Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకవింశో7ధ్యాయః

శ్రీకృష్ణం మనసాధ్యాత్వా రక్షః కృష్ణపరాయణః | బ్రహ్మే ముహూర్త ఉత్థాయ పుష్పతల్పాన్మనోహరాత్‌. 1

రాత్రివాసః పరిత్యజ్య స్నాత్వా మంగళవారిణా | ధౌ తే చ వాససీ ధృత్వా కృత్వా తిలక ముజ్జ్వలమ్‌. 2

చకారాహ్నిక మావశ్య మభీష్ట దేవవందనమ్‌ | దధ్యాజ్య మధులాజాంశ్చ దదర్శ వస్తు మంగళమ్‌. 3

రత్నశ్రేష్ఠం మణిశ్రేష్ఠం వస్త్రశ్రేష్ఠం చ కాంచనమ్‌ | బ్రాహ్మణభ్యో దదౌ భక్త్యా యథానిత్యంచ నారద. 4

అమూల్యరత్నం యత్కించిన్ముక్తామాణిక్యహీ రకమ్‌ | దదౌ విప్రాయ గురవే యాత్రా మంగళ##హేతవే. 5

గజరత్న మశ్వరత్నం ధనరత్నం మనోహరమ్‌ | దదౌ సర్వం దరిద్రాయ విప్రాయ మంగళాయ చ. 6

భాండారాణాం సహస్రాణి నగరాణాం ద్విలక్షకమ్‌ | గ్రామాణాం శతకోటించ బ్రాహ్మణాయ దదౌముదా. 7

పుత్రం కృత్వా తు రాజేంద్రం సర్వేషు దానవేషు చ | పుత్రం సమర్ప్య భార్యాం తాం రాజ్యం చ సర్వసంపదమ్‌.

ప్రజానుచర సంఘంచ భాండారం వాహనాదికమ్‌ | స్వయం సన్నాహయుక్తశ్చ ధనుష్పాణిర్బభూవహ. 9

భృత్యద్వారాక్రమేణౖవ చకారసైన్యసంచయమ్‌ | అశ్వానాం చ త్రిలక్షేణ లక్షేణ వరహస్తినామ్‌. 10

రథానా మయుతేనైవ ధానుష్కాణాం త్రికోటిభిః | త్రికోటిబి ర్వర్మిణాం చ శూలినాం నా త్రికోటిభిః. 11

కృతాసేనా7పరిమితా దానవేంద్రేణ నారద | తస్యాం సేనాపతిశ్చైవ యుద్ధశాస్త్ర విశారదః. 12

సహారథః స విజ్ఞేయో రథినాం ప్రవరోరణ | త్రిలక్షాక్షౌహిణీ సేనాపతిం కృత్వానరాధిపః. 13

ఇరువది ఒకటవ అధ్యాయము

శక్తి ప్రాదుర్బావము

కృష్ణ భక్తుడగు శంఖచూడుడు వేకువను కృష్ణుని ధ్యానించి కమ్మని పూలపాన్పు నుండి లేచెను. అతడు రాత్రి వస్త్రములు వదలి మంగళ స్నాన మొనరించి తెల్లని దుస్తులు దాల్చి తిలకము నుదుట దిద్దెను. అతడు నిత్యకృత్యములు నెఱ వేర్చుకొని దేవ వందన మాచరించి మంగళ ద్రవ్యములగు పెరుగు నెయ్యి తేనె పేలాలు మున్నగు వానిని చూచెను. నారదా! అతడు అలవాటు బ్రాహ్మణులకు మేలైన రత్నములుమణులు వస్త్రములు బంగారము దానముగ నిచ్చెను. తన రణ యాత్రమంచిగ సాగుట కతడు బ్రాహ్మణ గురువులకు విలువైన రత్న మాణిక్యములు ముత్తెములు వజ్రములును దానమిచ్చెను. అతడు శుభము కొఱకు బ్రాహ్మణులకు నిరుపేదలకును మేలైన గజాశ్వములను రత్న ధనరాసులను దాన మొసంగెను. అతడు మంగళము కొఱకు వేల ధనాగారములను రెండు లక్షల నగరములను నూఱు కోట్ల గ్రామములను విప్రులకు దానముగ నొసగెను. అతడు తన పుత్రుని రాజుగ దానవు కధిపతిగ జేసి తన భార్యను రాజ్యము నెల్ల సంపదలను కాపాడుట కతని కప్పగించెను. అతడు తన ప్రజలను ధనాగారముల ననుచరులను వాహనాదికమును కాపాడుటకు తన కొడుకున కొసంగెను. తను స్వయ ముగ యుద్ధ సన్నద్ధుడై ధనుర్బాణములు దాల్చెను. అతడు తన భటులను సైన్యము నాయత్త పరచుమని యాజ్ఞాపించెను మూడు కోట్ల గుఱ్ఱములు లక్ష గజ బలమును పది వేల రథములు మూడు కోట్ల ధనుర్దరులు మూడు కోట్ల కవచధారులు మూడు కోట్ల శూలధారులును కల విశాలసైన్యవాహినిని దానవ పతి సమకూర్చెను. దానికి యుద్ధ శాస్త్ర విశారదుడగు నొకసేనాపతిని నియమించెను. తన యక్షౌహిణులసేన కధిపతిగ నతని నియమించెను.

త్రింశద క్షౌహిణీ బాధం భాండౌఘంచ చకార హ | బహిర్బభూవ శిబరా న్మనసా శ్రీహరిం స్మరన్‌. 14

రత్నేంద్రసారనిర్మాణం విమాన మారురోహసః | గురువర్గా న్పురస్కృత్య ప్రయ¸° శంకరాంతికమ్‌. 15

పుష్పభద్రానదీతీరే యత్రాక్షయవటః శుభః | సిద్ధాశ్రమం చ సిద్ధానాం సిద్ధిక్షేత్రం చ నారద. 16

కపిలస్య తపః స్థానం పుణ్యక్షేత్రం చ భారతే | పశ్చిమో దధి పూర్వే చ మలయస్య చ పశ్చి మే. 17

శ్రీశైలోత్తరభాగే చ గంధమాదన దక్షిణ | పంచయోజన విస్తీర్ణా దైర్ఘ్యే శతగుణా తథా. 18

శుద్ధ స్పటిక సంకాశా భారతే చ సు పుణ్యదా | శాశ్వతీ జలపూర్ణా చ పుష్పభద్రానదీ శుభా. 19

లవణాబ్ధిప్రియా భార్యా శశ్వత్సౌభాగ్య సంయుతా | కరావతీ మిశ్రితా చ నిర్గతా సా హిమాలయాత్‌. 20

గోమతీం వామతః కృత్వా ప్రవిష్టా పశ్చిమోదధౌ | తత్ర గత్వా శంఖచూడో దదర్శ చంద్రశేఖరమ్‌. 21

వటమూలే సమాసీనం సూర్యకోటి సమప్రభమ్‌ | కృత్వాయోగాసనం దృష్ట్వా ముద్రాయుక్తం చ సస్మితమ్‌. 22

శుద్ధస్సటికసంకాశం జ్వలంతం బ్రహ్మతేజసా | త్రిశూల వట్టిశధరం వ్యాఘ్రచర్మాంబరం పరమ్‌. 23

భక్త మృత్యుహరం శాంతం గౌరీకాంతం మనోహరమ్‌ | తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్‌. 24

అశుతోషం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకాతరమ్‌ | విశ్వనాథం విశ్వబీజం విశ్వరూపంచ విశ్వజమ్‌. 25

విశ్వం భరం విశ్వవరం విశ్వసంహార కారకమ్‌ | కారణం కారణానాం చ నరకార్ణవ తారణమ్‌. 26

ముప్పదియక్షౌహిణుల సేనను రక్షగ నుంచెను. ఇట్లు సైన్య విభాగ మొనర్చి యతడు శ్రీహరిని స్మరించుచు తన శిబిరము నుండి బయలు దేరెను. అతడు మేలు జాతి రతనాల విమాన మెక్కి గురువరులు ముందు నడువగ శంకరుని జేర నరి గెను. ఓయి నారదా! పుష్ప భద్రా నదీ తీరము నందు సిద్ధులకు సిద్ధి గూర్చునట్టి సిద్ధాశ్రమము గలదు. అందక్షయవటము గలదు. భారతదేశ మందలి యీ పుణ్యక్షేత్రము కపిల మహాముని తపోభూమి ఇది పడమటి సముద్రమునకు తూర్పుగ మలయాద్రికి పడమటగ శ్రీశైలమునకు నుత్తరముగ గంధ మాదనమునకు దక్షిణముగ నైదామడల వెడల్పున దానికి నూఱు రెట్లు పొడవున నొప్పారుచున్నది. పుష్పభద్రా నది శుద్ధ స్పటికము వలె తెల్లగను శాశ్వత జల పూర్ణముగను భారతమున పుణ్యప్రదముగను విలసిల్లుచుండును. ఇది సాగరునికి ప్రియపత్ని. నిరంతరము సౌభాగ్యశాలిని హిమాలయము నుండి వెడలి శరావతి నదిలో గలిసినది. దాని కెడమవైపున గోమతి నది గలదు. అదియును పడమటి సాగరమున గలియును. శంఖ చూడు డచ్చోటి కేగి చంద్రశేఖరుని దర్శించెను. పరమశివుడు యోగాసనమున ముద్రలతో గూర్చొని చిర్నగవులు చిందిం చుచు కోటి సూర్యుల ప్రభలు విరజిమ్ముచు మఱ్ఱిచెట్టు క్రింద విరాజిల్లుచుండెను. శంకరుడు తెల్లని యచ్చమైన స్పటికాకారమున బ్రహ్మతేజము రూపు దాల్చినట్లుగ పులి తోలు దాల్చి త్రిశూలము పట్టిశము చేత బట్టి విలసిల్లుచుండెను. శివుడు ప్రసన్నవదనుడు భక్తానుగ్రహ తత్పరుడు అల్ప సంతోషి విశ్వనాధుడు విశ్వబీజుడు విశ్వజుడు. విశ్వంభరుడు మయోభవుడు మయస్కరుడు శివతరుడు విశ్వకరుడు విశ్వసంహార కారకుడు కారణ కారణుడు నరక సాగర తారకుడు.

జ్ఞానప్రదం జ్ఞానబీజం జ్ఞానానందం సనాతనమ్‌ | అవరుహ్య విమానాచ్చ తం దృష్ట్వా దానవేశ్వరః. 27

సర్వైః సార్ధం భక్తియుక్తః శిరసా ప్రణనామసః | వామతో భద్రకాళీం చ స్కందం చ తత్పురః స్థితమ్‌. 28

ఆశిషం చ దదౌ తసై#్మ కాళీస్కంద శ్చ శంకరః | ఉత్త స్థు రాగతం దృష్ట్వా సర్వేనందీ శ్వరాదయః. 29

పరస్పరం చ భాషాంతే చక్రుస్తత్ర సాంప్రతమ్‌ | రాజా కృత్వా చ సంభాషా మువాస శివసన్నిధౌ. 30

ప్రసన్నాత్మా మహాదేవో భగవాంస్త మువాచ హ | విధాతా జగతాం బ్రహ్మా పితా ధర్మస్య ధర్మవిత్‌. 31

మరీచి స్తస్య పుత్రశ్చ వైష్ణవశ్చాపి ధార్మికః | కశ్యపశ్చాపి తత్పుత్రో ధర్మిష్ఠశ్చ ప్రజా పతిః. 32

దక్షః ప్రీత్యా దదౌ తసై#్మ భక్త్యా కన్యాస్త్రయోదశ | తాస్త్వేకా చ దనుః సాధ్వీ తత్సౌభాగ్య వివర్ధితా. 33

చత్వారింశ ద్దనోఃపుత్రా దానవాస్తే జసోల్బణాః | తేష్వేకో విప్ర చిత్తిశ్చ మహాబలపరాక్రమః. 34

తత్పుత్రో ధార్మికో దంభో విష్ణుభక్తో జితేంద్రియః | జజాప పరమం మంత్రం పుష్కరే లక్షవత్సరమ్‌. 35

శుక్రాచార్యం గురుం కృత్వా కృష్ణస్య పరమాత్మనః | తదా త్వాం తనయం ప్రాప పరం కృష్ణపరాయణమ్‌. 36

పురా త్వం పార్షదోగోపో గోషేష్యపి సుధార్మికః | అధునా రాధికాశాపా ద్బారతే దానవేశ్వరః. 37

అబ్రహ్మ స్తంబ పర్యం తం తుచ్చం మేనే చ వైష్ణవః | సాలోక్య సార్షి సాయుజ్య సామీప్యం చ హరేరపి. 38

దీయమానం న గృహ్ణంతి వైష్ణవాః సేవనం వినా | బ్రహ్మత్వ మమరత్వం వా తుచ్చం మేనే చ వైష్ణవః. 39

ఇంద్రత్వం వా మనుత్వం వా నమేనే గణనాసు చ | కృష్ణభక్తస్య తే కిం వా దేవానాం విషయే భ్రమే. 40

జ్ఞానప్రదుడు జ్ఞానబీజుడు జ్ఞానానందుడు సర్వజ్ఞుడు సనాతనుడు నగు శివుని సందర్శించి దానవపతి విమానము నుండి దిగెను. అతడు తన వారంతఱతో భక్తిమీర తలవంచి శివునకు మ్రెక్కెను. శివున కెడమ వైపున భద్రకాళియును ముందు వైపు కుమారుడును గలరు. శివుడు కుమారస్వామి కాళి వీరతని కాశీస్సు లిచ్చిరి. అతనిని గని నందీశ్వరాదులు లేచి నిలుచుండిరి. వారు తమలోతాము గుసగుసలాడిరి. దానవుడును కొంత మాటలాడి పిదప శివుని సన్నిధి నుండెను. అపుడు ప్రసన్నాత్ముడు భగవానుడు నగు మహదేవు డిట్లనెను: ఎల్ల ధర్మము లెఱింగి జగములు విరచించు తండ్రి విధాత బ్రహ్మ. బ్రహ్మ కుమారుడు మరీచి. అతడు పరమవైష్ణవుడు ధర్మాత్ముడు. మరీచి పుత్రుడు ధర్మాత్ముడగు కశ్యప ప్రజాపతి. దక్షుడు ప్రీతితో తన పదుముగ్గురు కన్నియలను కశ్యపున కొసంగెను. వారిలో దనువను నామె గొప్ప సౌభాగ్యవతి పరమసాధ్వి. ఆమెకు నలువదిమంది తేజోవంతులగు పుత్రులు పుట్టిరి. వారిలో విప్రచిత్త మహా బలశాలి. అతని కొడుకు ధార్మికుడు. విష్ణుభక్తుడు జితేంద్రియుడునైన దంభుడు. అతడు పుష్కరమున లక్ష యేండ్లు తపమొనర్చెను. అతడు శుక్రుని గురునిగ జేసికొని శ్రీకృష్ణమంత్రము జపించెను. అపుడు కృష్ణ పరమాత్ముని భక్తుడవగు నీ వతనికి కుమారుడుగ జన్మించితివి. నీవును పూర్వము కృష్ణు ననుచరులైన గోపకులలో ధర్మనిష్ఠగల గోపకుడవు. నీవు రాధాశాపమున భారతమున దానవపతివై జన్మించితివి. గడ్డి మొదలు బ్రహ్మ వఱకు గల దంతయును తుచ్చముగ తలంచు వైష్ణవుడవు. శ్రీహరియొక్క సాలోక్యము సామీప్యము సాయుజ్యము సార్షి మున్నగునవి స్వయముగ వరించి వచ్చినను పరమవైష్ణవులు హరి సేవనే తప్ప వానిని గ్రహింపరు. వైష్ణవులు బ్రహ్మత్వము నమరత్వమును తుచ్ఛముగ తలంతురు. ఇంద్రత్వము మనుత్వమును లెక్కచేయని వైష్ణవుడవు నీవు. నీకీ దేవతల యధికారముపై నింత వ్యామోహమెందులకు.

దేహి రాజ్యం చ దేవానాం మత్ర్పీతిం రక్ష భూమిప | సుఖం స్వరాజ్యే త్వంతిష్ఠ దేవాస్తిష్ఠంతువై పదే. 41

అలం భూత విరోధేన సర్వేకశ్యప వంశజాః | యానికాని చ పాపాని బ్రహ్మ హత్యాదికాని చ. 42

జ్ఞాతి ద్రోహస్య పాపాని కళాంనార్హంతి షోడశీమ్‌ | స్వసంపదాంచ హానించ యది రాజేంద్ర మన్యసే. 43

సర్వావస్థా చ సమతాం కేషాం యాతి చ సర్వదా | బ్రహ్మణశ్చ తిరోభావో లయే ప్రాకృతికే సదా. 44

ఆవిర్బావః పున స్తస్య ప్రభావా దీశ్వరేచ్ఛయా | జ్ఞాన వృద్ధిశ్చ తపసా స్మృతిలోపశ్చ నిశ్చితమ్‌. 45

కరోతి సృష్టిం జ్ఞానేన స్రష్టా సో పి క్రమేణ చ | పరిపూర్ణతమో ధర్మః సత్యే సత్యాశ్రయే సదా. 46

త్రిభాగః సో7పి త్రేతాయాం ద్విభాగో ద్వాపరేస్మృతః | ఏకభాగః కలౌ పూర్వం తదంశశ్చ క్రమేణ చ. 47

కళా మాత్రం కలేః శేషే కుహ్వాం చంద్రకళా యుథా | యాదృక్తే జో రవేర్గ్రీష్మే నతాదృక్ఛిశిరే పునః. 48

దినేషు యాదృజ్మధ్యాహ్నే సాయం ప్రాతర్నతత్సమమ్‌ | ఉదయం యాతి కాలేన బాలతాం చ క్రమేణ చ. 49

ప్రకాండతాం చ తత్పశ్చాత్కాలే7స్తం పునరేతిసః | దినే ప్రచ్ఛన్నతాం యాతి కాలేన దుర్దినే ఘనే. 50

రాహుగ్రస్తే కింపితశ్చ పునరేవ ప్రసన్నతామ్‌ | పరిపూర్ణతమ శ్చంద్రః పూర్ణిమాయాం చ జాయతే. 51

తాదృశో న భ##వేన్నిత్యం క్షయం యాతి దినే దినే | పునశ్చ పుష్టి మాయాతి పరం కుహ్వా దినే దినే. 52

సంపద్యుక్తః శుక్లపక్షే కృష్ణే వ్లూనశ్చ యక్ష్మణా | రాహుగ్రస్తే దినే వ్లూనో దుర్దినే న విరోచనే. 53

కాలే చంద్రో భ##వే చ్ఛుక్లో భ్రష్టశ్రీః కాలభేదతః | భవిష్యతి బలిశ్చేంద్రో భ్రష్టశ్రీః సుతలే7ధునా. 54

రాజా ! వారి రాజ్యము వారి కిచ్చి వేయుము. నా మాట కాపాడుము. నీ స్వరాజ్యములో నీవుండుము. దేవతలు తమ పదవులలో తాముందురు. మీ రెల్లరును కశ్వప సంతతివారే కదా ! పరస్పర విరోధము చాలించుము. బ్రహ్మహత్య మున్నగున వెన్నియో పాపములు గలవు. అవన్నియు జ్ఞాతిద్రోహ మనెడు పాపమునకు పదారవవంతునకును చాలవు. రాజేంద్రా! నీ సొంత సంపదకు నీవే హాని తలపెట్టుదువా ? అన్ని దినము లెంతవారికైన నొక్క తీరుగ నుండవు. బ్రహ్మసైతమును ప్రకృతి ప్రశయమున విలయ మొందును. పిదప నీశ్వ రాజ్ఞవలన బ్రహ్మ మరల నావిర్బవించును. తపము వలన జ్ఞానము వృద్ది చేసికొనును. కాని పూర్వస్మృతి లోపించును. బ్రహ్మయును జ్ఞాన మాధారముగ క్రమముగ సృష్టికార్యమునకు పూనుకొనును. సత్యాశ్రయమగు సత్యయుగమందు ధర్మము నాల్గు పాదముల నుండెను. త్రేతాయుగమున మూడు పాదముల ద్వారపమున రెండు పాదముల కలిలో నొకే పాదమున నుండును. తుదకదియును నశించును. అమావాస్యనాటి చంద్రకళ వలెను గ్రీష్మమందలి వేడిమి శిశిరమున నుండనట్లును కలియుగాంతమున సత్యమొక కొలది కళ మాత్రముగ నుండును. మిట్ట మధ్యాహ్నమున నున్న తీరున వేడిమి యుదయ సాయంతనముల నుండదు. సమాయానాసారముగ క్రమముగ సూర్యు నుదయము బాల్య దశ మున్నగునవి గల్గుచుండును. మధ్యాహ్నమున సూర్యుడు ప్రచండు డగును. సాయంకాలమున నస్త మించును. మేఘముల దట్టముగ క్రమ్మిన దినమును దుర్దిన మందురు. చంద్రుడు రాహుగ్రస్తుడై వణకుచుండును. రాహు ముక్తుడై ప్రసన్ను డగును. పన్నమినాడు పరిపూర్ణుడై వెండి వెన్నెలలు వెదజల్లును. ఆనాటినుండి క్రమక్రమముగ చంద్రుడు తగ్గుచుండును. ఆమావాస్య దాటిన మీదట దినదినము ప్రవర్ధమాను డగుచుండును. చంద్రుడు శుక్లపక్షమందు సంపదలగూడియు కృష్ణపక్షమందు రోగమున క్షయబాధపడియు నుండును. రాహుగ్రస్తుడై మలిను డగును; మొయిలడ్డురాగ కాంతిహీను డగును. ఇటుల చంద్రుడంతటివాడును కాలము బట్టి యొకప్పుడు కాంతివంతుడుగను మఱియొకప్పుడు కాంతి హీనుడగ నుండును. సిరికోల్పడి సుతలమందున్న బలి యొకనాటికి మంచికాలమున నింద్రుడు గాగలడు.

కాలేన పృథ్వీ సస్యాఢ్యా సర్వాధారా వసుంధరా | కాలే జలే నిమగ్నా సాతోరోభూతా7ంబువిప్లుతా. 55

కాలే నశ్యంతి విశ్వాని ప్రభవంత్యేవ కాలతః | చరాచరా శ్చ కాలేన నశ్యంతి ప్రభవంతి చ. 56

ఈశ్వరసై#్యవ సమతా బ్రహ్మణః పరమాత్మనః | అహం మృత్యుంజయో యస్మా దసంఖ్యం ప్రకృతంలయమ్‌.

ఆదర్శం చాపి ద్రక్ష్యామి వారం వారం పునః పునః | స చ ప్రకృతిరూపం చ స ఏవ పురుషః స్మృతః. 58

స చాత్మాస చ జీవశ్చ నానారూపధరః పరః | కరోతి సతతం యోహి తన్నామగుణకీర్తనమ్‌. 59

కాలేమృత్యుం స జయతి జన్మరోగభయం జరామ్‌ | స్రష్టా కృతో విధిస్తేన పాతా విష్ణుః కృతోభ##వేత్‌. 60

అహం కృతశ్చ సంహర్తా భయం విషయిణః కృతాః | కాలాగ్నిరుద్రం సంహారే నియోజ్యవిషయే నృప. 61

అహం కరోమి సతతం తన్నామ గుణకీర్తనమ్‌ | తేన మృత్యుం జయో7హం చ జ్ఞానేనానేన నిర్బయః. 62

మృత్యు ర్మృత్యు భయాద్యాతి వైనతేయా దివోరగాః | ఇత్యుక్త్వా స చ సర్వేశః సర్వభావేన తత్పరః. 63

విరరామ చ శంభుశ్చ సభామధ్యే చ నారద | రాజా తద్వచనం శ్రుత్వా ప్రశశంస పునః పునః. 64

ఉవాచ మధురం దేవం పరం వినయ పూర్వకమ్‌ | శంఖచూడః : త్వయా యత్కథితం దేవ నాన్యథా వచనం స్మృతమ్‌. 65

తథా పి కించి ద్యథార్థం శ్రూయతాం మన్నివే దనమ్‌ | జ్ఞాతి ద్రోహే మహత్పాపం త్వ యోక్త మధునా చయత్‌.

గృహీత్వా తస్య సర్వస్వం కుతః ప్రస్థాపితో బలిః | మయా సమూద్ధృతం సర్వమూర్ధ్వ మైశ్వర్యమీశ్వర. 67

సుతలా చ్చ సముద్దర్తుం నాలం తత్ర గదాధరః | సభ్రాతృకో హిరణ్యాక్షః కథం దేవైశ్చ హింసితః. 68

ఈ భూమియును మంచి కాలమైనపుడు పైరు పంటలతో సర్వాధారగ వసుంధరగ సుఖవరదాయిని యగు మాతగ కళకళలాడును. కాలము విపరీతమై జల మయ మయినప్పు డందు మునిగిపోవును. కాలమున నశించును. చరాచర జగము లన్నియు నాయా కాలములందు పుట్టుచు గిట్టుచుండును. ఈశ్వరుడే పరమాత్మ-పరబ్రహ్మ; నేనతని వలననే మృత్యుంజయుడ నైతిని. లెక్కకు మిక్కిలిగ ప్రాకృత ప్రళయముల నేను గాంచితిని. ఇంకెన్నియో ప్రళయములు చూడగలను. ఈశ్వరుడే ప్రకృతి. అతడే పురుషు డనబరగును. అతడే యాత్మ జీవుడు నానారూపధరుడు అట్టి యీశ్వరుని నామ రూప గుణ మహి మలు కీర్తింపవలయును. అట్టి హరిదాసుడు పుట్టువు చావు రోగ-భయ-జరలు వాసి మృత్యుంజయుడగును. అట్టి మృత్యుం జయుడగు పరమాత్మ చేతనే బ్రహ్మసృష్టి కర్తగవిష్ణువు పాలకుడుగ నియమింపబడిరి. నేను ప్రాణులకు భయము గల్గించు సంహారకుడుగ నుంటిని. రాజా! కాలాగ్ని రుద్రుడు సర్వ సంహారమున నియోగింపబడును. నేనా పరమాత్ముని గుణ నామ రూప కీర్తనము నిరంతరాయముగసలుపుచుందును. అతని జ్ఞానము వలన నిర్బయుడను సర్వజ్ఞుడను మృత్యుంజయుడ నైతిని. గరుడుని వలన పాములు భయపడునట్లుగ పరమాత్మ భయమున మృత్యువును భయపడును. అని సర్వ భావ తత్ప రుడై శివుడు పలికెను. ఇట్లు శంభుడు సభా మధ్యములో పలికి విరమించెను. ఓయి నారదా ! శివుని పలుకు లన్నిటిని దానవుడు గొప్పగ మెచ్చుకొనెను. అతడపుడు వినయముతో తియ్యగ మహాదేవునితో నిట్లు పలికెను. శంఖచూడు డిట్లు పలికెను. ఓ దేవా! నీవు పలికిన పలుకు లన్నియును నిజములే. అందు పొరపాటు లేదు. అయినను నేను విన్నవించునదియును కొంచెము వినుము. జ్ఞాతి ద్రోహము మహా పాపమని నీవిపుడే యంటివి. అట్లయినచో బలి సర్వస్వమును హరించి యతనిని పాతాళ మేల పంపితిరి? నేను పై లోకాల సంపద యంతయును కొల్లగొట్టితిని. సుతలమున గదాధరు డుండుట వలన నచటి సంపద నాకు సాధ్యము కాలేదు. దేవతలు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల నేల చంపిరి?

శుంభాదాయ శ్చా సురాశ్చ కథం దేవై ర్నిపాతితాః | పురా సముద్రమథనే పీయూషం భక్షితం సురైః. 69

క్లేశభాజో వయం తత్ర తే సర్వే ఫలభోగినః | క్రీడాభాండ మిదం విశ్వం ప్రకృతేః పరమాత్మనః. 70

యసై#్మ యత్ర స దదాతి తసై#్యశ్వర్యం భ##వేత్తదా | దేవదానవయో ర్వాదః శశ్వన్నైమిత్తికః సదా. 71

పరాజయో జయస్తేషాం కాలే7స్మాకం క్రమేణ చ | తదా77వయోర్విరోధం వా గమనం నిష్పలం పరమ్‌. 72

సమసంబంధినో బంధో రీశ్వరస్య మహాత్మనః | ఇయం తే మహతీ లజ్జా యుద్దో7స్మాభిః సహాధునా. 73

జయే తతో7ధికా కీర్తిర్హానిశ్చైవ పరాజయే | ఇత్యే తద్వచనం శ్రుత్వా ప్రహస్య చ త్రిలోచనః. 74

యథోచిత ముత్తరం తమువాచ దానవేశ్వరమ్‌ | యుష్మాభిః సహ యుద్ధేమే బ్రహ్మవంశ సముద్బవైః. 75

కా లజ్జా మహతీ రాజ న్నకీర్తిర్వా పరాజయే | యుద్ధమాదౌ హరే రేవ మధునా కైటభేన చ. 76

హిరణ్య కశిపోశ్చైవ సహ తేనాత్మనా నృప | హిరణ్యాక్షస్య యుద్ధం చ పునస్తేన గదా భృతా. 77

త్రిపురైఃసహ యుద్ధం చ మయా7పి చ పురాకృతమ్‌ | సర్వేశ్వర్యాః సర్వమాతుః ప్రకృత్యా శ్చ బభూవహ.

సహ శుంభాదిభిః పూర్వం సమరః పరమాద్బుతః | పార్షద ప్రవరస్త్వం చ కృష్ణస్య పరమాత్మనః. 79

యేయే హతాశ్చ దైతేయా నహికే పిత్వయా సమాః | కా లజ్జా మహతీ రాజన్మమ యుద్ధే త్వయా సహ. 80

సురాణాం శరణసై#్యవ ప్రేషితశ్చ హరే రహో | దేహి రాజ్యం చ దేవానా మితి మేనిశ్చితం వచః. 81

యుద్ధం వాకురు మత్సార్ధం వాగ్వ్యయే క్రిం ప్రయోజనమ్‌ | ఇత్యుక్త్వా శంకరస్తత్ర విరరామ చ నారద.

ఉత్తస్థౌ శంఖచూడ శ్చ హ్యమాత్యైః సహ సత్వరమ్‌. 82

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారదనారాయణ సంవాదే ఏకవింశో7ధ్యాయః.

శుంభాది రాక్షసులను దేవతలేల హతమార్చిరి? మునుపు సాగర మథనమున గల్గిన యమృతమును దేవతలే యారగించిరి గదా ! మేమేమొ కష్టాలు కుడుచువారము. వారు సుఖఫల భోగులా? ఈ విశ్వమంతయును ప్రకృతి పరమాత్మల విలాస స్థానము గదా ! పరమాత్మ యొకనికెంత యిచ్చునో వానికంతియే ప్రాప్తి దేవాసురుల వివాదము లెప్పుడు నేదోనెపమున జరుగుచునే యుండును. కాలాను సారముగ మాకు వారికి నడుమ జయాపజయములు గల్గుచుండును. ఇందులో మాయిర్వుర విరోధములో నడుమ నీరాక యంత మంచిదిగాదు. మహాశయుడగు నీశ్వరున కెల్లరతో సమాన భావములుండవలయును. మాతో నిపుడు నీవు పోరుటకు వచ్చుటలో నీకు సిగ్గుగలుగవలయును. మేము గెల్చితిమా కీర్తి గల్గును. ఓడితిమా హాని గల్గును. అను దానవుమాటలు విని ముక్కంటి నవ్వెను. అపుడు శివుడు మహాదేవుడు మరల తగినట్లుగ దానవునితో నిట్లు పలికెను : బ్రహ్మ వంశమున పుట్టిన నీ వంటి వానితో పోరుటకు సిగ్గేల ? ఓ రాజా ! ఓటమి వలన నా కపకీర్తియును లేదు. పూర్వము హరి మధుకైటభులతో బోరలే దా? హరియే హరణ్యకశిపుని గూల్చివేసెను గదా! గదాధరుడే హిరణ్యాక్షుని దునుమాడెను గదా! మునుపు నేనును త్రిపురాసురులతో బోరాడితిని. సర్వేశ్వరి విశ్వమాత పరాప్రకృతిమ తల్లి. ఆ తల్లి శుంభాది రాక్షసులతో నద్బుత లీలగ పోరి వారిని హతమార్చెను. నీవు శ్రీకృష్ణ పరమాత్ము ననుచరుడవు గదా ! ఇంత వఱకును చచ్చిన దానవులు నీ సాటి రారు. రాజా! ఇక నట్టి నీతో బోరుటకు నాకు సిగ్గెందులకు దేవతలను కాపాడు మని శ్రీహరియే నన్ను పంపెను సుమా! దేవతల రాజ్యము దేవతల కిప్పటికైన నిచ్చివేయుట మంచిదని నా యభిమతము. ఈ వట్టి మాటల వలన నేమి లాభము? చేతనైన యుద్ధము చేయుము. అని శంకరుడు విరమించెను. శంఖచూడుడును వెంటనే తన మంత్రులతో లేచెను.

ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణమున నవమ స్కంధమున నారద నారాయణ సంవాదమున నిరువదియొకటవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters