Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్గావింశోధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : యమస్య వచనం శ్రుత్వా సావిత్రీ చ పతివ్రతా |తుష్టాన పరయా భక్త్యా తమువా చ మన స్వినీ. 1

సావిత్ర్యువాచ : కిం కర్మ తద్బవేత్కేన కోవాతద్దేతురేవ చ | కోవా దేహీ చ దేహః కఃకోవా7త్రకర్మ కారకః. 2

కింవా జ్ఞానం చ బుద్దిఃకా కోవాప్రాణః శరీరిణామ్‌ | కానీం ద్రియాణి కింతేషాం లక్షణం దేవతా శ్చకాః. 3

భోక్తా భోజయితా కోవా కోవా భోగశ్చ నిష్కృతిః | కోజీవః పరమాత్మా కస్తన్మేవ్యా ఖ్యాతుమర్హసి. 4

ధర్మ ఉవాచ : వేదప్రణిహితో ధర్మః కర్మ యన్మంగళం పరమ్‌ |

అవైదికం తు యత్కర్మ తదేవాశుభ##మేవచ. 5

అహైతుకీ దేవసేనా సంకల్ప రహితాతీ | కర్మ నిర్మూల రూపా చ సాఏవ పరభక్తిదా. 6

కోవా కర్మఫలం భుంక్తేకోవానిర్లిప్త ఏవచ | బ్రహ్మభక్తోయోనర శ్చ సచముక్తః శ్రుతః శ్రుతౌ. 7

జన్మ మృత్యు జరావ్యాధిశోకభీతి వివర్జితః | భక్తి శ్చ ద్వివిధాసాధ్వీ శ్రుత్యుక్తా సర్వ సమ్మతా. 8

నిర్వాణ పదదాత్రీ చ హరిరూప ప్రదానృణామ్‌ | హరి రూప స్వరూపాం చ భక్తిం వాంఛంతి వైష్ణవాః. 9

అన్యే నిర్వాణ మిచ్చంతి యోగినో బ్రహ్మ విత్తమాః | కర్మణో బీజరూపశ్చ సతతం తత్పలప్రదః. 10

ఇరువదిఎనిమిదవ అధ్యాయము

సావిత్రుపాఖ్యానము

శ్రీనారాయణు డిట్లు పలికెను : పరమ పతి వ్రత మనస్వినియగు సావిత్రి యముని మాటలు విని కడుంగడు భక్తితో నతనిని ప్రసన్నునిగ జేసి సావిత్రి యిట్లనియెను. కర్మ మన సేమి; అదెట్లుండును ? దానికి కారణమెద్ది? ఈ దేహియెవడు? దేహ మేమి? కర్మకు కారకు డెవడు ; ఈ దేహి యొక్క జ్ఞానమేది? బుద్దియేది? బుద్దియేది? ప్రాణముల రూపమేది? ఈ యింద్రియములెవ్వి? వానిలక్షణమేది? వానికధిదేవతలెవ్వరు. భోక్త యెవడు ? భుజింపజేయు వాడెవడు? భోగమననేమి? దానినిష్కృతి యేది? ఈ జీవుడెవడు ? పరమాత్మ యెవడు? ఇన్నియును తెల్పుటకీవే సమర్థుడవు. ధర్మ రాజిట్లు పలికెను. వేద విహితమైన కర్మము శుభము. అది మంగళప్రదము. వేదమున జెప్పబడిన కర్మ మ శుభప్రదము. ఏ కోర్కి యే కారణము లేక చేసిన దేవ కార్యము కర్మ స్వరూపమును రూపుమాపును. అది పరమభక్తి గల్గించునది. బ్రహ్మభావముగలవాడు ముక్తుడని వేదమందు గలదు. అట్టివానికి కర్మ ఫలములేదు. వాడుఫల భోక్తవాడు. అతడు నిర్లప్తుడు. అతడు జన్మ మృత్యు జరా వ్యాధి శోకభయ రహితుడు. సాధ్వీమతల్లీ ! భక్తి రెండు విధములని వేదములందు గలదు. అందు నిర్గుణ భక్తి ముక్తి నొసంగును. రెండవది సగుణ భక్తి. అది హరిసారూప్య మొసంగును. దీనిని పరమవైష్ణువులు గోరుకొందురు. కర్మ బీజముల ఫలమొసంగువాడు పరమాత్ముడే.

కర్మరూప శ్చ భగవాన్పరాత్మా ప్రకృతిఃపరా | సో పి తద్దేతురూపశ్చ దేహీ నశ్వర ఏవ చ. 11

పృథివీ వాయురాకాశో జలం స్తథైవచ | ఏతాని సూత్ర రూపాణి సృష్టిరూప విధై సతః. 12

కర్మ కర్తా చ దేహీ చ ఆత్మా భోజయితా సదా | భోగో విభవభేదశ్చ నిష్కృతి ర్ముక్తి రేవచ. 13

సదా సద్బేదబీజం చ జ్ఞానం నానా విధం భ##వేత్‌ | విషయాణాం విభాగానాం భేది బీజం చ కీర్తితమ్‌. 14

బుద్ది ర్వవేచనా సా చ జ్ఞాన బీజం శ్రుతౌ శ్రుతమ్‌ | వాయుభేదా శ్చ ప్రాణాశ్చ బలరూపాశ్చ దేహినామ్‌. 15

ఇంద్రియాణాం చ ప్రవర మీశ్వరం శమనూహకమ్‌ | ప్రేరకం కర్మణాం చైవ దుర్నివార్యం చ దేహినామ్‌. 16

అనిరూప్య మదృశ్యం చ జ్ఞానభేదో మనః స్మృతమ్‌ | లోచనం శ్రవణం ఘ్రాణం త్వక్చ రసన మింద్రియమ్‌. 17

అంగినా మంగరూపం చ ప్రేరకం సర్వ కర్మణామ్‌ | రిపురూపం మిత్రరూపం సుఖరూపం చ దుఃఖదమ్‌. 18

సూర్యో వాయు శ్చ పృథివీ బ్రహ్మద్యా దేవతాః స్మృతాః | ప్రాణదేహో దిభృ ద్యోహి సజీవః పరికీర్తితః. 19

పరమం వ్యాపకం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః | కారణం కారణానాం చ పరమాత్మా స ఉచ్యతే. 20

భగవానుడు కర్మస్వరూపుడు : ప్రకృతికి పరుడు; అతనికి పరప్రకృతి కరాణమైనది; అతడు సృష్టి స్థితి సంహార కర్మములు చేయువాడు. ఈ దేహము నశ్వరమైనది. ఈ విశాల సృష్టి కాకాశము-వాయువు-అగ్ని-నీరు-భూమి మూలకారణములు. దేహి కర్మములు చేయువాడు; అంతర్యామి-కర్మ లను భవింపజేయువాడు; సుఖ-దుఃఖములే భోగ్యములు; ఇవి పరమేశ్వర వైభవములోని భేదములు; నిష్కృతి యనగ ముక్తి యని భావము. సత్తు-అసత్తుల భేద మెఱుగుట జ్ఞానము; ఇది పలు విధములుగ నుండును; ఘట-పటాది విషయము లన్నియును వాసనలకు మూలములు. బుద్ది యనగ వివేచనాశక్తి. ఇది జ్ఞానమునకు బీజము; ప్రాణము వాయువులలో నొక భేదము. ఇది బలము చేకూర్చును. ఇక మనఃస్వరూపము వినుము. ఇది యూహింపరానిది; చంచలమైనది; ఇంద్రియములలో శ్రేష్ఠమైనది; ఈశ్వరాంశ##మైనది; దేహుల కర్మములను ప్రేరించు నది; దుర్వివారమైనది. ఇది కనరానిది; నిరూపింపరానిది; బుద్ధిభేదము గలది; కన్ను-చెవి-ముక్కు-చర్మము-నాలుక యనున వింద్రియములు. ఈ జ్ఞానేంద్రియములను మనస్సు ప్రేరెపించును; ఇది జీవుని కవయవము వంటిది: మనస్సుజీవునకు సుఖము-దుఃఖము-మిత్రము-శత్రువు వంటిది; ఇంద్రియములకు సూర్యుడు-వాయువు-భూమి-బ్రహ్మ మొదలగువా రధిదేవ తలు. ఈ ప్రాణ దేహములు ధరించువాడే జీవుడు. ఇంక పరమాత్మ స్వరూపము వినుము. పరబ్రహ్మము-సర్వవ్యాపకము; నిర్వాణము-ప్రకృతిపరము-కారణమని చెప్పబడును.

ఇత్యేవం కథితం సర్వం త్వయా పృష్టం యథాగమమ్‌ | జ్ఞానినా జ్ఞానరూపం చ గచ్చ వత్సే యథాసుఖమ్‌. 21

సావిత్ర్యువాచ : త్వక్త్వా క్వయామి కాంతం వా త్వాం వాజ్ఞానార్ణవం ధ్రువమ్‌ |

యద్యత్కరో మిప్రశ్నం చ తద్బవాన్వక్తు మర్హసి. 22

కాంకాం యోనిం యాతి జీవః కర్మణా కేనవా పునః | కేన వా కర్మణా స్వర్గం కేన వా నరకం పితః. 23

కేనవా కర్మణా ముక్తిః కేన భక్తి ర్బవే ద్గురౌ | కేనవాకర్మణాయోగీ రోగీవాకేన కర్మణా. 24

కేనవా దీర్ఘజీవి చ కేనాల్పాయు శ్చ కర్మణా | కేనవా కర్మమా దుఃఖీ సుఖీవాకేన కర్మణా. 25

అంగహీన శ్చ కా ణశ్చ బధిరః కేన కర్మణా | అంధోవా పంగురపివా ప్రమత్తః కేన కర్మణా. 26

క్షిప్తో తిలుబ్దక శ్చౌరః కేనవా కర్మణా భ##వేత్‌ | కేన సిద్ధి మవాప్నోతి సాలోక్యాది చతుష్టయమ్‌. 27

కేన వా బ్రాహ్మణ త్వం చ తపస్విత్వం చ కేనవా | స్వర్గభోగాదికం కేన వైకుంఠం కేన కర్మణా. 28

గోలోకం కేన వా బ్రాహ్మన్సర్వోత్కృష్టం నిరామయమ్‌ | నరకోవా కతివిధః కింసంఖ్యో నామ కించవా. 29

కోవా కం నరకంయాతి కియంతం తేషు తిష్ఠతి | పాపినాం కర్మణా కేన యోవా వ్యాధిః ప్రజాయతే. 30

తద్యత్ర్పియం మయావృష్టం తన్మే వ్యాఖ్యాతు మర్హసి.

ఇది శ్రీదేవీభాగవతే మహాపురానే నవమస్కంధే నారదనారాయణ సంవాదే సావిత్రుపాఖ్యానేష్టా వింశోధ్యాయః.

అమ్మాయీ! శాస్త్రసమ్మతముగ నీ వడిగిన దంతయును దెల్పితిని. ఇది జ్ఞానులకు జ్ఞానరూపము. ఇక నీవు నీ యింటి కేగుము. సావిత్రి యిట్లనియెను : నా పతిని జ్ఞానసముద్రుడవగు నిన్ను వదలి నే నెక్కడికి వెళ్ళుదును నా ప్రశ్నల కన్నిటికిని సమాధానము లిచ్చుట కీవే సమర్థుడవు. ఈ జీవు డేయే కర్మలవలన నేయే జన్మము లెత్తును? ఏ కర్మముచే స్వర్గము బొందును? ఏ కర్మముచే నరక మొందును. ఏ కర్మమువలన ముక్తి గల్గును? ఏ కర్మముచేత గురుభక్తి గల్గును? ఏ కర్మముచే రోగి యగును? దేనిచే యోగి యగును? దీనిచే దీర్ఘజీవి యగును? అల్పజీవి యగును? ఎట్టి కర్మముచేత సుఖి యగును? ఎట్టి కర్మమువలన నంగహీనుడగ-చెవిటిగ-గ్రుడ్డిగ-కుంటిగ-ప్రమత్తుడుగ-ఏకాక్షిగ-దొంగ-లోభి-క్షిప్తుడుగ నెట్లగును? ఎట్టికర్మ ఫలమున సాలోక్యము అను సిద్దిని బడయగలడు. ఏయే కర్మములవలన బ్రాహ్మణత్వము-తపస్విత్వము-స్వర్గభోగాదికము-వైకుంఠము గల్గును. భగవానుడా ! నిరామయమును సర్వోన్నతమునైన గోలోకప్రాప్తి యెట్టి శుభకర్మమును కల్గును? నరకము లెన్ని విధములు ? వాని సంఖ్య లెన్ని? పేర్లెన్ని ? ఎవ డేయే నరకములందు గూలును? అందెంతకాల ముండును? ఏ పాపకర్మముల మూలమున వ్యాధి గల్గును? ఈ నే నడిగిన ప్రశ్నము లన్నిటికిని సమాధానము లిచ్చుటకు నీవే సమర్థుడవు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నారద నారాయణ సంవాదమున ఇరువదెనిమిదవ అధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters