Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వాదశో7ధ్యాయః

శ్రీనారాయణ ఉవాచః జంబుద్వీపో యత్ర చాయం యత్పృమాణనకీర్తితః | తావతా సర్వతః క్షారోదధినా పవివేష్టితః. 1

జంబ్వాఖ్యేన యథామేరుస్తథా క్షారోదకేన చ | క్షారోదధి స్తు ద్విగుణః ప్లక్షా ఖ్యేనో పవేష్టితః. 2

యథైవ పరిఖా బాహ్యోప వనేన హి వేష్ట్యతే ! ప్లక్షా ఖ్య శ్చ స్వయం జంబు ప్రమాణో ద్వీరూపభృత్‌. 3

హిరణ్మయో7గ్నిస్త త్రైవ తిష్ఠతీతి విని శ్చయః ! ప్రియవ్రతాత్మజస్త త్ర సప్త జిహ్వ ఇతి స్మృతః. 4

అగ్నిస్త దధిప స్త్వి ధ్మజిహ్వః స్వం ద్వీ పమేవ చ ! విభజ్య సప్త వర్షాణి స్వ పుత్రేభ్యో దదౌ విభుః. 5

స్వయ మాత్మ విదాం మాన్యాం యోగచర్యాం సమాశ్రితః | తేనైవ మా77త్మ యోగేన భగవంత ముపాగతః. 6

శివం చ యవసం భద్రం శాంతంక్షేమామృతే తథా | అభయం చేతి సపై#్తవ తద్వర్షాణి స దేక్షతామ్‌. 7

తేషు ప్రోక్తా నదీః సప్త గిరియః సప్త చైవ హి | అరుణా నృవ్ణూంగి రసీ సావిత్రీ సుప్రభాతికా. 8

ఋతం భరా సత్యం భరా ఇతి నద్యః ప్రకీర్తితాః | మణికూటో వ్రజకూట ఇంద్రసేన స్తథైవ చ. 9

జ్యోతిష్మాన్వై సువర్ణ శ్చ హిరణ్యష్టీవ ఏవ చ | మేఘ మాల ఇతి ఖ్యాతాః ప్లక్ష ద్వీప స్య పర్వతాః. 10

నదీనాం జల మాత్రేణ దర్శన స్పర్శనా దిభిః | నిర్దూతాశేషరజసో నిస్తమ స్కాః ప్రజా స్తథా. 11

హం సశ్చైవ పతంగ శ్చ ఊర్ధ్వాయన ఇతీ వచ | సత్యాం గ సంజ్ఞా శ్చ త్వారో వర్ణాః ప్లక్ష స్యద్వీ పకే. 12

పండ్రెండవ అధ్యాయము

భువన వ్యవస్థ

శ్రీ నారాయణు డిట్లనెనుః ఈ జంబూ ద్వీపమెంత పరిమాణము గలదో యంతియ పరిమాణము గల క్షార సముద్రముచే నీ జంబూద్వీపము చుట్టబడియున్నది. మేరుగిరి జంబూద్వీపముచే చుట్టబడెను. జంబూద్వీప పరిమాణమునకు రెండింతలు పరిమాణముగల ప్లక్షద్వీపముచేత క్షారసముద్రము చుట్టబడెను. ఒకపెద్ద లోతైన యగడ్త వనములను చుట్టినట్టులిది యును చుట్టి యుండును. అదు బంగారు కాంతిరేఖలు వెల్గుచుండును. అచట ప్రియవ్రతుని కుమారుడు సప్తజిహ్వుడనువాడు గలడు. ఇధ్మజిహ్వుడా ద్వీపమున కధిపతి. అతడు దాని నేడు వర్షములుగ విభజించి తన యేడుగురు కొడుకులకు పంచి యిచ్చెను. తుద కత డాత్మ ప్రియమగు యోగమార్గ మవలంబించి యాత్మవిచారయోగముతో భగవంతునిలో లీనుడయ్యెను. శివము-యవసము-భద్రము-శాంతము-క్షేమము-అమృతము-అభయ-మను నేడు వర్షములతని యేడుగురు కొడుకుల పేర్లమీద నేర్పడెను. అం దేడునదులు నేడు గిరులును ముఖ్యములు. అరుణ-నృవ్ణు-అంగీరస-సావిత్రి-సుప్రభాతిక-ఋతంభర-సత్యంభర-యనునవిముఖ్య జీవనదులు. మణికూటము-వజ్రకూటము-ఇంద్రసేనము-జ్యోతిష్మంతము-సువర్ణము-హిరణ్యష్ఠీవము-మేఘమాల-యనునవి ప్లక్షద్వీపమందలి పర్వతరాజములు. ఆ దివ్యవాహినుల జలమును తాకిన-త్రాగిన -క్రుంకిన -మాత్రన ప్రజల యజ్ఞాన పాపములు తొలగింపోవును. ఈ ప్లక్షద్వీపమందు హంస-పతంగ-ఊర్ద్వాయన-సత్యాంగము-లను నాల్గు వర్ణములు వారుందురు.

సహస్రాయుః ప్రమాణాశ్చవివిదోపమ దర్శనాః | స్వర్గద్వారం త్రయీవిద్యా విధినార్కం యజం తితే. 13

ప్రత్న స్య విష్ణో రూపం చ సత్యర్తస్య చబ్రహ్మణః | అమృత స్య చ మృత్యోశ్చ సూర్యమాత్మాన మీమహి. 14

ప్లక్షా దిషు చ సర్వేషు పంచ ద్వీ పేషు నారద| ఆయురిం ద్రి య మోజ శ్చ బలం బుద్ధిః సహో7పిచ. 15

విక్రమః సర్వలోకానాం సిద్ధి రౌత్పత్తికీ సదా | ప్లక్ష ద్వీపా త్పరం చేక్షు రసోదః సరితాం పతిః. 16

ప్లక్ష ద్వీపం సమగ్రంచ పరివార్యావతిష్ఠతే | శాల్మలా ఖ్యస్త తో ద్వీ ప శ్చా స్మా ద్ద్వి గుణ విస్తరః. 17

సమానేన సురోదేన సింధునా పరివేష్టితః | యత్రవై శాల్మలీ వృక్షః ప్లక్షాయామః ప్రకీర్తతః. 18

స్థానం తత్పక్షిరాజస్య గరుడ స్య మహాత్మనః | తస్య ద్వీ పస్య నా థో హి యజ్ఞబాహుః ప్రియవ్రతాత్‌. 19

జాతః సఏవ సప్తభ్యః స్వపుత్నే భ్యోదదౌ ధరమ్‌ | తద్వర్షాణాం చ నామాని కథితాని నిబోధత. 20

సులోచనం సౌ మన స్యం రమణం దేవవర్షకమ్‌ | పారిభద్రం తథాచా7ప్యా యనం విజ్ఞాతనామకమ్‌. 21

తేషు వర్షాద్రయః సప్త సపై#్తవ సరితః స్మృతాః | సరసః శత శృం గశ్చ వామదేవ శ్చ కందకః. 22

కుముదః పుష్ప వర్ష శ్చ సహస్ర శ్రుతిరేవ చ | ఏతే చ పర్వతాః సప్త నదీనామాని చోచ్యతే. 23

అనుమతిః సినీవాలీ సరస్వతీ కుహూస్తథా | రజనీ చైన నందా చ రాకేతి పరికీర్తితాః. 24

వారు వేయేండ్లు బ్రదుకుదురు. వారు దేవతలను పోలిన ఆకృతులు కలవారు. వారు త్రయీ విద్యావిధానము స్వర్గ ద్వారమనబడు సూర్యభగవాను నీ విధముగ బూజింతురు. పురాణపురుషుడు - శ్రీ విష్ణుస్వరూపుడు-సత్యధర్మముల కధిష్టానదేవత-బ్రహ్మస్వరూపుడు- శుభాశుభముల ప్రేరకుడు-నగు సూర్యాత్ముని శరణు వేడుచున్నాను. ఈ ప్లక్ష ద్వీపము నందును మఱి మిగిలిన యైదు దీవులందు నుండు వారి కాయువు ఇంద్రియము ఓజస్సు బుద్ధిబలము ప్రాణము పరాక్రమము ననువి సహజసంపదలుగ గల్గుచుండును. ఈ ప్లక్షద్వీపము చుట్టును చెఱకు సముద్రము గలదు. ఈ దీవికి రెండింతల పరి మాణముతో శాల్మలీద్వీపము గలదు. ఈ దీవి తనంతటి వైశాల్యముగల సురాసాగరముచే చుట్టబడియున్నది.ఈద్వీప మందు శాల్మలీద్వీపవృక్షములు ప్లక్షద్వీపవృక్షము లంత మిక్కిలిగ గలవు. ఆ ద్వీపము పక్షిరాజగు గరుడ భగవానుని నివాసస్థానము. అ దీవి కథిపతి ప్రియవ్రతుని కొడుకు యజ్ఞబాహుడు. అతడు తన యేడుగురు కొడుకుల కేడు వర్షములు పంచియిచ్చెను. ఆ% వర్షముల నామముల వినుము. సులోచనము--సౌమనస్యము-సౌమనస్యము-రమణము-దేవవర్షకము-పారిభద్రము-అప్యాయనము-విజ్ఞాతము-ననునవి వాని పేర్లు. అ వర్షములందేడు నదులు నేడు పర్వతములు ప్రధానములు. సరసము-శతశృంగము-వామదేవము-కందకము-కుముదము-పుష్పవర్షము-సహస్రశ్రుతి-యునవి యేడు గిరుల పేర్లు. ఇంకనదుల పేర్లు చెప్పబడుచున్నవి. అనుమతి -సినీవాలి-సరస్వతి-కుహు-రజని-నంద-రాక యనునవి ముఖ్యనదులు.

తద్వర్ష పురుషాః సర్వే చాతుర్వర్ణ్య సమాహ్వయాః | శ్రుతధరో వీర్యధరో వసుంధర ఇషుం ధరః. 25

భగవంతం వేదమయం యజంతే సోమ మీశ్వరమ్‌ | స్వగోభిః పితృదేవేభ్యో విభజన్కృష్ణ శుక్లయోః. 26

సర్వాసాం చ ప్రజానాం చ రాజాసోమః ప్రసీదతు | ఏవం సురోదా ద్ధ్వి గుణః స్వ మానేన ప్రకీర్తతః. 27

ఘృతో దేనా వృతః సో7యం కుశద్వీపః ప్రకాశ##తే | యస్మిన్నాస్తే కుశస్తంభో ద్వీపాఖ్యాకారణోజ్వలన్‌. 28

స్వశష్పరోచిషా కాష్ఠా భాసయ న్పరితిష్ఠతే | హిరణ్యరేతా స్తద్ద్వీ పపతిః పై#్ర యవ్రతః స్వరాట్‌. 29

స్వపు త్రేభ్య శ్చ సప్త భ్యస్త ద్ద్వీ పం సప్తధా7భజత్‌ | వసు శ్చ వసుదాన శ్చ తథా దృఢరుచిః పరః. 30

నాభి గుప్త స్తు త్యవ్రతౌ వివక్త భామ దేవకౌ | తేషాం వర్షేషు సపై#్తన సీమాగిరివరాః స్మృతాః. 31

నద్యః సపై#్తవ సంతీహ తన్నామానిని బోధత | చక్రస్తథా చతుః శృగః కపిల శ్చిత్ర కూటకః. 32

దేవానీకశ్చో ర్ద్వరోమా ద్రవిణః సప్త పర్వతాః | రసకుల్యా మధుకుల్యా మిత్రవిందా తథైన చ. 33

శ్రుత విందా దేవగర్బా ఘృత చ్యు న్మందమాలికే | యత్పయోభిః కుశ ద్వీ పవాసినః సర్వ ఏవ తే.34

కుశలః కోవిదశ్చై వా7ప్యభియుక్త స్త థై వచ | కులక శ్చేతి సంజ్ఞాభి శ్చ తుర్వర్ణాః ప్రకీర్తితాః. 35

జాతవేద సరూపం తం దేవం కర్మజ కౌశ##లైః | యజంతే దేవవర్యాభాః సర్వేసర్వవిదోజనాః .36

పరస్య బ్రహ్మణః సాక్షా జ్ఞాతవేదో7సి హవ్యవాట్‌ | దేవానాం పురుషాంగానాం యక్షేన పురుషం యజ. 37

ఏవం యజంతే జ్వలనం సర్వే ద్వీపాధివాసినః |

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ7అష్టమస్కంధే ద్వాదశో7ధ్యాయః.

ఆ వర్షములందు శ్రుతధర- వీర్యధర-వసుంధర-ఇషుదర-యను నాల్గు వర్ణముల వారు గలరు. తన కిరణ కాంతులచే శుక్ల కృష్ణ పక్షములు విభజించుచు పితరులను తనువుచుండు వేదమయుడు భగవానుడు నగు సోమేశ్వరు నచటి వారు గొల్తురు. ఆ సోము డెల్ల ప్రజల కోర్కులు దీర్చుచుండును. ఈ సురాసముద్రమునకు రెండింతలుగ నేతిసంద్రము తన రారును. ఈ నేతిసంద్రముచేత కుశద్వీపము చుట్టబడియున్నది. అచట కుశస్తంబము లుండుటవలన దీనిని కుశద్వీపమందురు. కుశ స్తంబములు తమ యంకురముల కాంతులు విరజిమ్ముచుండును. ఆ దీవికి ప్రియవ్రతుని కొడుకు హిరణ్యరేతు డధిపతి. ఇతడును తన యేడుగురు కొడుకుల పేరులేడు వర్షముల కుంచెను. వసువు-దృఢరుచి-నాభిగుప్తము-స్తుత్యవ్రతము-వివిక్తము-నామదేవక-మను నవి వర్షముల పేర్లు. వానియందేడుగిరులు గలవు. అందేడు నదులు గలవు. వాని పేర్లు వినుము. చక్రము చతుః శృంగము-కపిలము-చిత్రకూటము-దేవానీకము-ఊర్ద్వరోమము-ద్రవిణము-నను నవి యేడు గిరులు. రసకుల్య-మధుకుల్య-మిత్రవింత-శ్రుతివింద-దేవగర్బ-ఘృతచ్యుత- మందమాలికయను నవి యేడు నదుల పేర్లు. కుశధ్వీపవాసు లీ నదుల జలము లుపయోగించుకొందురు. కుశల- కోవిద-అభియుక్త- కులక- యను నాల్గు వర్ణముల ప్రజలచట నివాసము చేతురు. వారు సర్వవిదులు- దేవతాస్వరూపులు-కర్మకుశలురు- అగ్నిదేవుని సేవించువారలు. ఓ జాతవేదా!(ధనమునకు కీర్తికి మూలభూతుడా) నీవు సాక్షాత్తుగ పరబ్రహ్మమునకు హవ్యమును అందజేయువాడవు. మా దేవతాయజ్ఞనముల ఫలితములు పరమేశున కందజేయుము. అని కుశద్వీపవాసు లగ్నిలో వేల్తురు.

ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున పండ్రెండవ అధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters