Sri Devi Bagavatham-2    Chapters   

అథఅష్టమోధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ: తేషు వర్షేషు దేవేశాః పూర్వో క్తైః స్తవనైఃసదా | పూజయంతి మహాదేవిం జపధ్యాన సమాధిభిః. 1

సర్వర్తుకుసుమ శ్రేణీ శోభితా వనరాజయః | ఫలానాం పల్లవానాం చ యత్రశోభానిరంతరమ్‌. 2

తేషు కాననవర్షేషు వర్షపర్వతసానుషు | గిరిద్రోణీషు సర్వా సు నిర్మలోదకరాశిషు. 3

వికచోత్పలమాలాసు హంససారససంచయైః | విమిశ్రితేషు తేష్వేవ పక్షిభిః కూజితేషు చ. 4

జలక్రీడాదిభిశ్చిత్రవినోదైః క్రీడయంతి చ | సుందరీ లలితభ్రూ ణాం విలాసాయతనేషు చ. 5

తత్రత్యా విహరంత్యత్రసై#్వరం యువతిభిఃసహ | నవస్వపి చ వర్షేషు భగవానిదిపూరుషః. 6

''నారాయణాఖ్యోలోకానా మనుగ్రహరసైకదృక్‌'' దేవీ మారాధయన్నాస్తే స చ సర్వైశ్చ పూజ్యతే |

ఆత్మవ్యూహేనే జ్యయా7సౌ సన్నిధత్తే సమూహితః. 7

ఇలావృతే తు భగవా న్పద్మజాక్షి సముద్బవః | ఏక ఏక భవో దేవో నిత్యం వసతి సాంగనః. 8

తత్షేత్రే నాపరః కశ్చి త్ప్రవేశం వితనోతి చ | భవాన్యాః శాపతస్తత్ర పుమాన్‌ స్త్రీభవతిస్పుటమ్‌. 9

భవానీనాథకైః స్త్రీణా మసంఖ్యైర్గణకోటిభిః | సంరుధ్యమానో దేవేశో దేవం సంకర్షణం భజన్‌. 10

ఎనిమిదవ అధ్యాయము

భువన వ్యవస్థ

నారాయణు డిట్లనెను : దేవతలు పూర్వము చెప్పిన ప్రకారముగ నాయా దేశములలోని దేవేశ్వరిని దేవీభక్తులు స్తోత్రజపధ్యాన సమాధులతో సమారాధింతురు. అచట ఋతువులన్నిటియందును వనములు నిరంతరము పల్లవ-కుసుమ-ఫల రసాదులతో పచ్చపచ్చగ శోభిల్లుచుండును. ఆ వర్షారణ్యములందును అచటి వర్షపర్వతముల చఱియలందును కొండలోయ లందును విప్పారిన కలువపూలశ్రేణుల కల నిర్మల జలాశయములందును హంసలతోను బెగ్గురు పక్షులతోను ఆ జలములందు విరియబూచిన కమలకుసుమములపై సంచరించు ఆయా పక్షుల కూతలతోను మిశ్రితములగు ఆ అరణ్య ప్రదేశములందును సుందరుల అందమయిన కనుబొమలనెడు గృహములందును అచటివారు అచటియువతులతోకూడి జలక్రీడలు మొదలగు విచిత్ర వినోదములతో విహరించుచుందురు. ఆ తొమ్మిది వర్షములందు నాది పూరుషుడగు భగవానుడు పూజ్యడు. అతడు నారాయణ నామముతో పిలువబడుచు లోకాల నను గ్రహించు చూపులతో దేవిని నెమ్మదిగా గొల్చచుండును. అట్టి నారాయణమూర్తి నచటి జనములు నిశ్చలమతితో గొలుచుచుందురు. అచట నతడు ఆత్మవ్యూహముతోను ఆరాధన రూపమగు యజ్ఞముతోను సన్నిహితుడై యుండును. బ్రహ్మకనుబొమల రుద్రాంశజుడగు దేవుడు భవుడుద్బవించెను. అతడు దేవినిగూడి ''ఇలావృతవర్షమున'' పూజింపబడును. ఆ క్షేత్రమున పురుషుడెవ్వడును ప్రవేశింపడు. భవానీ శాపకారణముగ నచటికి వెళ్ళిన పరుషుడు స్త్రీరూపము దాల్చను. అచట భవానీపతియగు శివుడు కోట్లకొలది స్త్రీగణములతో జేరి సంకర్షణుని గొల్చుచుండును.

ఆత్మనా ధ్యానయోగేన సర్వభూత హితేచ్చయా | తాం తామసీం తురీయాం చ మూర్తిం ప్రకృతిమాత్మనః.

ఉపధావతి చైకాగ్రమనసా భగవానజః | శ్రీభగవానువాచ : ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణసంఖ్యా నాయానంతాయా వ్యక్తాయ నమ ఇతి. 12

భ##జే భజన్యారుణ పాదపంకజం భగస్య కృత్స్నస్య పరంపరాయణమ్‌ |

భ##క్తేష్వలం భావిత భూతభావనం భవాపహం త్వాం భవభావ మీశ్వరమ్‌. 13

న యస్య మాయాగుణ కర్మవృత్తిభిర్నిరీక్షితో హ్యణ్వపి దృష్టిరజ్యతే |

ఈశే కథానో జితమన్యు రంహసా కస్తం న మన్యేత జిగీషు రాత్మనః. 14

అసందృశో యం ప్రతిభాతి మాయయా క్షీబే వ మధ్వాసవతామ్రలో చనః |

న నాగవధ్వోర్హణ ఈశిరే హ్రియా యత్పాదయోః స్పర్శన ధర్షితేంద్రియాః. 15

యమాహుసరస్య స్థతిజన్మ సంయమంత్రిభిర్విహీనం యమనంత మౄషయః |

న వేద సిద్దార్థమివక్వ చిత్థ్సితం భూమండలం మూర్థసహ స్రధామసు. 16

యస్యా೭೭ద్య ఆసీద్గుణ విగ్రహో మహాన్విజ్ఞాన ధిష్ణ్యో భగవానజః కిల |

యత్సంవృతోహంత్రివృతా స్వతేజసా వైకారికం తామసమైంద్రియం సృజే. 17

ఏతే వయం యస్యవశే మహాత్మనః స్థితాః శకుంతా ఇవసూత్ర యంత్రితాః |

మహానహం వైకృతతామ సేంద్రియాఃసృజామ సర్వే యదనుగ్రహాదిదమ్‌. 18

యన్నిర్మితాం కర్హ్యపి కర్మ పర్వణీం మాయాంజనోయం గురు సర్గమోహితః |

నవేదనిస్తారణ యోగ మంజసాతసై#్మ నమస్తే విలయోదయాత్మనే. 19

ఆచోట భగవానుడు భవుడు (శివుడు) సర్వభూతహితముగోరి ధ్యానయోగముతో తన మూర్తిని తామసీ తురీయ ప్రకృతి నాశ్రయించియుండును. అతడేకాగ్రచిత్తముతో నా ప్రకృతిని ధ్యానించుచుండును. (భగవాను డిట్లనెను:) మహా పురుషుడు సర్వగుణవిఖ్యాతుడు అనంతుడు అవ్యక్తుడునగు భగవానునకు నమస్కారము. భజింపదగిన రమ్యపదకమలములు గల వానిని భక్తులపాలిటి కల్పతరువును భూతభావనుని సంసారబాధానివారకుని సకల పరాయణుని పరమేశ్వరుని భజించుచున్నాను. ఏ దేవుని చూపు మాయాగుణ కర్మవృత్తులుగల విషయములందు జిక్కుకొనదో యట్టి జితమన్యడు ఈశ్వరుడు నగు దేవు నాత్మవిజయముగోరువా డెవ్వడు చింతింపడు? మదువు గ్రోలుటవలన నెఱ్ఱని కన్నులుగల్గి యెవడు మాయచేత నెఱుంగబడడో మూఢములైన యింద్రియిములుగల నాగకన్య లెవని రమ్యపదకములములు తాకి సిగ్గుచేత గొలువజాలరో జన్మ స్థతి లయములులేని యెవనివలన జన్మస్థితిలయములు గల్గునో ఋషులెవని ననంతుడందురో తన వేల శిరములలో నొకదాని మీద కొద్దిచోటగల యీ భూమండలమంతయు నొక చిన్న కమలము మాత్రముగనైన లేదని యెవడు భావించునో ఎవ్వాని తొలి విగ్రహము గుణనిమిత్తమగు మహత్తత్త్వమో యే భగవానుడు విజ్ఞానమయుడో యెవని వలన రుద్రుడనగు నేను త్రిగుణాత్మకతేజముగల యహంకారముతో తామససృష్టి చేతునో-త్రాళ్లచేత గట్టుపడిన పక్షులవలె నే మహితాత్మునివలన మేమెల్లరము నిగ్రహింపబడియున్నారమో యహంకారవికారతామసేంద్రియములుగల మేమెవని దయచే సృష్ఠిరచన సాగింతుమో ఎవ్వని కర్మరూపమగు మాయకు లోనై జనులు భ్రాంతితో తరించు నుపాయ మెఱుంగరో యట్టి సృష్టిస్థితిలయాత్మునకు పదివేల నమస్కారములు.

నారాయణః : ఏవం స భగవా న్రుద్రో దేవం సంకర్షణం ప్రభుమ్‌ |

ఇలా వృత ముపాసీత దేవీగణ సమాహితః. 20

తథైవ ధర్మపుత్త్రోసౌ నామ్నా భద్రశ్రవా ఇతి | తత్కులస్యాపి పతయః పురుషా భద్రసేవకాః. 21

భద్రాశ్వ వర్షే తాం మూర్తిం వాసుదేవస్య విశ్రుతామ్‌ | హయమూర్తి భిదాంతాం తు హయగ్రీవ పదాంకితామ్‌. 22

పరమేణ సమాధ్యన్యవారకేణ నియం త్రితామ్‌ | ఏవమేవ చ తాం మూర్తిం గృణంత ఉపయాంతిచ. 23

భద్రశ్రవస ఊచుః: ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమ ఇతి |

అహో విచిత్రం భగవద్విచేష్టితం ఘ్నంతం జనోయం హి మిషన్న పశ్యతి |

ధ్యాయన్న సద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషుః. 24

వదంతి విశ్వం కవయః స్మ నశ్వరం పశ్యంతి చాధ్యాత్మ విదో విపశ్చితః |

తథాపి ముహ్యంతి తవాజమాయయా సువిస్మితం కృత్యమజం నతోస్మితమ్‌. 25

విశ్వోద్బవస్థాన నిరోధకర్మతే హ్యకర్తురంగీకృత మప్య పావృతః |

యుక్తం న చిత్రం త్వయి కార్యకారణ సర్వాత్మని వ్యతిరేక్తే చ వస్తుతః. 26

వేదాన్యుగాన్తే తమసా తిరస్కృతా న్రసాతలాద్యో నృతురంగ విగ్రహః |

ప్రత్యాదదే వై కవయేభియాచతే తసై#్మ నమస్తేవితథే హితాయతే. 27

ఏవం స్తువంతి దేవేశం హయశీర్షం హరించ తే | భద్రశ్రవస నామానో వర్ణయంతి చ తద్గుణాన్‌. 28

ఏషాం చరితమేతద్ది యం వదేచ్చ్రావయే చ్చ యః | పాపకంచుక ముత్సృజ్య దేవీలోకం వ్రజేచ్చసః. 29

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ అష్టమస్కంధేఅష్టమోధ్యాయః.

నారాయణు డిట్లనెను : ఈ విధముగ నిలావృతములోని రుద్రుడు దేవీగణములను గూడి సంకర్షణదేవు నుపాసించును. భద్రాశ్వవర్షమునందు ధర్మపుత్రుడు భద్రశ్రవో నామముతో నుపాసింపబడును. అతని గొల్చు వంశజులను భద్రసేవకు లందురు. ఆ భద్రాశ్వవర్షమందు ప్రసిద్ది జెందిన వాసుదేవుని హయగ్రీవమూర్తి వెలుగొందుచున్నది. భాగవతులు నిశ్చల చిత్తముతోడి సమాధిలో మునింగి యా దివ్యమూర్తి నీ రీతిగ నుపాసింతురు. భద్రశ్రవసు లిట్లందురు : ఆత్మచింతనచేయు ధర్మస్వరూపుడగు భగవానునకు నమస్కారము లని యుపాసింతుము. దైవము చేతలు చాలవిచిత్రములు. ఎల్లభూతములు మృత్యువాత బడుచుండుట స్వయముగ చూచియును జనము సత్యమును నమ్మరు. కొడుకునకుగాని తండ్రికిగాని దహనాదులు చేసియును జనము తిరిగి విషయము లనుభవింపజూచును. ఈ విశ్వము నశ్వరమని కవులు-పండితులు-వక్కాణింతురు. సమాధిలో మునిగిన యాత్మవిదులు నటులే యందురు. ఓ రాజా! ఐనను విచిత్రమైన యీ మాయాకృతికి జనము ప్రమోహము జెందును. అట్టి మహిమాతిశయముగల నీకు నమస్కారములు. ఈ విశ్వమును నీవు పుట్టించి పెంచి లయింపజేతువు. ఐనను నిన్నావరణములేని యకర్తగ చెప్పుదురు. ఇదంతయును కార్యకారణుడవు సర్వాత్మకుడవు నగు నీవు మాయవలన సృజింతువు. వాస్తవముగ నీవు నిరుపాధికుడవు-అకర్తవు. యుగాంతమున తమోవృతములగు వేదములు దొంగిలింపబడగ నీవు హయగ్రీవరూపము దాల్చి రసాతలమునుండి వానిని తెచ్చి బ్రహ్మ యాచింపగ నతని కెవడిచ్చెనో యట్టి సత్యరూపుడు విశ్వహితుడు నగు వానిని నమస్కరింతుము. ఇట్లు హయగ్రీవుడగు శ్రీహరిని భద్రశ్రవసులు సంస్తుతించి యతని గుణగణము లభివర్ణింతురు.

వీరి యీ దివ్యచరితలు విని చదువువారు పాపమను కుబుసమునుండి ముక్తులై శ్రీదేవీ లోకమును జేరగలరు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున నెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters