Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తమో7ధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : ఇత్యుక్త్వా జగతాం నాథో విరరామ చ నారద | అతీవ రురుదుర్దేవ్యః సమాలింగ్య పరస్పరమ్‌. 1

తాశ్చ సర్వాః సమాలోక్య క్రమేణోచుస్త దేశ్వర | కంపితాః సాశ్రునేత్రాశ్చ శోకేన చ భ##యేన చ. 2

సరస్వత్యువాచ : విశాపం దేహి హేనాథ దుష్టమాజన్మశోచనమ్‌ | సత్స్వామినా పరిత్యక్తాః కుతో జీవంతి తాః స్త్రియః. 3

దేహత్యాగం కరిష్యామి యోగేన భారతే ధ్రువమ్‌ | అత్యున్నతో హి నియతం పాతుమర్హతినిశ్చితమ్‌. 4

గంగోవాచ : అహం కేనాపరాధేన త్వయా త్యక్తా జగత్పతే | దేహత్యాగం కరిష్యామి నిర్దోషాయావధంలభ. 5

నిర్దోషకామినీ త్యాగం కరోతి యో నరోభువి | స యాతి నరకంఘోరం కింతు సర్వేశ్వరో7పివా. 6

పద్మోవాచ : నాథ సత్త్వస్వరూపస్త్వం కోపః కథ మహోతవ | ప్రసాదం కురు భార్యేద్వే సదీశస్య క్షమావరా. 7

భారతే భారతీశాపా ద్యాస్యామి కలయాహ్యయమ్‌ | కియత్కాలం స్థితిస్తత్ర కదా ద్రక్ష్యామి తే పదమ్‌. 8

దాస్యంతి పాపినః పాపం సద్యః స్నానావగాహనాత్‌ | కేన తేన విముక్తా7హ మాగమిష్యామి తే పదమ్‌. 9

కలయా తులసీరూపం ధర్మధ్వజనుతా సతీ | భుక్త్వా కదా లభిష్యామి త్వత్పదాంబుజ మచ్యుత. 10

వృక్షరూపా భవిష్యామి త్వదధిష్ఠాతృ దేవతా | సముద్ధరిష్యసి కదా తన్మే బ్రూహి కృపానిధే. 11

ఏడవ అధ్యాయము

సరస్వతి నదిగా మారుట

శ్రీనారాయణు డిట్లనెను : నారదా! ఇట్లు పలికి జగన్నాథుడు మిన్నకుండెను. అపుడు దేవు లొకరినొకరు కౌగలించుకొని దురపిల్లిరి. పిమ్మట వారు కన్నీరు గార్చుచు శోకభయముల వణకుచు క్రమముగహరితో నిట్లనిరి. సరస్వతి: ఓ నాథా ! నీ శాపము బ్రతికినంతకాలమును శోకము గల్గించును. కాన శాపము తొలగింపుము. అనుకూలపతిని వదలి యువతు లెట్లు బ్రదుకగలరు! నేను భారతదేశమున కేగి నా దేహమును యోగాగ్నిలో దహించువేతును. మహాత్ము లెప్పుడు నెల్లరిని రక్షించుచుందురు గదా! గంగ: ఓ జగత్పతీ ! నేనేమి తప్పు చేసితినని నన్ను వదిలిపెట్టుచున్నావు. నే నీ తనువు వదలగలను. నీ వొక నిరపరాధను చంపిన పాపము నొందుము. ఈ భూమిపై నే దోషములేని స్త్రీని వదలినవాడు ఘోర నరకమున గూలును. అతడు సర్వేశ్వరుడైనను తప్పక నరక మొందగలడు. పద్మ : నాథా ! నీవు సత్త్వస్వరూపుడవు. నీకు గూడ కోప మెట్లు వచ్చెను ! ఆ యిర్వురి భార్యలందును ప్రసన్నడవు గమ్ము. సత్పురుషునకు క్షమ ప్రధానగుణము గదా! నేను భారతదేశమున భారతీశాపమున నా యంశ##చే నవతరింపగలను. కాని యచట నేనెంత కాలమని యుండవలయును. మరల నీ పద దర్శన మెపుడు ప్రాప్తించగలదు. పాపాత్ములు నాలో మునిగి వారి పాపములు నాలో వదిలివేతురు. వారి పాపాలనుండి నేనెట్లు ముక్తురాలను గాగలను. తిరిగి నీ పదకలమలము లెప్పుము దర్శింపగలను ? ఓ యచ్యుతా! నేను ధర్మ ధ్వజుని కూతురనై తులసీరూప మొందియుందును. మఱి నే నెన్నాళ్లకు ముక్తురాలను గాగలను. నీ పదకమలము లెపుడు గాంచగలను ? ఓ దయానిధీ! నీ యధిష్ఠానముగల తులసిరూపు దాల్చగలను. మఱి నన్నెన్న డుద్ధరింతువో తెలుపుము.

గంగా సరస్వతీ శాపా ద్యదియాస్యతి భారతే | శాపేనముక్తా పాపాచ్చ కదా త్వాం చ లభిష్యతి. 12

గంగా శాపేనవా వాణీ యదియాస్యతి భారతమ్‌ | కదా శాపా ద్వినిర్ముచ్య లభిష్యతి పదంతవ. 13

తాం వాణీం బ్రహ్మసదనం గంగాంవా శివమందిరమ్‌ | గంతుం వదసి హేనాథ తత్షమస్వ చ తే వచః. 14

ఇత్యుక్త్వా కమలా కాంత పాదం ధృత్వా ననామ సా | స్వకేశై ర్వేష్టనం కృత్వా రురోద చ పునః పునః. 15

''ఉవాచ పద్మనాభ స్తాం పద్మాం కృత్వా స్వ వక్షసి | ఈషద్ధాస్య ప్రసన్నాస్యో భక్తానుగ్రహకాతరః''

త్వద్వాక్య మాచరిష్యామి స్వవాక్యం చ సురేశ్వరి | సమతాం చ కరిష్యామి శృణు త్వం కమలేక్షణ. 16

భారతీ యాతు కలయా సరిద్రూపా చ భారతే | అర్థా సా బ్రహ్మసదనం స్వయంతిష్ఠతు మద్గృహే. 17

భగీరథేన సా నీతా గంగా యాస్యతి భారతే | పూతం కర్తుం త్రిభువనం స్వయంతిష్ఠతుమద్గృహే. 18

తత్రైవ చందమౌళే శ్చ మౌళిం ప్రాప్స్యతి దుర్లభమ్‌ | తతః స్వభావతః పూతా7ప్యతిపూజా భవిష్యతి. 19

కలాంశాంశేన గచ్ఛత్వం భారతే వామలోచనే | పద్మావతీ సరిద్రూపా తులసీవృక్షరూపిణీ. 20

కలేః పంచసహస్రే చ గతే వర్షే చ మోక్షణమ్‌ | యుష్మాకం సరితాం చైవ మద్గేహే చాగమిష్యథ. 21

సంపదాం హేతుభూతా చ విపత్తిః సర్వదేహినామ్‌ | వినా విపత్తే ర్మహియా కేషాం పద్మభ##వే భ##వేత్‌. 22

సరస్వతీ శాప మొందిన గంగ భారతదేశమున నదిగ నవతరించి తిరిగి శాపముక్తయై నిన్నెన్నడు చేరుకొనగలదు? గంగాశాపమున సరస్వతి భారతదేశమందు నదిగ నవతరించి తిరిగి శాపముబాసి యెన్నడు నీ పదము చేరగలదు. నాథా సరస్వతిని బ్రహ్మ చెంతకు గంగను శివుని సన్నిధికి వెళ్ళుమంటివి గదా ! ఆ నీ మాటను నిజము చేయకుము. అని పలికి లక్ష్మి తల ప్రియకాంతుని పాదములు పట్టుకొని మ్రొక్కి తన కేశపాశములతోహరి పదములు కప్పుచు వెక్కివెక్కి యేడ్వసాగెను. అపుడు భక్తానుగ్రహకాతరుడగు పద్మనాభుడు చిర్నగవుతో లక్ష్మిని తల యెదకు హత్తుకొని యామె కిట్లనెను. కమలలోచనా! నీ మాట చెల్లింతును. నా మాటయును చెల్లించుకొందును. ఈ రెంటిలో సమత పాటింతును వినుము. భారతీ దేవి తన యొక కళతో భారతదేశమందు నదీరూపమును దాల్చుత. మఱి సగము కళతో బ్రహ్మచెంత నుండుత ! ఇంక పూర్ణకళతో స్వయముగ నా సన్నిధి నుండుగాత! భగీరథుని ప్రయత్న ఫలితముగ ముల్లోకములను పావన మొనర్చుటకొఱకు నొకే కళతో గంగ భూమిపై నవతరింపగలదు. మఱియును గంగ చంద్రమౌళి తలపై నొకే కళతో నేగి మఱియును పూజింపబడును. వామాక్షీ ! ఇంక నీవు నీ కళాంశవలన భారతదేశమందు పద్మావతీ నదిగ నవతరించి వృక్షముగ రూపు దాల్చగలవు. కలియుగం దైదు వేలేండ్లు గడచిన పిమ్మట నీ నదీరూపమునకు విముక్తి గల్గును. నీ వపుడు నన్నే చేర గలవు. పద్మా! ఎల్ల ప్రాణుల కాపదలు సంపదలకు కారణములు. కష్టము లనుభవించ కెవడు మహాత్ముడు గాగలడు?

మన్మంత్రోపాసకానాంచ సతాం స్నానావ గాహనాత్‌ | యుష్మాకం మోక్షణం పాపా ద్ధర్షనాత్స్పర్శనా త్తథా. 23

పృథివ్యాం యాని తీర్థాని సంత్యసంఖ్యాని సుందరి | భవిష్యంతి చ పూతాని మద్బక్త స్పర్శ దర్శనాత్‌. 24

మన్మంత్రో పాసకా భక్తా విశ్రమంతిచ భారతే | పూతం కర్తుం తారితుంచ సుపవిత్ర వసుంధరామ్‌. 25

మద్బక్తా యత్రతిష్ఠంతి పాదం ప్రక్షాళయంత చ | తత్థ్సానం చ మహాతీర్థం సుపవిత్రం భ##వే ద్థ్రువమ్‌. 26

స్త్రీఘ్నో గోఘ్నః కృతఘ్నశ్చ బ్రహ్మఘ్నో గురుతల్పగః | జీవన్ముక్తో భ##వేత్పూతో మద్బక్త స్పర్శ దర్శనాత్‌. 27

ఏకాదశీవిహీనశ్చ సంధ్యాహీనో7థ నాస్తికః | నరఘాతీభ##వే త్పూతో మద్బక్త స్పర్శ దర్శనాత్‌. 28

అసిజీవీ మసీజీవీ ధావకో గ్రామయాచకః | వృషవాహో భ##వేత్పూతో మద్బక్త స్పర్శ దర్శనాత్‌. 29

విశ్వాసఘాతీ మిత్రఘ్నో మిథ్యాసాక్ష్యస్యదాయకః | స్థాప్యహారీ భ##వేత్పూతో మద్బక్త స్పర్శదర్శనాత్‌. 30

అత్యుగ్రవా న్పుందూషకశ్చ జారకః పుంశ్చ లీపతిః | పూతశ్చ వృషలీ పుత్రో మద్బక్తస్పర్శదర్శనాత్‌. 31

శూద్రాణాం సూవకారశ్చ దేవలోగ్రామయాజకః | అదీక్షితో భ##వేత్పూతో మద్బక్త స్పర్శదర్శనాత్‌. 32

పితరం మాతరం భార్యాం భ్రాతరం తనయం సుతామ్‌ | గురోః కులం చ భగినీం చక్షుర్హీనంచబాంధవమ్‌. 33

నా మంత్రోపాసకులు పరమసాధులు నిన్ను దర్శించి స్పృశించి స్నానాదులు చేసినంతనే నీకు శాపమోక్షము గల్గును. సుందరీ! ఈ భూమిపై గల లెక్క లేనన్ని తీర్థము లన్నియును నా పరమభక్తుల దర్శన స్పర్శములవలన పవిత్రములు గాగలవు. ఈ పావన భూమాతను పవిత్ర మొనర్చుటకు తరింపజేయుటకు నా మంత్రోపాసకులు భక్తులును భారత భూమిపై వసింతురు. నా భక్తు లెచట వసించి పాదప్రక్షాళన మొనరింతురో యచ్చోటు తప్పక పవిత్ర పుణ్యతీర్థ మగును. నా భక్తులైన వారినిదర్శించి స్పృశించినంతనే బ్రాహ్మణుని స్త్రీని గోవులను చంపినవాడును గురుతల్పగామియును కృతఘ్ను డును పవిత్రుడై జీవన్ముక్తుడు గాగలడు. నా భక్తులగు వారిని దర్శించి స్పృశించినంతనే యేకాదశి వ్రతము సలుపనివాడు సంధ్యావందన మాచరింపనివాడు నాస్తికుడు నరహంతయును పవిత్రుడు గాగలడు. నా భక్తులైనవారిని దర్శించి స్పృశించినంతనే చాకలివాడు వృషవాహనులు అసిజీవులు మసిజీవులు గ్రామయాజకులును పవిత్రులు గాగలరు. నా భక్తులైనవారిని దర్శించి స్పృశించినంతనే విశ్వాఘాతుకుడు మిత్రద్రోహి కూటసాక్ష్యము బలుకువాడు అప్పు లెగవేయువాడు పవిత్రులు గాగలరు. ఉగ్రకర్ముడు పురుషదూషకుడు జారుడు వ్యభిచారిణుల పతియు వ్యభిచారిణుల కుమారుడును నా భక్తులను దర్శించి స్పృశించినంతనే పవిత్రుడు గాగలడు. నా భక్తులైన వారిని దర్శించి స్పృశించినంతనే శూద్రుల వంటలవాడు పూజరి పురోహితుడు దీక్ష నందనివాడును పవిత్రుడు గాగలడు. సుందరీ! ఎవడు తన తల్లి దండ్రులను భార్యను సంతా నమును సోదరులను గురుకులమును బందుగులను గ్రుడ్డివారిని.

శ్వశ్రూంచ శ్వశురం చైవ యోన పుష్ణాతి సుందరి | స మహా పాతకీ పూతో మద్బక్త స్పర్శదర్శనాత్‌. 34

అశ్వత్థ నాశకశ్చైవ మద్బక్తనిందకస్తథా | శూద్రాన్నభోజీ విప్రశ్చ పూతో మద్బక్త దర్శనాత్‌. 35

దేవ ద్రవ్యాపహారీచ విప్రద్రవ్యాపహారకః | లాక్షాలోహర సానాంచ విక్రేతా దుహితు స్తథా. 36

మహాపాతకినశ్చైవ శూద్రాణాంశవదాహకః | భ##వేయురేతే పూతాశ్చ మద్బక్త స్పర్శదర్శనాత్‌. 37

శ్రీమహాలక్ష్మీ రువాచ : భక్తానాం లక్షణంబ్రూహి భక్తానుగ్రహకాతర | తేషాంతు దర్శన స్పర్శాత్సద్యః పూతా నరాధమాః. 38

హరిభక్తి విహీనాశ్చ మహాహంకారసంయుతాః | స్వప్రశంసారతా ధూర్తాః శఠాశ్చ సాధునిందకాః. 39

పునంతి సర్వతీర్థాని యేషాం స్నానావగాహనాత్‌ | యేషాం చ పాదరజసా పూతాపాదోదకాన్మహీ. 40

యేషాం సందర్శనం స్పర్శం యేవావాంఛంతి భారతే | సర్వేషాం పరమోలాభో వైష్ణవానాం సమాగమః. 41

నహ్యమ్మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయాః | తే పునంత్యురు కాలేన విష్ణుభక్తాః క్షణాదహో. 42

మహాలక్ష్మీవచః శ్రుత్వా లక్ష్మీకాంతశ్చ సస్మితః | నిగూఢ తత్త్వం కథితుమపి శ్రోష్ఠోపచక్రమే. 43

అత్తమామలను పోషింపడో యట్టి మహాపాతకియును నా పరమభక్తులను దర్శించి స్పృశించినంతనే పవిత్రుడగును. నా భక్తులను నన్ను నిందించువాడును రావిచెట్టు నఱకువాడును శూద్రాన్నము తిను విప్రుడును నా భక్తులను దర్శించి స్పృశించినంతనే పవిత్రు డగును. దేవబ్రాహ్మణ మాన్యము లపహరించువాడును బిడ్డలను లక్కను లోహమును రసవస్తుల నమ్మువాడును శూద్రుల శవములు దహనము చేయువాడును మొదలగు పాపాత్ములు సైతము నా ప్రియ భక్తులను దర్శించి స్పృశించినంతనే పవిత్రు లగుదురు. శ్రీమహాలక్ష్మి యిట్లనియెను : ప్రియ భక్తానుగ్రహ తత్పరా! నాకు నీ పరమభక్తుల లక్షణములు తెల్పుము. వారిని దర్శించి స్పృశించినంతనే నరాధములు పవిత్రులు గాగలరు. హరి భక్తిలేనివారును-అహంకారులు-ధూర్తులు-శఠులు-డంబాచారులు-సాధునిందకులునైన పాపులను సైతము సర్వతీర్థములును భక్తుల స్పర్శన దర్శ నములవలన పవిత్ర మొనర్చును. భక్తుల పాదరజముపాదోదకము సోకినంతనే భూమియును పవిత్రము గాగలదు. భారతీయు లెవరి దర్శన-స్పర్శన భాగ్యము నిత్యము గోరుచుందురో యట్టి భక్తులను గూర్చి యింకను తెల్పుము. పరమ వైష్ణవుల సమాగమమన్నిటికన్న పుణ్యలాభము. పుణ్యజల తీర్థములు పుణ్యక్షేత్రములు శిలావిగ్రహములు నెంతో కాలమునకు పవిత్ర మొనరించును. కాని విష్ణు భక్తులప్పటి కప్పుడే పవిత్ర మొనరింపగలరు. అను మహాలక్ష్మి వచనములు విని లక్ష్మీవల్లభుడు నవ్వి యా రహస్యమైన తత్త్వము సైతము తెల్పుటకు బూనుకొనెను.

భక్తానాం లక్షణం లక్ష్మిగూఢం శ్రుతిపురాణయోః | పుణ్యస్వరూపం పాపఘ్నం సుఖదం భుక్తి ముక్తిదమ్‌. 44

సారభూతం గోపనీయం నవక్తవ్యం ఖలేషు చ | త్వాం పవిత్రాం ప్రాణతుల్యాం కథయామి నిశామయ. 45

గురువక్త్రా దివష్ణుమంత్రో యస్యకర్ణే పతిష్యతి | వదంతివేదా స్తంచాపి పవిత్రంచ నరోత్తమమ్‌. 46

పురుషాణాం శతం పూర్వం తథా తజ్జన్మ మాత్రతః | స్వర్గస్థం నరకస్థంవా ముక్తి మాప్నోతి తత్షణాత్‌. 47

యైఃకై శ్చి ద్యత్ర వా జన్మలబ్ధం యేషు చ జంతుషు | జీవన్ముక్తా స్తుతే పూతాయాంతి కాలేహరేః పదమ్‌. 48

మద్బక్తియుక్తో మర్త్యశ్చ సముక్తో మద్గుణాన్వితః | మద్గుణా ధీనవృత్తిర్యః కథావిష్టశ్చసంతతమ్‌. 49

మద్గుణ శ్రుతిమాత్రేణ సానందః పులకాన్వితః | సగద్గదః సాశ్రునేత్రః స్వాత్మవిస్మృత ఏవచ. 50

న వాంఛతి సుఖం ముక్తిం సాలోక్యాది చతుష్టయమ్‌ | బ్రహ్మత్వ మమరత్వంవాత ద్వాంఛా మమసేవనే. 51

ఇంద్రత్వం చ మమత్వంచబ్రహ్మత్వం చ సుదర్లభమ్‌ | స్వర్గరాజ్యాదిభోగం చ స్వప్నే7పి చ న వాంఛతి. 52

భ్రమంతి భారతే భక్తా స్తా దృగ్జన్మసుదర్లభమ్‌ | మద్గుణ శ్రవణాః శ్రావ్యగానైర్నిత్యం ముదా7న్వితాః. 53

తేయాంతి చ మహీం పూత్వా వరం తీర్థం మమా77లయమ్‌ | ఇత్యేవం కథితంసర్వం పద్మే కురుయథోచితమ్‌. 54

తదాజ్ఞాయా తాస్తచ్చ క్రుర్హిరిస్తస్థౌ సుఖాసనే.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే సప్తమోధ్యాయః.

లక్ష్మి ! పరమభక్తుల లక్షణములు వేదపురాణములందు నిగూఢముగ నున్నవి. అవి పుణ్యదములు భుక్తిముక్తి సుఖదములుపాపహరములు. అవి వేదసారములు రహస్యములు దుష్టులకు చెప్పరానివి. కనుక పవిత్రురాలవు సమానవగు నీకు విషయము తెల్పుదును వినుము. పరమగురుని నోట నెవని చెవిలో విష్ణుమంత్రము పడునో వేదము లట్టివానిని పవిత్రునిగ నరోత్తమునిగ చెప్పును. అట్టి పుణ్యపురుషుడు పుట్టినతోడనే వానికి ముందటి నూఱు తరములవారు స్వర్గమున నున్నను నరకమందున్నను నప్పటికప్పుడే ముక్తింగాతురు. మఱి యెవరెవ రేయే జంతువులందు బుట్టినను వారును జీవ న్ముక్తులై పిమ్మట విష్ణుపదము చేరగలరు. నిత్యము నాయందే భక్తి గలిగి నా గుణకీర్తనలే సలిపి నా కథలే వినువారు నా ప్రియభక్తులు. నా గుణములు విన్నంతనే యెవని నెమ్మేను పుల్కరించునో ఆనందబాష్పములు జలజల రాలునో వాడు నా ప్రియభక్తుడు. ఏనాడు ముక్తి సుఖములు సాలోక్యాదులు అమరత్వము బ్రహ్మత్వము కోరడో నన్ను సేవించుటలో తత్పరుడో వాడు నా ప్రియభక్తుడు. ఇంద్రత్వనరత్వములు స్వర్గరాజ్యభోగములు దుర్లభ##మైన బ్రహ్మతత్వమును నెవడు కల నైన వాంఛింపడో వాడు నా భక్తుడు. నా దివ్యగుణములు వినుచు నా గుణగానము చేయుచు నిత్యానంద మొందుచు భారత దేశమున తిరుగు వాడు నా పరమభక్తుడు. వాని జన్మము సుదుర్లభము కృతార్థమును. ఇట్టి భక్తులు భూమిని పవిత్ర మొనర్చి పిమ్మట నా దివ్యసన్నిధి చెందగలరు. కమలా! ఇట్లు నీ కోరిక దంతయును దెల్పితిని. ఇంక నీకేది రుచించునో దానిని చేయుము. పిదప గంగాదులు హరి యానతి నెఱవేర్పనగిరి. శ్రీహరి మాత్ర మచ్చోటనే సుఖాసనమందు చెలు వొందుచుండెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నేడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters