Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వాదశస్కంధః

అథ ప్రథమోధ్యాయః

నారద ఉవాచ : సదాచార విధిర్దేవ భవతా వర్ణితః ప్రభో | తస్యా ప్యతుల మహాత్మ్యం సర్వపాప వినాశనమ్‌ . 1

శ్రుతం భవన్ము ఖాంబోజచ్యుతం దేవీకథా మృతమ్‌ | వ్రతాని యాని చోక్తాని చాంద్రాయణ ముఖాని తే . 2

దుఃఖసాధ్యాని జానీమః కర్తృసాధ్యాని తాని చ | తదస్మా త్సాంప్రతం యత్తు సుఖసాధ్యం శరీరిణామ్‌. 3

దేవీ ప్రసాదజనకం సుఖానుష్ఠాన సిద్దిదమ్‌ | తత్కర్మ వదమే స్వామి న్కృపాపూర్వం సురేశ్వర. 4

సదాచారవిధౌ యశ్చ గాయత్రీ విధి రీరితః | తస్మి న్ముఖ్యతమం కిం స్యాత్కింవా పుణ్యాధికప్రదమ్‌ . 5

యే గాయత్రీ గతా వర్ణా స్తత్త్వసంఖ్యాస్త్వయేరితాః | తేషాం కే ఋషయః ప్రోక్తాః కాని చ్చందాంసి వైమునే . 6

తేషాం కా దేవతాః ప్రోక్తాః సర్వం కథయ మే ప్రభో | మహ త్కౌతూహలం మే చ మానసే పరివర్తతే . 7

శ్రీనారాయమ ఉవాచః కుర్యా దన్య న్న వా కుర్యా దనుష్ఠానాదికం తథా | గాయత్రీమాత్రనిష్ఠ స్తు కృతకృత్యో భ##వే ద్ద్విజః. 8

సంధ్యాసు చార్ఘ్యదానం చ గాయత్రీ జపమేవ చ | సహస్ర త్రితయం కుర్వ న్సురైః పూజ్యో భ##వే న్మునే . 9

న్యాసాన్‌ కరోతు వా మా వా గాయత్రీ మేవ చా భ్యసేత్‌ | ధ్యాత్వా నిర్వ్యాజయా వృత్త్యా సచ్చిదానంద రూపిణీమ్‌ . 10

యదక్షరైక సంసిద్ధేః స్పర్ధతే బ్రహ్మణోత్తమః | హరిశంకర కంజోత్థ సూర్య చంద్ర హుతాశ##నైః . 11

అథాతః శ్రూయతాం బ్రహ్మ స్వర్ణ ఋష్యాదికాం స్తథా | ఛందాంసి దేవతా స్తద్వ త్క్రమాత్తత్త్వాని చైవ హి . 12

మొదటి అధ్యాయము

గాయత్రీ విచారణము

నారదడిట్లెనెను: దేవా! ప్రభూ! నారాయణ భగవానుడా! అతుల మహాత్మ్యము సర్వ పాపహరమునైన సదాచార విదానమును నాకు చక్కగ వివరించితివి. నీ ముఖ కమలమునండి శ్రీదేవీ దివ్య కథాసుధారసము చెవుల కమృతపు సోనలుగ వింటిని. చాంద్రాయణము మున్నగు వ్రతములను తెలిపితివి. కాని అవన్నియును కష్ట- దుఃఖ- సాధ్యములు; సామాన్యున కలవిగానివి. నిష్ఠగల కర్తకే సాధ్యము లగును. కనుక ప్రాణులకు తేలికగ సుక సాధ్యములైన వానిని వివరింపుమయ్యా ! శ్రీదేవికి ప్రసన్నత గూర్చునవియును తేలికగ ననుష్ఠించదగినవియునగు వానిని మా యెడల దయతో తెలుపగదవయ్యా ! సదాచార విధులను తెల్పుచు నందు గాయత్రీ విధానము తెలిపితివి. ఆ విధానములో మిక్కిలి ముఖ్యతమమైనదియు అధిక పుణ్యకరమైనదియు నగు దానిని మాత్రము దయతో తెల్పుము. గాయత్రి కెన్ని వర్ణములుగలవో యన్ని తత్త్వములు గల వంటివి. వానికి బుషులెవరు? ఛందము లెవ్వి? వాని దేవత లెవ్వరు ? మునీశా!ప్రభూ! నాకు వాని నన్నిటినిగూడ తెలుపుము. వానిని వినవలయునని నామనస్సులో మిక్కుటమైన కోరిక గలుగుచున్నది. శ్రీనారాయణుడుట్లనెను: బ్రాహ్మణుడైన వా డితరమైన యనుష్ఠానములు చేసినను చేయకున్నను గాయత్రీ నిష్ఠకల్గియన్నచో నతడు నిక్కముగ తరించును. మూడు వేళలం దర్ఘ్య ప్రదాననమును మూడు వేల గాయత్రి జపము నాచరించువానిని దేవతలు సైతము కొనియాడుదురు. అంగ-కర-న్యాసములు చేసినను చేయకున్ననున కృపణత్వములేని మంచి మనస్సుతో సచ్చిదానంద స్వరూపిణిని ధ్యానించి యెంతేని జపించవలయును. గాయత్రిలోని యొకేయొక వర్ణమునైన సిద్ది బొందినచో నతడు హరి హర బ్రహ్మాలతోను సూర్య చంద్రాగ్నులతోను పోటికి నిలువబడును. బ్రహ్మణవర్యా! ఇక గాయత్రీ మంత్రమునకు ఋషులు - ఛందములు- దేవతలు - తత్వములు వరుసగ వివరింతును- నిశ్చల చిత్తముతో నాలకించుము.

వామదేవో త్రిర్వసిష్ఠః శుక్రః కణ్వః పరాశరః | విశ్వామిత్రో మహాతేజాః కపిలః శౌనకో మహాన్‌ . 13

యాజ్ఞవల్కో భరద్యాజో జమదగ్నిస్తపోనిధిః | గౌతమో ముద్గలశ్చైవ వేదవ్యాసశ్చ లోమశః .14

అగస్త్యః కౌశికోవత్సః పులస్తో మాండుకస్తథా | దుర్వాసా స్తపతాంశ్రేష్ఠో నారదః కస్యప స్తథా . 15

ఇత్యేతే ఋషయః ప్రోక్తా వర్ణానాం క్రమశో మునే | గాయత్య్రుష్ణిగనుష్టుప్చ బృహతీ పంక్తిరేవచ. 16

త్రిష్టుభం జగతీ చైవ తథా తిజగతీ మతా | శక్వర్యతి శక్వరీ చ ధృతిశ్చాతిధృతిస్తథా . 17

విరాట్ప్రస్తార పంక్తి శ్చ కృతిః ప్రకృతి రాకృతిః | వికృతిః సంకృతి శ్చైవాక్షర పంక్తి స్తథైవ చ. 18

భూర్బువః స్వరితి చ్చందస్తథా జ్యోతిష్మతీ స్మృతమ్‌ | ఇత్యేతాని చ ఛందాంసి కీర్తితాని మహామునే. 19

దైవతాని శృణు ప్రాజ్ఞ తేషా మేవానుపూర్వశః | ఆగ్నేయ ప్రథమం ప్రోక్తం ప్రాజాపత్యం ద్వితీయకమ్‌. 20

తృతీయం చ తథా సౌమ్య మీశానం చ చతుర్థకమ్‌ | సావిత్రం పంచమం ప్రోక్తం షష్ఠం మాదిత్యదైవతమ్‌ . 21

బార్హసృత్వం సప్తమం తు మైత్రావరుణ మష్టమమ్‌ | నవమం భగదైవత్యం దశమంచార్యమేశ్వరమ్‌ . 22

గణశ మేకాదశకం త్వాష్ట్రం ద్వాదశకం స్మృతమ్‌ | పౌష్ణం త్రయోదశం ప్రోక్త మైంద్రాగ్నం చ చతుర్దశమ్‌. 23

వాయవ్యం పంచదశకం వామదేవ్యం చ షోడశమ్‌ | మైత్రావరుణ దైవత్యం ప్రోక్తం సప్తదశాక్షరమ్‌ . 24

అష్టాదశం వైశ్వదేవ మూనవింసం తు మాతృకమ్‌ | వైష్ణవం వింసతితమం వసుదైవత మీరితమ్‌ . 25

ఏకవింశతిసంఖ్యాకం ద్వావింశం రుద్రదైవతమ్‌ | త్రయోవింశం చ కౌబేర మాశ్వినం తత్త్వసంఖ్యకమ్‌ . 26

చతుర్వింశతివర్ణానాం దేవతానాం చ సంగ్రహః | కథితః పరమ శ్రేష్ఠా మహాపాపైకశోధనః 27

యదాకర్ణనమాత్రేణ సాంగం జాప్యఫలం మునే.

ఇతి శ్రీదేవీభగవతే మహాపురాణ ద్వాదశస్కందే గాయత్రీ విచారోనామ ప్రథమోద్యాయః

వామదేవుడు- అత్రి- వసిష్ఠుడు- శుక్రుడు - కణ్వుడు- మహాతేజస్వియైన విశ్వామిత్రుడు - కపిలుడు- శౌనకుడు- యాజ్ఞవల్కుడు భరద్వాజుడు తపోనిధియైన జమదగ్ని గౌతముడు ముద్గులుడు వేదవ్యాసుడు లోమశుడు అగస్త్యుడు కౌశికుడు వత్సుడు పులస్త్యుడు మాండూకుడు తాపస వర్యుడగు దుర్వాసుడు నారదుడు కశ్యపుడు అనువారలు వరుసగ గాయత్రి వర్ణములకు ఋషులు. మునీశా! గాయత్రి ఉష్ణిక్కు అనుష్టుప్పు బృహతి పంక్తి త్రిష్టుప్పు జగీతి అతిజగతి శక్వరి అతిశక్వరి ధృతి అతిధృతి విరాట్‌ ప్రస్తారపంక్తి కృతి ప్రకృతి ఆకృతి వికృతి సంకృతి అక్షరపంక్తి భూః భువః స్వః జ్యోతిష్మతి యను నిరువది నాలుగును గాయత్రికి ఛందములుగ పేర్కొనబడెను. మునీశా! ఇపుడు వాని దేవతలను క్రమముగ నాలించుము. మొదటి దేవత యగ్ని రెండవవాడు ప్రజాపతి మూడవవాడు చంద్రుడు నాలవవాడీశానుడు ఐదవవాడు సవిత ఆరవవా డాదిత్యుడు ఏడవాడు బృహస్పతి ఎనిమిదవవాడు మిత్రావరుణుడు తొమ్మిదవవాడు భగుడు పదవవా డర్యముడు పదునొకండవవాడు గణపతి పండ్రెండవవాడు త్వష్ట - పదమూడవ వాడు పూష - పదునాల్గవవాడింద్రాగ్నీ పదునైదవవాడు వాయువు పదునారవవాడు వామదేవుడు పదునేడవవాడు మైత్రావరుణుడు పదునెనిమిదవవాడు విశ్వేదేవుడు పందొమ్మిదవవారు మాతృకలు ఇరుదవవాడు విష్ణువు ఇరువదొకటవవాడు వసువు ఇరువదిరెండవవాడు రుద్రుడు ఇరువది మూడవవాడు కుబేరుడు ఇరువదినాలవవా రశ్వికుమారులు - అనువార లిరువదినాలు గక్షరములకు దేవతలు-పరమ శ్రేష్ఠులు-దివ్యులు-మహాపాపహరులుగ ప్రసిద్ధి గాంచిరి.

మునీశా ! వీరిని విన్న మాత్రముననే సాంగముగ జేసిన జప ఫలిత మంతయును సంప్రాప్తించును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమునందు గాయత్రీ విచారమను మొదటి యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters