Sri Devi Bagavatham-2    Chapters   

అథ షడ్వింశో7ధ్యాయః.

నారదః : తులస్యు పాఖ్యాన మిదం శ్రుతం చాతి సుధోపమమ్‌ | తతః సావిత్ర్యు పాఖ్యానం తన్మే వ్యాఖ్యాతుమర్హసి. 1

పురా కేన సముద్బూతాసా శ్రుతా చ శ్రుతేః ప్రసూః | కేన వా పూజితాలోకే ప్రథమే కైశ్చవా పరే. 2

నారాయణః : బ్రహ్మణా వేదజననీ ప్రథమే పూజితా మునే | ద్వితీయే చ వేదగణౖస్తత్పశ్చా ద్విదుషాంగణౖః. 3

తదా చాశ్వపతి ర్బూపః పూజయామాస భారతే | తత్పశ్చా త్పూజయామాసు ర్వర్ణాశ్చత్వార ఏవచ. 4

నారదః : కోవా సో శ్వపతి ర్బ్రహ్మాన్‌ కేనవాతేన పూజితా | సర్వ పూజ్యా చ సా దేవీ ప్రథమే కైశ్చవా పరే. 5

నారాయణః : మద్రదేశే మహారాజో బభూవాశ్వ పతిర్మునే | వైరిణాం బలహర్తా చ మిత్రాణాం దుఃఖనాశనః. 6

ఆసీత్తస్య మహారాజ్ఞీ మహిషీ ధర్మచారిణీ | మాలతీతి సమాఖ్యాతా యథా లక్ష్మీర్గదాభృతః. 7

సా చ రాజ్ఞీ చ వంధ్యా చ వసిష్ఠస్యో పదేశతః | చకారారాధనం భక్త్యా సావిత్ర్యాశ్చైవ నారద. 8

ప్రత్యాదేశం నసా ప్రాప్తా మహిషీ న దదర్శ తామ్‌ | గృహం జగామ దుఃఖార్తా హృదయేన విదూయతా. 9

రాజా తాం దుఃఖితాం దృష్ట్యా బోధయిత్వా నయేనవై | సావిత్ర్యాస్తపసే భక్త్యా జగామ పుష్కరం తదా. 10

తపశ్చకార తత్రైవ సంయతః శతవత్సరమ్‌ | న దదర్శ చ సావిత్ర్యాః ప్రత్యాదేశో బభూవ చ. 11

శుక్రా వాకాశవాణీం చ నృపేంద్ర శ్చా శరీరిణీమ్‌ | గాయత్ర్యా దశలక్షం చ జపం త్వం కురు నారద. 12

ఇరువదిఆరవ అధ్యాయము

సావిత్ర్యుపాఖ్యానము

నారదు డిట్లనెను: నే నమృతము జూలువారు నట్టి తులసి చరిత్రము వింటిని. ఇపుడు సావిత్రి చరిత్రము నాకు విపులముగ తెలుపుము. ఆ వేదమాత యే కారణమున నవతరించెను. ఆదేవిని తొలుదొల్త నెవరు పూజించిరి. నారాయణుడిట్లు పలికెను : ఓ మునీ ! వేదమాతను మొట్టమొదట బ్రహ్మ పూజించెను. పిదప వేద గణములు నా తర్వాత పండితులును సావిత్రి నర్చించిరి. అటు పిదప భారతదేశమున అశ్వపతిరాజును తదుపరి నాల్గు వర్ణములవారును త్రిపదయగు సావిత్రి నారాధించిరి. నారదు డిట్లనియెను : అశ్వపతి యెవరు? అతడెట్లు సావిత్రినిపూజించెను. ఆ పిదప సర్వపూజ్యయగు సావిత్రి యెవరెవరిచేత బూజింపబడెను. నారాయణు డిట్లనియెను: ఓ మునీశా! అశ్వపతి మద్రదేశ మహారాజు : అతడు వైరుల బల మడచి మిత్రులదుఃఖ ములు పాపువాడు. అతని వట్ట మహిషి ధర్మచారిణి మాలతి యనపేరు గాంచినది; ఆమె విష్ణు భార్యయగు లక్ష్మీతో సమా నురాలు. నారదా ! ఆ రాణి గొడ్రాలు. ఆమె వసిష్ఠు ననుమతి వలన నిర్మల భక్తితోసావిత్రీదేవి నారాధించెను. ఎన్ని దినము లారాధించినను సావిత్రి దర్శనము గాని యా దేశము గాని యామెకు గలుగలేదు. అపుడామె బరువైన హృదయముతో బిట్టు వగుచుచు తన యింటి కేగెను. రాజు దుఃఖార్తయగు తన భార్యను నయమున నూరడించి తానును సావిత్రీ తపము చేయు టకు పుష్కర తీర్థమునకు బయలుదేరెను. అతడచ్చోట నింద్రియ నిగ్రహముతో నూఱండ్లు తప మొనరించినను సావిత్రీ దర్శనము గాని యాజ్ఞగాని యతనికి గలుగ లేదు. అపుడతని కాకాశవాణి యిట్లు వినిపించెను; ''ఓ రాజా ! పది లక్షలు సావిత్రీ జప మొనరించుము.''

ఏతస్మి న్నంతరే తత్ర ఆజగామ పరాశరః | ప్రణనామ తత స్తం చ మునిర్నృ పమువాచ చ. 13

మునిరువాచ : సకృ జ్ఞపశ్చ గాయత్ర్యాః పాపం దినభవం హరేత్‌ |

దశవారం జపేనైవ నశ్యేత్పాపం దివానిశమ్‌. 14

శతవారం జపశ్చైవ పాపం మాసార్జితం హరేత్‌ | సహస్రధా జపశ్చైవ కల్మషం వత్సరార్జితమ్‌. 15

లక్ష జన్మకృతం పాపం దశలక్షోన్య జన్మజమ్‌ | సర్వ జన్మకృతం పాపం శతలక్షా ద్వినశ్యతి. 16

కరోతి ముక్తిం విప్రాణాం జపో దశగుణస్తతః | కరం సర్పఫణాకారం కృత్వాతద్రంధ్రముద్రితమ్‌. 17

అనమ్ర మూర్దమ చలం ప్రజపేత్ర్పాజ్ముఖో ద్విజః | అనామికామధ్య దేశా దథోవామ క్రమేణ చ. 18

తర్జనీమూల పర్వంతం జప్యసై#్యవం క్రమః కరే | శ్వేత పంకజ బీజానాం స్పటి కానాం చ సంస్కృతామ్‌. 19

కృత్వా వామాలికాం రాజన్‌ జపే త్తీర్థే సురాలయే | సంస్థాప్య మాలా మశ్వత్థ పత్రే పద్మే చ సంయతః. 20

కృత్వా గోరోచనాక్తాం చ గాయత్ర్యా స్నాపయేత్సుధీః | గాయత్రీ శతకం తస్యాం జ పే చ్చ విధిపూర్వకమ్‌. 21

అథ వా పంచగవ్యేన స్నాత్వా మాలాం సు సంస్కృతామ్‌ |

అథ గంగోదకే నైవ స్నాత్వా వాతిసు సంస్కృతామ్‌. 22

ఏవం క్రమేణ రాజర్షే దశలక్షం జపంకరు | సాక్షా ద్ద్రక్ష్యసి సావిత్రీం త్రిజన్మ పాతకక్షయాత్‌. 23

నిత్యం సంధ్యాంచ హేరాజ న్కరిష్యసి దినే దినే | మధ్యాహ్నే చాపిసాయా హ్నే ప్రాతరేవశుచిః సదా. 24

అంతలో నచ్చోటికి పరాశర ముని యేగుదెంచెను. అతనికి రాజు నమస్కరింపగ ముని యిట్లు పలికెను. శ్రీ గాయత్త్రీ జప మొక్కమారు చేసిన నానాటి పగటి పాపములు తొలగును. పది సార్లు జపించిన నొక రాత్రి నొక పగలును చేసిన పాపము బాయును. నూఱు పర్యాయములు గాయత్రీ జపము చేసిన నొక నెలలో చేసిన పాతకములు నశించును; వేయి మార్లు జపించినచో నొక యేడాదిలో చేసిన పాపమంతయును నశించును. ఒక లక్ష జపమున నప్పటి జన్మలో చేసిన పాపములు వైతొలగును. పది లక్షల జపము వలన నితర జన్మముల పాపమును నూఱు లక్షల జపము వలన జన్మము లన్నిటి పాపమును వైతొలగిపోవును. దశకోటిగా గాయత్రీ జపమున బ్రాహ్మణుడు విముక్తుడు గాగలడు. ఇక జప విధానము వినుము. తన కుడి చేతిని పాము పడగ వలె వ్రేళ్ళు సందులు లేనట్లుగ నుంచుకొన వలయును. తూర్పు ముఖముగ కదలక కూర్చుండవలయును. తలవంచవలయును అనామిక నడిమి కణువు నుండి క్రిందుగ నెడమ భాగముగను తర్వాత తర్జనీ మూలము దాక వరుసగ జపము లెక్కించవలయును. తెల్ల కమలముల విత్తులతో గాని స్పటికములతో గాని చేసిన మాలను శుద్ధ మొనర్పవలయును. ఆ మాలతో పుణ్య తీర్థమునగాని దేవాలయమున గాని జపించ వలయును. మాలను రావియాకుపై గాని కమలమున గాని యుంచవలయును. స్నాన మొనరించి గాయత్రీదేవిని పూజించి గాయ త్ర్యష్టోత్తరశతము జపింపవలయును. పంచ గవ్యములతో గాని గంగా జలముతో గాని మాలను శుద్ద మొనరింపవలయును. ఓ రాజర్షీ ! ఇట్లు క్రమముగ పది లక్షలు గాయత్రి జపింపుము. నీ మూడు జన్మల పాపము తొలగును. అపుడు నీకు సావిత్రీదేవి సాక్షాత్కరించగలదు. రాజా ! నిత్యము శుచిగ నుదయము-మధ్యాహ్నము-సాయంత్రములందు సంధ్యావందన మొనర్పుము.

సంధ్యాహీనోశుచిర్నిత్య మనర్హః సర్వకర్మసు | యదహ్నా కురుతే కర్మ సతస్య ఫలభాగ్బవేత్‌. 25

నోపతిష్ఠతి యః పూర్వాం నోపాస్తే యస్తు పశ్చిమామ్‌ | స శూద్రవద్బహిష్కార్యః సర్వస్మాద్ద్విజ కర్మణః.

యావజ్జవన పర్యంతం త్రిసంధ్యాం యః కరోతి చ | స చ సూర్య సమోవిప్రస్తేజసా తప సా సదా. 27

తత్పాద పద్మరజసా సద్యః పూతా వసుంధరా | జీవన్ముక్తః స తేజస్వీ సంధ్యాపూతో హి యోద్విజః. 28

తీర్థాని చ పవిత్రాణి తస్య సంస్పర్శమా త్రతః | తతః పాపాని యాంత్యేవ వైనతే యా దివోరగా. 29

న గృహ్ణంతి సురాః పూజాం పితరః పిందతర్పణమ్‌ | స్వేచ్ఛయా చ ద్విజాతే శ్చ త్రిసంధ్యా రహితస్య చ.

మూలప్రకృత్యభక్తో యస్తన్మంత్రస్యా ప్యనర్చకః | తదుత్సవ విహీనశ్చ విషహీనో యథోరగః. 31

విష్ణుమంత్ర వీహీన శ్చ త్రిసంధ్యారహితో ద్విజః | ఏకాదశీ విహీనశ్చ విషహీనో యథోరగః. 32

హరే రనైవేద్యభోజీ ధావకో వృషవాహకః | శూద్రాన్న భోజీ యోవిప్రోవిషహీనోయ థోరగః. 33

శూద్రాణాం శవదాహీయః సవిప్రో పృషలీపతిః | శూద్రాణాం సూపకారశ్చ విషహీనో యథోరగః. 34

శూద్రాణాం చ ప్రతిగ్రాహీ శూద్రాయాజీ చ యోద్విజః | అసి జీవీ మసిజీవీ విసహీనో యథోరగః. 35

యః కన్యా విక్రయీ విప్రో యోహరేర్నామ విక్రయీ | యో విప్రోవీరాన్నభోజీ ఋతుస్నాతాన్న భోజకః.

సంధ్యాహీనుడు శుచిగాడు. అతడే పని కైనను తగడు. అతడు చేసిన యే పనియును ఫలవంతము గాదు. ఉదయ-సాయం సంధ్య లుపాసించనివాడు శూద్రుడే. అట్టి వానిని బ్రాహ్మణ కర్మల నుండి వెలివేయవలయును. జీవిత మంతయును మూడు సంధ్యలుపాసించువాడు తేజమున తపమున సూర్యుని బోలినవాడగును. సంధ్యాపూతుడైన బ్రాహ్మణుడు తేజస్వి జీవన్ముక్తుడు. అతని పాదధూళి చేత భూమి పవిత్రమగును. అతనిని తాకినంతనే యెల్ల తీర్థములు పవిత్రము లగును. గరుడుని గాంచిన పాముల వలె నితని నుండి పాపాలు పారిపోవును. మూడు సంధ్య లుపాసించినవాని పూజలను దేవతలును పిండ తర్పణములను పితరులును గ్రహింపరు. మూల ప్రకృతిని భజించనివాడును దేవి పండుగలలో పాల్గొనని వాడునువిషములేని పాము వంటివాడు మూడు సంధ్య లుపాసించనివాడును విష్ణు మంత్రము జపించనివాడును ఏకాదశీ వత మాచరించనివాడును విషము లేని పాము వంటివాడు. హరికి నివేదన మొనర్పక తినువాడును ఎద్దులపై బరువు వేయువాడును వస్త్రములను శుద్ధ మొనర్చి జీవించువాడును శూద్రాన్నము తినువాడునగు విప్రుడు విషము లేని పామువంటివాడు. శూద్రుల శవములు దహనము చేయువాడు శూద్రాపతి శూద్రుల వంటలవాడు నగు విప్రుడు విషము లేని పాము వంటివాడు. శూద్రుల నుండి దానములు పట్టువాడును శూద్రులచే యాగములు చేయించువాడును మసి వ్యాపారమును శస్త్రముల వ్యాపారమును చేయు విప్రుడును విషము లేని పాము వంటివాడు. కన్నియ నమ్ముకొనువాడును పుత్రులు లేనివాడును ఋతువతి చేతి యన్నము దినువాడును పతి పుత్త్రులు లేనిస్త్రీ చేతి యన్నము దినువాడును-

భగజీవి వార్దుషికో విషహీనో యథోరగః | యోవిద్యా విక్రయీ విప్రో విషహీనో యథోరగః. 37

సూర్యోదయే న్యపే ద్యోహి మత్స్యభోజీ చ యోద్విజః | శివాపూజాదిరహితో విషహీనో యథోరగః. 38

ఇత్యుక్త్వా చ మునిశ్రేష్ఠాః సర్వ పూజా విధిక్రమమ్‌ | తమువాచ చ సావిత్ర్యా ధ్యానాదిక మభీప్సితమ్‌. 39

దత్త్వా సర్వం నృపేంద్రాయ య¸° చ స్వాశ్రమే మునే | రాజా సంపూజ్య సావిత్రీం దదర్శ వరమాప చ.

నారద ఉవాచ : కింవా ధ్యానం చసావిత్ర్యాః కింనా పూజా విధానకమ్‌ |

స్తోత్రం మంత్రం చ కిం దత్వా ప్రయ¸° న పరాశరః. 41

నృపః కేన విధానేన సంపూజ్య శ్రుతిమాతరమ్‌ | వరం చ కంవా సంప్రాప పంపూజ్యతు విధానతః. 42

తత్సర్వం శ్రోతు మిచ్చామి సావిత్ర్యాః పరమంమహత్‌ | రహస్యాతి రహస్యం చ శ్రుతిసిద్ధం సమాసతః. 43

నారాయణ ఉవాచ : జేష్ఠ కృష్ణత్రయోదశ్యాం శుద్ధకాలే చ యత్నతః

వ్రతమేవం చతుర్తశ్యాం వ్రతీ భక్త్యా సమాచరేత్‌. 44

వ్రతం చతుర్దశాబ్దం చ ద్విసప్తఫల సంయుతమ్‌ | దత్వా ద్వి సప్తనైవేద్యం పుష్పధూపాదికం చరేత్‌. 45

వస్త్రం యజ్ఞోపవీతం చ భోజనం విధిపూర్వకమ్‌ | సంస్థాప్య మంగళఘటం ఫలశాఖాసమన్వితమ్‌. 46

గణశం చ దినేశం చ వహ్నింవిష్ణుం శివం శివామ్‌ | సంపూజ్య పూజయే దిష్టం ఘటే ఆవాహితే ద్విజః. 47

శృణు ధ్యానం చ సావిత్ర్యా శ్చోక్తం మాధ్యం దినే చయత్‌ |

స్తోత్రం పూజా విధానం చ మంత్రం చ సర్వకామదమ్‌. 48

కూట సాక్ష్యము బల్కువాడును వడ్డీ వ్యాపారము మీద బ్రదుకువాడును విద్య నమ్ముకొను వాడునగు విప్రుడు విషము లేని పాము వంటివాడు. ప్రొద్దుపొడుచునందాక నిదురించువాడును-చేపలు తినువాడును-దేవీ పూజకు పెడమొగము పెట్టువాడునగు విప్రుడు విషము లేని పాము వంటివాడు. అని పరాశరుడు సావిత్రి యొక్క పూజా విధానము ధ్యానము మున్నగువానిని వివరించెను. పరాశరుడు రాజున కీ విధముగ బలికి తన యాశ్రయమునకు చనుదెంచెను రాజును తర్వాత సావిత్రిని బూజించి యా దేవిని దర్శించి వరము బడసెను. నారదు డిట్లనియెను : సావిత్రీదేవి యొక్క ధ్యాన మంత్రములను పూజా విధానమును స్తోత్రము మున్నగు వాని నెట్లు చెప్పి పరాశరుడేగెనో తెలుపుము. ఆ పిదప రాజు సావిత్రిని వేదమాతనే విధానముగా పూజించెను; మఱి యే వరము బడసెను ? సావిత్రి యొక్క పరమ పావనము వేదప్రసిద్దము పరమ గుహ్యము నగు చరిత్ర మహత్త వినదలుచుచున్నాను. నారాయణు డిట్లనెను : జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శుభ సమయమున నియతుడై యుండి చతుర్దశి నాడు సావిత్రీ వ్రత మాచరించవలయును. ఆ వ్రతము పదునాల్గు సంవత్సరము లాచరింపవలసినది. దానికి పదునాల్గు విధములుగనైవేద్యము చెల్లించవలయును. దేనికి పుష్ప ధూపములు వస్త్ర యజ్ఞోపవీతములు నైవేద్యములు నర్పించి ఫల శాఖలు గల మంగళ కలశమును స్థాపించవలయును. బ్రాహ్మణుడు గణపతిని సూర్యుని విష్ణువును అగ్నిని పార్వతీ పరమేశులను కలశమం దావాహన ముచే పూజింపవలయును. మధ్యాహ్న సమయమున సావిత్రిని గూర్చి చేయు ధ్యానము స్తోత్రము విధానము మంత్రమును సర్వ కామములు తీర్చును.

అట్టి వానిని శ్రద్దగా వినుము.

తప్తకాంచనవర్ణాభాం జ్వలంతీం బ్రహ్మతేజసా | గ్రీష్మ మధ్యాహ్నమార్తాండ సహస్ర సమ్మితప్రభామ్‌. 49

ఈషద్దాస్య ప్రసన్నాస్యాం రత్నభూషణభూషితమ్‌ | వహ్ని శుద్దాంశుకాధానాం భక్తానుగ్రహ విగ్రహామ్‌. 50

సుఖదాం ముక్తిదాంశాంతాం కాంతాం చ జగతాం విధేః |

సర్వ సంపత్స్వరూపాం చ ప్రదాత్రీం సర్వ సంపదామ్‌. 51

వేదాధిష్ఠాతృ దేవీం చ వేదశాస్త్ర స్వరూపిణీమ్‌ | వేదబీజ స్వరూపాం చ భ##జే తాం వేదమాతరమ్‌. 52

ధ్యాత్వా ధ్యానేన నైవేద్యం దత్త్వాపాణిం స్వమూర్దని | పునర్ద్యాత్వా ఘటే భక్త్యా దేవీమావాహయే ద్ర్వతీ. 53

దత్త్వా షోడశోపచారం వేదోక్తం మంత్రపూర్వకమ్‌ | సంపూజ్య స్తుత్వా ప్రణమే ద్దేవ దేవీం విధానతః. 54

ఆసనం పాద్య మర్ఘ్యం చ స్నానీయంచాను లేపనమ్‌ | ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం శీతలం జలమ్‌. 55

వసనం భూషణం మాల్యం గంధమా చ మనీయకమ్‌ | మనోహరం సుతల్పం చ దేయాన్వేతానిషోడశ. 56

దారు సారవికారం చ హేమాదినిర్మితం చవా | దేవాధారం పుణ్యదం చ మయాతుభ్యం నివేదితమ్‌. 57

తీర్థో దకం చ పాద్యం చ పుణ్యదం ప్రీతిదం మహత్‌ | పూజాంగ భూతం శుద్దం చ మయాతుభ్యం నివేదితమ్‌. 58

పవిత్ర రూప మర్ఘం చ దూర్వాపుష్ప దళాన్వితమ్‌ | పుణ్యదం శంఖతోయాక్తం మయా తుభ్యం నివేదితమ్‌. 59

సుగంధం గంధతోయం చ స్నేహంసాగంధ కారకమ్‌ |

మయా నివేదితం భక్త్యా స్నానీయం ప్రతిగృహ్యతామ్‌. 60

గంధ ద్రవ్యోద్బవం పుణ్యం ప్రీతిదం దివ్యగం ధదమ్‌ | మయా నివేదితం భక్త్యా గంధతోయం తవాంబికే. 61

శ్రీసావిత్రీదేవీ క్రాగిన బంగారు వర్ణము గలది ; బ్రహ్మతేజముతో తేజరిల్లునది; గ్రీష్మకాల మందలి నడిమింటివే వెలుంగు వెలుంగులతో వెలయుచుండునది; చిఱుత నగవున విరిసిన నమ్మోము గలది, రత్నభూషణములు దాల్చినది; అగ్నిచేత పవిత్రమైన వస్త్రములు దాల్చినది; భక్తులపాలిటి పెన్నిధానము. బ్రహ్మసృష్టిలోని సుఖరూపిణి; సకల సంపద లొసంగు కలుముల తల్లి. ముక్తి నొసంగు శాంతరూపిణి కాంతామణి వేదబీజ స్వరూపిణి వేదాధిష్ఠానదేవి వేదశాస్త్ర స్వరూపిణి యగు వేదమాతను నేను భజింతును. అను ధ్యానముతో తలపై చేతులు మోడ్చి ధ్యానించి దేవిని నిశ్చలభక్తితో కలశమం దావాహనము చేయవలయును. పిదప తల్లిని వేదోక్తమంత్రములతో యథా విధిగ షోడశోపచార పూజలతో బూజింపవల యును స్తుతించవలయును; నమస్కరింపవలయును. శ్రీజగన్మాత కానము పాద్యము అర్థ్యము స్నానము అనులేవనము వస్త్రము ధూపము దీపనైవేద్య తాంబూలములు చల్లని పానీయము సొమ్ములును దండలును సుగంధము ఆచమనీయము మెత్తని శయ్య మున్నగు పదారు వస్తువు లర్పించవలయును. చందనము కట్టెతోగాని బంగారముతోని జేసిన పుణ్యప్రదమైన సింహాసనమును దేవి కర్పించుచున్నాను. ఓ షట్కుక్షీ ! నీ కిదిగో యిష్టము ప్రియము గూర్చునట్టి పవిత్ర పూజాంగ భూతము పుణ్యదమునైన తీర్థోదకమును పాద్యముగ సమర్పించుచున్నాను. త్రిపదాదేవీ ! గఱికపూలతో చిగుళ్లతో చెన్నొం దుచు పవిత్రము పుణ్యదమునైన శంఖతోయమైన యర్ఘ్యము నీ కర్పించుచున్నాను. ఓ పంచాశీర్షాదేవీ ! సువాసనలు గుబాళించు మెత్తమెత్తని గంధజలయుత స్నానద్రవ్యములు నీకు భక్తితో సమర్పించుచున్నాను. ఓ త్రిలోచనాదేవీ ! పరిమళ ద్రవ్యములతో గలిసి పుణ్యము గలిసి పుణ్యము ప్రీతిని గూర్చుచు వాసనలు విరజిమ్మునట్టి గంధజలము నీ కర్పించున్నాను.

సర్వ మంగళ రూపం చ సర్వం చ మంగళ ప్రదమ్‌ | పుణ్యదం చ సు ధూపంతం గృహాణ పరమేశ్వరి. 62

సుగంధ యుక్తం సుఖదం మయా తుభ్యం నివేదితమ్‌ | జగతాం దర్శనార్థాయ ప్రదీపం దీప్తికారకమ్‌. 63

అంధకార ధ్వంసబీజం మయా తుభ్యం నివేదితమ్‌ | తుష్టిదం పుష్టిదం చైవ ప్రీతిదం క్షుద్వినాశనమ్‌. 64

పుణ్యదం స్వాదురూపం చ నైవేద్యం ప్రతిగృహ్యతామ్‌ | తాంబూల ప్రవరం రమ్యం కర్పూరాదిసు వాసితమ్‌. 65

తుష్టిదం పుష్టిదం చైవ మయా తుభ్యం నివేదితమ్‌ | సుశీతలం వారి శీతం పిపాసానాశ కారణమ్‌. 66

జగతాం జీవరూపం చ జీవనం ప్రతిగృహ్యతామ్‌ | దేహశోభా స్వరూపం చ స భాశోభా వివర్ధనమ్‌. 67

కార్పాసజం చ కృమిజం వసనం ప్రతి గృహ్యతామ్‌ | కాంచనా దివినిర్మాణం శ్రీకారం శ్రీయుతం సదా. 68

సుఖదం పుణ్యదం రత్న భూషణం ప్రతి గృహ్యతామ్‌ | నానావృక్షసము ద్బూతం నానారూప సమన్వితమ్‌. 69

ఫలస్వరూపం ఫలదం ఫలం చ ప్రతి గృహ్యతామ్‌ | సర్వ మంగళ రూపం చ సర్వ మంగళ మంగళమ్‌. 70

నానా పుష్పవి నార్మాణం బహుశోభా సమన్వితమ్‌ | ప్రీతిదం పుణ్యదం చైవ మాల్యం చ ప్రతిగృహ్యతామ్‌. 71

పుణ్యదం చ సుగంధాఢ్యం గంధం చ దేవీ గృహ్యతామ్‌ | సిం దూరం చ వరం రమ్యం ఫాలశోభా వివర్దనమ్‌. 72

భూషణానాం చ ప్రవరం సిందూరం ప్రతి గృహ్యతామ్‌ | విశుద్ద గ్రంథిసంయుక్తం పుణ్యసూత్రం వినిర్మితమ్‌. 73

పవిత్రం వేదమంత్రేణ యజ్ఞ సూత్రం చ గృహ్యతామ్‌ | ద్రవ్యాణ్యతాని మూలేన దత్త్వాస్తోత్రం పఠేత్సుధీః. 74

ఓ దశహస్తా ! సర్వమంగళ స్వరూపము-సర్వమంగళ ప్రదము-పుణ్యప్రదమునగు ధూపము స్వీకరింపుము తల్లీ! ఈ ధూపము పరిమళవంతమైనది; సుఖప్రదమైనది; ఈ దీపము జగముల నెల్ల వెలిగించి చూపించజాలినది. ఇది పెంజీకట్లు పటాపంచలు చేయునది; దీనిని నీ కర్పించితిని. ఓ సంతుష్టా ! తుష్టి-పుష్టి ప్రీతి గల్గించుచు పేరాకలిమంట చల్లార్చునది పుణ్యదము మధురమునైన నైదేద్యమును స్వీకరింపుమమ్మా! మైలేన కప్పురము విడియ మిదోగో! ఈ తమ్ములము తుష్టి-పుష్టి గల్గించును. దీనిని గ్రహింపుము; ఓ జలప్రియా! దప్పిక తీర్చునట్టి చల్లని పానీయము గలదు. జగముల కెల్ల జీవనరూప మైన జీవనమును (నీటిని) గ్రహింపు మమ్మా! ఓ శుద్దవస్త్రా! దేహమున కందమను గూర్ఛునది సభలో మర్యాద నెక్కువ జేయునది అగు ఈ చేనేత పట్టుపుట్టమును ధరింపుము. ఓ శుద్ద మాల్యానులేపనా! శ్రీకరమును శ్రీయుతములును బంగారమున చేయబడినవియును పుణ్యసుఖము లోసుగునవియు నగు రత్నభూషణములు గైకొనుము. ఓ సుధాధామమా ! పెక్కుచెట్లనుండి పుట్టినవి పెక్కు రూపములు గలవి అగు తియ్యని మామిడిపండ్లు గ్రహింపుము ఓ సురభీదేవీ! సర్వమంగళస్వరూపము సర్వ మంగళ మంగళమునై పెక్కు విధములగు పూలతో గ్రుచ్చబడి యందాలు చిందీంచు పుణ్యప్రీతి గల్గించు పూలదండను స్వీకరింపుము. ఓ సర్వకారణా ! పుణ్యము లొసగు పరిమళాలు చిల్కు సుగంధమును వాసన చూడుము. ఓ తిలకినీ తిలకమా ! నెన్నొసటి కందము గల్గించునది మంచి యలంకరా మైనదియునగు సిందూర వాసన చూడుము. ఓ తిలకినీ తిలకమా ! నెన్నొసటి కందము గల్గించునది మంచి యలంకార మైనదియునగు సిందూర తిలకమును దిద్దుకొమ్ము. గాయత్రీదేవిరో ! పుణ్యసూత్రములతో బ్రహ్మగ్రంథితో నలరారునదియు వేదమంత్రములతో పవిత్రమైనదియు నగు యజ్ఞోప వీతము దాల్చుమమ్మా ! పండితు డీ విధమగు పదార్థములను దేవి కర్పించి షోడశకళయగు సావిత్రి స్తోత్రము చదువవలయును.

తతో విప్రాయ భక్త్యా చ ప్రతీదద్యా చ్చ దక్షిణామ్‌ | సావిత్రీతి చ తుర్థ్యంతం వహ్నిజాయాంతు మేవచ. 75

లక్ష్మీ మాయా కామపూర్వం మంత్ర మష్టాక్షరం విదుః | మాధ్యం దినోక్తం స్తోత్రం చ సర్వకామ ఫలప్రదమ్‌. 76

విప్ర జీవన రూపం చ నిబోధ కథ యామి తే | కృష్ణేన దత్తాం సావిత్రీం గోలోకే బ్రహ్మణ పురా. 77

నాయాతి సా తేన సార్దం బ్రహ్మలోకే చ నారద | బ్రహ్మా కృష్ణాజ్ఞయా భక్త్యా తుష్టావ వేదమాతరమ్‌. 78

తదా సా పరితుష్టా చ బ్రహ్మాణం చకమే పతిమ్‌ |

బ్రహ్మోవాచ : స చ్చి దానం దరూపే త్వం మూల ప్రకృతి రూపిణీ. 79

హిరణ్య గర్బ రూపే త్వం ప్రసన్నా భవ సుందరి | తేజః స్వరూపే పరమే పరమానంద రూపిణి. 80

ద్విజాతీనాం జాతిరూపే ప్రసన్నా భవ సుందరి | నిత్యే నిత్య ప్రియే దేవి నిత్యానంద స్వరూపిణీ. 81

సర్వ మంగళరూపే చ ప్రసన్నా భవ సుందరి | సర్వ స్వరూపే విప్రాణాం మంత్ర సారే పరాత్పరే. 82

సుఖదే మోక్షదే దేవి ప్రసన్నా భవ సుందరి | విప్రపాపేధ్మ దాహాయ జ్వల దగ్ని శిఖోపమే. 83

బ్రహ్మతేజః ప్రదే దేవి ప్రసన్నా భవ సుందరి | కాయేన మనసావాచా యత్పాపం కురుతే నరః. 84

తత్త త్స్మరణ మాత్రేణ భస్మీ భూతం భవిష్యతి | ఇత్యుక్త్వా జగతాం ధాతా తస్థౌ తత్ర చ సంసది. 85

సావిత్రీ బ్రహ్మణా సార్దం బ్రహ్మలోకం జగామ సా | అనేన స్తవరాజేన సంస్తూ యాశ్వపతిర్నృపః. 86

దదర్శ తాం చ సావిత్రీం వరం ప్రాప మనోగతమ్‌ | స్తవరాజ మిమం పుణ్యం సంధ్యాం కృత్వాచయః పఠేత్‌. 87

పాఠే చతుర్ణాం వేదానాం యత్పలంలభ##తే చతత్‌ |

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే షడ్వింశోధ్యాయః.

పిమ్మట బ్రాహ్మణునకు భోజనము పెట్టి తుష్టిగ దక్షిణ లీయవలయును. ''ఓం శ్రీం హ్రీం క్లీం సావిత్త్ర్య స్వాహా'' అను అష్టాక్షరిని జపించవలయును. ఈ మాధ్యందిన స్తోత్ర మెల్ల కామములు గురియును. ఈ సావిత్రీమంత్రము బ్రాహ్మణులకు ప్రాణము వంటిది. ఇంకను వినుము. దీనిని మునుపు గోలోకమందున కృష్ణుడు బ్రహ్మ కుపదేశించెను. సావిత్రి బ్రహ్మతోడ బ్రహ్మలోక మేగుటకు నిరాకరించెను. అపుడు కృష్ణు ననుమతితో బ్రహ్మ సావిత్రిని ప్రసన్నురాలిని చేసికొనెను. అపుడా జగన్మాత సంతసించి బ్రహ్మను పతిగ స్వీకరించెను. బ్రహ్మ యిట్లనెను : ఓ సచ్చిదానంద స్వరూపిణీ ! నీవు మూలప్రకృతి రూపిణివి. ఓ హిరణ్యగర్బరూపిణీ ! సుందరీ ! నీవు ప్రసన్నపు గమ్ము. నీవు తేజఃస్వరూపిణివి; పరమపు; పరమానందరూపిణివి; ఓ సుందరీ ! నీవు బ్రాహ్మణుల జాతిదానవు. నిత్యా! నిత్యప్రియా ! నిత్యానందస్వరూపిణి ! దేవీ! సర్వమంగళరూపిణీ ! సుందరీ ! నీవు సుప్రసన్నవు గమ్ము. విప్రుల మంత్రసారమా! పరాత్పరా! సర్వస్వరూపిణీ! ప్రసన్నురాలవు గమ్ము. సుఖదా! పరమాద్థప్రదా! సుందరీ విప్రుల పాపము లనెడు కట్టెలు గాల్చు నగ్నిశిఖవంటిదానవు. దేవీ ! ప్రసన్నపు గమ్ము. ఈ శరీరముతో మనస్సుతో వాక్కుతో మే మెన్నియో పాతకములు చేసితిమి. నిన్నొకసారి స్మరించినంతనే యీ పాపములు భస్మములగును. అని జగముల సృష్టికర్త యా కొలువు కూటమున పలికెను. అంత సావిత్రి బ్రహ్మను గూడి బ్రహ్మలోక మేగెను. అశ్వపతియు నిదే స్తోత్రముతో సావిత్రిని సంస్తుతించెను. అతడు సావిత్రిని దర్శించి కోరిన వరముల బడసెను. సంధ్యావందన మొనర్చి పిదప ఈ పవిత్ర స్తవరాజమును పఠించవలయును.

అట్టి వానికి నాల్గు వేదములు చదివినంత ఫల మబ్బును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమున నవమ స్కంధమున నిరువదియారవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters