Sri Devi Bagavatham-2    Chapters   

అథపంచత్రింశోధ్యాయః

హిమాలయః యోగం వద మహేశాని సాంగం సంవిత్ప్రదాయకమ్‌| కృతేన యేన యోగ్యోహం భ##వేయం తత్త్వదర్శనే. 1

శ్రీ దేవ్యువాచ: న యోగో నభసఃపృష్ఠే నభూమౌ నరసాతలే |

ఐక్యం జీవాత్మనో రాహుర్యోగం యోగవిశారదాః. 2

తత్ప్రత్యూహాః షడాఖ్యాతా యెగవిఘ్నకరానఘ | కామక్రోధౌ లోభమోహౌ మదమాత్సర్య సంజ్ఞకౌ. 3

యెగాంగై రేవ భిత్తాతాన్యోగినో యోగమాప్నుయుః | యమం నియమ మాసన ప్రాణాయామౌ తతః పరమ్‌. 4

ప్రత్యాహారం ధారణాఖ్యం ధ్యానం సార్థం సమాధినా | అష్టాంగాన్యాహు రేతాని యోగినాం యోగసాధనే. 5

అహింస సత్య మస్తేయం బ్రహ్మచర్యం దయా೭೭ర్జవమ్‌ | క్షమా ధృతి ర్మితాహారః శౌచం చేతియమాదశ. 6

తపః సంతోష ఆస్తిక్యం దానం దేవస్యపూజనమ్‌ | సిద్ధాంత శ్రవణం చైవ హ్రీర్మతిశ్చజపో హుతమ్‌. 7

దశైతే నియమాః ప్రోక్తమయా పర్వతనాయక | పద్మాసనం స్వస్తికం చ భద్రం వజ్రాసనం తథా. 8

వీరాసన మితి ప్రోక్తం క్రమాదాసనపంచకమ్‌ | ఉర్వోరుపరి విన్యస్య సన్యక్పాదతలే శుభే. 9

అంగుష్ఠా చ నిబధ్నీ యాద్ద స్తాభ్యాం వ్యుత్క్రమాత్తతః | పద్మాసన మితిప్రోక్తం యోగినాం హృదయం గమమ్‌. 10

జానుర్వో రంతరే సమ్యక్కృత్వాపాదతలే శుబే | ఋజుకాయో విశేద్యోగీ స్వస్తికం తత్ప్రచక్షతే. 11

సీవన్యాః పార్శ్వ యోర్న్యస్య గుర్పయుగ్మణ సునిశ్చతమ్‌ | వృషణాధ ః పాదపార్ణీ పార్ణిభ్యాం పరిబంధయేత్‌. 12

భద్రాసన మితి ప్రోక్తం యోగిభిఃపరిపూజితమ్‌ | ఉర్వోః పాదౌ క్రమా న్న్యస్య జాన్వోః ప్రత్యజ్ముకాంగుళీ. 13

ముప్పదియైదవ అధ్యాయము

శ్రీదేవీ గీతలు

హిమాలయు డిట్లనెనుః:ఓ మహేశానీ ! యోగముసును గుఱించి సాంగముగ నాకు వివరింపుము. ఏ యోగమున బ్రహ్మజ్ఞానము గల్గునో దాని నాచరించి తత్త్వదర్శనమునకు పాత్రుడ నగుదును. శ్రీదేవి యిట్లనెను : యోగ మనునది భూమ్యాకాశరసాతములం దెచటనైన నుండునది కాదు. జీవ-పరాత్మల యైక్యమే యోగమని యోగవిదులందులు. ఓ యనఘాత్మా! కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యములను నారును యోగమునకు విఘ్నముగల్గించుచుండును.యోగులు యోగాంగముల సాయమున కామాదిశత్రువులను గెలచియోగమాచరించవలయును.యమము-నియమము-ఆసనము-ప్రాణా యామము.ప్రత్యాహారము-ధ్యానము-సమాధియునునవియష్టాంగములు. యోగసాధనముకు యోగులీ యెనిమిదిటి ననుష్ఠింపవలయును. అందుమొదటిదగు యమముసత్యము-అహింస-బ్రహ్మచర్యము-అస్తేయము-దానము-ఋజత-దయ-క్షమ-ధృతి-మితాహారము-శౌచమను పది తెఱంగుల నోప్పుచుండును. తపము-సంతోషము-దానము-ఆస్తికత-దేవపూజనము-వేదాంతశ్రవణము-లజ్జ-మతి-జపహోమములు అను పదియును గలసి నియమగునని నాచేత చెప్పబడెను.ఓ గిరీంద్రా! రెండుతొడలపై నుంచుకొనవలయును. పిదప వీపు మీదుగ చేతులు త్రిప్పి పాదముల బొటనవ్రేళ్లు పట్టుకొనుటే పద్మాస నము. ఇది యోగుల కత్యంతము ప్రియమైనది. తొడల-పిక్కల-మధ్యపాదతలము లుంచి సరళముగ కూర్చుండుట స్వస్తి కాసనమనబడును. వృషణముల క్రింద రెండువైపుల రెండు కాలిమడమలనుచేతిలో గట్టిగ నదిమి పట్టియుంచవలయును. అదియే భద్రాసనమనబడును. దీనిని యోగులెక్కువగ నాదరింతురు. రెండు తొడలపై రెండు పాదములుంచి పిక్కల క్రింద చేతల వ్రేళు లుంచవలయును.

కరౌ విదధ్యాదాఖ్యాతం వజ్రాసన మనుత్తమమ్‌| ఏకం పాదమధః కృత్వా విన్యస్యోరుం తథోత్తరే. 14

బుజుకాయో విశేద్యోగీ వీరాసన మితీరితమ్‌ | ఇడయా೭೭కర్షయేద్వాయుంబాహ్యంషోడశమాత్రయా.15

ధారయే త్పూరితం యోగీ చతుఃషష్ట్యాతు మాత్రయా | సుఖుమ్నా మధ్యగం సమ్యగ్ద్వాత్రింశన్మాత్రయో శ##నైః 16

నాడ్యా పింగళయా చైవ రేచయే ద్యోగవిత్తమః|ప్రాణాయాయ మిమం ప్రాహు ర్యోగశాస్త్ర విశారదాః. 17

భూయోభూయఃక్రమాత్తస్య బాహ్యా మేవం సమాచరేత్‌ | మాత్రావృద్ధిః క్రమేణౖవ సమ్యగ్ద్వాదశ షోడశ. 18

జపధ్యానాదిభిః సార్థం సగర్బం తంవిదురుధాః | తదపేతం విగర్బం చ ప్రాణాయామం పరే విదుః. 19

క్రమా దభ్యస్యతః పుంసో దేహస్వేదోద్గమో7ధమః | మధ్యమః కంపసంయుక్తో భూమిత్యాగః పరోమతః. 20

ఉత్తమస్య గుణావాప్తి ర్యావచ్చీలన మిష్యతే| ఇంద్రియాణాం విచరతాం విషయేషు నిరర్గళమ్‌ .21

బలాదాహరణం తేభ్యః ప్రత్యాహరో7భిధీయతే | అంగుష్ఠగ్పుజానూరూ మూలాధారలింగనాభిషు. 22

హృద్గ్రీవా కంఠదేశేషు లంబికా యాంతతో నసి | భ్రూమధ్యే మస్తకే మూర్ద్ని ద్వాదశాంతేయథావిధి. 23

ధారణం ప్రాణమరుతో ధారణతి నిగద్యతే | సమాహితేన మనసా చైతన్యాం తరవర్తినా. 24

ఆత్మన్యభీష్ట దేవానాం ధ్యానంధ్యాన మిహోచ్యతే | సమత్వభావనా నిత్యం జీవాత్మపరమాత్మనోః. 25

ఇట్లు కూర్చోనుట వజ్రసన మగును. ఆయా తొడలక్రింద నాయాపాదములుంచవలయును. పిదప శరీరమును నిట్టనిలువుగనుంచి కూరుచుండుట వీరాసన మగును. ఇడా(ఎడమ ముక్కు) ద్వారమున బైటి వాయువును పదునారుసార్లు ప్రణవము జపించుచు పీల్చవలయును. దాని నురువదినాల్గు సారులు ప్రణవ ముచ్చరించు నంతవఱకు లోన పూరించి యుంచ వలయును.అపు డది సుషుమ్న మధ్యకు చేరును. దానిని ముప్పదిరెండు మార్లు ప్రణవ ముచ్చరింగదగినంత సమయమునపింగళ(కుడిముక్కు) నుండి రేచింపవలయును. ఇటు లొక్కసారి చేసిన దానిని ప్రాణాయమమని యోగవిదులందురు. ఈ ప్రకారముగ ప్రణవోచ్చారణము క్రమముగ పండ్రెండు లేకపదునారు సారులకు పెంచుచు బైటి వాయువును పెలుమార్లు - పూరక-కుంభక-రేచకము లోనరించుచుండవలయును. ఈప్రాణాయామము జప-ధ్యానములతో గూడిన సగర్బమనియు నవి లేనిచో విగర్బప్రాణాయామమనియుబుధు లెఱుంగుదురు. ఇట్లు క్రమముగ నభ్యసించువాని దేహమున చెమట పుట్టిన నధమ మనియు వణకు పుట్టిన మధ్యమ మనియు మేనుపైకి లేచిననుత్తమ మనియు ప్రాణాయామము మత్తెఱగుల నుండును. సాధకు డుత్తమ ప్రాణాయామము సిద్దించువఱకు దీని నభ్యసింపవలయును. ఇంద్రియములు విషయములందు నిరాటంకముగ స్వేచ్చగ తిరుగాడుచుండును. వానిని బల్మితో లాగి నిలుపుట ప్రత్యాహార మనబడును.

అంగుష్ఠము -గుల్పము-పిక్కలు-తొడలు మూలాధారములు -లింగము-నాభి హృదయము -మెడ- కంఠము -లంబిక- ముక్కు - భ్రూమధ్యము-తల మూర్థము ద్వాదశాంతమనునవి స్థానములు. వీనియందు ప్రాణవాయువును నిల్పుడే ధారణ మనబడును. నిశ్చల మనస్సును చైతన్యాత్మలో నిలువ వలయును. పిదప తనయిష్ఠదేవతను ధ్యానించుటే ధ్యానమనబడును. నిత్యము జీవ-పరమాత్మల సమైక్యము భావింపవలయును.

సమాధి మాహుర్మునయః ప్రోక్తమష్టాంగ లక్షణమ్‌ | ఇదానీం కథయే తేహం మంత్ర యోగమనుత్తమమ్‌. 26

విశ్వం శరీర మిత్యుక్తం పంచభూతాత్మకం నగ | చంద్ర సూర్యాగ్ని తేజోభిర్జీవ బ్రహ్మైక్యరూపకమ్‌. 27

త్రిసఃకోట్యస్తదర్థేన శరీరేనాడయో మతాః | తాసుముఖ్యా దశప్రోక్తా స్తాభ్యస్తి స్రోవ్యవస్థితాః. 28

ప్రధానా మేరుదండేత్ర చంద్రసూర్యాగ్ని రూపిణీ | ఇడా వామే స్థితా నాడీ శుభ్రాతు చంద్రరూపిణీ. 29

శక్తి రూపాతు సా నాడీసాక్షా దమృతవిగ్రహా | దక్షిణ యా పింగళాఖ్యా పుంరూపా సూర్యవిగ్రహా.30

సర్వతేజోమయీ సా తు సుషుమ్నా వహ్నిరూపిణీ |తస్యా మధ్యే విచిత్రాఖ్యే ఇచ్చాజ్ఞాన క్రియాత్మకమ్‌. 31

మధ్యే స్వయంభూలింగం తు కోటిసూర్యసమ ప్రబమ్‌ | దతూర్ద్వం మాయాబీజం తు హరాత్మాబిందు నాదకమ్‌.

తదూర్ద్వం తుశిఖాకారా కుండలీ రక్త విగ్రహా | దేవ్యాత్మికా తు సా ప్రోక్తా మదభిన్నా నగాధిప. 33

తద్బాహ్యే హేమ రూపాభం వాదిసాంతచతుర్దలమ్‌ | ద్రుతహేమ సమప్రఖ్యం పద్మం తత్ర విచింతయేత్‌. 34

తదూర్ద్వం స్వనల ప్రఖ్యం షడ్దలం హీరకప్రభమ్‌ | బాదిలాంత షడర్ణేన స్వాధిష్ఠాన మనుత్తమమ్‌. 35

మూలమాధార షట్కోణం మూలాధారం తతో విదుః | స్వశ##బ్దేన పరంలింగం స్వాధిష్ఠానం తతో విదుః. 36

తదూర్ద్వం నాభిదేశేతు మణిపూరం మహాప్రభమ్‌ | మేఘాభం విద్యుదాభం చ బహు

తేజోమయం తతః. 37

అదియే సమాధి యని మునులందరు. ఇట్లు నీ కష్టాంగ యోగమును గూర్చివివరించితిని. ఇపుడింక శ్రేష్ఠమైన మంత్ర యోగమును వక్కాణింతును. వినుము. ఓ గిరి నాయకా! ఈ పంచ భూతాత్మకమైన శరీరము విశ్వము. ఇది చంద్ర సూర్యాగ్నులతో గూడి జీవ బ్రహ్మల యైక్యమును దెలుపును. ఇట్టి శరీరమున మూడున్నర కోట్ల నాడులు గలవు. వీనిలో పదిముఖ్యమైనవి. ఆ పదింటిలోను మూడు ముఖ్యతరములు. ఈ మూటిలో ముఖ్యతమమైనది చంద్రసూర్యాగ్ని రూపమైన మేరు దండము. ఇడానాడి యెడమ వైపుండును. ఇది తెల్లని చంద్రరూపమున నుండును ఇది యమృత శక్తిరూపమైనది.కుడి వైపున పురుష రూపమున సూర్యరూపముగల పింగళా నాడి యుండును. ఇక సర్వ తేజో రాశియై వహ్ని రూపమున సుషుమ్నా నాడి వెలుగొందును. దాని మధ్యవిచిత్రమను నాడి గలదు. దాని యందిచ్చా జ్ఞాన క్రియాత్మకమైన లింగము గలదు. ఇదిస్వయంభూలింగము. కోటి సూర్య సమానమైన ప్రకాశముగలది. దానకిపైని హరాత్మకము బిందు నాదాత్మకము మాయా బీజమునైన హ్రీంకారము విలసిల్లుచుండును. దానకిపైకి దీపశిఖ వలె నెఱ్ఱగ దేవీ రూపిణి యగు కుండలినీ శక్తి విరాజిల్లుచుండును. గిరీశా ! ఆ శక్తియు నేను నొకటియే. దానికి బైట బంగారు వన్నెగలు నాల్గు దళముల పద్మము గలదు. దానిలోనున్న వ-శ-ష-స-యక్షరములను సాధకుడు ధ్యానించవలయును. దానకిపై నగ్ని వలె వెల్గుచు వజ్రకాంతలీను నారు దళముల పద్మమలరును. బ-భ-మ-య-ర ల అను అక్షరములం దొప్పును. అట్టి స్వాధిష్ఠానమును ధ్యానింపవలయును. ఈ షట్కోణమునకు మూలమైనది మూలాధారమనబడును. ఇక స్వయను శబ్దముతో నధిష్ఠానమైనది స్వాధిష్ఠాన మన బరగును. దానకిపైకి నాభీ స్థాన మందు మణిపూరము గలదు. అది మేఘ ముల మెఱగు తీగల కాంతుల పగిది తేజోమయమై ప్రభలు విరజిమ్ముచుండును.

మణివ ద్బిన్నం తత్పద్మం మణిపద్మం తథోచ్యతే | దశభిశ్చ దళైర్యుక్తం

డాదిఫాంతాక్షరాన్వితమ్‌. 38

విష్ణునాధిష్ఠితం పద్మం విష్ణ్వాలోకన కారణమ్‌ |తదూర్ద్వేనాహతం పద్మముద్యదాదిత్య సన్నిభమ్‌. 39

కాదిఠాంతదళై రేకం పత్రై శ్చ సమధిష్ఠితమ్‌ | దన్మధ్యే బాణలింగం తు సూర్యాయుత సమప్రభమ్‌. 40

శబ్దబ్రహ్మమయం శబ్దానాహతం తత్ర దృశ్యతే | అనాహం తాఖ్యం తత్పద్మం మునిభిః పరికీర్తితమ్‌. 41

ఆనందసదనం తత్తు పురుషాధిష్ఠితం పరమ్‌ | దతూర్ద్వం తు విశుద్ధాఖ్యం దళం షోడశ పంకజమ్‌. 42

స్వరైః షోడశభిర్యుక్తం ధూమ్రవర్ణమహాప్రభమ్‌ | విశుద్ధం తనుతే యస్మాజ్జీవస్య హంసలోకనాత్‌. 43

విశుద్దం పద్మమాఖ్యాత మాకాశాఖ్యం మహాద్బుతమ్‌ | ఆజ్ఞా చక్రం తదూర్ద్వే తు ఆత్మనాధిష్ఠితం పరమ్‌. 44

ఆజ్ఞా సంక్రమణం తత్రతేనాజ్ఞేతి ప్రకీర్తితమ్‌ | ద్విదళం జక్షసంయుక్తం పద్మం తత్సుమనోహరమ్‌. 45

కైలాసాఖ్యం తదూర్ద్వం తు రోధినీ తు తదూర్ద్వతః | ఏవం త్వాధారచక్రాణి ప్రోక్తాని తవ సువ్రత. 46

సహస్రారయుతం బిందు స్థానం తదూర్ద్వ మీరితమ్‌ | ఇత్యేతత్కథితం సర్వం యోగమార్గ మనుత్తమమ్‌. 47

ఆదౌ పూరకయోగే నాప్యాధారే యోజయేన్మనః | గుడమే ఢ్రాంతరే శక్తి స్తామాంకుచ్య ప్రభోధయేత్‌. 48

లింగభేక్రమేణౖవ బిందుచక్రం చ ప్రాపయేత్‌ | శంభునా తాం పరాశక్తి మేకీభూతాం విచింతయేత్‌. 49

తత్రోత్థితామృతం యత్తు ద్రుతలాక్షారసోపమమ్‌ | పాయయిత్యా తు తాం శక్తిం మాయాఖ్యాం యోగసిద్దిదామ్‌.

మణుల కాంతులను బోలియుండుటచే దీనిని మణిపూరపద్మ మనియందురు. ఈ పద్మము నందు డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ యను పది యక్షరములుండును. ఇదు శ్రీ మహావిష్ణు వధిష్ఠించియుంట దీని ధ్యానమున శ్రీ విష్ణుసాక్షాత్కారము గల్గును. దీనికి పైకి బాలసూర్యప్రకాశమునకు సరివచ్చు ప్రభగల్గు '' ననాహత పద్మము'' తనర్చును. ఇది క-ఖ-గ-ఘ-జ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ యను పండ్రెండు వర్ణములు గలది. సూర్యకోటుల ప్రభలతో తుల తూగునది. దీనిమధ్య బాణలింగము గలదు. ఇందుతాకిడి లేనప్పటికిని చప్పు డుప్పతిల్లును. కనుక దీనిని''అనాహత'' మనియు ''శబ్దబ్రహ్మమయ''మనియు శబ్దబ్రహ్మనిష్ణాతులు పేర్కొందురు. ఇది పరమానందనిలయము. ఇందు రుద్రుడు విరాజిల్లును. దీనిమీద పదారుదళముల విశుద్దకమల మొప్పారుచుండును. ఇందు అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఋ-ఋ- - - ఏ-ఐ- ఓ-ఔ-అం- అః యను పదునారు వర్ణము లుండును. ఇందుగల ధూమ్రవర్ణము మహాప్రభలు వెలార్చును. ఇచట జీవుడాత్మదర్శనము చేయుటవలన శుధ్ది జెందును. కనుక దీనిని విశుద్దిపద్మమందురు. దీని నాకాశమనియు పల్కుదురు. దీనికి మీద నాజ్ఞాచక్ర మలరారును. ఇది ఆత్మ కధిష్ఠానమైనది. ఇచట పరమేశు నాజ్ఞ జీవునకు లభించును. కనుక దీని నాజ్ఞ చక్రమందురు. ఈ పద్మమందుహ-క్ష యను రెండక్షరములుగల దళములు శోభిల్లును. దానికిపైని కైలాసపద్మమును దానిపైని రోధినీపద్మమును చెన్నొందును. వీనిని చక్రములనియునందురు. సువ్రతా! ఇట్లు నీకాధారాది చక్రములు వివరించితిని. దీనికి పైగ సహస్రారమను చక్రరాజము దీపిల్లును. ఇదే బిందుస్థానము. శ్రీపరమాత్మ సన్నిధానము. ఇట్లు నీకు దివ్యయోగమార్గమంతయు వివరించితిని. తొలుత పూరకముతో నాధరచక్రమున మనస్సు నిలుపవలయును. పిదప గుడి మేఢ్రముల నడుమగల కుండలినీ శక్తి నచటి వాయువుతో సంకోచించి మేలుకొలుపవలయును. అటుపిమ్మట క్రమముగమెల్లగ నెల్లచక్రములు భేదించి సహస్రారచక్రము జేరి యందు గల పరమశివునితోపరాశక్తి నేకమొనరించి వారిని ధ్యానింపవలయును. అచటనుండి లక్కరసమువలె నమృతము వెడలుచుండును.

దానితోయోగసిద్ది గల్గించుమాయాశక్తిని తనుప వలయును.

షట్చక్రదేవతా స్తత్ర సంతర్వ్యామృతధారయా | ఆనయేత్తేన మార్గేణ మూలాధారం తతః సుధీః. 51

ఏవ మభ్యస్య మానస్యాప్యహన్య హని నిశ్చితమ్‌ | పూర్వోక్త దూషితా మంత్రాః సర్వే సిధ్యంతి నాన్యథా. 52

జరామరణ దుఃఖాద్యైర్ముచ్యతే భవబంధనాత్‌ | యే గుణాః సంతి దేవ్యా మే జగన్మాతుర్యథా తథాః. 53

తే గుణాః సాధకవరే భవంత్యేవ న చాన్య థా | ఇత్యేవం కథితం తాత వాయుధారణ ముత్తమమ్‌. 54

ఇదానీం ధారణాకఖ్యం తు శృణుష్వావహితో మమ | దిక్కాలా ద్యనవచ్చిన్న దేవ్యాంచేతో విధాయచ. 55

తన్మయో భవతి క్షిప్రం జీవబ్రహ్మైక్యయోజనాత్‌ | అథవా సమలం చేతో యది క్షిప్రం న సిద్ధ్యతి. 56

తదావయవ యేగేన యేగీ యోగాన్సమభ్యసేత్‌ | మదీయహస్త పాదాదావంగే తు మధురే నగ. 57

చిత్తం సంస్థాపయే న్మంత్రీ స్థానస్ధా నజయా త్పునః | విశుద్ధ చిత్తః సర్వస్మి న్రూపే సంస్థాపయేన్మనః. 58

యావన్మనో లయం యాతి దేవ్యాం సంవిది పర్వత | తావదిష్టమనుం మంత్రీజపహోమైః సమభ్యసేత్‌. 59

మంత్రా భ్యాసేన యోగేన జ్ఞేయజ్ఞానాయకల్పతే | న యోగేన వినా మంత్రోన మంత్రేణ వినా హి సః. 60

ద్వయోరభ్యాస యోగోహి బ్రహ్మసంసద్ది కారణమ్‌ | తమః పరివృతే గేహే ఘటో దీపేన దృశ్యతే. 61

ఏవం మాయావృతో హ్యాత్మా మనునా గోచరీకృతః | ఇతి యోగవిధిః కృత్న్సఃసాంగః ప్రోక్తోమాయాధునా.62

గురూపదేశతో జ్ఞే యోనాన్యథా శాస్త్రకోటిభిః |

ఇతి శ్రీ దేవి భాగవతే మహాపరాణ సప్తమస్కంధే పంచత్రింశోధ్యాయః.

స్థితప్రజ్ఞుడైనవా డమృతధారతో షట్చక్రములందున్న దేవతలను తనిపి పిదప నా యమృతధారను మూలాధారమునకు తేవలయును. ఈ విధముగ నిత్యము యోగాభ్యాసముచేయు యోగిదోషము లన్నియును తొలిగిపోవును. ఎల్లమంత్రము లతనికి కరతలామలకము లగును. వేరు విధముగ లభించవు. ఇట్టి యోగి జరామరణ దుఃఖముల కాటపట్టగు సంసారబంధములనుండి విడివడును. జగన్మాతనగు నాలోనెన్నియో సుగుణవిధులు గలవు. అట్టి సుగుణములన్నియును సాధకునిలో తప్పక వెలయుచుండును. ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధానముగ నవధరింపుము. శ్రీ దేవి దిక్కాలముల కతీతయైనది.ఆమెయందేచిత్తము నిలుకడ జెందవలయును. ఇట్లుచిత్తము నిల్పి దేవీ తన్మయుడైనవాడు జీవబ్రహ్మైక మొందును. ఒకవేళ మనస్సు రజోదోషమున మలినమైనచో యోగము వెంటనే సిద్ధింపదు. అపుడవయవయోగమున యోగి యోగమభ్యసింపవలయును. అనగ నామధుర మధురమైన పాదములు -చేతులుమున్నగువానియందు చిత్తము నిల్పవలయును. అటు లొక్కొక్కచోటు జయించుచు చిత్తశుద్దియైన వెంటనేచిత్తమును దేవీ రూపమందంతట నిలిపి ధ్యానింపవలయును. ఓయి పర్వతరాజా! జ్ఞానస్వరూపిణి నగు నా యందుచిత్తము లయమందువఱకు సాధకుడు తన కిష్టమైన మంత్రమో జపమో హోమమో చేయుచుండవలయును. ఇట్టి మంత్రాభ్యాసయోగమునను బ్రహ్మజ్ఞానముగల్గును. యోగము లేక మంత్రమును మంత్రము లేక యోగమును సిద్ధంపవు. ఈ రెంటి నభ్యసించిన మంత్రయోగి బ్రహ్మతాదాత్మ్య మందవచ్చును. ఇంటిలో పెంజీకటి తెరల మాటునగల కుండ దీపము వెల్గున కనబడును. అటులే మాయాంథతమములో జిక్కిన జీవాత్మ మంత్రయోగముల వెలుగు వెల్లువలలో కనిపించును. ఇటుల నీకు యోగవిధానమంతయును సాంగముగ వివపించితిని. ఇదంతయును సద్గురూపదేశమున తెలియవలసినదేకాని యెన్ని కోటుల శాస్త్రములను చూచిన నేమియు లాభములేదు.

ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమందు ముప్పదియైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters