Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టాదశో7ధ్యాయః

శ్రీనారాయణః : అథస్తా త్సవితుః ప్రోక్తమయుతరంహూ మండలమ్‌ | నక్షత్ర వచ్చరతి చ సైంహికై యో7తదర్హణః. 1

సూర్యాచంద్రమసో రేవ మర్దనః సింహికాసుతః | అమరత్వంచ ఖేటత్వం లేభే యో విష్ణ్వనుగ్రహాత్‌. 2

యదద స్తరణ ర్బింబం తపతో యోజనాయుతమ్‌ | తచ్ఛాదకో7సురో జ్ఞేయో7ప్యర్కసాహస్రవిస్తరమ్‌. 3

త్రయోదశసహస్రంతు సోమస్యాచ్ఛాదకో గ్రహః | యః సర్వసమయే వైరానుబంధీ ఛాదకో7భవత్‌. 4

సూర్యా చంద్రమసో ర్దూరా ద్బ వేచ్ఛా దన కారకః | తన్నిశమ్యోభయత్రాపి విష్ణునా ప్రేరితం స్వకమ్‌. 5

చక్రం సుదర్శనం నామ జ్వాలామాలీతి భీషణమ్‌ | తత్తేజసా దుః సహేన సమంతా త్పరివారితమ్‌. 6

ముహూర్తో ద్వీజమాన స్తు దూరాచ్చకిత మానసః | ఆరాన్ని వర్తతే సో7య ముపరాగ ఇతీవ హ. 7

ఉచ్యతే లోకమధ్యే తు దేవర్షే అవబుధ్యతామ్‌ | తతో7ధ స్తా త్స మాఖ్యాతా లోకాః పరమ పావనాః. 8

సిద్ధానాం చారణానాంచ విద్యాధ్రాణాం చ సత్తమ | యోజనాయుత విఖ్యాతా లోకాః పుణానిషేవితాః. 9

తతో7ప్యధ స్తా ద్దేవర్షే యక్షాణాంచ సరక్షసామ్‌ | పిశాచ ప్రేతభూతానాం విహారాజిర ముత్తమమ్‌. 10

అంతరిక్షం చ తత్ర్పోక్తం యావద్వాయుః ప్రవాతి హి | యావద్మేఘా స్తతోద్యంతి తత్ర్పోక్తం జ్ఞానకోవిదైః.

పదునెనిమిదవ అధ్యాయము

భువనవ్యవస్థ - దేవయోనివిశేషలోకవర్ణనము

శ్రీనారాయణుడిట్లనెను : సూర్యునకు పదివేల యోజనముల మీదుగ (ఈరాహువు నక్షత్రము అనదగిన యోగ్యత కలవాడు కాడు. అయినను నక్షత్రము వలెనే సంచరించుచుండును.) రాహుమండలము శోభిల్లును. ఈ సింహికాసుతుడు సూర్య చంద్రులను మర్దించువాడు. ఇతడు శ్రీవిష్ణుననుగ్రహమున నమరత్వమును గ్రహత్వమును బడసెను. పదివేలయోజనముల వఱకును తపించు రవిమండలము నితడు గప్పివేయును. ఇతనిని రాక్షసునిగ నెఱుగవలయును. చంద్రమండలము పండ్రెండు వేల యోజనములుగలది. రాహువు పదుమూడు వేలయోజనముల విస్తారము కలవాడగును. ఇతడు పగవట్టి పర్వములందే సూర్యచంద్రుల నాచ్ఛాదించును. సూర్యచంద్రులల్లంత దూరమునందున్నను నితడువారిని గప్పివేయును. ఈ సంగతి శ్రీ మహావిష్ణునకు తెలియును. ఆదిచూచి అతడు వెంటనే యగ్ని జ్వాలలు చెలరేగు భిష ణమగు తన సుదర్శన చక్రమును ప్రేరించును. చక్రము యొక్క దుస్సహమైన తేజమును రాహువు సహింపలేకుండును, అతడు కలగుండు చెంది యొక్క ముహూర్త మాత్రముననే దూరము ముండియే తొలగిపోవును. ఇదే ఉపరాగము-గ్రహణము. ఇట్లు గ్రహణము లోకమున చెప్పబడెను. దేవర్షీ: చక్కగ వినుము. దీనికి క్రిందుగ పరమ పావనమైన లోకములు గలవు. అవి సిద్ధ-చారణ-విద్యాధరుల పుణ్య లోకములు. అవి పదివేల యోజనములంత విస్తారమున నొప్పిదమై యున్నవి. ఓయిసురమునీ! వీనికి క్రిందుగ యక్ష-రాక్షస భూత-ప్రేత పిశాచముల విహారస్ధానములు నెక్కొని యున్నవి. ఎందాక మేఘములు క్రమ్ముకొని యుండునో యెందాక వాయువులు వీచునో యందాక నంతరిక్షము గలదని జానకోవీదులు వాక్రుత్తురు.

తతో7ధస్తాద్యోజనానాం శతం యావద్ద్వి జోత్తమ | పృధివీ పరిసంఖ్యాతా సుపర్ణశ్యేన సారసాః. 12

హంసాదయః ప్రోత్పతంతి పార్ధివాః పృధివీభవాః | భూ సన్ని వేశావస్ధానం యధావదుప వర్ణితమ్‌. 13

అధ స్తా దవనేః సప్తదేవర్షే వివరాః స్మృతాః | ఏకైకశో యోజనానా మాయామో చ్ఛ్రాయతః పునః. 14

అయుతాంతర విఖ్యాతాః సర్వర్తు సుఖాదాయకాః | అతలం ప్రధమం ప్రోక్తం ద్వీతీయం వితలం తథా. 15

తృతీయం సుతలంప్రోక్తం చతుర్ధం వైతలాతలమ్‌ | మహాతలం పంచ మం చ షష్ఠం ప్రోక్తం రసాతలమ్‌. 16

సప్తమం విప్ర పాతాలం సపై#్తతే వివరాః స్మృతాః | ఏతేఘ బిలస్వర్గేషు దివో7ప్యధిక మేవచ. 17

కామభోగై శ్వ ర్య సుఖసమృద్ధ భువనేషు చ | నిత్యోద్యాన వహారేషు సుఖాస్వాదః ప్రవర్తతే. 18

దైత్యాశ్చ కాద్రవేయాశ్చ దానవా బలశాలినః | నిత్య ప్రముదితా రక్తాః కలత్రాపత్యబంధుభిః. 19

సుహృద్బి రనుజీవాద్యైః సంయుతాశ్చ గృహేశ్వరాః | ఈశ్వరాద ప్రతిహతకామా మాయానినశ్బతే. 20

నివసంతి సదా హృష్టాః సర్వర్తుసుఖసంయుతాః | మయేన మాయావిభునా యేషు యేషు చ నిర్మితాః. 21

పురః ప్రకామశో భక్తా మణీప్రవరశాలినః | విచిత్రభవనాట్టాల గోపురాద్యః సహస్రశః. 22

సభాచత్వరచైత్యాది శోభాఢ్యాః సురదుర్లభాః | నాగాసురాణాం మిధునైః సపారావతసారికైః. 23

ఓ ద్విజవర్యా! దానికి నూఱుయోజనములు క్రిందుగ సస్యశ్యామలయగు భూమి తిరముగనున్నది. దానిపై గరుడ పక్షులు డేగలు సారసములు హంసలు మున్నగు నేలపై బుట్టిన ప్రాణులెగురు చుండును. భూసంబంధమైన విషయము నీకు తెల్పితిని.

విబుధఋషీ! భూమికి క్రిందిదెసనేడు పెద్ద వివరములు గలవు. వానిలో ప్రతిది పదివేలయోజనములు పొడవు గలది. ప్రతిదియునంతియే వెడల్పుగలదు. ప్రతిది యెల్లఋతువు లందును సుఖముగూర్చును. వానిలో మొదటి దతలము; పెండవది వితలము. మూడవది సుతలము: నాల్గవది తలాతలము ఐదవది మహాతలము. ఆరవది రసాతలము. ఏడవది పాతాళము; ఈ యేడును మహావివరము లనబరగును. ఓ విప్రా! వీనియందు స్వర్గమునకన్న మిన్నయగు సంపదలుచెన్నొందు చుండును. అచ్చోటగల రమ్యహర్మయములందు నుద్యానవనములందును కామభోగములు నిత్యసుఖసంపదలు పెక్కులుగలవు. అందుభుజశాలురైన కద్రూతనయులును దైత్యదానవులును నిత్యము తమతమ యాలుబిడ్డలతోబందుగులతో మోద-ప్రయోదము లనుభవింతురు. వారుతమ నెచ్చెలులను తమ యాశ్రితులను గూడి గృహముల సుఖింతురు. వారికోర్కెలు మొక్కపోనివి. వారుమాయావులు. అచటి వారెల్ల ఋతువులందును సుఖ సంతోషములతో నుందురు. మాయలకు విభుడగు మయుడు వానిని అట్లు నిర్మించెను. వారి పురములందలి భవనాల చిత్రవిచిత్రములైన అట్లాలకములగోపురములు మున్నగునవి జాతిమణుల-మేలిముత్యాల కాంతులీనుచుండును. అచ్చోటి కొలువుకూటములు ముంగిళ్ళు విహారస్థలులును కాంతులు వెద జల్లుచు స్వర్గమును దలదన్ను చండును. ఆచటి నాగాసురుల జంటలు పావురముల గోరువంకల జంటలును-

కీర్ణకృత్రిమభూమిశ్చ వివరేశగృహోత్తమై | అలంకృతా శ్చకాసంతి ఉద్యానాని మహాంతి చ. 24

మనః ప్రసన్న కారీణి ఫలపుష్పవిశాలిభిః | లలనానాం విలాసార్హస్థాభిః శోఙతభాంజి చ. 25

నానావిహంగమవ్రాత సంయుక్త జలరాశిభిః | స్వచ్ఛార్ణః పూరితహ్రదైః పాఠీనసమలంకృతైః. 26

జలజంతు క్షుబ్ధనీరనీరజాతై రనేకశః | కుముదోత్పల కహ్లారనీలరక్తోత్పలై స్తథా. 27

తేషు కృతని కేతానాం విహారైః సంకులాని చ | ఇంద్రియోత్సవవారైశ్చ తథైవ నినిథైః స్వరై. 28

అమరాణాంచ పరమం శ్రియంచాతిశయంతి చ | యత్ర నైవ భయం క్వాపి కాలాంగైర్దినరాత్రిభిః. 29

యత్రాహిప్రనరాణాంచ సిరఃసధమణిరశ్మిభిః | నిత్యం తమః ప్రభాధ్యేత సదాప్రస్పులుకాంతిభిః. 30

న వా ఏతేషు వసతాం దివ్యౌషధిరసాయనైః | రసాన్న పానస్నానాద్యై రాధయోన చ వ్యాధయః. 31

వలీపలితజీర్ణత్వ వైవర్ణ్య స్వేదగంధతాః | అనుత్సాహవయోవస్ధా న బాధంతే కదాచన. 32

కల్యాణానాం సదా తేషాం న చ మృత్యుభయంకుతః | భగవత్తేజసో7న్యత్ర చక్రాచ్చైవసుదర్శనాత్‌. 33

యస్మి న్ప్ర విష్టే దైతేయ వధూనాం గర్బరాశయః | ప్రాయోభయాత్పతం త్యేవ స్ర వంతి బ్రహ్మపుత్రక. 34

ఇతి శ్రీ దేవీభాగవతే మహా పురాణ7ష్టమస్కంధే7ష్టా దశో7ధ్యాయః.

రమ్యమగు కృత్రిమస్థానములు నెతైన మంచిమేడలు తీర్చిదిద్దిన కనుల పండువగు తోటలు ముచ్చటలు గొల్పుచుండును. అచటి చెట్లు పూలు పండ్లు విదుల్చుచు నెమ్మదికి నెమ్మి కమ్మందనము గ్రుమ్మరించును. అచటి లలనామణుల కొంగ్రొత్తతళు కుబెళుకుగలిగి తగిన తావులు పెక్కు గలవు. అచ్చోపెల్లుగ కలకలారావములు చేయు పక్షులతో నిండిన కొలంకులందు చేపలు గలవు. అచ్చట జలచరములచే గలతజె ందిన పెక్కులు నీలారుణ కమలములును కలువలు నుత్పలములును కహ్లారములును గలవు. అవి యచ్చట తమతమ తావు లేర్పరచుకొని సొగసారుచున్నవి. ఆ కొలంకుల పెక్కుగతులగు స్వరములింద్రియములును తనుపును. వేయేల? ఆ చోటి కలుము లమరసంపదల నతిశయించును. కాలాంగములగు దివారాత్రములవలని భయ మెంతమాత్ర మునులేదు. అచటినాగరాజుల తలలందలి మణిగణముల నిత్యకాంతులవలన నట చీకట్లు తొంగియైన చూడలేవు. ఆచోటి దివ్యౌ షధుల రసాయనములం గూడిన రసాన్న పానములు స్నానములు నచట వసించువారి కాధి వ్యాధులు గల్గింపవు. మేనులు ముడు తలుపడి కృశించుట పాలిపోవుట ముసలితనము వెండ్రుకలు నెఱయుట నిరుత్సాహము మున్నగు మార్పు లచటివారి కేనాటికిని లేవు. వారి కెల్లవేళల మేలు దొంతరలు గల్గును. చావుభీతి లేదు. కానా వారు చక్రహస్తుని చక్రతేజమునకు వెఱతురు నారదా! అందు శ్రీహరి తేజము ప్రవేశింపగనే యతని చక్రభీతివలన దైత్యకాంతల గర్బములు స్రవించిపోవును.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమందు పదునెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters