Sri Devi Bagavatham-2    Chapters   

అథ తృతీయోధ్యాయః

నారాయణః: మహీం దేవః ప్రతీష్ఠాప్య యథాస్థానేచ నారద |వైకుంఠలోక మగమ ద్ర్బహ్మోవాచ స్వమాత్మజమ్‌. 1

స్వాయంభువ మహాబాహోపుత్ర | తేజస్వి నాంవర | స్థానే మహీమయే తిష్ట ప్రజాఃసృజం యథోచితమ్‌. 2

దేశకాలవిభాగేన యజ్ఞేశం పురుషం యజ | ఉచ్చావచ పదార్దైశ్చ యజ్ఞసాధనకైర్విభో. 3

ధర్మమాచర శాస్త్రక్తం వర్ణా శ్రమనిబంధనమ్‌ | ఏతేన క్రమయోగేన ప్రజావృద్దిర్బవిష్యతి. 4

పుత్రా ముత్పాద్య గుణతః కీర్త్యాకాంత్యాత్మరూపిణః | విద్యా వినయ సంపన్నా న్సదాచవారతాం వరాన్‌. 5

కన్యా శ్చ దత్త్వా గుణవద్యశోవధ్భ్వః సమాహితః | మనః సమ్య క్సమాధాయ ప్రధానపురుషే పరే. 6

భక్తిసాధన యోగేన భగవత్పరి చర్యయా | గి మిష్టాం సదా వంద్యాం యోగినాంగమితా భవాన్‌. 7

ఇత్యాశ్వాస్య మనుం పుత్రం పద్మయోనిః ప్రజాపతిః | ప్రజాసర్గే నియమ్యాముం స్వధామపత్యపద్యత. 8

ప్రజాః సృజత పుత్రేతి పితురాజ్ఞాం సమాదధత్‌ | స్వాయంభువః ప్రజాసర్గ మకరో త్పృథివీపతిః. 9

ప్రియవ్రతోత్తానపాదౌ మనుపుత్రౌ మహౌజసౌ | కన్యాస్తిస్రః ప్రసూతాశ్చ తాసాం నామానిమేశృణు 10

అకృతిః ప్రథమా కన్యా ద్వితీయా దేవహూతికా తృతీయా చ ప్రసూతిర్హి విఖ్యాతాలోకపావనీ. 11

అకృతిం రుచయే ప్రాదా త్కర్దమాయ చమధ్యమామ్‌ | దక్షాయాదాత్ర్పసూతిం చ యాసాంలోకఇమాః ప్రజాః.

మూడవ అధ్యాయము

మనుకన్యా వంశ వర్ణనము - ద్వీపవర్ష సముద్రాది వ్యవస్థ

నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల్పి తిరిగి తన వైకుంఠథామ మరిగెను. పిమ్మట బ్రహ్మ మనువుతో నిట్లనెను: స్వాయంభువ మనూ! మహాబాహూ! పుత్రా! తేజస్వులలో శ్రేష్ఠా! ఈ నేలపై నుండి నీకు దోచిన రీతిగ ప్రజా సృష్టి కొనసాగింపుము. దేశకాలములకు తగినచట్లు నుత్తమమైన యజ్ఞసాధనములు సమకూర్చుకొని యజ్ఞ పూరుషునిగూర్చి వేల్పుము. శాస్త్రక్తముగ వర్ణాశ్రమ ధర్మము పాటించుచు ఈ క్రమపద్దతి నే ప్రజావృద్ది జరుగగలదు. విద్యావినయసం పదలు-సదాచారము - గల్గి కీర్తిలో కాంతిలో నీకు ప్రతిరూపులగు కుమారవరులను పెక్కురను త్రిగుణాను గుణశీలవతులగు కన్యలను గని పిదప మనస్సును ప్రధాన పురుషునందు చక్కగ నిలుపుము. భక్తిసాధన యోగముతో భగవంతునకు కైంకర్యములు చేయుచు పరమయోగులు పొందునట్టి మాన్యపరమగతిని బొందుము. ఈ రీతిగ కమలనిలయుడగు ప్రజాపతి తన పుత్రుడగు మనువును ప్రజాసృష్ఠిలో నియమించి తన నివాసమున కరిగెను. 'సంతతి బడయు' మను తండ్రిమాట జనదాటక స్వాయంభువమను మహీపతి ప్రజాసృష్టికి గండగెను. అంతమునువునకు ప్రియవ్రతుడు - ఉత్తానపాదు | డను నిర్వురు కొమరులు గల్గిరి. పిదప మువ్వురు కన్నియలు గల్గిరి. వారి పేర్లు వినుము: మొదటి కన్య 'అకృతి' రెండవ కన్నియ'దేవహూతి' మూడవ కన్నె 'ప్రశూతి.. వీరులోకపావనలై వన్నె గాంచిరి. ఆకృతిని రుచికి - దేవహూతిని కర్దమునకు - ప్రసూతిని దక్షున-కిచ్చి మనువుపెండ్లిచేసెను. ఈ లోకమంతయును వీరి సతంతియే.

రూచేః ప్రజజ్ఞే భగావాన్యజ్ఞో నామాదిపూరుషః | ఆకుత్యాం దేవహూత్యాం చ కపలోపిచకర్దమాత్‌. 13

సాంఖ్యాతార్యః సర్వలోకే విఖ్యతః కపిలో విభుః | దక్షాత్ర్పసూత్యాం కన్యాశ్చ బహుశో జజ్ఞిరే ప్రజాః. 14

యాసాం సంతానసంభూతా దేవతిర్యజ్ఞరాదయః | ప్రసూతా లోకవిఖ్యాతాః సర్వే సర్గప్రవర్తకాః 15

యజ్ఞ శ్చ భగవాన్వ్సాయంభువ మన్వంతరే విభుః | మనుం రరక్ష రక్షోభ్యోయామైర్దేవగణౖర్వృతః 16

కపిలోపి మహాయోగీ భగవాన్స్వాశ్రమే స్థితః | దేవహూత్యై పరం జ్ఞానం సర్వావిద్యా నివర్తకమ్‌. 17

సవిశేషం ధ్యానయోగ మధ్యాత్మజ్ఞాన నిశ్చయమ్‌ | కాపిలం శాస్త్రమాఖ్యాతం సర్వాజ్ఞాన వినాశనమ్‌. 18

ఉపదిశ్య మహాయోగీ స య¸° పులహాశ్రమమ్‌ | అద్యా పి వర్తతే దేవః సాంఖ్యాచార్యో మహాశయః. 19

యన్నామస్మరణనా పి సాంఖ్యయోగశ్చ సిద్ద్యతి | తం వందే కపిలం యోగాచార్యం సర్వ వరప్రదమ్‌. 20

ఏవ ముక్తం మనోః కన్యా వంశవర్ణన ముత్తమమ్‌ | పఠతాం శృణ్వతాం చాపీ సరక్వపాప వినాశనమ్‌. 21

అతః పరం ప్రవక్ష్యామి మనుపుత్రా న్వయం శుభమ్‌ | యదా కర్ణన మాత్రేం పరంపద మవాప్నుయాత్‌. 22

ద్వీపవర్ష సముద్రాది వ్యవస్థా యత్సుతైః కృతా | వ్యవహార ప్రిసిద్ద్యర్థం సర్వభూత సుఖాప్తయే. 23

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ ష్టమస్కంధే భువననకోశోనామ తృతీయోధ్యాయః.

ఆకృతి రుచులకు యజ్ఞడను పేరుతో నాది పూరుషుడగు భగవాను డవతరించెను. దేనహూతి కర్దములకు కపిలుడుగ హరి యవతరించెను. ఈ కపిలుడే సాంఖ్యయోగ ప్రవర్తకుడని లోకమున విఖ్యాతి గాంచెను. ప్రసూతి దక్షులను పెక్కురు ప్రజలు గలిగిరి. వారికి దేవ-తిర్యక్కులు -నరులు మున్నగు వారు లోకవిఖానితులైన వారు గల్గిరి. వీరెల్లరును సృష్టి కర్తలే. యజ్ఞభగవానుడు స్వాయంభువ మన్వంతరమందు యామదేవ గుణములతో గూడి రాక్షసుల బారినుండి మనువును గాపాడెను. మహీయోగియగు కపిల భగవానుడు తన యాశ్రమమందుండి దేవహూతికవిద్యనాశకమగు పరమ జ్ఞానము భోధించెను. ఆది సవిశేషమైన ధ్యానయోగము; ఆధ్యాత్మజ్ఞాన నిశ్చయము; అజ్ఞానమను పెంజీకట్లు బాపువెల్గుబాట; కాపిలశాస్త్రమని ప్రచారది మందినది. కపిల మహాయోగి తన తల్లికి సాంఖ్య ముపదేశించి పులహాశ్రమ మేగెను. అసాంఖ్యా చార్య మహాశయు డిప్పటికి నచ్చటనే కలడు. ఎవ్వాని దివ్యనామ సంస్మరణమున సాంఖ్యయోగము సిద్దించునో- యోగాచార్యడు-సర్వవరప్రదుడు నగునట్టి కపిలునకు నమస్కారములు. ఇట్లు మను కన్యల యుత్తమవంశము వర్ణించితిని. దీనిని చదివిన-వినన వారి సర్వపాపములు పటాపంచలగును. ఇకమీదుట మునుపుత్రుల శుభవంశ వర్ణనము వినిపింతును. దానిని విన్నంతమాత్రన పరమపదము చేకూరును. లోక్యవ్యహారము కొఱకు సకల భూతముల కల్యాణము కొఱకు మనుపుత్రులు ద్వీప- వర్ష- సముద్రములను నేర్పాటు లేర్పరచిరి.

ఇది శ్రీ దేవి భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున భువనకోశమను తృతీయాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters