు - గాయత్రికి - సావిత్రికి - సరస్వతికి వేదమాతకు - ఫృథ్వికి - అజకు - కౌశికికి - సాంకృతికి - సార్వజితికి - వీరందఱికిని తర్పణ మాచరించవలయును. అనంతరము శాంతికొఱకు ''జాతవేదసే సునవామ'' యను మంత్రము చదువవలయును. సుధీమణియైనవాడు శాంతి కొఱకు ''మానస్తోకేతనయే'' మంత్రముగాని ''త్ర్యంబకం యజామహే'' మంత్రముగాని యుచ్చరించవలయును. శాంతికి ''తచ్చం యో'' మంత్రము నుచ్చరించవలయును. ''అతో దేవా'' యను రెండు మంత్రములతో సర్వాంగములు తాకవలయును. పిదప ''స్యోనా పృథివీ'' మంత్రముతో భూమికి నమస్కారము చేయవలయును. పిదప బ్రహ్మాణుడు తన గోత్ర - ఋషి - నామమలు గల ప్రవర చెప్పి నమస్కరించవలయును. ఈ విధముగ ప్రాతః కాలమందలి సంధ్యావందనము విధించబడినది. సంధ్యావందనము మగిసిన పిమ్మట అగ్ని కార్య మాచరించవలయును. అటు పిమ్మట సావధానచిత్తముతో పంచాయతల పూజ సలుపవలయును. భవాని - శివుడు - గణపతి - సూర్యుడు - విష్ణువు వీరి నర్చించవలయును. వ్యాహృతులు గల పురుష సూక్తముతో గాని - శ్రీదేవ మూల మంత్రముతోగాని ''హ్రీశ్చతే'' యను మంత్రముతోగాని నిశ్చలచిత్తముతో పంచాయతన పూజ జరుపవలయును.

భవానీం తు యజేన్మధ్యేతధే తథే శాన్యాంతు మాధవమ్‌ | ఆగ్నేయ్యాం గిరిజానాథం గణశం రక్షసాం దిశి. 37

వాయవ్యా మర్చయే త్సూర్యమితి దేవ స్థితిక్రమః | షోఢశానుపచారాంశ్చ షోడశర్గ్బిర్హరేన్నరః. 38

దేవీమభ్యర్చ్య పురతో యజే దన్యా ననుక్రమాత్‌ | న దేవీ పూజనాత్పుణ్య మధికం క్వచి దీక్ష్యతే. 39

అతఏవ తు సంధ్యాసు సంధ్యోపాస్తిః శ్రుతీరితా | నాక్షతై రర్చయే ద్విష్ణుం న తులస్యా గణశ్వరమ్‌. 40

దూర్వాభిర్నార్చయే ద్దుర్గాం కేతకైర్న మహేశ్వరమ్‌ | మల్లికాజాతికుసుమం కుటజం పనసం తథా. 41

కింశుకం వకుళం కుంద లోధ్రం తు కరవీరకమ్‌ | శింశపా7పరాజితాం పుష్ప బందూకాగస్త్య పుష్పకే. 42

మదంతం సుందువారం చ పాలాశకుసుమం తథా | దూర్వాంకురం బిల్పదళం కుశమంజరికా తథా. 43

శల్లకీ మాధవీ పుష్ప మర్కమందారపుష్పకమ్‌ | కేతకీం కర్ణికారం చ కదంబకుసుమం తథా. 44

పున్నాగశ్చంపక స్తద్వ ద్యూథికాతగరౌ తథా | ఏవమాదీని పుష్పాణి దేవీప్రియకరాణి చ. 45

గుగ్గులస్య భ##వేద్దూపో దీపస్యా త్తిలతైలతః | కృత్వేత్థం దేవతా జాం తతోమూలమనుం జపేత్‌. 46

ఏవం పూజాం సమపై#్యవ వేదాభ్యాసం చరేద్బుధః | తతః స్వవృత్త్యా కుర్వీత పోష్యవర్గార్థ సాధనమ్‌. 47

తృతీయ దినభాగే తు నియమేనవి చక్షణః.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే సప్తదశో7ధ్యాయః.

మధ్యను భవానీ దేవిని - ఈశాన్యమున విష్ణుని - ఆగ్నేయమున శివుని - నైరృతిలో గణపతిని - వాయవ్యమున సూర్యుని - ఉంచి యర్చించవలయును. ఇది దేవతలను ప్రతిష్ఠించు క్రమపద్ధతి. పురుష సూక్తమందలి పచదారు మంత్రములతో పదారు విధముల పూజలు చేయవలయును. మునుముందు భవాని నర్చించి పిదప తక్కిన దేవతలను క్రమముగ నర్చించవలయును. ఏలన శ్రీదేవ పూజకన్న మిన్నయైన పుణ్యభాగ్యము మఱియొకటి లేదు. అందుకొఱకే సంధ్యలందు తప్పక సంధ్యావందనము చేయుమని శ్రుతులు పలుకుచున్నవి. ఆక్షతలతో విష్ణుని - తులసితో గణపతిని - గరికతో దుర్గను - మొగలిగపూవుతో శివుని - ఎన్నడును పూజిపరాదు. మల్లియులు - జాతిసుమనములు - కుటజములు - పనసలు - కింశుకములు - వకుళము - మొల్ల - లొద్దుగు - శింశుప - అపరాజిత - బంధూకము - ఆగస్త్యము - మదంతము - సిందువారము - పలాశము - దూర్వాంకుమరు - మారేడు దళములు - కుశ - శల్లకి - మాధవి - జిల్లేడు - మందారము - మొడలి - కర్ణికారము - కదంబము - పున్నాగము - చంపకము - యూథిక - తగరము మున్నగు మైలైన పూలు - దేవికి ప్రీతి పాత్రములైనవి. నూగులనూనెతో - నేతితో దిపారాధన చేసి దేవి కగురుధూపము సమర్పించవలయును. ఈవిధముగ దేవతల పూజలు కలిపి పిదప తన కిష్టమైన మూలమంత్రము ను జపించవలయును. ఈ విధముగ తెలిసినవాడు పూజలు ముగించుకొని పిదప వేదాధ్యయన మొనరించవలయును. ఆ పిమ్మట తన వృత్తికి తగినట్లు తల్లి - దండ్రి - గురువులు - పోశ్యవర్గములను నియముపూర్వకముగ శ్రద్ధగ - తెల్వితో మూడవ జామున పూజించ సేవించవలయును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పదునొకండవ స్కంధమున పదునేడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters