Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టమోధ్యాయః

జనమేజయః సంశయోయం మహాన్‌ బ్రహ్మ న్వర్తతే మమ మానసే | బ్రహ్మలోకం గతో రాజా రేవతీ సంయుతః స్వయమ్‌. 1

మయా పూర్వం శ్రుతం కృత్స్నం బ్రాహ్మణభ్యః కథాంతరే |

బ్రాహ్మణో బ్రహ్మవి చ్ఛాంతో బ్రహ్మలోక మవాప్నుయాత్‌. 2

రాజా కథం గత స్తత్ర రేవతీ సంయుతః స్వయమ్‌ | సత్యలోకేతి దుష్పా భూర్లోకాదితి సంశయః. 3

మృతః స్వర్గ మావాప్నోతి సర్వశాస్త్రే నిర్ణయః | ''మానుషేణ తు దేహేన బ్రహ్మలోకే గతిః కథమ్‌''

స్వర్గా త్పునః కథం లోకే మానుషే జాయతే గతిః. 4

ఏతన్మే సంశయం విద్యం శ్చేత్తు మర్హసి సాంప్రతమ్‌ | యథా రాజా గత స్తత్ర ప్రష్టుకామః ప్రజాపతిమ్‌. 5

వ్యాసః : మేరో స్తు శిఖరే రాజ న్సర్వే లోకాః ప్రతిష్ఠితాః | ఇంద్రలోకో వహ్నిలోకో యా చ సంయమినీ పురీ.

తథైవ సత్యలోకశ్చకైలాస శ్చ తథా పునః | వైకుంఠ శ్చ పున స్తత్ర వైష్ణవం పద ముచ్యతే. 7

యథార్జునః శక్రలోకే గతః పార్థో ధనుర్దరః | పంచవర్షాణి కౌంతేయః స్థిత స్తత్ర సురాలయే. 8

మానుషేణౖవ దేహేన వాసవస్య చ సన్నిధౌ | తథైవాన్యేపి భూపాలాః కకుత్థ్స ప్రముఖాః కిల. 9

స్వర్లో కగతయః పశ్చా ద్దైత్యా శ్చాపి మహాబలాః | జిత్యేంద్రసదనం ప్రావ్య సంస్థితా స్తత్ర కామతః. 10

మహాభిషః పురా రాజా బ్రహ్మలోకం గతః స్వరాట్‌ | ఆగచ్ఛంతీం నృపో గంగా మపశ్య చ్చాతి సుందరీమ్‌. 11

ఎనిమిదవ అధ్యాయము

రైవతమను వృత్తాంతము

జనమేజయ డిట్లనెను: ఓ వ్యాసమహర్షీ ! రేవతుడు రేవతిని తీసికొని బ్రహ్మలోక మేగెనను విషయము నా మది కచ్చెరువు గొలుపుచున్నది. నేను మున్ను బ్రాహ్మణుల సభలో కథాప్రసంగమున నొక మాట వింటిని. ఏమన బ్రహ్మవిదుడు శాంతుడునగు బ్రాహ్మణుడు బ్రహ్మలోకము వెళ్ళగలడు. భూలోకవాసులకు బ్రహ్మలోకము చేరరానిది. మఱి రేవతుడు రేవతిని తీసికొని స్వయముగ నెట్లు బ్రహ్మలోకమేగ గల్గెను? చచ్చినవాడు స్వర్గమేగునని సర్వశాస్త్రములు తెల్పుచున్నవి. ఈ మానవదేహముతో బ్రహ్మలోకము చేరుటెట్లు సాధ్యము? ఆ స్వర్గమునుండి మానవలోకమునకు తిరిగి యెట్లు రావచ్చును? ఓ విద్వాంసుడా! రేవతుడు బ్రహ్మనుజేరి ప్రశ్నించదలచి యెట్లు వెళ్ళను. నా యీ సంశయ మిపుడు దీర్చుటకు నీవు సమర్థు డవు. అన వ్యాసు డిట్లనెను: ఓ రాజా! సుమేరు పర్వత శిఖరములందు సర్వలోకములు నెలకొనియున్నవి. ఇవి ఇంద్ర లోకము; అగ్ని లోకము; యమలోకము; సత్యలోకము; కైలాసము; వైష్ణవనిలయమగు వైకుంఠధామము. పూర్వము దనుర్ధ రుడు పార్థుడునైన అర్జునుడు దేవేంద్ర నగరమున నైదు సంవత్సరములు నివసించెను. అపుడింద్రుని సన్నిధిలో నర్జునుడు మానవ శరీరముతో నుండెను. అర్జునునివలె కుకుత్థ్సుడు మొదలుగాగల రాజులు స్వర్గ మేగిరి. పిదప మహాబలశాలురగు దానవులును స్వర్గసీమను చేరిరి. వారింద్రనగరము జయించి సుఖముండిరి. మునుపు మహాభిషుడను మహారాజు బ్రహ్మ లోకమునకు వెళ్ళుచు త్రోవలో నతడు గంగాసుందరిని చూచెను.

వాయునాంబరమస్యా స్తుదై వాదపహృతం నృప | కిం చి న్నగ్నా నృపేణాథ దృష్ట్వాహ సుందరీ తథా. 12

స్మితం చకార కామార్తః సాచ కించిజ్జహాసవై | బ్రహ్మణా తౌ తదా దృష్టౌ శప్తౌయాతౌ వసుంధరామ్‌. 13

వైకుంఠేపి సురాః సర్వే పీడితా దైత్వ దానవైః | గత్వా హరిం జగన్నాధమస్తువ న్కమలాపతిమ్‌. 14

సందేహో నాత్ర కర్తవ్యః సర్వథా నృపసత్తమ | గమ్యా సర్వేపి లోకాః స్యుర్మానవానాం నరాధిప. 15

అవశ్యం కృతపుణ్యానాం తపసానాం నరాధిప | పుణ్య సద్బావ ఏవాత్ర గమనే కారణం నృప. 16

తథైవ యజమానానాం భావినాత్మనామ్‌ | జనమేజయః: రేవతో రేవతీంకన్యాం గృహీత్వాచారులోచనమ్‌. 17

బ్రహ్మలోకం గతః పశ్చాత్కిం కృతంతేన భూభుజా | బ్రహ్మణా కిం సమాదిష్టం కసై#్మదత్తా సుతా పునః. 18

అంతలో దైవవశమున కమ్మనిపిల్లగాలుల కామె మేనిమీద వస్త్రము కొంత తొలగెను. అపుడామె సగము దిగంబరగ నుండగ రాజదేవైపు ఱప్పవాల్పకచూచెను. ఆ రాజు వలరాజు బాణములకు తాళ##లే కామె వాడిచూపుల నెదుర్కొనుచు చిర్నవ్వు నవ్వెను. ఆ సుందరియు మరల చిర్నగవు నవ్వెను. ఈ యిర్వురి నవ్వులను బ్రహ్మచూచి మీరు నేలపై బుట్టుడని శపించెను. ఎల్ల దేవతలును దైత్య దానవులచేత పీడింపబడి కమలాపతియగు విష్ణునిజేరి సంస్తుతింతురు. రాజా విజ్ఞులగు మానవు లెల్లలోకముల కేగవచ్చును. ఈ విషయముగూర్చి ఆవంతయు సందేహింప బనిలేదు. సరపతీ! పుణ్యాత్ములు తాపసోత్తములు అటకు తప్పక వెళ్ళగలరు. వాని పుణ్య సత్యములు వారి బాటలో వారికి తోడుగ నుండును. అట్లే యజ్ఞము నిర్వర్తించు మహితాత్ములగు యజమానులు వెళ్లగలరు అనెను. జనమేజయు డిట్లనెను: అట్లు తన పుత్రియగు రేవతినిగొని వెళ్లిన ఆ రాజు బ్రహ్మలోకము జేరిన పిమ్మట యేమి చేసెను? బ్రహ్మ యతని కేమని పలికెను? రేవతి నెవరి కిచ్చిరి? విప్రవర్యా: అన్ని విషయములు నాకు వివరముగ దెల్పుము.

వ్యాసః : తత్సర్వం విస్తరా ద్ర్బహ్మన్‌ కథయత్వం మమాధునా | నిశామయ మహీపాల రాజా రేవతకః కిల. 19

పుత్ర్యా వరం పరిప్రష్టుం బ్రహ్మలోకం గతోయదా | ఆవర్తమానే గాంధర్వే స్థితో లబ్దక్షణః క్షణమ్‌. 20

శృణ్వన్నతృప్యత్‌ హృష్టాత్మా సభాయాంతు సకన్యకః | సమాప్తే తత్ర గాంధర్వే ప్రణమ్య పరమేశ్వరమ్‌. 21

దర్శయిత్వా సుతాం తసై#్మ స్వాభిప్రాయం న్యవేదయత్‌ | వరం కథయ దేవేశ కన్యేయం మమపుత్రికా. 22

దేయా కసై#్మమయా బ్రహ్మన్‌ ప్రష్టుంత్వాం సుముపాగతః | బహవో రాజపుత్రా మే వీక్షితాః కులసంభవాః. 23

కస్మిం శ్చిన్మే మనః కామం నోపతిష్ఠతి చంచలమ్‌ | తస్మాత్త్వాం దేవదేవేశ ప్రష్టుమత్రా గతోస్మ్యహమ్‌. 24

తదాజ్ఞాపయ సర్వజ్ఞ యోగ్యం రాజసుతం వరమ్‌ | కులీనం బలవంతం చ సర్వలక్షణసంయుతమ్‌. 25

దాతారం ధర్మశీలం చ రాజపుత్రం సమాదిశ | తదాకర్ణ్య జగత్కర్తా వచనం నృపతే స్తదా. 26

తమువాచ హసన్వాక్యందృష్ట్వా కాలస్యపర్యయమ్‌ | రాజపుత్రా స్త్వయారాజ న్వరాయేహృదేయేకృతాః. 27

గ్రస్తాః కాలేన తే సర్వే సపితృపౌ త్రబాంధవాః | సప్తవింశతియోద్వైవ ద్వాపర స్తు ప్రవర్తతే. 28

వంశజాస్తే మృతాః సర్వే పురీ దైత్వై రివలుంఠితా | సోమవంశోద్బవ స్తత్ర రాజా రాజ్యం ప్రశాస్తిహి. 29

ఉగ్రసేన ఇతి ఖ్యాతో మథురాధిపతిః కిల | యయాతి వంశ సంభూతో రాజా మాథురమండలే. 30

వ్యాసు డిట్లనియెను : రాజా! వినుము. రేవతుడను రాజు గలడు గదా : అతడు తన పుత్రికి తగిన వరుని తెలియు టకు బ్రహ్మలోక మేగెను. అత్తఱి నచట సంగీతసభ సాగుచుండె. అతడానందముతో నట నుండెను. అతడు తన కన్యతో సభయందు జరుగుచున్న నాదగానమాధురి చెవులార గ్రోలుచు సంతోషించెను. అది పూర్తికాగా బ్రహ్మకు నమస్కరించెను. రేవతుడు తన కూతును బ్రహ్మకు జూపి యిట్లు పలికెను. ఓ దేవపతీ! ఈమె నా కుమార్తె. ఈమెకు తగిన వరుడెవడో తెల్పుము. ఈమె నే రాజవరున కీయవలయునో నిన్నడుగ వచ్చితిని. ఎందఱో కులశీలములుగల రాజపుత్రులను చూచితిని. వారిలో నొక్కడును నా మనస్సునకు నచ్చినవాడు లేడు. అందువలన దేవదేవా! నిన్నడుగుట కిటకు వచ్చితిని. సర్వజ్ఞా: యోగ్యుడు కులీనుడు బలశాలి సర్వలక్షణ సంయుతుడునైన రాకుమారిని వరునిగ తెలుపుము. దాత ధర్మశీలుడునగు రాజ పుత్రుని నాకు తెలుపుము. అను రాజుమాటలకు జగత్కర్తయగు బ్రహ్మ వినెను. బ్రహ్మ కాలవైపరీత్యమునకు నవ్వుచు నిట్లు పలికెను. రాజా! నీ పుత్త్రికి రాజపుత్రులను వరులుగ కొందఱి నాలోచించితివి. ఇపుడు వారెల్లరును వారి తండ్రితాత లును వారి బంధువు లందఱును కాలగర్బముల గలిసిరి. ఇపు డిరువదియేడవ ద్వాపరము నడచుచున్నది. ఇపుడు నీ వంశ జులు చనిపోయిరి. నీ పురము దానవులచేత జిక్కెను. అచట నిపుడు చంద్రవంశరాజు రాజ్య మేలుచున్నాడు. అతడు యయాతి వంశజుడు. మధురానగరాధిపతి ఉగ్రసేనుడన పేరు గాంచినవాడు.

ఉగ్రసేనాత్మజః కంసః సురద్వేషీ మహాబలః | దైత్యాంశః పితరం సోపి కారాగారం న్యవేశయత్‌. 31

స్వయం రాజ్యం చకారాసౌ నృపాణాం మదగర్వితః | మేదినీ చాతి భారార్తా బ్రహ్మాణం శరణంగతా. 32

దుష్టరాజన్య సైన్యానాం భారేణాతి సమాకులా | అంశావతరణం తత్ర గదితం సురసత్తమైః. 33

వాసుదేవః సముత్పన్నః కృష్ణః కమలలోచనః | దేవక్యాం దేవరూపిణ్యాం యోసౌనారాయణో మునిః. 34

తప శ్చచార దుఃసాధ్యం ధర్మపుత్రః సనాతనః | గంగాతీరే నరసుఖః పుణ్య బదరికాశ్రమే. 35

సోవతీర్ణో యదుకులే వాసుదేవోపి విశ్రతః | తేనాసౌ నిహతః పాపః కంసః కృష్ణేన సత్తమ. 36

ఉగ్రసేనాయ రాజ్యం వైదత్తం హత్వాఖలం సుతమ్‌ | కంసస్య శ్వశురః పాపో జరాసం ధో మహాబలః. 37

ఆగత్య మథురాం క్రోధా చ్చకార సంగరం ముదా | కృష్ణేనాసౌ జితః సంఖ్యే జరానంధో మహాబలః : 38

ప్రేషయామాస యుద్దాయ సబలం యవనం తతః | శ్రుత్వా೭೭యాంతం మహాశూరం ససైన్యం యవనాధిపమ్‌.

''కృష్ణ స్తు మథురాం త్యక్త్వాపురీం ద్వారవతీమగాత్‌ | ప్రభగ్నాం తాం పురీం కృష్ణః శిల్పిభిః సహ సంగతైః.

కారయామాస దుర్గాఢ్యాం హట్టశాలా విమం డితామ్‌ | జీర్ణోద్ధారం పుసః కృత్వావాసుదేవః ప్రతాపవాన్‌. ఉగ్రసేనం చ రాజానం చకారవశ వర్తినమ్‌''

యాదవాన్‌ స్థాపయామాస ద్వారవత్యాం యదూత్తమః | వాసుదేవ స్తు తత్రాద్య వర్తతే బాంధవైః సహ. 40

ఉగ్రసేనుని కొడుకు కంసుడు. అతడు దేవతలను ద్వేషించువాడు. బలశాలి-దైత్వాంశజుడు. తన తండ్రినే కారాగారమున బంధించెను. అతడు మదగర్వముతో నెల్లరాజుల జయించి పాలించుచున్నాడు. భారమునకు తాళ##లేక భూ మాత బ్రహ్మను శరణు వేడెను. క్రూర రాజసేనల భారముతో భూమి క్రుంగాపోయెను. దేవత లెల్లరును తమ తమ యంశములతో నవతరించిరి. కమలలోచనుడు వాసుదేవుడు నగు కృష్ణుడు దేవరూపిణియగు దేవకియం దుద్బవించెను. కృష్ణుడు నారాయణ మున్యంశమున జనించినవాడు. తొల్లి సనాతనుడు ధర్మపుత్రుడు నరసఖుడునగు నారాయణుడు గంగాతీరమున పావన బదరికాశ్రమందు వాసుదేవుడని శ్రీకృష్ణుడని ప్రసిద్ది గాంచుట కవతరించి పాపాత్ముడగు కంసుని చంపెను. అట్లు కంసుని చంపి యతని రాజ్యమును కృష్ణు డు గ్రసేనున కిచ్చెను. కంసుని మామ జరాసంధుడు - బలశాలి - పాపాత్ముడు. అతడు కోపముతో మధురపై దండెత్తి పోరు సాగించెను. కాని మహాబలుడగు జరాసంధుడు కృష్ణుని చేతిలో వోడెను. జరా సంధు డపుడు మహాబలుడగు కాలయవనుని కృష్ణునిపై యుద్ధమునకు పురికొల్పెను. శూరుడగు యవనపతి సైన్యముతో వచ్చుట కృష్ణుడు వినెను. అంత కృష్ణుడు మధురవదలి ద్వారకకేగెను. ఆ శిథిలపురమును శిల్పులచేత నిర్మింపజేసి జీర్ణమైన నగరమును పునరుద్ధరించెను. దానికి తన వశమందున్న యుగ్రసేనుని రాజుగ చేసెను. యాదవులనందఱను ద్వారకలో నివసింపజేసెను. అచట నిపుడు శ్రీకృష్ణుడు తన బంధుమిత్రులతో నివసించుచున్నాడు.

తస్యాగ్రజః స విఖ్యాతో బలదేవో హలాయుధః | శేషాంశో ముసలీ వీరో వరోస్తు తవ సమ్మతః. 41

సంకర్షణాయ దేహ్యాశు కన్యాం కమలలోచనామ్‌ | రేవతీం బలభద్రాయ వివాహవిధినా తతః. 42

దత్వా పుత్రీం నృపశ్రేష్ఠ గచ్ఛత్వం బదరికాశ్రమమ్‌ | తపస్తప్తుం సురారామం పావనం కామదం నృణామ్‌. 43

ఇతి రాజా సమాదిష్టో బ్రహ్మణా పద్మయోనినా | జగామ తరసా రాజ న్ద్వారకాం కన్యయాన్వితః. 44

దదౌతాం బలదేవాయ కన్యాం వై శుభలక్షణామ్‌ | తత స్తప్త్వా తప స్తీవ్రం నృపతిః కాలపర్యయే. 45

జగామ త్రిదశావాయ త్యక్త్వా దేహం సరిత్త టే | రాజోవాచ : భగవన్మహదాశ్చర్యం భవతాసముదాహృతమ్‌. 46

రేవతస్తు స్థిత స్తత్ర బ్రహ్మలోకే సుతార్థతః | యుగానాం తు గతం తత్ర శతమష్టోత్తరం కిల. 47

కన్యా వృద్ధా న సంజాతా రాజావాతితరాంను కిమ్‌ | ఏతావంతం తథా కాల మాయుః పూర్ణం తయోః కథమ్‌. 48

కృష్ణుని యన్న బలదేవుడు. అతడు శేషాంశవలన నవతరించినవాడు. హలాయుధుడు ; ముసలి ; వీరుడు. అతడు నీ కొమరి తకన్ని విధముల తగినవరుడు. కమలలోచనయగు నీ కన్యను బలరామున కిచ్చి యథావిధిగ వివాహ మంగళ కార్యము జరిపించుము. రాజా! అట్లు నీ కూతును కన్యాదానము చేసిన పిమ్మట నీవు సురారామము పావనము జనుల కోర్కెలు దీర్చునది-యగు బదరికాశ్రమమున తన మొనరించుట కరుగుము. అని పద్మయోనియగు బ్రహ్మ పలుకగా రాజు తన కన్యను వెంటగొని వేగమే ద్వారకను జేరెను. శుభలక్షణయగు తన కన్నియను బలదేవున కొసంగి పిదప తీవ్ర తప మొనరింప నడవుల కేగెను. అతడు నదీతీరమున మేను చాలించి స్వర్గము చేరెను. అన విని రాజిట్లనెను : ఓ వ్యాసమునీ! నీ వాశ్చర్యకరమైన విషయము వెల్లడించితివి. రేవతుడు బ్రహ్మలోకమున తన కూతుతో నేగి యట నూటయెనిమిదియుగము లుండె నంటివి. అంతటి దీర్ఘకాలమునగూడ రేవతుడుగాని రేవతిగాని ముసలివారు కాలేదా? ఇంతకాలము వారి కాయువుతీర కెట్లుండున ?.

న జరా క్షుత్పిపా సావా నమృత్యుర్న భయం పునః | న తు గ్లానిః ప్రభవతి బ్రహ్మలోకే సదానఘ. 49

మేరుం గతస్య శర్యాతేః సంతతీ రాక్షస్హైరతై | గతా కుశస్థలీం త్వక్త్వా భయ భీతా ఇతస్తతః. 50

మనో శ్చ క్షువతః పుత్ర ఉత్పన్నో వీర్య వత్తరః | ఇక్ష్వాకు రితి విఖ్యాతః సూర్యవంశకరస్తు సః. 51

వంశార్థం తప ఆతిష్ఠ ద్దేవీం ధ్యాత్వా నిరంతరమ్‌ | నారదస్యోపదేశేన ప్రాప్య దీక్షా మనుత్తమామ్‌. 52

తస్య పుత్రశతం రాజన్నిక్ష్వాకోరితి విశ్రుతమ్‌ | వికుక్షిః ప్రథమస్తేషాం బలవీర్య సమన్వితః. 53

అయోధ్యాయాం స్థితో రాజా ఇక్ష్వాకురితి విశ్రుతః | శకుని ప్రముఖాః పుత్రాః పంచాశద్బలవత్తరాః. 54

ఉత్తరాపథదేశస్య రక్షితారః కృతాః కిల | దక్షిణస్యాం తథా రాజన్నా దిష్టాస్తేనతేసుతాః. 55

చత్వారింశ త్తథాష్టౌ చ రక్షణార్థం మహాత్మనా | అన్యౌ ద్వౌ సంస్థితౌ పార్మ్వే సేవార్థం తస్యభూపతే. 56

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధేష్టమోధ్యాయః.

వ్యాసు డిట్లనెను: అనఘా: బ్రహ్మలోకమునందు సతతము ముదిమి ఆకలిదప్పులు చావుభయము నిందమున్నగు దొసగులు మచ్చునకైన లేవు. శర్యాతి స్వర్గమున కేగిన పిమ్మట నతని సంతానము రాక్షసులచే పీడింపబడి కుశస్తలి వదిలి భీతితో చెల్లాచెదరయ్యెను. వైవస్వతమనువు తుమ్మునుండి వీర్యవంతడగు ఇక్ష్వాకు మహారాజు జన్మించి ప్రసిద్ధి గాంచెను. అతడు సూర్యకులదీపకుడు. అతడు వంశోద్ధారమునకు నారదునివలన దీక్షబొంది నిరంతరముగ హ్రీంమయియగు శ్రీదేవిని ధ్యానించి తపించెను. అతనికి నూర్గురు కొడుకులు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు-అతడు బలవీర్యసంయుతుడు. ఇక్ష్వాకు డయోధ్య రాజధానిగ పాలించి వాసి కెక్కెను. అతనికి శకుని మున్నగు నేబదిమంది కొడుకులు పుట్టిరి. రాజా! అతడు వారిలో కొందఱి నుత్తరాపథమునకు కొందఱిని దక్షిణాపథమునకు రాజులుగ చేసెను. ఆ యేబదిమందిలో నలువది యెనిమిది మందిని పాలకులుగ నియమించి తక్కిన యిద్దఱిని తన పరిచర్యల కుంచుకొనెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి మహాపురాణమున సప్తమ స్కంధమున అష్టమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters