Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టత్రింశోధ్యాయః.

హిమాలయః : కతి స్థానాని దేవేశి ద్రష్టవ్యాని మహీతలే | ముఖ్యాని చ పవిత్రాణి దేవీ ప్రియతమానిచ. 1

ప్రతాన్యపి తథా యాని తుష్టిదా న్యుత్సవా అపి | తత్సర్వం వద మే మాతః కృతకృత్యో యతో నరః 2

శ్రీ దేవ్యువాచ: సర్వం దృశ్యం మమ స్థానం సర్వేకాలా ప్రతాత్మకాః |

ఉత్సవాః సర్వకాలేషు యతోహం సర్వ రూపిణీ. 3

తథాపీ భక్తవాత్సల్యా త్కించి త్కించి తథోచ్యతే | సృణుష్వా వహితో భూత్వా నగరాజ వచో మమ. 4

కోలాపురం మహాస్థానం యత్ర లక్ష్మీఃసదా స్థితా | మాతుః పురం ద్వీతీయం చ రేణుకాధిష్ఠితం పరమ్‌. 5

తులజాపురం తృతీయం స్యా- త్సప్తశృంగ తథైవచ | హింగులాయా మహాస్థానం- జ్వాలాముఖ్యాస్తథైవచ.6

శాకంభర్యాః పరం స్థానం -భ్రమర్యాః స్థానముత్తమమ్‌ | శ్రీరక్త దంతికా స్థానం - దుర్గాస్థానం తథైవ చ. 7

వింధ్యాచల నివాసిన్యాః స్థానం సర్వోత్తమోత్తమమ్‌ |అన్నపూర్ణా మహాస్థానం- కాంచీపుర మనుత్తమ్‌. 8

భీమాదేవ్యాః పరంస్థానం - విమలాస్థానమేవచ- | శ్రీచంద్రలా మహాస్థానాం | కౌశికీస్థాన మేవచ. 9

నీలాంబయాః పరంస్థానం నీలపర్వత మస్తకే | జాంబూనదేశ్వరీ స్థానం - తథా శ్రీ నగరం శుభమ్‌. 10

గుహ్యకాల్యా మహాస్థానం నేపాలే యత్ర్పతిష్ఠితమ్‌ | మీనాక్ష్యాః పరమం స్థానం - యత్తత్ర్పోక్తం చిదంబరే. 11

వేదారణ్యం మహాస్థానం - సుందర్యా సమిధిష్ఠితమ్‌ |ఏకాంబరం మహాస్థానం - పరశక్త్యా ప్రతిష్ఠితమ్‌. 12

ముప్పదిఎనిమిదవ అధ్యాయము

శ్రీదేవి గీతలు

హిమాలయుడు శ్రీదేవితో నిట్లనెను: ఓ దేవేశీ ! ఈ భూతలమునందు శ్రీదేవీ ప్రియములు-ముఖ్యములు-పవిత్రములు-దర్శనీయములునైన పుణ్యతీర్థక్షేత్రము లెన్నిగలవో తెలుపుము. తల్లీ ! ఏయే వ్రతములు దేవీమహోత్సవములు జరుపుటవలన నరుడు కృతకృత్యుడగునో యవన్నియును వివరింపుము. శ్రీదేవి యిట్లనెను: ఓ చలిమలదొరా ! నేను విశ్వమయిని-సర్వకాల స్వరూపిణి. కనుక కంటికి కనబడుచోట లన్నియును నాదివ్యస్థానములే ఇంక నెల్లకాలములును నా మహోత్సములే. ఓ వలిమలఱడా ! ఐనను నీమీది వాత్సల్యముచే కొన్ని పుణ్యక్షేత్రముల గూర్చి తెల్పుదును. సావధానముగ వినుము. కోలా పురము నా మహాపుణ్యస్థానము. అందు శ్రీమహాలక్ష్మినిత్యము విలసిల్లచుండును. రెండవది సహ్యాద్రిమీది మాతృపురము గలదు. అందు రేణుకాదేవి యధిష్టించి యుండును. మూడవది తులజాపురము. అందు హింగులాదేవి విలసిల్లియున్నది. సప్తశృంగమున జ్యాలాముఖి గలదు. శాకంభరీ పరధామము-భ్రామరీస్థానము- శ్రీరక్తదంతికా నివాసము-శ్రీదుర్గాధామమును-గలవు. వింధ్యగిరిపై నున్న దేవీస్థానముత్తమోత్తమమైనది. శ్రీమంతమైన కాంచీపురము-అన్నపూర్ణా మహాస్థానము-శ్రీభీమాదేవి మహాస్థానము-విమలాదేవిస్థానము-శ్రీచంద్రలా మహాస్థానము-శ్రీకౌ

శికీస్థానమును-గలవు. నీలపర్వతశిఖరమున నీలాంబరీదేవి నిలయము గలదు. శ్రీనగరమందు జాంబూనదేశ్వరీదేవి వెలయుచున్నది. గుహ్యకాళికి నేపాళము ప్రతిష్ఠా స్థానము-చిదంబరము మీనాక్షిదేవికి నిలయము. శ్రీవేదారణ్య మహాస్థానమున సుందరీదేవి-ఏకాంబర మహాక్షేత్రమున శ్రీపరా శక్తిదేవి ప్రతిష్ఠితలై యున్నారు.

మదాలసా పరం స్థానం-యోగేశ్వర్యాస్తథైవచ- | తథా నీలసరస్వత్యాః స్థానం చీనేషు విశ్రుతమ్‌. 13

వైద్యనాథే తు భగలాస్థానం సర్వోత్తమం మతమ్‌ | శ్రీమచ్చ్రీభువనేశ్వర్యా - మణిద్వీపం మమ స్మృతమ్‌ . 14

శ్రీమత్త్రిపురభైరవ్యాః కామాఖ్యాయోనిమండలమ్‌ | భు మండలే క్షేత్రరత్నం మహామాయాధివాసితమ్‌. 15

నాతఃపరతరం స్థానం క్వచిదస్తి ధరతలే | ప్రతిమాసం భ##వేద్ధేవీ యత్రసాక్షాద్ర జస్వలా. 16

తత్రత్యా దేవతాః సర్వాః పర్వతాత్మకతాం గతాః | పర్వతేషు వసంత్యేవ మహత్యో దేవతా అపి.17

తత్రత్యా పృథివీ సర్వా దేవీరూపా స్మృతా బుధైః | నాతః పరతరం స్థానం కామాఖ్యా యోనిమండలాత్‌. 18

గాయత్య్రా శ్చ పరం స్థానం శ్రీమత్పుష్కర మీరితమ్‌ | అమరేశే చండికా స్యా త్పృభాసే పుష్కరేక్షిణీ. 19

నైమిషే తు మహాస్థానే దేవీ సా లింగధారిణీ | పురుహూతా పుష్కరాక్షే అషాఢౌ చ రతిస్తథా. 20

చండముండా మహాస్థానే దండినీ పరమేశ్వరీ | భారభూతౌ భ##వే ద్బూతి ర్నకులే నకులేశ్వరి. 21

చంద్రికా తు హరిశ్చంద్రే-శ్రీగిరౌ శాంకరీ స్మృతా | జప్యేశ్వరే త్రిశూలా స్యా - త్సూక్ష్మాచామ్రాతకేశ్వరే. 22

శాంకరీ తు మహాకాలే-శర్వాణీ మధ్యమాభిధే | కేదారాఖ్యే మహాక్షేత్రే దేవీ సా మార్గదాయినీ. 23

భైరవాఖ్యే భైరవీ సా-గయాయాం మంగలా స్మృతా | స్థాణుప్రియా కురక్షేత్రే-స్వాయం భువ్యపినాకులే. 24

కనఖలే భ##వే దుగ్రా-విశ్వేశా విమలేశ్వరే | అట్టహాసే మహానందా - మహేంద్రే తు మహాంతకా. 25

చీనదేశమున మదాలసయును యోగేశ్వరీయును-నీలసరస్వతీదేవియును ప్రసిద్ధి వహించియున్నారు. శ్రీబగళాదేవి వైద్యనాధమున గలదు. శ్రీ త్రిభువనేశ్వరి నగు నా పుణ్యధామము శ్రీమంతమగు మణిద్వీపమని ప్రసిద్ధి. సతీదేవి యోని మండలము పూడిన తావు కామాఖ్యా క్షేత్రము. ఇది పుణ్యక్షేత్రరాజము. మహామాయాధివాసితమగు శ్రీమత్తిప్రుర భైరవీ స్థానము. ఇచట శ్రీదేవి ప్రతినెల రజస్వల యగుచుండును. దీనిని మించిన దేవీపుణ్యక్షేత్ర మీ భూతలముల లేనేలేదు. ఇచ్చట నుత్తమదేవత లెల్లరును పర్వతరూపములు దాల్చి పర్వతముల మీదనే వాస ముందురు. ఆ క్షేత్రమందలి ప్రతిరేణువందును అణువణువందునను శ్రీదేవి విలసిల్లునని పెద్దలందురు. ఈ కామాఖ్యా యోనిమండలమును మించిన పుణ్యతీర్థము మరిలేదు. శ్రీపుష్కరక్షేత్రమున శ్రీగాయత్రీదేవియు అమరేశ్వరమున చండికాదేవియు ప్రభాసమున పుష్కరేక్షిణియు వెలయు చుందురు. శ్రీలింగధారిణీదేవికి నైమిశమును పురుహూతాదేవికి పుష్కరాక్షమును-రతీదేవి కాషాఢమును-నివాసస్థానములు. చండముండా మహాస్థానమున దండినీ పరమేశ్వరియును-భారభూతియందు మహాభూతియును-నాకు లేశ్వరమున నాకులి యును పేరు గాంచిన దేవతలు. హరిశ్చంద్రపురి శ్రీ చంద్రికకు-శ్రీగిరి శాంకరికి-జప్యేశ్వరి త్రిశూలకు-ఆ మ్రాతకేశ్వరము సూక్ష్మాదేవికిని-నివాసములు. శ్రీశాంకరి యుజ్జయినిలోను-శర్వాణిమధ్య మేశ్వరములోను శ్రీమార్గదాయినీదేవి కేదారమహాక్షేత్రములోను వెలసి యొప్పుచున్నారు.భైరవ స్థానమునభైరవీదేవియును-శ్రీగయాక్షేత్రమున మంగళాదేవియును-కురుక్షేత్రమున స్థాణుప్రియయు-మా కులమున స్వాయంభువియు-శోభిల్లుచున్నారు. ఉగ్రాదేవి కనఖలమున-విశ్వేశివిమలేశ్వరమున - మహానంద ఆట్టహాసమున-మహాంతక మహేంద్రమున-వెలసిన దేవతలు.

భీమే భీమేశ్వరీ ప్రోక్తా-స్థానే వస్త్రా పథే పునః | భవానీ శాంకరీ ప్రోక్తా-రుద్రాణీ త్వర్థకోటికే. 26

అవిముక్తే విశాలాక్షీ-మహాభాగా మహాలయే | గోకర్ణే భద్రకర్ణీ స్యా-ద్బద్రా స్యా ద్బద్రకర్ణకే. 27

ఉత్పలాక్షీ సువర్ణాక్షే-స్థాణ్వీశా స్థాణుసంజ్ఞకే | కమలాలయే తు కమలా-ప్రచండా ఛగలండకే. 28

కురండలే త్రిసంధ్యాస్యా-న్మాకోటే ముకుటేశ్వరీ | మండలేశే శాండకీ స్యా - త్యాళీ కాలంజరే పునః. 29

శంకుకర్ణే ధ్వనిః ప్రోక్తా-స్థూలా స్యాత్థ్సూలకేశ్వరే | జ్ఞానినాం హృదయాంభోజే-హృల్లేఖా పరమేశ్వరీ. 30

ప్రోక్తా నీమాని స్థానాని దేవ్యాః ప్రియతమాని చ | తత్తత్‌ క్షేత్రస్య మహాత్మ్యం శ్రుత్వా పూర్వం నగోత్తమ. 31

తదుక్తేన విధానేన పశ్చాద్దేవీం ప్రపూజయేత్‌ | అథవా సర్వ క్షేత్రాణి కాశ్యాం సంతి నగోత్తమ. 32

తత్ర నితం వసే న్నిత్య దేవీ భక్తి పరాయణః | తానిస్థానాని సంపశ్యన్‌ జపన్దేవీం నిరంతరమ్‌. 33

ధ్యాయం స్త చ్చరణాం భోజం ముక్తోభవతి బంధనాత్‌ | ఇమాని దేవీనామాని ప్రాతరుత్థాయ యఃపఠేత్‌. 34

భస్మీభవంతి పాపాని తత్‌క్షణాన్నగ సత్వరమ్‌ | శ్రాద్దకాలే పఠే దేతా స్యమలాని ద్విజాగ్రత్తః. 35

ముక్తాస్త త్పితరః సర్వే ప్రయాంతి పరమాం గతిమ్‌ |అధునా కథయిష్యామి వ్రతాని తవ సువ్రత. 36

నారీభిశ్చ నరైశ్చైవ కర్తవ్యాని ప్రయత్నతః | వ్రత మనంతతృతీ యాఖ్యం రసకల్యాణినీ వ్రతమ్‌. 37

భీమపురి భీమేశ్వరికి-వస్త్రాపథము భవానిశాంకరికి-అర్థకోటి రుద్రాణికి-వన్నెగాంచిన దేవీధామములున. శ్రీవిశాలాక్షీదేవి కాశియందు-మహాభాగ మహాలయమున-భద్రకర్ణి గోకర్ణమున భద్రాస్య భద్రకంటకమున ప్రసిద్ధ దేవతలు. సువర్ణాక్షమం దుత్పలాక్షీదేవియు-స్థాణుక్షేత్రమున స్థాణీశ్వరీదేవియు-కమలాలయమందు కమలయు-ఛగలండమందు ప్రచండయును-విరాజిల్లు దేవీరత్నములు. త్రిసంధ్యాదేవి కురండలక్షేత్రమున-మకుటేశ్వరి మహాకోటమున-శాండకి మండలేశ్వరమున-కాళిక కాలంజరమున వెలసిన దేవతలు. శంకుకర్ణములో ధ్వని-స్థూలకేశ్వరములో స్థూల-జ్ఞానుల హృదయకమలమందు హృల్లేఖా ప్రాణశక్తి-దేవతలు విలసిల్లుచున్నారు. నగపతీఃఇటుల శ్రీదేవికి ప్రియతమములైన పుణ్యస్థానము లన్నియును నీకు చెప్పబడినవి. ఆయా క్షేత్ర మహాత్మ్యములు వినవలయును. నేను చెప్పిన విధానమున శ్రీదేవిని పూజింపవలయును. ఎల్ల పుణ్యక్షేత్రములు శ్రీకాశీక్షేత్రమం దుండును. శ్రీదేవివీ భక్తి పరాయణుడు నిత్యమాయాదేవి పుణ్యధామములు దర్శించుచు శ్రీదేవిని నిరంతరము జపింపవలయును. దేవీ దివ్యచరణకమలములు ధ్యానించుచున్నవాడు సంసారఘోరబంధములనుండి విముక్తుడగును. ఈ దివ్యదేవి నామములును క్షేత్రములు నుదయమున మేల్కొంచి చదువవలయును. వీనిని చదివినవాని పాపరాసు లెల్లను భస్మీపటలము జెందును. వీనిని శ్రాద్దకాలమున బ్రాహ్మణ సన్నిధిలో నిర్మలాత్మతో చదువవలయును. అట్లు చదివినవాని

పాపరాసు లెల్లను భస్మీపటలము జెందును. వీనిని శ్రాద్ధకాలమున బ్రాహ్మణసన్నిధిలో నిర్మలాత్మతో చదువవలయును. అట్లు చదివినవాని పితరులు విముక్తులై పరమగతి జెందురు. ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల్ల స్త్రీ పురుషులు తప్పక నిష్ఠతో నాచరింపవలయును. అనంతతృతీయావ్రతము-రవికల్యాణినీ వ్రతము-

ఆర్ద్రానందకరం నామ్నా తృతీయాయావ్రతం చ యత్‌ | శుక్రవారవ్రతం చైవ తథా కృష్ణ చతుర్దశీ. 38

భౌమవారవ్రతం చైవ ప్రదోషవ్రత మేవ చ| యత్ర దేవో మహాదేవో దేవీం సంస్థాప్య విష్టరే. 39

నృత్యం కరోతి పురతః సార్ధం దేవైర్నిశాముఖే | తత్రోపోష్య రజన్యా దౌ ప్రదోషేపూజయేచ్చివామ్‌. 40

ప్రతిపక్షం విశేషేణ తద్దేవీ ప్రీతికారకమ్‌ | సోమవారవ్రతం చైవ మమాతి ప్రియకృ న్నగ. 41

తత్రాపి దేవీం సంపూజ్య రాత్రౌ భోజన మాచరేత్‌ | నవరాత్రద్వయం చైవ వ్రతం ప్రీతికరం మమ. 42

ఏవ మన్యా న్య పి విభో నిత్యనైమిత్తికాని చ | వ్రతాని కురుతే యో వై మత్ప్రీత్యర్థం విమత్సరః. 43

ప్రాప్నోతి మమ సా యుజ్యం స మే భక్తః సమేప్రియః | ఉత్సవా న పి కుర్వీత దోలోత్సవముఖా న్విభో. 44

శయనోత్సవం యథా కుర్యాత్తథా జాగరణోత్సవమ్‌ | రథోత్సవం చ మే కుర్యా ద్దమనోత్సవ మేవ చ. 45

పవిత్రో త్సవ మేవాపి శ్రావణ ప్రీతికారకమ్‌ | మమ భక్తః సదా కుర్యా దేవ మన్యాన్మహోత్సవాన్‌. 46

మద్బక్తాన్బోజయే త్ప్రీ త్యా తథాచైవ సువాసినీః | కుమారీ ర్వటుకాం శ్చాపి మద్బద్ద్యా తద్గతాంతరః. 47

విత్త శాఠ్యేన రహితో యజే దేతా న్సుమాదిభిః | య ఏవం కురుతే భక్త్యా ప్రతివర్ష మతం ద్రితః. 48

స ధన్యఃకృతకృత్యోసౌ మత్వ్రీ తేః పాత్ర మంజసా | సర్వ ముక్తం సమాసేన మమ ప్రీతిప్రదాయకమ్‌. నాశిష్యాయ ప్రదాతవ్యణ నా భక్తాయ కదాచన. 49

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే దేవీగీతాయా మష్టాత్రీంశోధ్యాయః.

అర్ద్రానందకరమను తృతీయా వ్రతము-శుక్రవార వ్రతము-కృష్ణ చతుర్దశీ వ్రతము-భౌమవారవ్రతము-ప్రదోష వ్రతము-మున్నగునవి దేవీముఖ్యవ్రతము. మొదట పూజాస్థానము దేవదేవుడగు మహాదేవుని శ్రీ దేవీని పీఠముపై నుంచ వలయును. ప్రదోషసమయమున శ్రీదేవీ సన్నిధానమున నెల్ల దేవతల యెదుట నృత్యమొనరిణపవలయును. పగలంతయు నుపవసించి ప్రదోషమున మంగళమయియగు శివను పూజింపవలయును. ఇట్లు ప్రతి పక్షమందును వ్రతము లాచరించిన దేవి మిక్కిలి సంతోషంచును నగేశా! సోమవారవ్రతము నాకత్యంత ప్రియమైన వ్రతము. ఇటుల శ్రీదేవిని చక్కగ నర్చించి రాత్రివేళ భుజింపవలయును. నాకురెండు ననరాత్ర మహోత్సవములను మిక్కిలి ప్రియకరములు. ఇవికాక నా ప్రీత్యర్ధము మచ్చర ముడిగి నిత్య మైమిత్తికము లాచరింపవలయును. వ్రతము లాచరింపవలయును. అటు లొనర్చిన నా ప్రియభక్తుడు నా సాయుజ్య పదవి పొందును. ఇంక నా మహోత్సవములు పెక్కు గలవు. వానిలో డోలోత్సవముశయ నోత్సవము జాగరణోత్సవము రధోత్సవము దమనోత్సవము మున్నగు నుత్సవము లాచరింపవలయును. ముఖ్యముగ శ్రావణమాసమందు పవిత్రోత్సవము నాకు మిక్కిలి యిష్టమైనది. ఇట్లు నా భక్తుడైనవాడు దేవీ మహోత్సవములు భక్తిశ్రద్ధలతో జరుపవలయును. పిమ్మట నా భక్తులను-ముతైదువలను-బాలికలను-వడుగులను-దేవిభావమున నర్చించి వారిలో నన్నే కనుచు వారికి భోజనము పెట్టవలయును. డబ్బునకు గింజువలాడుకొనక వీరి నెల్లరిని పుష్పతాంబూల వస్త్రములతో సమ్మానింపవలయును. ఇట్లు ప్రతియేడు జాగరూకుడై దేవీభక్తు డాచరింపవలయును. అట్టివాడు కృతార్ధుడు-ధన్యభాగ్యుడు-పుణ్యాత్ముడు-నా ప్రేమకు పాత్రుడు. ఈ విధముగ నాకు ప్రియమైన విషయము లన్నియును సంక్షేపముగ దెలిపితిని. దీని నంతయును దేవీభక్తుడుగాని వానికిని ప్రియశిష్యుడుగాని వానికిని చెప్పరాదు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున దేవీగీతయుందు ముప్పదిఎనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters