Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకవింశోధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ : అథాతః శ్రూయతాం బ్రహ్మన్‌ గాయత్ర్యాః పపనాశనమ్‌ | పురశ్చరణకం పుణ్యం యథేష్టఫలదాయకమ్‌. 1

పర్వతాగ్రే నదీతీరే బిల్మమూలే జలాశ##యే | గోష్ఠే దేవాలయేశ్వత్థే ఉద్యానే తులసీవనే. 2

పుణ్య క్షేత్రో గురోః పార్శ్వే చిత్తైకాగ్ర్యస్థలేపి చ | పునశ్చరణకృన్మంత్రీ సిద్ధ్యత్యేవ న సంశయః. 3

యస్య కస్యాపి మంత్రస్య పురశ్చరణ హారభేత్‌ | వ్యాహృతిత్రయ సంయుక్తాం గాయత్రీం చాయుతం జపేత్‌. 4

నృసింహార్కవరాహాణాం తాంత్రికం వైదికం తథా | వినా జప్త్వా తు గాయత్రీం తత్సర్వం నిష్పలం భ##వేత్‌. 5

సర్వే శాక్తా ద్విజాః ప్రోక్తా న శైవాన చ వైష్ణవాం | ఆదిశక్తి ముపాసంతే గాయత్రీం వేదమాతరమ్‌. 6

మంత్ర సంశోధ్య యత్నేన పునశ్చరణ తత్పరః | మంత్రశోధన పూర్వాంగ మాత్మశోధన ముత్తమమ్‌. 7

ఆత్మ తత్త్వశోధనాయ త్రిలక్షం ప్రజపేద్బుధః | అథవా చైకలక్షం తు శ్రుతి ప్రోక్తేన వర్త్మనా. 8

ఆత్మశుద్ధిం వినా కర్తుర్‌ జపహోమాదికాః క్రియాః | నిష్పలా స్తా స్తు విజ్ఞేయాః కారణం శ్రుతిచోదితమ్‌. 9

తపసా తాపయే ద్దేహం పితౄన్దేవాం శ్చ తర్పయేత్‌ | తపసా స్వర్గ మాప్నోతి తపసా విందతే మహత్‌. 10

క్షత్రియో బాహువీర్యేణ తరేదాపద ఆత్మనః | ధనేన వైశ్యః శూద్ర స్త జపహోమైర్ద్వి జోత్తమః. 11

ఇరువదియొకటవ అధ్యాయము

గాయత్రీ పురశ్చరణము

శ్రీనారాయణు డిట్లనెను : బ్రాహ్మణోత్తమా ! ఇపుడు పాపహరము - ఇష్టఫలదాయకము - పుణ్యఫలము నగు గాయత్రి పునశ్చరణ విధానము తెలుపుచున్నాను వినుము. పర్వతము చివర - నదీతీరము - మారేడు చెట్టు మొదలు - కొలంకులు - గోశాల - దేవళము - రావిచెట్టు - పూదోట - తులసీవనము - పుణ్యక్షేత్రము - గురు సన్నిధి - యీ ప్రదేశములం దెచటనైన చిత్తము నిలుచుచోట పురశ్చరణము చేయువానికి తప్పక మంత్రసిద్ధి గల్గును. ఏ మంత్రమునకైన పురశ్చరణ చేయదలచిన మొదట వ్యాహృతుల తోడి గాయత్రిని పదివేలు జపించవలయును. నారసింహము - ఆదిత్యము - వారాహము ననునవి వైదికము - తాంత్రికము నని రెండు విధములుగ గలవు. ఈ రెంట దేనికైన పురశ్చరణ చేయదలచిన గాయత్రిని జపించనిచో నంతయు నిష్పల మగును. ద్విజు లందఱును శాక్తేయులేకాని శైవులునువైష్ణవులును గారు ఏలన నెల్ల ద్విజులను నాదిశక్తివేదమాత అగుగాయత్రి నుపసాసించువారే. పురశ్చరణ చేయదలచినవాడు మంత్రశోధనకు పూర్వమంగశోధనమును ఆత్మశోధనమును పూనికతో చేసికొనవలయును. బుధు డాత్మశోధనకు మూడు లక్షలు జపించవలయును. లేక వేదమున చెప్పిన చొప్పున లక్ష జపించవలయును. ఆత్మశుద్ధి - మంత్రశుద్ధి లేక చేసిన జపహోమము లన్నియును వ్యర్థములే యగును. వేదమే ఇటుల పల్కినది. తపము వలన దేహమును తపింపచేయవలయును. దేవతలకు పితరులకును తర్పణము ఏయవలయును. అట్టి తపస్సు వలన స్వర్గము గల్గును. క్షత్రియుడు తన బాహువీర్యముతో వైశ్యుడు ధనము వలన శూద్రుడు పరిచర్యచేత ద్విజోత్తముడు జప హోమాదుల వలన నాపదలు దాటుదురు.

అతఏవ తు విప్రేంద్ర తపః కుర్యాత్ర్పయత్నతః | శరీరశోషణం ప్రాహుస్తాపసా స్తప ఉత్తమమ్‌. 12

శోధయే ద్విధిమార్గేణ కృచ్ఛ్రచాంద్రాయణాదిభిః | అథాన్నశుద్ధి కరణం వక్ష్యామి శృణు నారద. 13

అయాచితోఞ్చ శుక్లాఖ్య భిక్షావృత్తి చతుష్టయమ్‌ | తాంత్రికైర్వైదికైశ్చైవ ప్రోక్తాన్నస్య విశుద్దతా. 14

భిక్షాన్నం శుద్ధ మానీయ కృత్వా భాగచతుష్టయమ్‌ | ఏకం భాగం ద్విజేభ్య స్తు గోగ్రాస స్తు ద్వితీయకః. 15

అతిథిభ్య స్తృతీయస్తు త దూర్ధ్వం తు స్వభార్యయోః | ఆశ్రమస్య యథా యస్యకృత్వా గ్రాసవిధిం క్రమాత్‌.

ఆదౌ క్షిప్త్వా తు గోమూత్రం యథాశక్తి యథా క్రమమ్‌ |

తదూర్ద్వం గ్రాససంఖ్యా స్యా ద్వానప్రస్థగృహస్థయోః. 17

కుక్కుటాండ ప్రమాణం తు గ్రాసమానం విధీయతే | అఎ్టౌ గ్రాసా గృహస్థస్య వనస్థస్య తదర్ధకమ్‌. 18

బ్రహ్మచారీ యథేష్టం చ గోమూత్రవిధి పూర్వకమ్‌ | ప్రోక్షణం నవవారం చ షడ్వారం చ త్రివారకమ్‌. 19

నిచ్ఛిద్రం చ కరం కృత్వా సావిత్రీం చ తదిత్యృచమ్‌ | మంత్రముచ్చార్య మనసా ప్రోక్షణం విధి రుచ్యతే. 20

చౌరో వా యది చాండాలో వైశ్యః క్షత్రస్తథైవ చ | అన్నం దద్యాత్తు యః కశ్చిదధమో విధి రుచ్యతే. 21

శూద్రాన్నం శూద్రసంపర్కం శూద్రేణ చ సహాశనమ్‌ | తే యాంతి నరకం ఘోరం యావచ్ఛంద్ర దివాకరౌ. 22

విప్రేంద్రా ! అందువలననే కడు పూనికతో తప మాచరించవలయును. శరీరమును శోషింపజేయుటయే యుత్తమ తప మనబడును. విధిప్రకారముగ కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములతో తపించవలయును. నారదా! ఇపుడన్న శుద్ధి కరణమును తెల్పుచున్నాను వినుము. యాచించక దొరకినది - ఉంఛవృత్తి - శుక్ల - భిక్షావృత్తి - యివి నాల్గు వృత్తులు. ఇట్లు లభించినదానికి వైదికులునుతాంత్రికులు నన్న శుద్ధిని పేర్కొనినారు. శుద్ధమైన భిక్షాన్నము దెచ్చి నాల్గు భాగములుచేయవలయును. అందొకటి ద్విజులకు - రెండవది గోవులకును మూడవ దతిథులకు - నాల్గవది తన కుటుంబమునకు తనకు నుపయో గించుకొనవలయును. ఆయా యాశ్రమములకు తగినట్లుగ కబళములు చేయవలయును. మొదట యథాశక్తిగ - యథాక్రమ ముగదానిపై గోమూత్రము చల్లవలయును. పిదప గృహస్థ - వానప్రస్థులకు చెప్పిన చొప్పున కబళములు నిర్ణయించవలయును. అన్న కబళము కోడి గ్రుడ్డంత యుండవలయును. గృహస్థు డెనిమిది కబళములను గ్రహించ వలయును. ఇక బ్రహ్మచారి తొమ్మిదిసార్లు గాని - యారుమార్లు గాని - మూడుసారులు గాని గోమూత్రము చిలుకరించి తన యిష్టము వచ్చి నన్ని కబళములు తినవచ్చును. తన రెండుచేతులు శుభ్రము చేసికొని మదిలో గాయత్రిని జపించి జలము ప్రోక్షించవలయును. దొంగ - చండాలుడు - వైశ్యుడు - క్షత్రియుడు - వీరిలో నెవ రిచ్చినను నా యన్న మధమ మనబడును. శూద్ర సంపర్కముతో శూద్రులం గూడి శూద్రాన్నము తినువారు సూర్యచంద్రులుండు నందాక ఘోరనరకమునందు గూలుదురు.

గాత్రీచ్ఛందోమంత్రస్య యథా సంఖ్యాక్షరాణి చ | తావల్లక్షాణి కర్తవ్యం పురశ్చరణకం తథా. 23

ద్వాత్రింశల్లక్షమానం తు విశ్వామిత్ర మతం తథా | జీవహీనో యతా దేహః సర్వ కర్మసు న క్షమః. 24

పురశ్చరణహీన స్తు తథా మంత్రః ప్రకీర్తితః | జ్యేష్ఠాషాడౌ భాద్రపదం పౌషం తు మలమాసకమ్‌. 25

అంగారం శనివారం చ వ్యతీపాతం చ వైధృతిమ్‌ | అష్టమీం నవమీం షష్ఠీం చతుర్థీం చ త్రయోదశీమ్‌. 26

చతుర్దశీ మమావాస్యాం ప్రదోషం చ తథా నిశాం | యామగ్ని రుద్ర సర్పేంద్రవసుశ్రవణ జన్మభమ్‌. 27

మేషకర్కతులాకుంభా న్మకరం చైవ వర్జయేత్‌ | సర్వాణ్యతాని వర్జ్యాని పురశ్చరణ కర్మణి. 28

చంద్రతారాను కూలే చ శుక్లపక్షే విశేషతః | పురశ్చరణకం కుర్యాన్మంత్రసిద్ధిః ప్రజాయుతే. 29

స్వస్తి వాచనకం కుర్యా న్నాందీశ్రాద్ధం యథావిధి | విప్రాన్సంతర్ప్య యత్నేన భోజనాచ్చాదనాదిభిః. 30

ఆరభే త్తు తతః పశ్చాదనుజ్ఞాన పురః సరమ్‌ | ప్రత్యజ్ముఖః శివస్థానే ద్విజశ్చాన్యతమే జపేత్‌. 31

కాశీపురీ చ కేదారో మహాకాలోథ నాసికమ్‌ | త్ర్యంబకం చ మహాక్షేత్రం పంచదీపా ఇమే భువి. 32

సర్వత్రైవ హి దీపస్తు కూర్మాసన మితి స్మృతమ్‌ | ప్రారంభదిన మారభ్య సమాప్తిదివసావధి. 33

ఈ గాయత్రి మంత్రమున కెన్ని యక్షరములు గలవో యన్ని లక్షలు జపించిన గాయత్రీ పురశ్చరణ మగును. ముప్పదిరెండు లక్షలు జపించిన గాయత్రీ పురశ్చరణ మగునని విశ్వామిత్రుడు పలికెను. జీవ చైతన్యము లేనిచో దేహమే లేదు. ఏ పనియును గాదు. అటులే పురశ్చరణలేని మంత్రము నిరర్థకమే యందురు. జ్యేష్ఠము - ఆషాడము - పుష్యము - మలమాసము - మంగళశనివారములు - వ్యతీపాతవైధృతియోగములు - చవితి - షష్ఠి - అష్టమి - నవమి - త్రయోదశి -చతుర్దశి - అమావాస్య - ప్రదోషరాత్రీకాలములు - భరణి - కృత్తిక - ఆర్ద్ర - అశ్లేష - జ్యేష్ఠ - ధనిష్ఠ నక్షత్రములు - జన్మనక్షత్రము - మేష - కటక - తులా - మకర - కుంభ లగ్నములు పురశ్చరణకు పనికి రావు. చంద్ర తారాబలములు చూచుకొనవలయును. విశేషించి శుక్లపక్షమున పురశ్చరణము ప్రారంభించినచో త్వరలో మంత్రసిద్ధి యగును. మొదట స్వస్తి వాచనము - నాందీశ్రాద్ధము యథావిధిగ జరిపి బ్రాహ్మణులకు భోజన వస్త్రము లిచ్చి తృప్తి పఱచవలయును. పిదప వారి యనుమతితో పురశ్చరణము ప్రారంభించవలయును. ద్విజుడు పడమటి ముఖముగ శివాలయమున గాని - యితర పుణ్యస్థలములగాని జపించవలయును. కాశి - కేదారము - మహా కాలము - నాసిక - త్ర్యంబకము - నను నైదు స్థానములు మహాక్షేత్రములు - పంచదీములు - మంత్రసిద్ధి క్షేత్రములని భూమిపై పూరు గాంచినవి. ఇవికానిచోట కూర్మాసనము సిద్ధిప్రదము. మొదలు పెట్టిననాటి నుండి పూర్తియగు వఱకును -

న న్యూనం నాతిరిక్తం చ జపం కుర్యా ద్ధినే దినే | నైరంతర్యేణ కుర్వంతి పురశ్చర్యాం మునీశ్వరాః. 34

ప్రాతరారభ్య విధివ జ్జపే న్మధ్యందినావధి | మనః సంహరణం శౌచం ధ్యానం మంత్రార్థచింతనమ్‌. 35

గాయత్రీ చ్ఛందో మంత్రస యదా సంఖ్యాక్షరాణి చ | తావల్లక్షాణి కర్తవ్యం పురశ్చరణం తథా. 36

జుహుయాత్త ద్దశాంశేన సఘృతేన పయోంధసా | తిలైః ప్రతైః ప్రసూనైశ్చ యవైశ్చ మధునాన్వితైః. 37

కుర్యా ద్దశాంశతో హోమం తతః సిద్ధో భ##వేన్మనుః | గాయత్రీ చైవ సంసేవ్యా ధర్మకామార్థమోక్షదా. 38

నిత్యేనైమిత్తికే కామ్యే త్రితయే తు పరాయణః | గాయత్ర్యా స్తు పరంనాస్తి ఇహలోకే పరత్ర చ. 39

మధ్యాహ్నమితభుజ్‌ మౌనీ త్రిస్నానార్చన తత్పరః | జలే లక్షత్రయం ధీమా ననన్య మానస క్రియః. 40

కర్మణా యో జపేత్పశ్చాత్కర్మభిః స్వేచ్ఛయాపివా | యావత్కార్యం న సిద్ధ్యే త్తు తావత్కుర్యాజ్య పాదికమ్‌. 41

సామాన్య కామ్యకర్మాదౌ యథావద్విధిరుచ్యతే | ఆదిత్య స్యోదయే స్నాత్వా సహస్రం ప్రత్యహం జపేత్‌. 42

ఆయురారోగ్య మైశ్వర్యం ధనం చ లభ##తే ధ్రువమ్‌ | షణ్మాసం వా త్రిమాసం వా వర్షాంతే సిద్ధి మాప్నుయాత్‌. 43

పద్మానాం లక్షహోమేన ఘృతాక్తానాం హుతాశ##నే | ప్రాప్నోతి నిఖిలం మోక్షం సిద్ధ్యత్యేవ న సంశయః. 44

ప్రతిదినమును జప మెక్కువ తక్కువలు చేయక మౌనముగ నిరంతరముగ పురశ్చరణ కొనసాగించవలయును. ఉదయము మొదలు మధ్యాహ్నము వఱకును జపము సాగించవలయును. పవిత్రత - మనోవిగ్రహము - ధ్యానము - మంత్రార్థ చింతనమును జపమందు పాటించవలసిన నియమములు. గాయత్రీ మంత్రమున కెన్ని యక్షరములు గలవో యన్ని లక్షలు జపము పురశ్చరణకు చేయవలయును. పిదప జప సంఖ్యలో దశాంశము మంచి నెయ్యి - పాలు - అన్నము - నూగులు - మారేడు దళములు - పూలు - పంచదార - యవలు - మున్నగు వస్తువులతో హోమమాచరించవలయును. అపుడు మంత్రసిద్ధు డగును. కనుక ధర్మార్థ కామమోక్షదాయినియైన గాయత్రి యెల్ల విధముల సంసేవించదగినది. నిత్య - నైమిత్తిక - కామ్య - మోక్షములు కావలసినవారు తప్పక గాయత్రీమాతను నమ్ముకొనవలయును. గాయత్రిని మించిన దేవత యీ లోకములం దేదియును లేదు. మఱియొక పురశ్చరణ విధానమును వినుము. మధ్యాహ్నమునందు మితముగ భుజించవలయును. మౌనము పాటించవల యును. మూడువేళల స్నానము చేయవలయును. నీటిలో నేకచిత్తముతో మూడు లక్షలు గాయత్రిని జపించవలయును. ఇటుల పురశ్చరణ జరిపిన పిమ్మట కామ్యకర్మగాని - సహజకర్మగాని సిద్ధించువఱకును జపము సాగించవలయును. ఇపుడు సామాన్యమగు కామ్యకర్మ విధానము తెలుపుచున్నాను వినుము. ప్రతిదినము సూర్యోదయమున స్నానముచేసి సహస్ర గాయత్రి జపించవలయును. దీనివలన నాయురారోగ్యములు - సిరి సంపదలు తప్పక కల్గును. ఇట్లు చేసిన మూడు నెలల - ఆరు నెలల - లేక సంవత్సరమునకు - చివర తప్పక కోరిన కోరిక తీరును. నేతిలో నిండ తడిపిన లక్షకమలము గ్నిలో గాయత్రి మంత్రముతో వేల్చిన తప్పక మోక్షమరచేతిదై యుండును.

మంత్ర సిద్ధిం వినాకర్తు ర్జపహోమాదికాః క్రియాః | కామ్యం వా యది వా మోక్షః సర్వంత న్నిష్పలం భ##వేత్‌. 45

పంచవింశతిలక్షేణ దధ్నా క్షీరేణ వా హుతాత్‌ | స్వదేహే సిధ్యతే జంతు ర్మహర్షీణాం మతం యథా. 46

అష్టాంగయోగ సిద్ధ్యా చ సరః ప్రాప్నోతి యత్పలమ్‌ | తత్పలం సిద్ధి మాప్నోతి నాత్ర కార్యా విచారణా. 47

శక్తో వాపి త్వశక్తోవా ఆహారం నియతం చరేత్‌ | షణ్మాసా త్తస్య సిద్ధిః స్యా ద్గురుభక్తిరతః సదా. 48

ఏకాహం పంచగవ్యాశీ చైకాహం మారుతాశనః | ఏకాహం బ్రాహ్మణాన్నాశీ గాయత్రీ జపకృద్బవేత్‌. 49

స్నాత్వా గంగాదితీర్థేషు శతమంతర్జలే జపేత్‌ | శ##తే నాపస్తతః పీత్వా సర్వపాపైః ప్రముచ్యతే. 50

చాంద్రాయణాదికృ చ్ఛ్రస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితమ్‌ | రాజా వా యది వా విప్రస్తపఃకుర్యాత్స్వకే గృహే. 51

గృహస్థో బ్రహ్మచారీ వా వనప్రస్థో దవాపి చ | అధికార పరత్వేన ఫలం యజ్ఞాదిపూర్వకమ్‌. 52

శ్రౌతస్మార్తా దికం కర్మ క్రియతే మోక్షకాంక్షిభిః | సాగ్నికశ్చ సదాచారే విద్వద్బి శ్చ సుశిక్షితః. 53

తతః కుర్యా త్ప్రయత్నేన ఫలమూలోదకాదిభిః | భిక్షాన్నం శుద్ధ మశ్నీయా దష్టౌ గ్రాసా న్స్వయం భ##జేత్‌. 54

ఏవం పురశ్చరణకం కృత్వా మంత్రసిద్ధి మవాప్నుయాత్‌ | దేవర్షే యదనుష్ఠానా ద్దారిద్ర్యం విలయం వ్రజేత్‌. 55

యచ్ఛ్రుత్వాపి చ పుణ్యానాం మహతీం సిద్ధి మాప్నుయాత్‌.

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే ఏకవింశోధ్యాయః.

మంత్రసిద్ధిగాక చేసిన జపహోమములు కామ్యమోక్ష క్రియ లన్నియును నిష్పలము లగును. పాలు పెరుగు కలిపి గాయత్రితో నిరువదైదు లక్షలు వేల్చినవాడీ జన్మమునందే సిద్ధి బొందునని మహర్షులు వచించిరి. అస్టాంగసిద్ధి వలన నే ఫలితము గల్గునో మంత్రసిద్ధివలన నదే ఫలము తప్పక కల్గును. ఆహారము తీసికొనుచు నియమముగ చేతనైన గాకున్న ఆరు నెలలు గాయత్రి జపించినచో గురుభక్తిగల వారికి తప్పక సిద్ధి గల్గను. ఒకదినమున పంచగవ్యములును ఒకదినమునందు వాయువును ఒక దినమందు బ్రాహ్మణాన్నమును దినుచు గాయత్రి పమ మాచరించవలయును. గంగాది పుణ్యతీర్థములందు గ్రుంకి యా జలములం దుండి శతగాయత్రి జపించి పిదప తీర్థము తీసికొనినవాని సర్వపాపములు పటాపంచ లగును. దీని వలన తప్పక కృచ్ఛ్ర చాంద్రాయణాదుల ఫలిత మబ్బును. రాజుగాని విప్రుడుగాని తన గృహమునందే జపించ వలయును. బ్రహ్మచారి - గృమస్థుడు - వానప్రస్థుడును వారి వారి యోగ్యతలను బట్టి యజ్ఞముల ఫలితములు పడయుదురు. ముముక్షులు శ్రౌత - స్మార్తకర్మలు తప్ప కాచరించవలయును. అగ్నిహోత్రి - సదాచార సంపన్నుడు - పండితులచేత సుశిక్షతుడును ప్రయత్నించి ఫలమూలములు - జలములు - భిక్షాన్నము గ్రహించవలయును. ఎనిమిది ముద్దలు మాత్రమే భుజించవలయును. దేవఋషీ ఈ చెప్పిన చొప్పున పురశ్చరణము జరిపిన వానికి తప్పక మంత్రసిద్ధి గల్గును. దీని ననుష్ఠించినవాడు ధనవంతుడు నగును. ఈ గాయత్రీ పురశ్చరణ విధానము విన్నవానికి మిక్కిలిగ పుణ్యఫలము లబ్బును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యేకాదశ స్కంధమున నిరువదొకటవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters