Sri Devi Bagavatham-2    Chapters   

అథ తృతీయోధ్యాయః.

శ్రీనారాశ్రీనారయణ ఉవాచ : 

అధ డింభో జలే తిష్ఠ న్యా వద్వై బ్రహ్మణో వయః | తతః స కాలే సహసా ద్విధాభూతో బభూవ హ. 1

తన్మధ్యే శిశురేక శ్చ శతకోటి రవి ప్రభః | క్షణం రోరూయమాణ శ్ఛ స్చనాంధః పీడితః క్షుధా. 2

పిత్రా మాత్రా పరిత్యక్తో జలమధ్యే నిరాశ్రయః | బ్రహ్మండాసంఖ్యనాథోయో దదర్శోర్ధ్వ మనాథవత్‌. 3

స్థూలాత్థ్సూతమ సో7పి నామ్నా దేవో మహావిరాట్‌ | పరమాణుర్యథా సూక్ష్మాత్పరః స్థూలాత్తథా7ప్యసౌ. 4

తేజసా షోడశాంశో7యం కృష్ణస్య పరమాత్మనః | ఆధారః సర్వ విశ్వానాం మహావిష్ణు శ్చ ప్రాకృతః. 5

తేజసా లోమకూపేషు విశ్వాని నిఖిలాని చ | అస్యా7పి తేషాం సంఖ్యాం చ కృష్ణో వక్తుం న హి క్షమః. 6

సంఖ్యా చే ద్రజసా మస్తి విశ్వానాం న కదా చన | బ్రహ్మవిష్ణుశివాదీం తథా సంఖ్యా న విద్యతే. 7

ప్రతి విశ్వేషు సంత్యేవం బ్రహ్మవిష్ణుశివా దయః | పాతాళా ద్బ్ర హ్మలోకాంతం బ్రహ్మాండం పరికీర్తితమ్‌. 8

తత ఊర్ధ్వం చ వైకుంఠో బ్రహ్మాండా ద్బ హి రేవ సః |

తత ఊర్ధ్వం చ గోలోకః పంచాశత్కోటియోజనః. 9

నిత్య సత్యస్వరూప శ్చ యథాకృష్ణస్తథా ప్యయమ్‌ | సప్తద్వీ పమితా పృథ్వీ సప్తసాగర సంయుతా. 10

ఊనపంచాశదుపద్వీపా7సంఖ్య శైలవనాన్వితా | ఊర్ధ్వం సప్త స్వర్గలోకా బ్రహ్మలోకసమన్నితాః. 11

పాతాళా ని చ సప్తా ధ శ్చైవం బ్రహ్మండ మేవచ | ఊర్ధ్వం ధరాయా భూర్లోకో భువర్లోక స్తతః పరమ్‌. 12

తతః పరశ్చ స్వర్లోకో జనలోక స్తథాపరః | తతః పర స్త పోలోక స్సత్యలోక స్తతః పరః. 13

మూడవ అధ్యాయము

విరాట్స్వరూప ప్రతిపాదనము

శ్రీనారాయణు డిట్లనెను: బ్రహ్మండ జల మధ్యమున పడవేసిన యండాకారుడగు బాలు డందు బ్రహ్మవయ సంత కాల ముండి యొకనాడు హఠాత్తుగ రెండుగ మారెను. ఆ రెంటిలో నొకటి శిశురూపము. ఆశిశువు నుఱుకోట్ల సూర్యుల కాంతులనుబోలి కాంతికలిగియుండును. అతడు పాలులేక యాకలిమంటతో క్షణ మేడ్చెను. అతడు తల్లిదండ్రుల చేత విడువబడి జలమందు నిరాశ్రయుడై యుండెను. అతడసంఖ్య బ్రహ్మాండములకు నాధు డయ్యు ననాధునివలెపై దిక్కు చూచుండెను. అతడుస్ధూలవస్తువులకంటె మిక్కిలి స్ధూలముగనుంట మహావిరాట్టని పిలువబడెను. సూక్ష్మములలో పరమాణు వెంత సూక్ష్మమో స్ధూలములో నంత స్ధూలముగ నుండెను. అతడు కృష్ణ పరమాత్ముని తేజములో పదారవ యంశముగల్గిసకల విశ్వమునకాధారభూతుడై మహావిష్ణువన మూలప్రకృతి సంభవుడన ప్రసిద్ది గాంచెను. అతని రోమకూపములలో పెక్కు విశ్వములు గలవు. వానిని కృష్ణుడుగూడ లెక్కించుటకు జాలడు. ఇసుక రేణువులు లెక్కించవచ్చును కాని యావిశ్వములు లెక్కింపనలవికాదు. ప్రతి బ్రహ్మండమున బ్రహ్మ విష్ణు శివులు గలరు. వారి సంఖ్య తెలియరాదు. ప్రతి విశ్వమందు బ్రహ్మ విష్ణు శివులు గలరు. పాతాళమునుండి బ్రహ్మలోకమువఱకున్న భాగమును బ్రహ్మాండమందురు. బ్రహ్మం డమునకు బయట పైగ వైకుంఠము విరాజిల్లును. దానికి పైగ నైబదికోట్ల యోజనముల దూరమున గోలోకము ప్రకాశించుచుండును. శ్రీకృష్ణుని వలెగోలోకమును నిత్యము సత్యము చిన్మయము; ఈ భూమి యేడు దీవులతో నేడు సాగరములతో గూడినది. భూమిపైలెక్కలేనన్ని గిరులు వనములుగలవు. నలువదితొమ్మిది యుపద్వీపములు గలవు. పైని బ్రహ్మలోకముతో గూడి యేడు స్వర్గలోకములు గలవు. క్రిందుగ నేడు పాతాళలోకములు గలవు. ఈభూమికిపైగ భూలోకమును దానికిపైగా భువర్లోకమును గలవు. దానికిపైగా స్వర్లోకమును దానిపై జనలోకమును దాని మీద తపోలోకమును దానికావల సత్యలోకమును గలవు

తతః పరం బ్రహ్మలోక స్తప్తకాంచనసన్నిభః | ఏవం సర్వం కృత్రిమం చ బాహ్యాభ్యంతరమేవ చ. 14

తద్వినాశే వినాశశ్చ సర్వేషా మేవ నారద | జలుబుద్బూవత్సర్వం విశ్వ సం ఘ మనిత్యకమ్‌. 15

నిత్యౌ గోలోక వైకుంఠౌ ప్రోక్తౌ శశ్వ దకృత్రి మౌ | ప్రత్యేకం లోమ కూపేషు బ్రహ్మాండం పరినిశ్చితమ్‌. 16

ఏషాం సంఖ్యా న జానాతి కృష్ణో7న్యస్యా7పికా కథా | ప్రత్యేకం ప్రతిబ్రహ్మాండం బ్రహ్మ విష్ణుశివాదయః. 17

తిస్రః కోట్యః సురాణాంచ సంఖ్యా సర్వత్ర పుత్రక | దిగీశా శ్చైవ దిక్పాలా నక్షత్రాణి గ్రహాదయః. 18

భువి వర్ణా శ్చ చత్వారో7ప్యధో నాగా శ్చరాచరాః | అథ కాలే7త్ర స విరా డూర్ధ్వం దృష్ట్వా పునః పునః. 19

డింభాంతరే చ శూన్యం చ న ద్వి తీయం చ కించన చింతా మవాప క్షుద్యుక్తో రురోదచ పునః పునః. 20

జ్ఞానం ప్రాప్య తదా దధ్యౌ కృష్ణం పరమపూరుషమ్‌ | తతో దదర్శ తత్రైవబ్రహ్మజ్యోతిః సనాతనమ్‌. 21

నవీన జలదశ్యామం ద్నిభుజం పీతవాససం | సమ్మితం మురళీహస్తం భక్కాను గ్రహకాతరమ్‌. 22

జహాస బాలకస్తుష్టో దృష్య్వా జనక మీశ్వరమ్‌ | వరం తదా దదౌ తసై#్మ పరేశః సమయోచి తమ్‌. 23

మత్సమో జ్ఞానయుక్తాశ్చ క్షుత్పిపాసాది వర్జితః | బ్రహ్మండ సంఖ్యనిలయో భవ వత్స లయావధి. 24

నిష్కామో నిర్బయశ్చైవ సర్వేశాం వరదో భవ | జరామృత్యు రోగశోక పీడాది వర్జితో భవ. 25

ఇత్యుక్తా తస్య కృష్ణేన మహామంత్రం షడక్షరమ్‌ | త్రిః కృత్వశ్చ ప్రజజాప వేదంగ ప్రవరం పరమ్‌. 26

దానిపై బ్రహ్మలోకము కరగిన బంగారు వన్నెతో నొప్పును. ఇటుల సర్వమును బయట లోపల కృత్రిమమైనదే. నారద! బ్రహ్మలోకము నశించినపు డీ లోకము లన్నియును నశించును. ఈ బ్రహ్మాండములోని లోకాలన్నియును నీటి బుడగలవంటివి అనిత్యమైనది. గోలోక వైకుంఠలోకములు రెండు మాత్రమే నిత్యములు; శాశ్వతములు; సహజములు. ఆ బాలుని ప్రతి రోమకూపమందును బ్రహ్మండము నిండియున్నది. ఈ బ్రహ్మాండముల సంఖ్య కృష్ణునకే తెలియదు. ఇంకిత రుల కెట్లు తెలియగలదు. నారదా! మూడుకోట్ల దేవతలు వ్యాపించియున్నారు. దేవతలలో దిక్పాలకులు నక్షత్రములు గ్రహాలు మున్నగునవియు గలవు. భూమిపై నాలుగు వర్ణములువారు గలరు; చరాచరప్రాణులు గలరు; భూమిక్రింద నాగలోకము గలదు. ఆ విరాడ్బాలుడు పెక్కుసార్లుపైకిచూచెను. అబాలుని లోపల శూన్యము నిండియున్నది. మరేమియును లేదు. అతడాకలిచే మాటిమాటికి చింతించు చేడ్వసాగెను. కొంత వడి కతడు తెలివొంది పరమ పురుషుడగు కృష్ణుని ధ్వానించెను. అంతలో నతనికి సనాతనమైన బ్రహ్మజ్యోతి కనిపించెను. ఆ జ్యోతి రూపము క్రొత్త నల్లని మేఘము నలె నున్నది. అది రెండు చేతులు గల్గి పట్టు వస్త్రము దాల్చి మురళి చేత దాల్చి భక్తుల ననుగ్రహించుటకు ఆతురతతో నున్నట్లు గలదు. ఈశ్వరుడగు తన తండ్రిని చూచి బాలుడు నవ్వెను. కృష్ణు డపుడు బాలునికి తగినట్లు వరమిచ్చుచు ఇట్లనెను. ఓ బాలుడా! నావలె జ్ఞానవంతుడవుగమ్ము; నా కాకలి దప్పులుండవు, నీలోని బ్రహ్మాండములు ప్రళయము వఱకు నుండ గలవు. నిష్కాముడవు నిర్బయుడవు గమ్ము; ఎల్లరికి వరములిమ్ము; నిన్ను జర మృత్యువు రోగము శోకము మున్నగు పీడలు బాధించవు. అని కృష్ణు జతనికి ''ఓం కృష్ణాయ స్వాహా'' అను కృష్ణ షడక్షర మగామంత్ర ముపదేశించెను. అతడు వేదప్రవరము పరము నగు కృష్ణ మంత్రము ముమ్మారు జపించెను.

ప్రణవాది చతుర్ధ్యంతం కృష్ణ ఇత్యక్షర ద్వయమ్‌ | వహ్నిజాయాంత మిష్టంచ సర్వం విఘ్న హరం పరమ్‌. 27

మంత్రం దత్వాతదాహారం కల్పయామాస వై విభుః | శ్రూయతాం త ద్బ్రహ్మపుత్ర నిబోధ కధయామి తే. 28

ప్రతివిశ్వం యన్నై వేద్యం దదాతివైష్ణవో జపః | తత్షోడశాంశో విషయిణో విష్ణోః పంచదశాస్యవై. 29

నిర్గుణస్యాత్మనశ్చైవ పరిపూర్ణితమస్యచ | నై వేద్యే చైవ కృష్ణస్య నహి కించి త్ప్రయోజనమ్‌. 30

యద్యద్దదాతి నై వేద్యం తసై#్మ దేవాయ యో జనః | సచ ఖాదతి తత్సర్వం లక్ష్మీనాధో విరాట్త థా. 31

తంచ మంత్రవరం దత్త్వా తమువాచ పునర్విభుః | వరమన్యం కిమిష్టంతే తన్మే బ్రూహి దదామి చ. 32

కృష్ణస్య వచనం శ్రుత్వా తమువాచ విరాడ్విభుః | కృష్ణం తం బాలకస్తావ ద్వచనం సమయోచితమ్‌. 33

బాలక ఉవాచః వరో మే త్వత్పదాంభోజే భక్తి ర్బవతు నిశ్చలా |

సతతం యావదాయుర్మే క్షణంవా సుచిరం చ వా. 34

త్వద్బక్తియుక్తో లోకే7 స్మిన్‌ జీవన్ముక్త శ్చ సంతతమ్‌ | త్వద్బక్తి హీనో మూర్ఖశ్చ జీవన్న పిమృతో హి సః. 35

కింతజ్జపేన తపసా యజ్ఞేన పూజనేన చ | వ్రతేన చోపవాసేవన పుణ్యన తీర్ధసేవయా. 36

కృష్ణ భక్తి విహీనస్య మూర్ఖస్య జీవనం వృధా | యేనాత్మనా జీవిత శ్చ తమేవ న హి మన్యతే. 37

యావదాత్మా శరీరే7స్తి తావత్స శక్తి సంయుతః | పశ్చాద్యాంతి గతే తస్మిన్‌ స్వతంత్రాః సర్వశక్తయః. 38

అది సకల విఘ్నహరము; పరమము. పిమ్మట నతని యాహారము గూర్చి యేర్పాటు గావించి కృష్ణుడిట్లనెను. బ్రహ్మపుత్రా! నేను చెప్పునది చక్కగ వినుము. ప్రతి విశ్వమందలి వైష్ణవుడును నైవేద్యము సమర్పించునపు డందులోని పదారవ భాగము విష్ణునకు తక్కిన పదునైదు భాగము లావిరాడ్బాలునికిని చెందును.ఇక నిర్గుణుడు పరమాత్ముడు పరిపూర్ణతముడునగు కృష్ణునకు నైవేద్యముతో ప్రయోజనము లేదు. శ్రీకృష్ణ దేవున కెవడైన నైవేద్యము సమర్పించుచో దానిని సైతము మోత్తమును లక్ష్మీనాధుడగు విరాడ్బాలు డారగించును. ఆ విధముగ మహా మంత్ర ముపదేశించిన తర్వాత కృష్ణుడు బాలునితో మరల నిట్లనెను. ఓ కుమారా! నీకిష్టమైన వరమేదైన ఇంకొకటి కోరుకొనుము. ఇచ్చెదను. ఆను కృష్ణుని మాటలు విని విరాడ్విభుడు సమయమునకు దగినట్లుగ కృష్ణున కిట్లనెను. నాకాయువు కొద్దిగ నున్న నీ పదకమలము లందలి నిశ్చల భక్తి కుదురుకొనిన చాలు ఈ లోకము నందు నీ భక్తి గలవాడు జీవన్ముక్తుడు. నీ ప్రియ భక్తి లేనివాడు మూర్ఖుడు బ్రతికియు చచ్చినవాడే. నీ భక్తి లేని జప తపః పూజా యజ్ఞ వ్రతోపవాస తీర్థసేన లన్నియును వ్యర్థములు. కృష్ణ భక్తి లేని మూర్ఖుని జీవితము వ్యర్థము. వాడు బ్రతికియున్నను లెక్కింపదగినవాడు కాడు. ఈ శరీరమం దాత్మయున్నంత వఱకు శక్తి యుండును. ఆత్మ వెడలగనే యింద్రియ శక్తు లన్నియు నతనిని వెంబండించును.

సచత్వం చ మహాబాగ సర్వాత్మా ప్రకృతేః వరః | స్వేచ్ఛా మయ శ్చ సర్వా ద్యో బ్రహ్మజ్యోతిః సనాతనః. 39

ఇత్యుక్త్వా బాలకస్త త్ర విరరామచ నారద | ఉవాచ కృష్ణః ప్రత్యుక్తిం మధూరాం శ్రుతిసుందరీమ్‌. 40

శ్రీ కృష్ణ ఉవాచ : సుచిరం సుస్థిరం తిష్ఠ యథా హం త్వం తథా భవ | బ్రహ్మణో7సంఖ్య పాతే చ పాతస్తే న భవిష్యతి. 41

అంశేన ప్రతి బ్రహ్మాండే త్వం చ క్షుద్ర విరాడ్బవ | తన్నాభిపద్మా ద్బ్రహ్మాచ విశ్వస్రష్టా భవిష్యతి. 42

లలాటే బ్రహ్మణశ్చైవ రుద్రాశ్చైకాదశైవతే | శివాం శేన భవిష్యంతి సృష్టిసంహరణాయవై. 43

కాలాగ్విరుద్ర స్తే ష్వేకో విశ్వసంహారకారకః | పాతా విష్ణు శ్చ విషయీ రుద్రాంశేన భవిష్యతి. 44

మద్బక్తియుక్తః సతతం భవిష్యసి వరేణ మే | ధ్యానేన కమనీయం మాం నిత్యం ద్రక్ష్యసి నిశ్యితమ్‌. 45

మాతరం కమనీయాం చ మమ వక్షః స్థలస్థితామ్‌ | యామి లోకం తిష్ఠ వత్సే త్యుక్త్వా సో7తరధీయత. 46

దత్వా ల్వలోకం బ్రహ్మాణం శంకరం సమువాచ హ | స్రష్టారం స్రష్టుమీశం చ సంహర్తుం చైవ తత్షణమ్‌. 47

భగవానువాచ: స్పష్టిం స్రష్టుంగచ్చ వత్స నాభిపద్మోద్బవో భవ | మహావిరాడ్లో మకూపే క్షుద్రస్య చ విధే శృణు. 48

గచ్చ వత్స మహాదేవ బ్రహ్మఫాలోద్బవో భవ | అంశేన చ మహాభాగ స్వయం చ సుచిరం తప. 49

ఇత్యుక్త్వా జగతాం నాథో విరరామ విధేః సుతః | జగామ బ్రహ్మాతం నత్వా శివశ్చ శివదాయకః. 50

మహావిరా డ్లోమకూపే బ్రహ్మాండగోళ##కే జలే | బభూవ చ విరాడ్‌క్షుద్రో విరాడంశేన సాంప్రతమ్‌. 51

శ్యామో యువా పీతవాసాః శయానో జలతల్పకే | ఈషద్ధాస్యః ప్రసన్నాస్యో విశ్వవా పీ జనార్దనః. 52

ఓ మహానుభావా! నీవు సర్వాత్ముడవు. ప్రకృతికి పరుడవు.సర్వతంత్ర స్వతంత్రుడవు; బ్రహ్మజ్యోతివి; సనాతనుడవు; అని పలికి బాలుడు విరమించెను. అపుడు కృష్ణుడు చెవికింపుగ తీయగ నిట్లు మారు పలికెను. వున నావలె స్ధిరముగ చిరముండుము. కొన్ని బ్రహ్మాండములు నశించినను. నీకు నాశము లేదు. ప్రతి బ్రహ్మాండములోను నీ యంశ-సూక్ష్మాంశ-రూపములు గల్గుచుండును. నీ నాభికమలము నుండి విశ్వ స్రష్ట యగు బ్రహ్మ యుద్బవించగలడు. బ్రహ్మ నుదుటి నుండి పదునొకండుగురు రుద్రు లావిర్బవింతురు. వారు శివాంశమున సృష్టి సంహారము లొనరింతురు. నారిలో కాలాగ్ని రుద్రుడు విశ్వ సంహారము చేయును. పాలకుడగు విష్ణువు రుద్రాంశము వలన నుదయించును. నా పయి నీకు చిరభక్తి నిలుచునట్లు వరమిచ్చుచున్నాను. నీవుధ్యానములో నిత్యమును నా సుందర రూపము చూడగలవు. నీ తల్లి నా వక్షః స్ధలమున నెలవై యుండును. ఆమెను గూడ నీవు చూడగలవు. ఓ వత్సా! ఇక నా గోలోక మేగుచున్నాను. నీ వుండుము. అని కృష్ణుడు గోలోకము వెళ్లి బ్రహ్మను సృష్టి చేయుమనియు శంకరుని సంహరించుమనియు నా దేశము లొసంగెను. బ్రహ్మ! నీవు సృష్టిచేయుట కేగుము. విరాడ్బాలకుని రోమకూపములలో నెన్నో బ్రహ్మాండములు గలవు-నీవొక బ్రహ్మాండ మందున్న విష్ణు నాభి కమలమున జన్మించుము. ఓ మహాదేవా! వత్సా! నీవు బ్రహ్మ నుదుట అంశతో నుద్బవించుము. మహాభాగ! నీవు స్వయముగ నిరతముగ తపము చేయుచుండుము. అని పలికి జగన్నాథుడు విరమించెను. బ్రహ్మ యతినికి నమస్కరించెను. శివదాయకుడగు శివుడు నతనికి నమస్కరించి వెళ్ళెను. మహావిరాడ్బాలకుడు బ్రహ్మండ గోళ జలములమధ్య గలడు. అతనీ యంశమున గల్గిన క్షుద్ర విరాట్టోకడు నుండెను. క్షుద్ర విరాట్టును జల తల్పమున వరుండి పట్టువస్త్రము గట్టి యువకుడగనై శ్యామల వర్ణముతో చిర్నగవుతో విశ్వవ్యాపియై జనార్దనుడై ప్రకాశించుచుండెను.

తన్నాభి కమలే బ్రహ్మ బభూవ కమలోద్బవః | సంభూయ పద్మదండే చ బభ్రామ యుగలక్షకమ్‌. 53

నాంతం జగామ దండస్య పద్మనాళస్య పద్మజః | నాభిజస్య చ పద్మస్య చింతామాప పితా తవ. 54

స్వస్థానం పునరాగమ్య దధ్యౌకృష్ణ పదాంబుజమ్‌ | తతో దదర్శక్షు ద్రంతం ధ్యానేన దివ్య చక్షుషా. 55

శయానం జలతల్పే చ బ్రహ్మాండగోళకాప్లు తే | యల్లోమకూపే బ్రహ్మాండం తం చ తత్పర మీశ్వరమ్‌. 56

శ్రీకృష్ణం చాపి గోలోకం గోపగోపీసమన్వితమ్‌ | తం సంస్తూయ వరం ప్రావ తతః సృష్టిం చకార సః. 57

బభూవు ర్బ్రహ్మణః పుత్రా మానసాః సనకాదయః | తతో రుద్రకళా శ్చాపి శివసై#్యకాదశ స్మృతాః. 58

బభూవ పాతా విషుశ్చ క్షుద్రస్య వామపార్శ్వంతః | చతుర్బుజశ్చ భగవాన్‌ శ్వేతద్నీపే స చావసత్‌. 59

క్షుద్రస్య నాభి పద్మే చ బ్రహ్మా విశ్వం ససర్జ హ | స్వర్గం మర్త్యం చ పాతాళం త్రిలోకీం సచరాచరమ్‌. 60

ఏవం సర్వం లో మకూపే విశ్వం ప్రత్యేక మేవ చ | ప్రతివిశ్వే క్షుద్రవిరాట్‌ బ్రహ్మ విష్ణుశివాదయః. 61

ఇత్యేవం కథితం బ్రహ్మనొ కృష్ణసంకీర్తనం శుభమ్‌. |

సుఖదం మోక్షదం బ్రహ్మ న్కిం భూయః శ్రోతు మిచ్ఛసి. 62

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే తృతీయో7ధ్యాయః.

ఆ క్షుద్ర విరాట్టు బొడ్డు తమ్మి నుండి బ్రహ్మ యుదయించెను. అతడు బ్రహ్మ పుట్టిన తర్వాత లక్ష యుగముల వఱకు పద్మ నాళమున తిరిగెను. అయినను తామర తూడు మొదలతనికి కనిపించలేదు. ఇట్లు నీ తండ్రి యగు బ్రహ్మ పద్మములో తిరుగుచు చింతించెను. అతడు తిరిగి తను పుట్టిన చోటి కేతెంచి కృష్ణ పదాంబుజములు ధ్యానించెను. అపుడు బ్రహ్మ తన దివ్య చక్షువులతో ధ్యానమందు క్షుద్ర విరాట్టును దర్శించెను. ఆ విరాట్పురుషుడు జలముల సెజ్జపై పరుండెను. అతని రోమ కూపముల బ్రహ్మాండము విరాజిల్లుచుండెను. బ్రహ్మకు గోలోకవాసి గోపగోపీ సంయుతుడు నగు శ్రీ కృష్ణుడు దర్శన మొసంగెను. బ్రహ్మ కృష్ణుని సంస్తుతించి వరము లొంది సృష్టి కార్యమునకు పూనుకొనెను. ఆపుడు బ్రహ్మ మానస పుత్రులు సనకాదులు బ్రహ్మ నుండి యుద్బవించిరి. పిదప శివుని పదునొకండు రుద్రాంశములు గల రుద్రు లావిర్బవించిరి. క్షుద్ర విరాట్టు నాభి కమలమున బుట్టిన బ్రహ్మ స్వర్గ మర్త్య పాతాళములు గల చరాచ ప్రపంచమును సృజించెను. ప్రతి బ్రహ్మండమునందు నొక క్షుద్ర విరాట్టు బ్రహ్మ విష్ణు శివులు నుందురు. బ్రాహ్మాణా! ఈ ప్రకారముగ నీకు శ్రీకృష్ణ సంకీర్తనము వినిపించితిని. ఇది శుభము, సుఖము, మోక్షము నొసంగునది. ఇంకేమి వినదలతువో తెలుపుము.

ఇదిశ్రీ దేవీ భాగవత మహా పురాణ మందలి తొమ్మిదవ స్కంధమున మూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters