Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచదశో7ధ్యాయః

శ్రీ నారాయణః అతః పరం ప్రవక్ష్యామి భానోర్గమన ముత్తరమ్‌ | శీఘ్రమందాదిగతిభి స్త్రీవిధం గమనం రవేః. 1

సర్వగ్రహాణం త్రీణ్యవ స్థానాని సురసత్తమ | స్థానం జారద్గవం మధ్యం తథైరావత ముత్తరమ్‌. 2

వైశ్వానరం దక్షిణతో నిర్దిష్ట మితి తత్త్వతః | అశ్వినీ కృత్తికా యామ్యా నగవీథితి శబ్దితా. 3

రోహిణ్యార్ద్రా మృగశిరో గజవీథ్యభి ధీయతే | వుష్యాశ్లేషా తథా7దిత్యా వీథీ చైరావతీ స్మృతా. 4

ఏతా స్తు వీథయ స్తిస్ర ఉత్తరో మార్గ ఉచ్యతే | తథా ద్వేచాపి ఫల్గన్యౌ మఘాచైవార్షభీమతా. 5

హస్త శ్చిత్రా తథాస్వాతీ గోవీథితి తుశబ్దితా | జ్యేష్ఠా విశాఖానురాధా వీధి జారద్గవీ మతా. 6

ఏతా స్తు వీథయ స్తి స్రో మధ్యమోమర్గా ఉచ్యతే | మూలాషాడో త్తరాషాడా అజవీథ్యభిశబ్దితా. 7

శ్రవణం చ ధనిష్ఠా చ మార్గీ శతఖిషక్తథా | వైశ్వానరీ భాద్రపదే రేవతీ చైవకీర్తితాః. 8

ఏతాస్తు వీథయస్తిస్రో దక్షిణో మార్గుఉచ్యతే | ఉత్తరాయణమాసాద్య యుగాక్షాంతని బద్దయోః. 9

కర్షణం పాశయోర్వాయు బద్దయోరోహణంస్మృతమ్‌ | తదాభ్యంతరగాన్మండలాద్రథస్య గతిర్బవేత్‌. 10

మాంద్యం దివసవృద్దిశ్చ జాయతే సురస్తతమ| రాత్రి హ్రాస శ్చ భవతి సౌమాయాన క్రమోహ్యయమ్‌. 11

దక్షిణాయనకే పాశే ప్రేరణా దవరో హణమ్‌ | బహిర్మం డలవేశేన గతిశైఘ్ర్యం తదా భ##వేత్‌. 12

తదా దినాల్పతా రాత్రివృద్ది శ్చ పరకీర్తితా | వైషువే పాశసామ్యాత్తు సమావస్థాఆనతో రవేః. 13

మధ్య మండలవేశ శ్చ సామ్యం రాత్రి దినా దికే | ఆకృష్యేతే యదా తౌతు ధ్రువేణసమధిష్ఠితౌ. 14

తదా భ్యంతరతః సూర్యో భ్రమతే మండలానిచ | ధ్రువేణ ముచ్యమానేన పునారశ్మియుగేనతు. 15

పదునైదవ అధ్యాయము

భువన వ్యవస్థ - జ్యోతిర్వ్యవస్థ

శ్రీ నారాయణు ఈవిధముగా పలికెను : ఇకమీదట ఇంకను మిగులను విస్తరరూపమున రవి గమనమును వివరింతును. రవియొక్క గమనము-మాత్రమే కాదు. ఇతర గ్రహముల గమనము కూడ-శీఘ్రము-మందము-సమము-అని మూడు విధములుగ నుండును.

ఓ దేవమునిశ్రేష్ఠా! నారదా! వినుము : రవికే కాదు-సర్వగ్రహములకును స్థానములుమూడు-మధ్యస్థానము-ఉత్తరస్థానము-దక్షిణస్థానము-అని వీనికి వరుసగ-1. జారద్గవము 2. ఐరవతము 3. వైశ్వానరము అనియు పేరులు కలవు. వీనిలో నొక్కొక్కటి మూడు ఉపభేదములతో నుండును.

ఎట్లనగా | ఉత్తర దక్షిణ ధ్రువ నక్షత్రములు రెండు కొనలందుండునట్లు. అంతరిక్షములో అమరియున్న జ్యోతిశ్చక్రము నట్టనడుమ గ్రహములు సంచరించు బాటగా ఇరువది ఏడు నక్షత్రములతో ఏర్పడిన క్రాంతివృత్తము అను చక్రపు అమరిక ఉన్నది. వీనిలో అశ్విని భరణి కృత్తికలు నాగవీథి; రోహిణి మృగశిర ఆర్దృలు-గజవీథి; పునర్వసు-పుష్యమి-ఆశ్లేషలు-ఐరావతవీథి; ఈమూడు విథులను కలిసి ఐరావతవీథియగును. (నాగ-గజ-ఐరావత-మూడును గజములే.) ఈ మూడు వీథులును కలిసి ఉత్తర మార్గము అనబడును.

ముఖ-పూర్వఫల్గుని-ఉత్తరఫల్గుని-అర్షభీవీథి;హస్త-చిత్త-స్వాతి-గోవీథి; విశాఖ-అనూరాధ-జ్యేష్ఠ-జారద్గవ వీథి; ఈ మూడు వీథులును కలిసి జారద్గవవీధి అనబడును. ఈ మూడు వీథులను కలిసి మధ్యమమార్గము. అగును. (ఋషభ-గో-జరద్గు-శతభిషము-మార్గవీథి; పూర్వాభాద్ర-ఉత్తరాభాద్ర-రేవతి-వైశ్వానరవీథి; ఈ మూడు వీథులును కలిసి దక్షిణమార్గము అనబడును. సూర్యుడు ఉత్తరాయనమును చేరినప్పుడు అతని రథపు కాడి కొనలయందు ఇమిడ్చి వాయువుచే కట్టబడిన పాశములను లాగుట జరుగును. అది అతని నడకలో ఆరోహణము అనబడుచున్నది. అప్పుడు అభ్యంతర భాగమునందలి అంతరిక్ష మండలమున రవి రథ గమనము జరుగును. దానిచే అతని గతిలో మాంద్యము-నెమ్మదితనము-పగళ్ల పరిమాణముల వృద్ది-జరుగును. రాత్రుల పరిమాణము తగ్గును. ఇది సౌమ్యా(ఉత్తరా) యనక్రమము. దక్షిణాయనమున ఇవే పాశములు ప్రేరితములై - అనగా ముందునకు సడలించబడి వదలబడిన-అవరోహణము జరుగును. బహిర్మండలమున రవి రథము ప్రవేశించినడుచును. అందుచే అతని రథగతిలో శీఘ్రత్వము వచ్చును. అప్పుడు పగళ్ల పరిమాణము తగ్గి రాత్రుల పరిమాణము పెరుగును. విషువకాలమునందు(ఇది లోగడ చెప్పబడినది.) పాశముల బిగువు సమావస్థలో ఉండుట చేత రాత్రిందినముల పరిమాణములు సమములుగనుండును. ఈ నడకలో రవి రథగమనము మధ్యమండలమున జరుగును. రవిరథపు కాడికొనలయందు బిగింపబడిన పాశములు ధ్రువుడు అధిష్టాతగానున్న అంతరిక్షమునందలి వాయువులచే అకర్షింప-లాగ-బడునపుడు సూర్యడు అభ్యంతర మండలమున నెమ్మది నడకతో తిరుగును. ధ్రువుడు తన అధీనమునమండు అంతరిక్షవాయు ద్వారమున పాశములను మరల వదిలినపుడు రవి బాహ్యమంజలమున తిరుగును. (పాశముల వదులుటగాని తన దగ్గరకు లాగికొనుటగాని ధ్రువుడు చేయప్పుడు మధ్యమండలమున రవి రథము సంచరించును.)

తథైవ బాహ్యతః సూర్యో భ్రమతే మండలానిచ | తస్మి న్మేరౌ పూర్వభాగే పుర్యైంద్రీ దేవధానికా. 16

దక్షిణ వై సంయమనీ నామ యామ్యా మహాపురీ | పశ్చా న్నివ్లూెచనీనామ వారుణీ వై మహాపురీ. 17

తదుత్తరే పురీ సౌమ్యా ప్రోక్తా నామ విభావరీ | ఐంద్రపుర్యాం రవేః ప్రోక్త ఉదయో బ్రహ్మవాదిభిః. 18

సంయమన్యాం చ మధ్యాహ్నో నివ్లూెచన్యాం విమీలనమ్‌ | విభావర్యాం నిశీథః స్యా త్తిగ్మాంశోః సురపూజితః : 19

ప్రవృత్తే శ్చ నిమిత్తాన భూతానాం తాని సర్వశః | మేరో శ్చ తుర్దిశం భానోః కీర్తితాని మయా మునే. 20

మేరు స్థానాం సదా మధ్యం గత ఏవ విభాతి హి | సవ్యం గచ్ఛ న్దక్షిణన కరోతి స్వర్ణ పర్వతమ్‌. 21

ఉదయాస్తమయే చైవ సర్వకాలం తు సమ్ముఖే | దిశా స్వశేషాసు తథా సురర్షే వితిశాసు చ.

22

యైర్యత్ర దృశ్యతే భాస్వా న్స తేషా ముదయః స్మృతః | తిరోభావం చ యత్రైతి తత్రై వాస్త మనం రవేః. 23

నైవాస్తమన మర్కస్య నోదయః సర్వదా సతః | ఉదయాస్తమనాఖ్యం హి దర్శనా దర్శనం రవేః. 24

మేరుపునకు తూర్పుదెసయందు ఇంద్రుని నగరమగు దేవధాని- అమరావతి దక్షిణపు దెస యముని సంయమనీపురి పడమట వరుణుని మహాపురి యగునివ్లూెచని- ఉత్తరమున సౌమ్య- ఉత్తర దిక్కుననుండు కుబేరుని నగరియగు విభావరి- కలవు. (భోగోళముపై ప్రదేశములందు ఉన్నజనుల స్థితినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ దిగ్వ్యవస్థ ఏర్పడును. ఏలయన ఎవరికి ఎటనుండి సూర్యుడుదయించు చున్నట్లు కనబడునో అచటివారి కదియే తూర్పు- అందరకును మేరువు మాత్రము ఉత్తరముననే యున్నది. అని ముందు చెప్పబడును.) రవి ఉదయించుచోటు అమరావతి- అతడు అంతరిక్ష మధ్యమునకు చేరి మధ్యాహ్నమును ఏర్పరచు స్థానము సంయమని- అస్తమించు స్థానము నివ్లూెచని- విభావరియును కుబేరపురి అర్ధరాత్రి స్థానము అని వ్యవస్థ. ప్రాణుల జీవన ప్రవృత్తులకు మూలము కాలము. దానివ్యవస్థకు మూలము రవి గమనము. దానినిబట్టి ఏర్పడియు రవి రథగతి గుర్తించుటకు సాధనము దిక్కులవ్యవస్థ. మేరువును ఆధారముగా తీసికొని దానికి నాలుగు వైపుల ఈ వ్యవస్థ అంతయు నీకు తెలిపితిని. మేరువునందు ఉన్నవారికి ఎప్పుడును అంతరిక్ష మధ్యమున నున్నట్లే సూర్యుడు కనబడును. అతడు ఆ మేరువునకు సవ్య-ఎడమ-దక్షిణ-కుడి-వైపులుగ నడుచుటయే అచ్చటి వారికి ఉదయాస్త మయములు. ఆయాదేశముల యందు విదిశల-మూలల-యందు రవి కనబడుటయే ఆయాకాలవ్యవస్థకు ఆధారము. ఎవరికి ఎచ్చట నున్నట్లు రవి కనబడునో వారికి అచ్చట ఉదయము-ఎచ్చట అతడు మరుగుపడినట్లు కనబడునో అచ్చటివారికి అస్తమనము వాస్తవమున సూర్యునకు ఉదయముకాని అస్తమయము కాని ఎప్పుడునులేవు. రవి దర్శనమునకు అందుట అందక పోవుటలే అతని ఉదయాస్తమయములు.

శక్రాదీనాం పురే తిష్ఠ న్స్పృశ##త్యేష పురత్రయమ్‌ | వికర్ణౌ ద్వౌ వికర్ణ స్థ స్త్రీ న్కోణాన్ద్వే పురేతథా. 25

సర్వేషాం ద్వీపవర్షాణాం మేరు రుత్తరతః స్థితః | యైర్యత్ర దృశ్యతే భానుఃసైవ ప్రాచీతి చోచ్యతే. 26

తద్వామభాగతో మేరు ర్వర్త తేతి వినిర్ణయః | యది చైంద్ర్యాః ప్రచలతే ఘటికా దశపంచభిః. 27

యామ్యాం తదా యోజనానాం సపాదం కోటి యుగ్మకమ్‌ | సార్ధ ద్వాదశ లక్షాణి పం చనేత్ర సహస్రకమ్‌. 28

ప్రక్రామతి సహ స్రాంశుః కాలమార్గ ప్రదర్శకః | ఏవం తతో వారుణీం చ సౌమ్యమైంద్రీం సహస్ర దృక్‌. 29

పర్యేతి కాలచ క్రాత్మా ద్యుమణిః కాలబుద్దయే | తథా చాన్యే గ్రహాః సోమాదయో యే దివిచారిణః. 30

నక్షత్రైః సహ చోద్యంతి సహ చాస్తం వ్రజంతితే | ఏవం ముహూర్తేన రథో భానో రష్టశతాధికమ్‌. 31

యోజనానాం చతుస్త్రింశల్లక్షాణి భ్రమతి ప్రభుః | త్రయీమయ శ్చతుర్దిక్షు పురీషు చ సమీతురణాత్‌. 32

ప్రవహా ఖ్యా త్సదా కాలచక్రం పర్యేతి భానుమాన్‌ | యస్య చక్రం రథసై#్యకం ద్వాదశారం త్రినాభికమ్‌. 33

ఇంద్రుడు మున్నగువారి పట్టణములం దున్నపుడు రవి మూడు పట్టణములను అనగ నింద్రపురి నున్నప్పు డింద్ర యమ సోమపురములను తాకును. ఆగ్నేయకోణమున నుండగ ఈశాన-ఆగ్నేయనైఋతి కోణములను నింద్ర యమపురములను తాకును. ఎల్ల వర్షద్వీపములకును మేరుపర్వత ముత్తరముగ చెన్ను మీరును. ఎవ్వరు భానూదయ మెచ్చట గందురో వారి కది తూరుపగును. వారి కందఱికిని మేరు వుత్తరమున నుండునని మునుల నిశ్చయము. సూర్యు డింద్రపురమునుండి పదునైదు గడియలు పయనించి యమపురిని జేరును. అంతలో రెండుకోట్ల ముప్పది ఏడు లక్షల డెబ్బదియైదువేల యోజనముల దూరము రవి పయనించును. ఇట్లు కాలమును దెల్పు కాలచక్రాత్మకుడైన రవి ప్రయాణించును. ఇదే వేగముతో భాస్కరుడు వరుణ సోమేంద్రపురములను దాటును. ఇటుల కాలజ్ఞానమునకు హేతుభూతుడై రవి తిరుగుచుండును. చంద్రాదులగు ఇతర గ్రహములును సూర్యునివలెనే తిరుగుచు ఇతర గ్రహములు సైతము తమ తమ స్థానములగు నక్షత్రములంగూడి యుదయించి యస్తమించుచుండును. రవి రథమొక్క ముహూర్తకాలములో ముప్పదినాల్గు లక్షల యెనిమిదివందల యోజనములు ప్రయాణము సాగించును. వేదమయుడగు భానుడు నలుదెసలందున్న పురములను జేరును. ప్రవహమను వాయువువలన రవి రథ మిట్లు తిరుగును. ఈ కాలచక్రాత్మకుని యరదమునకు సంవత్సరమున నొకే చక్రము- మూడు చాతుర్మాస్యములను నాభి పండ్రెండు మాసములనెడి ఆకులు- కలది-కలదు.

(శ్రీదేవీ భాగవతము-అష్టమ-స్కంధము-పదునైదవ అధ్యాయములో రవి రథము పదునైదు గడియల కాలములో సపాదకోటి యుగ్మకము- సార్ధద్వాదశ లక్షలు-పంచనేత్ర సహస్రకము-యోజనములు పయనించునని చెప్పబడినది. అనగా 2,25,00,000+12,50,000+25000 = 2,37,75,000 యోజనములు. ఇట్లే ఒక ముహూర్తమున-అనగా రెండు గడియల కాలములో అష్టశతాధికచతుస్త్రింశల్లక్షయోజనములు 34,00,800 యోజనములు పయనించు ననిచెప్పబడినది. ముహూర్తము = 2 గడియలు. అట్లు పదునైదు గడియలు = ముహూర్తము x 15/2 అగును. దాని ననుసరించి పదునైదు గడియలలో 34,00,800 x 15/2 = 2,25,06,000 అగును. ఇది పైదానికి సరిపోదు. ఇట్లే ఈ అధ్యాయము 37వ శ్లోకమున తుర్యమానేన -1/4వ వంతు పరిమాణముతో-అనగా దేనిలో నాలవవంతు? అని ప్రశ్నము. ఇది మానసోత్తర పరి మాణములో నాల్గవవంతు అని చెప్పుకొనవలయును. అమానసోత్తర పరిమాణమును 1,57,50,000గా గ్రహించి దానిలో నాల్గవ వంతు 39,37,500 అని వ్యాఖ్యాత నీలకంఠుడు చెప్పెను. ఆయన మానసోత్తర పరిమాణము అను అంశము దేనినుండి గ్రహించి చెప్పెనో తెలియదు. పరిష్కర్త).

షణ్నమి కవయస్తం చ వత్సరాత్మక మూచిరే | మేరు మూర్థని తస్యాక్షో మానసోత్తర పర్వతే. 34

కృతేతవిభాగో యః ప్రోతంతత్ర రథాంగకమ్‌ | తైరకారకయంత్రేణ చక్రసామ్యం పరిభ్రమన్‌. 35

మాన సోత్తర నామ్నీ హ గిరౌ పర్యేతి చాంశుమాన్‌ | తస్మి న్నక్షే కృతం మూలం ద్వితీయో7క్షోధ్రువేకృతః. 36

తుర్య మానేన తైలస్య యంత్రాక్షవదితీరితః | కృతోపరితనో భోగః సూర్య స్య జగతాం పతేః. 37

రథనీడ స్తు షట్‌ త్రింశల్ల క్షయోజన మాయతః | తత్తుర్య భాగతః సో7యం పరిణాహేన కీర్తితా. 38

తావా నర్క రథస్యాత్ర యుగస్తస్మిన్భయాః శుభాః | సప్తచ్ఛందో7భిధా నా శ్చ సూరసూతేనయోజితాః. 39

వహంతి దేవ మాదిత్యం లోకానాం సుఖహేతవే | పురస్తా త్సవితుః సూతో7రుణః పశ్చాన్నియోజితః. 40

సౌత్యే కర్మణి సంయుక్తో వర్తతే గరుడుగ్రజః | తథైవ వాల ఖిల్యా ఖ్యా ఋష యో7ంగుష్ఠ పర్వకాః. 41

ప్రమాణన పరిఖ్యాతాః షష్టి సాహ స్రసంఖ్యకాః | స్తు వంతి పురతః సూర్యం సూక్త వాక్యైః సుశోభ##నైః. 42

తథా చా న్యేచ ఋషయోగంధర్వా అప్సరోరగాః | గ్రామణ్యో యాతుధానాశ్చ దేవాః సర్వేపరేశ్వరమ్‌. 43

ఏకైకశః సప్త సప్త మాసిమాసి విరోచనమ్‌ | సార్ధలక్షోత్తరం కోటినవకం భూమి మండలమ్‌. 44

దివసహస్రం యోజనానాం సగవ్యుత్యుత్తరం క్షణాత్‌ | పర్యేతి దేవదేవేశో విశ్వవ్యాపీ నిరంతరమ్‌. 45

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ7అష్టమస్కంధే పంచదశో7ధ్యాయః.

ఆరు ఋతువు లనెడు నిరుసు గలదు. ఇట్టి రథమును కవులు సంవత్సరాత్మక మందురు. మేరువుపైని గల మానసోత్తరగిరియందు దీని యొక యక్షము గలదు. మానసోత్తరపర్వతపు పొడవు. 1,57,50,000. ఈ చక్రముయొక్క యితర భాగములవలన కలా-కాష్ఠా ముహూర్తాది విభాగములు చేయబడెను. ఇట్ట చక్రమును రవితైలకారుని యంత్రమువలె (నూనె గానుగవలె) త్రిప్పుచుండును. ఇటుల రథము మానసోత్తరిగిరిని ప్రదక్షిణించును. ఆ గిరిపై నున్న యక్షము కాక మఱియొకటి ధ్రువునం దుంచబడెను. ఈ అక్షపు పొడవు మానసోత్తర పర్వతపు పొడవులో నాల్గవవంతు. ఇవి తైల యంత్రముయొక్క యక్షములను బోలియుండును. దీనికిపై నున్న దంతయును లోకపతియగు రవి యుండు భాగము. రథముపై సూర్యుడుండు స్థలము వెడల్పు ముప్పదియారు లక్షల యోజనములంత గలదు. ఇంతియ పరిమాణమున ఎత్తుగల గుఱ్ఱములను గూర్చును. గుఱ్ఱములు లోకకల్యాణముకొఱకు భానుని యోయుచుండును. సవితృదేవునికి ముందు సూతుడగు నరుణుడు పడమటి మొగమై యుండును. గరుడుని సోదరు డిట్లు సూతకార్యమునకు నియోగింపబడెను. వాలఖిల్యాది మహర్షు లంగుష్ఠ మాత్రులు. వారు లెక్క కరువదివేల మందిగలరు. వారు రవిమ్రోలచేరి శుభకరములగు వేదసూక్తములతో ఆయనను ప్రస్తుతింతురు. అదే విధముగ నితర ఋషులు దేవతలు గంధర్వులు నచ్చరలు నాగులు గ్రామణులు యాతుధానులు నెల్లరును భానుని ప్రస్తుతింతురు. వారు రవిని నెలల కొలది వారముల కొలదిగసేవింతురు. భూమండలమునకు చుట్టు రవి పయనించు కక్ష్య చుట్టు కొలత తొమ్మిదికోట్ల యెకలక్ష యేబదిరెండువేల యోజనములు-ఒక గప్యూతి. ఇంత దీర్ఘ దూరమును భాను డొక్క క్షణమాత్రమున దాటి పోవును. అతడు విశ్వవ్యాపి-దేవదేవేశుడు. (ఇచట చెప్పిన ఈ సంఖ్యలు శాస్త్ర ప్రమాణమునకు సరిపోవుటలేదు-పరిష్కర్త)

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్ట స్కంధమున పంచదశాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters