Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తదశో7ధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : ధర్మధ్వజస్య పత్నీచ మాధవీతిచ విశ్రుతా | నృపేణసార్ధ సా77రామే రేమేచ గంధమాదనే. 1

శయ్యాం రతికరీం కృత్వా పుష్పచందనచర్చితామ్‌ | చందనాలి ప్తసర్వాంగీం పుష్పచందన వాయునా. 2

స్త్రీరత్నమతి చార్వంగీ రత్నభూషణభూషితా | కాముకీ రసికా సృష్టా రసికేన చ సంయుతా. 3

సురతేవిరతి ర్నాస్తి తయోః సురతివిజ్ఞయోః | గతం దైవం వర్షశతం నజ్ఞాతం చదివానిశమ్‌. 4

తతో రాజామతిం ప్రాప్య సురతాద్విరరామ చ | కాముకీ సుందరీ కిం చిన్నచ తృప్తిం జగామ సా. 5

దధార గర్బం సాసద్యో దేవదబ్దశతం సతీ | శ్రీగర్బా శ్రీయుతా సా చ సంబభూవ దినే దినే. 6

శుభే క్షణ శుభదినే శుభయోగే చ సంయుతే | శుభలగ్నే శుభాంశే చ శుభస్వామి గ్రహాన్వితే. 7

కార్తికీ పూర్ణిమాయాంతు సితవారే చ పాద్మజ | సుషావసా చ పద్మాంశాం పద్మినీం తాం మనోహరామ్‌. 8

శరత్పార్వణ చంద్రాస్యాం శరత్పంకజలోచనామ్‌ | పక్వబింబాధరోష్ఠీం చ పశ్యంతీం సస్మితాంగృహమ్‌. 9

హస్తపాదతలారక్తాం నిమ్ననాభిం మనోహరామ్‌ | తదధస్త్రీవళీయుక్తాం నితంబయుగ వర్తులామ్‌. 10

శీతే సుఖోష్ణసర్వాంగీం గ్రీష్మే చ సుఖ శీతలామ్‌ | శ్యామాం సుకేశీం రుచిరాం న్యగ్రోధ పరిమండలామ్‌. 11

పీత చంపకవర్ణాభాం సుందరీష్వేవ సుందరీమ్‌ | నరా నార్య శ్చ తాం దృష్ట్వా తులనాం దాతు మక్షమాః. 12

పదునేడవ అధ్యాయము

శక్తి ప్రాదుర్పావము-తులస్యుపాఖ్యానము

శ్రీనారాయణు డిట్లనెను : ఓయి నారదా! ధర్మధ్వజుని భార్య మాధవి యన పేరొందినది. ఆమె గంధమాధన గిరిపై పూల తోటలలో రాజును గూడి స్వేచ్ఛగ విహరించెను. మాధవి చందనముతో పూలతో గమ గుమలాడు మెత్తని సెజ్జ యమర్చినది; ఆమె యును మేని నిండ చందనము పూసికొనెను. పూల మంచి గంధముల మీది గాలి సోకి యామె మఱింత శోభిల్లుచుండెను. రత్న భూషణ భూషిత, లావణ్యవతి; రసికురా స్త్రీ రత్నము-కాముకి యగు మాధవిని సృజించి యామెకు రసిక హృదయుడగు రాజుతో తగులమును బ్రహ్మనేర్పుతో గూర్చెను. వారిర్వురును శృంగార కళావిశారదులే ఎంతకును విడిపోనివారై రాత్రింబగళ్లు తెలియక వారు వలపు కౌగిళ్ళలో నానంద సీమలు చేరిరి. అప్పటికి రాజు తెలివొంది సురతి చాలించెను. కాని మాధవికి మాత్ర మింకను తృప్తి గలుగలేదు. ఐననామె గర్బవతియై నూఱండ్ల గర్బము మోసెను. ఆమె గర్బమున దైవ యోగమున లక్ష్మ్యంశ ముండుట వలన నామె దిన దిన వర్ధమానగర్బ శ్రీతో పెంపారుచుండెను. ఒక శుభదినము శుభయోగము శుభలగ్నము శుభాంశము శుభగ్రహములు శుభలక్షణములుగల సమయమందున కార్తికశుద్ధ పూర్ణిమ శుక్రవారమునాడు పద్మాంశగల సుమనోహరమైన పద్మినిని మాధవి ప్రసవించెను. ఆ బాలామణి శారద పూర్ణచంద్రముఖి; శారద కమలనయన; పండిన దొండపండు వంటి పెదవులు గలది; ఆమె పుట్టగనే నవ్వుచు పురుటింటిని చూచెను. ఆమె కర పాదతలము లెఱుపుగను బొడ్డులోతుగ నుండెను. పొట్టపై త్రివళు లుండెను. పిఱుదులు గుండ్రముగ నుండెను. ఆమె కోమ లింగములు చలికాలమున నునువెచ్చగను వేసవికాలమున చల్లగను కేశములు మఱ్ఱియూడలవలె దీర్ఘముగనుండెను. ఆమె శరీర కాంతి నిగనిగలాడు చంపకమువలె నుండెను. ఆమె సుందరీమణి. స్త్రీ పురుషు లామెను చూచి యామె నెవరితోడను సరిపోల్చ లేకుండిరి.

తేననామ్నా చ తులసీం తాం వదంతి మనీషిణః | సా చ భూమిష్ఠ మాత్రేణ యోగ్యా స్త్రీ ప్రకృతిర్యథా. 13

సర్వైర్నిషిద్ధా తపసే జగామ బదరీవనమ్‌ | తత్ర దేవాబ్దలక్షంచ చకారపరమంతపః. 14

మమనారాయణః స్వామీభవితేతి చనిశ్చితా | గ్రీష్మే పంచతపాః శీతే తోయవస్త్రాచ ప్రావృషి. 15

ఆసనస్థా వృష్టిధారాం సహంతీతి దివానిశమ్‌ | విశంత్సహస్ర వర్షంచ ఫలతోయాశనా చసా. 16

త్రింశత్సహస్ర వర్షం చ పత్రాహారా తపస్వినీ | చత్వారింస త్సహస్రాబ్దం వాయ్వాహారా కృశోదరీ. 17

తతో దశ సహస్రాబ్దం నిరాహారా బభూవ సా | నిర్లక్ష్యాం చైక పాదస్థాం దృష్ట్వాతాంకమలోద్బవః. 18

సమాయ¸° వరం దాతుం పరం బదరికా శ్రమమ్‌ | చతుర్ముఖం చ సా దృష్ట్వా ననామ హంసవాహనమ్‌. 19

తామువాచ జగత్కర్తా విధాతా జగతామపి | బ్రహ్మోవాచ : వరం వృణీష్వ తులసి యత్తే మనసి వాం ఛితమ్‌. 20

హరిభక్తిం హరేర్దాస్య మజరా మరతా మపి | తులస్యవాచ : శృణు తాత ప్రవక్ష్యామి యన్మే మనసి వాంఛితమ్‌. 21

సర్వజ్ఞస్యాపి పురతః కాలజ్ఞా మమ సాంప్రతమ్‌ | అహం తు తులసీ గోపీ గోలోకే7హంస్థితా పురా. 22

కృష్ణప్రియా కింకరీ చ తదంశా తత్సఖీ ప్రియా | గోవిందరతి సంభుక్తా మతృప్తాం మాం చ మూర్ఛితామ్‌. 23

రాసేశ్వరీ స మాగత్య దదర్శరాస మండలే | గోవిందం భర్త్స యామాస మాం శశాప రుషా7న్వితా. 24

అందుచే పండితు లామెకు తులసియను సార్థకనామ మిడిరి. ఆమె పుట్టగనే యోగ్యురాలగు స్త్రీ ప్రకృతిగ నలరారెను. ఎందఱు వారించినను విన కామె బదరికావనమున కేగి లక్ష దివ్య వత్సరములు తప మాచరించెను. శ్రీమన్నారాయణుడే నాకు పతి గావలయునని యామె గ్రీష్మమున పంచాగ్నుల మధ్యను చలికాలమున తడిబట్టలు కట్టుకొనియును వానకాలమున ఆరుబైట కూర్చొనియును వాన ధారలకు రేబవళ్ళు తట్టుకొనుచు నుండెను. ఒక యిరువది వేలేండ్లు తినుచు గడపెను. ఆ తపస్విని ముప్పది వేలేండ్లు గాలి యాహారముగనుండి కడు కృశించెను. అటు పిమ్మట పదివేలేం డ్లాహారము తీసికొనక జీవించెను. ఇట్టు లే దిక్కులే కొంటికాలిమీద తపము చేయుచుండగ బ్రహ్మ చూచెను. బ్రహ్మ వర మొసంగుటకు బదరి కాశ్రమమునకు వెళ్ళెను ఆమె హంసవాహనుడు చతుర్ముఖుడునగు బ్రహ్మకు నమస్కరించెను. అపుడు జగత్తుల సృష్టికర్త యామెతో నిట్లనియెను. తులసీ ! నీ మనసులోని కోరికను కోరుకొనుము. హరి భక్తి కావలయునా? హరిసేవ కావలయునా? జన్మమరణములేని స్థితి కావలయునా కోరుకొనుము. తులసి యిట్లనెను: ఓ తండ్రీ! నా మనసులోని కోర్కె వినుము. నీవు సర్వజ్ఞుడవు. నీ ముందు నాకు సిగ్గెందులకు? నేను పూర్వము గోలోకమందలి తులసి యను గోపికను. నేను కృష్ణుని ప్రియురాలను; కృష్ణుని సేవకురాలను; కృష్ణాంశమను; కృష్ణును చెలికత్తెను గోవిందునితోడి రతి క్రీడలలో నెంత సుఖించిననునాకు తృప్తి గల్గలేదు. ఒకనాడు రాసమండలమందున రాసేశ్వరియగు రాధ నన్ను చూచెను. ఆమె గోవిందుని ననరాని మాటలని నన్ను కోపముతో శపించెను.

యాహి త్వం మానవీం యోని మిత్యేవం చ శశాపహ | మామువాచ స గోవిందో మదంశం చ చతుర్బుజమ్‌. 25

లభిష్యసి తపస్తప్త్వా భారతే బ్రహ్మణో వరాత్‌ | ఇత్యేవ ముక్త్వా దేవేశో వ్యంతర్థానం చకార సః. 26

దేవ్యా భియాతనుం త్యక్త్వా ప్రాప్తం జన్మ గురోభువి | అహం నారాయణం కాంతం శాంతం సుందర విగ్రహమ్‌. 27

సాంప్రతం తం పతిం లబ్ధుం వరయే త్వం చ దేహిమే | బ్రహ్మదేవః : సుదామానామ గోపశ్చ శ్రీకృష్ణాంగ సముద్బవః. 28

తదంశ శ్చాతి తేజ స్వీ లేఖే జన్మ చ భారతే | సాంప్రతం రాధికాశాపా ద్దను వంశ సముద్బవః. 29

శంఖచూడేతి విఖ్యాత సై#్త్రలోక్యే న చ తత్సమః | గోలోకే త్వాం పురా దృష్ట్వా కామోన్మథిత మానసః. 30

విలం భితుం న శశాక రాధికాయాః ప్రభావతః | స చ జాతిస్మర స్తస్మాత్సుదామా7భూ చ్చ సాగరే. 31

జాతిస్మరా త్వ మపిసా సర్వం జానాసి సుందరి | అధునా తస్య తత్నీ త్వం సంభవిష్యసి శోభ##నే. 32

పశ్చా న్నారాయణం శాంతం కాంత మేవ వరిష్యసి | శాపా న్నారాయణ సై#్యవ కలయా దైవయోగతః. 33

భవిష్యసి వృక్షరూపా త్వం పూతా విశ్వపావనీ ప్రధానా సర్వ పుష్పేషు విష్ణుప్రాణాధికా భ##వేః. 34

త్వయావినా చ సర్వేషాం పూజా చ విఫలా భ##వేత్‌ | బృందావనే వృక్షరూపా నామ్నా బృందావనీతి చ. 35

త్వత్పత్రైర్గోపిగోపాశ్చ పూజయిష్యంతి మాధవమ్‌ | వృక్షాధి దేవీరూపేణ సార్ధం కృష్ణేన సంతతమ్‌. 36

నీవు మనుజ జన్మ నెత్తుమని రాధ నన్ను శపించెను. అపుడు గోవిందుడును నాతో నిట్లనెను. నా యంశ గల చతుర్బుజుని బడయగలవు. భారతదేశమున తప మొనర్చుము బ్రహ్మ వరమున నీవు చతుర్బజుని బడయగలవు. అని గోవిందు దంతర్ధాన మొందెను. ఓ గురూ! నేను రాధకు వెఱచి తనువు చాలించి భారతమున జన్మించితిని. కాంతుడు శాంతుడు సుందర విగ్రహుడు నారాయణుడు. నే నిపు డతనిని పతిగ బొందుటకు కోరుచున్నాను. నాకీ వరమిమ్ము.

బ్రహ్మదేవు డిట్లనెను: సుదాముడను గోపాలుడు శ్రీకృష్ణుని యంగముల నుండి జన్మించెను. అతడు కృష్ణాంశముతో జన్మించెను. తేజస్వి. భారతమున జన్మించెను. అతడును రాధా శాపమున దను వంశమున జన్మించెను. అతని శంఖచూడు డందురు. ప్రఖ్యాతుడు. ముల్లోకములందు నతని సాటివాడు లేడు. మునువుగోలోకమున నతడు నిన్ను చూచి కామించెను. రాధా ప్రభావమున నతడపుడు నిన్ను చేరుకొనలేకుండెను. ఆ సుదాముడే యీ శంఖ చూడుడు. ఇతనికి భార్యవుగా గలవు. ఆ తరువాత శాంతుడు కాంతుడునగు నారాయణుని పతిగ వరించగలవు. అటు తర్వాత నారాయణుని శాపమున దైవ యోగమున చెట్టుగ నగుదువు. నీవు వృక్షరూపమొంది పవిత్రరాలవు గాగలవు. అన్ని పూల యందు ప్రధానమైనదానవు విష్ణునకు ప్రాణములకన్న ప్రియురాలవు గాగలవు. నీ పుష్పము లేనిచో పూజలన్నియును వ్యర్థములు. బృందావనమున నీవు వృక్షరూప మొందుటచే నీవు బృందావని యనబరగుదువు గోపికా గోపకులు నీ దళములతో మాధవుని బూజింపగలరు. నీవు వృక్షాధిష్ఠానదేవిని. నిత్యము శ్రీకృష్ణుని గూడుచుందువు.

విహరిష్యసి గోపేన స్వచ్ఛం దం మద్వరేన చ | ఇత్యేవం వచనం శ్రుత్వా సస్మితా హృష్టమానసా. 37

ప్రణనామ చ బ్రహ్మాణం తం చ కించిదు వాచసా|

తులస్యువాచ: యథా మే ద్విభుజే కృష్ణే వాంఛా చశ్యామ సుందరే. 38

సత్యం బ్రవీమి హే తాత నతథా చచతుర్బుజే| అతృప్తా7హం చ గోవిందే దైవాచ్చృంగార భంగతః. 39

గోవింద సై#్యవ వచనాత్ర్పార్థయామి చతుర్బుజమ్‌| త్వత్ర్పసాదేన గోవిందం పునరేవ సు దుర్లభమ్‌. 40

ధ్రువమేవ లభిష్యామి రాధాభీతిం ప్రమోచయ| బ్రహ్మదేవః: గృహాణ రాధికా మంత్రం దదామి షోడశాక్షరమ్‌. 41

తస్యాశ్చ ప్రాణతుల్యా త్వం మద్వరేణ భవిష్యసి | శృంగారం యువయో ర్గోప్యం న జ్ఞాస్యతి చరాధికా. 42

రాధాసమాత్వం సుభ##గే గోవిందస్య భవిష్యసి| ఇత్యేవ ముక్త్వా దత్వాచ దేవ్యావై షోడశాక్షరమ్‌. 43

మంత్రం చైవ జగద్ధాతోస్తోత్రం చ కవచం పరమ్‌| సర్వం పూజా విధానం చ పురశ్చర్యా విధిక్రమమ్‌. 44

పరాం శుభాశిషంచైవ పూజాం చైవ చకార సా | బభూవ సిద్ధా సా దేవీ తత్ర్పసాదా ద్రమాయథా. 45

సిద్ధం మంత్రేణ తులసీ వరం ప్రాప యథోదితమ్‌ | బుభుజే చ మహాభోగం యద్విశ్వేషు చ దుర్లభమ్‌. 46

ప్రసన్నమనసా దేవో తత్యాజ తనసః క్లమమ్‌ | సిద్ధే ఫలే నరాణాం చ దుఃఖం చ సుఖముత్తమమ్‌. 47

భుక్త్వా పీత్వాచ సంతుష్ట్వా శయనంన చకార సా | తల్పేమనోరమే తత్ర పుష్ప చందన చర్చితే. 48

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారద నారాయణ సంవాదే తులస్యు పాఖ్యానే సప్తదశో7ధ్యాయః.

నా వర ప్రభావమున నీవుస్వేచ్ఛగ విహరింపగలవు అను బ్రహ్మ వాక్కులు విని నవ్వి తులసి సంతోషించెను. తులసి బ్రహ్మకు నమస్కరించి యతనితో నిట్లనెను. తండ్రీ! నాకు శ్యామసుందరుడు ద్విభుజుడునగు కృష్ణునందు నా కత్యంత ప్రేమ గలదు. తండ్రీ! నేను నిజము పల్కుచున్నాను. నాకు చతుర్భుజునిపై నంతగ ప్రేమ లేదు. నేను గోవిందునితో తృప్తి జెందలేదు. దురదృష్టమున మా శృంగార విలాసములకు భంగము వాటిల్లెను. కనుక గోవిందుని మాట ప్రకారము నేను చతుర్భుజుని కోరుదును. కాని నీ దయ వలన మరల దుర్లభుడైన గోవిందుని పతిగ జేయుము. నాకు రాధా భయము బాపుము. కృష్ణుని చేరగలను. బ్రహ్మదేవు డిట్లనెను: నీవు రాధా మంత్రము జపింపుము-నీకుపదేశింతును. ఆ మంత్రమున పదునారు వర్ణములు గలవు నీవు నా వరమున రాదకు ప్రాణతుల్యవగుదువు. కృష్ణుని తోడి నీ శృంగార వినోదములను రాధ యెఱుగజాలకుండును. ఓ సౌభాగ్యవతి! నీవును కృష్ణునకు రాధతో సమానవు గాగలవు. అని రాధా షోడశాక్షర మంత్రమున బ్రహ్మ తులసి కుపదేశించెను. బ్రహ్మ రాధా మంత్రము స్తోత్రము కవచము పూజా విధానము పురశ్చరణ విధానమున తులసికి తెలిపెను. బ్రహ్మ యామెను శుభాశీస్సులొసంగెను. తులసియును బ్రహ్మ చెప్పినట్లుచేసి యతని దయ వలన లక్ష్మివలె మంత్రసిద్ధి బొందెను. మంత్రసిద్ధి గాగ తులసి తగిన వరములు బడసెను. లోకమున దుర్లభ##మైన మహా భోగము లనుభవించెను. ఆమె మనస్సు ప్రసన్నత గాంచెను. ఆమె పడిన తపము శ్రమము మఱచెను. నరులకు ఫలము సిద్ధించినచో దుఃఖ ముత్తమ సుఖముగ మారును. ఆమెపిదప నీరాహరము తీసికొని సంతోషించి పుష్ప చందన ములు నిండిని కమ్మని శయ్యపై పరుండెను.

ఇది శ్రీదేవి భాగవత మహా పురాణమున నవమ స్కంధము నారద నారాయణ సంవాదమున తులస్యుపాఖ్యానమయు పదునేడవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters