Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్దశో7ధ్యాయః.

నారదః : లక్ష్మీః సరస్వతీ గంగా తులసీ విశ్వపావనీ | ఏతా నారాయణసై#్యవ చతస్రశ్చ ప్రియా ఇతి. 1

గంగా జగామ వైకుంఠ మిదమేవ శ్రుతం మయా | కథం సా తస్య పత్నీ చ బభూవేతి చ న శ్రుతమ్‌. 2

శ్రీనారాయణః : గంగా జగామ వైకుంఠం తత్పశ్చా జ్జగతాం విధిః | గత్వోవాచ తయాసార్ధం ప్రణమ్య జగదీశ్వరమ్‌. 3

బ్రహ్మోవాచ : రాధా కృష్ణాంగ సంభూతా యాదేవీ ద్రవరూపిణీ | నవ¸° వన సంపన్నా సుశీలా సుందరీ వరా. 4

శుద్ధ సత్త్వ స్వరూపా చ క్రోధాహంకార వర్జితా | తదంగ సంభవా నా7 న్యం వృణోతీయం చ తం వినా. 5

తత్రాతి మానినీ రాధా సా చ తేజస్వినీ పరా | సముద్యుక్తా పాతు మిమాభీతే యంబుద్ధి పూర్వకమ్‌. 6

వివేశ చరణాంభోజే కృష్ణస్య పరమాత్మనః | సర్వత్ర గోలకం శుష్కం దృష్ట్యా7హ మగమంతదా. 7

గోలోకే యత్ర కృష్ణ శ్చ సర్వవృత్తాంత ప్రాప్తయే | సర్వాంతరాత్మా సర్వేషా జ్ఞాత్వా7భిప్రాయమేవచ. 8

బహి శ్చకార గంగాం చ పాదాంగుష్ఠనఖా గ్రతః | దత్త్వాసై#్య రాధికా మంత్రం పూరయిత్వా చ గోలకమ్‌. 9

ప్రణమ్య తాం చ రాధేశం గృహీత్వా7త్రాగమం ప్రభో | గాంధర్వేణ వివాహేన గృహామేమాం సురేశ్వరీమ్‌. 10

సురేశ్వరేషు రసికే రసికేయం సమాగతా | త్వం రత్నం పుంస్సు దేవేశ స్త్రీరత్నం స్త్రీష్వియంసతీ. 11

విదగ్ధాయా విదగ్ధేన సంగమో గుణవా న్బవేత్‌ | ఉపస్థితాం స్వయం కన్యాం నగృహ్ణాతీహయః పుమాన్‌. 12

పదునాల్గవ అధ్యాయము

శక్తి ప్రాదుర్బావము

నారదు డిట్లనెను : విశ్వపావనులగు లక్ష్మి సరస్వతి గంగ తులసి యను నల్వురును నారాయణుని ప్రియతములు గదా! గంగవైకుంఠ మేగెనని వింటిని. కాని యామె విష్ణున కెట్లు భార్య యయ్యెనో నేను వినలేదు. శ్రీనారాయణు డిట్లనెను : గంగవైకుంఠ మేగుచుండగ నామె వెనువెంట బ్రహ్మయు నేగి నారాయణునకు నమస్కరించి యిట్టనెను.

శ్రీరాధాకృష్ణుల దివ్యాంగములనుండి యుద్బవించిన ద్రవరూపిణి-గంగ; ఈమె నవ¸°వనవతి సుశీల సుందరి వర శుద్ధసత్వ స్వరూపిణి క్రోధాహంకారములు లేనిది; కృష్ణునంగాలనుండి పుట్టి యతని దక్కొరులను వరించననెను.

అపు డచ్చట నున్న తేజస్విని-పర-మానిని యగు రాధ యీమెను మొత్తము త్రాగివేయదలంపగ నీమె భయపడెను. అపుడు గంగ శ్రీకృష్ణుని చరణకమలములు శరణు చొచ్చెను. అపుడు గోలోకమంతయు నెండిపోయెను. నే నపు డచటి కేగితిని. జరిగిన సంగతి తెలియుటకు నేను గోలోక మేగితిని. అపుడు కృష్ణుడు సర్వాత రాత్మభావముతో నాలోని భావ మెఱించెను. కృష్ణుడు తన కాలి బొటనవ్రేలి కొనగోట గంగను వెడలించెను. ఆమెకు నేను రాధామంత్ర ముపదేశించితిని. అపుడు గంగ గోలోక మంతట నిండెను. ఓ ప్రభూ! నే నపుడు రాధాపతికి నమస్కరించి సురేశ్వరియగు గంగను గొని యిచటికి వచ్చితిని. ఈమెను గాంధర్వ వివాహమున చేపట్టుము. సురేశులందు నీవు రసికావతంసుడవు. ఈమెయును సరసహృదయ. నీవు పురు షోత్తముడవు. ఈమెయును స్త్రీ జాతిరత్నము. సరియైన రసికురాలు రసికునితో గూడిన నెంతయో సుగుణము. చెంతకు చేరిన కన్నియును చేపట్టవలయును.

తె విహాయ మహాలక్ష్మీ రుష్టాయాతిన సంశయః | యో భ##వేత్పండితః సో7పి ప్రకృతింనా వమన్యతే. 13

సర్వే ప్రాకృతికాః పుంసః కామిన్యః ప్రకృతేః కళాః | త్వమేవ భగవన్నాథో నిర్గుణః ప్రకృతేః పరః. 14

అర్ధాంగం ద్విభుజః కృష్ణో యోర్ధాంగేన చతుర్భుజం | కృష్ణవామాంగ సంభూతా బభూవరాధికా పురా. 15

దక్షిణాంశః స్వయం సాచ వామాంశః కమలా తథా | తేనేయం త్వాం వృణోత్యేవ యత స్త్వద్దే హసంభవా. 16

ఏకాంగ చైవ స్త్రీ పుంసోర్యథా ప్రకృతి పూరుషౌ | ఇత్యేవ ముక్త్వా ధాతా తాం తం సమర్ప్య జగామసః. 17

గాంధర్వేణ వివాహేన తాం జగ్రాహ హరిః స్వయమ్‌ | నారాయణః కరం ధృత్వా పుష్పచందన చర్చితమ్‌. 18

రేమే రమాపతి స్తత్ర గంగయా సహితో ముదా | గంగా పృథ్వీం గతాయాసా స్వస్థానం పునరాగతా. 19

నిర్గతా విష్ణుపాదాబ్జాత్తేన విష్ణుపదీతి చ | మూర్చాం సంప్రాపసాదేవీ నవసంగమలీలయా. 20

రసికా సుఖసంభోగా ద్రసికేశ్వరసంయితా | తాం దృష్ట్వా దుఃఖితా వాణీ పద్మయా వర్జితా7పిచ. 21

నిత్యమీర్ష్యతి యంవాణీ న చ గంగా సరస్వతీమ్‌ | గంగా శశాప కోపేన భారతే చ హరి ప్రియా. 22

గంగయా సహ తసై#్యవ తిస్రోభార్యా రమాపతేః | సార్ధం తులస్యా పశ్చా చ్చ చతస్రశ్చాభవన్మునే. 23

ఇతి శ్రీదేవీభాగవతే మహపురాణ నవమస్కంధే చతుర్దశో7ధ్యాయః.

లేనిచో వానిని వదలి మహాలక్ష్మి కోపముతో వెళ్ళిపోవును. పండితుడైన వాడెప్పుడును ప్రకృతి నవమానింపడు. పురుషు లెల్లరును ప్రకృతివలన జనియించినవారే గదా! ఇక స్త్రీలు ప్రకృతి కళ గలవారే గద! నీవు నిర్గుణుడవు భగవానుడవు ప్రకృతికంటెపరుడవు. కృష్ణుని సగభాగము ద్విభుజుడుగ తక్కిన సగము చతురుజుడుగ నయ్యెను. మున్ను కృష్ణుని యెడమ భాగమునుండి రాధ యుద్బవించెను. కృష్ణుడు దక్షిణాంశముగాగ లక్ష్మి యతని వామాంశకళ యయ్యెను. అటులే గంగయును నీ దేహమునుండి పుట్టెను. నీవు కృష్ణునంశజుడవు. అందుచే గంగ నిన్ను వరించినది. గ్రహింపుము. స్త్రీ పురుషులవలె ప్రకృతి పురుషులును భేదము లేనివారే. అని బ్రహ్మ గంగను. నారాయణునకు సమర్పించి తన దారిని తానేగెను. అపుడు హరి స్వయముగ గాంధర్వవిధితో పుష్పచందనములతో నొప్పుచున్న గంగను జేపట్టెను. రమాపతి గంగతోగూడి యానంద తరంగముల నోలలాడెను. గంగ భూమి మీది కేగి మరల తనచోటు తాను చేరుకొనెను. విష్ణువు పదపద్మములనుండి వెడలుటవలన గంగను విష్ణు పది యందురు. ఆ దివ్య తరంగిణి హరితోడి తియ్యని సరసకేళీ విలాసములకు మూర్ఛవోయెను. ఇట్లు రసికురాలగు గంగ రసికశేఖరుని గలిసి వీడని బంధాలలో సుఖమనుభవించుట చూచి సరస్వతి యోర్వలేకపోయెను. లక్ష్మి సరస్వతి కెంతయో నచ్చ చెప్పినది. ప్రతిదినము సరస్వతి గంగపై నసూయ పూనును. గంగ మాత్రము సరస్వతిపై అసూయ పూనలేదు. కాని యొకసారి కోపముతో భారతదేశమున బుట్టుమని గంగ సరస్వతిని శపించెను. నారదా ! రమాపతికి లక్ష్మి సరస్తి గంగ మువ్వురూ భార్యలు తర్వాత తులసియు వచ్చెను. ఈమెతో గలిసి నారాయణునకు నల్గురు భార్యలు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమున నవమ స్కంధమున పదునాల్గవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters