Sri Devi Bagavatham-2    Chapters   

అథత్రింశోధ్యాయః.

సావిత్ర్యు వాచ: ప్రయాంతి స్వర్గమన్యం చ యేనైవ కర్మణాయమ | మానవాః పుణ్యవంత శ్చ తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 1

ధర్మరాజ ఉవాచ: అన్నదానం చ విప్రాయయఃకరోతి చ భారతే |

అన్న ప్రమాణ వర్షం చ శివలోకే మహీయతే. 2

అన్నదానం మహాదానమన్యేభ్యోపి కరోతియః | అన్నదాన ప్రమాణంచ శివలోకే మహీయతే 3

అన్నదానా త్పరం దానం నభూతం నభవిష్యతి | నాత్రపాత్ర పరీక్షాస్యాన్న కాలనియమః క్విచత్‌. 4

దేవేభ్యో బ్రాహ్మణభ్యోవా దదాతి చాసనం యది | మహీ యతే విష్ణులోకేవర్షాణా మయుతం సతి. 5

యో దదాతి చ విప్రారాయ దివ్యాంధేనుం పయస్వినీన్‌ | తల్లోమమాన వర్షం చ విస్ణులోకే మహీయతే. 6

చతుర్గుణం పుణ్య దినే దీర్ధే శతగుణం ఫలమ్‌ | దానంనారాయణ క్షేత్రే ఫలంకోటిగుణం భ##వేత్‌. 7

గాంయో దదాతి విప్రాయ భారతే భక్తి పూర్వకమ్‌ | వర్షాణా మయుతం చైవ చంద్రలోకే మహీయతే. 8

యశ్చోభయ ముఖీదానం కరోతి బ్రాహ్మణాయ చ | తల్లోమమాన వర్షం చ విష్ణులోకే మహీయతే. 9

యో దదాతి బ్రాహ్మణాయ శ్వేత చ్చ త్రంమనోహరమ్‌ | వర్షాణా మయుతంసోపి మోదతే వరుణాలయే. 10

విప్రాయ పీడి తాంగా య వస్త్రయుగ్మం దదాతి చ | మహీయతే వాయులోకే వర్షాణా మయుతం సతి. 11

యో దదాతి బ్రాహ్మణాయ శాలగ్రామం సవస్త్రకమ్‌ | మహీయతే సవై కుంఠే యావచ్ఛంద్ర దివాకరౌ. 12

యో దదాతి బ్రాహ్మణాయ దివ్యాంశయ్యాం మనోహరామ్‌ | మహీయతే చంద్రలోకే యావచ్చంద్ర దివాకరౌ. 13

యో దదాతి ప్రదీపం చ దేవేభ్యో బ్రాహ్మణాయ చ | యావన్మ న్వం తరం సోపి బ్రహ్మలోకే మహీయతే. 14

ముప్పదవ అధ్యాయము

సావిత్రుపాఖ్యానము

సావిత్రి యిట్లనెను: యమరాజా ! పుణ్యవంతులగు సత్ర్పురుషులెట్టి కర్మ చేయుటవలన స్వర్గము బొందుదురో దాని గూర్చి నాకు విధముగ తెలుపును. ధర్మ రాజిట్లనెను: ఈ కర్మభూమియగు భారతదేశమునందు బ్రాహ్మణున కన్న దానము చేసినవా డన్నములోని మెతుకు లెన్నిగలవో యన్నేండ్లు శివలోకమందు వసించును. అన్ని దానములలో మహాదాన మైన యన్నదానము నితరులకు చేసినవాడును శివలోకమం దుండును. అన్నదానమునకు మించిన దానముపూర్వము లేదు. ఇక ముదుండబోదు. దీనికి తగిన వ్యక్తినిగాని తగిన కాలమునుగాని చూడబనునిలేదు. బ్రాహ్మణులకుమ దేవతలకును ఆసనము దానముగ నిచ్చినవాడు పదివేలేండ్లు విష్ణులోకమునందు ప్రతిష్ట గాంచును. బ్రాహ్మణునకు బాగుగ పాలిచ్చునట్టి గోవును దానముచేసిన నాలుగింతలు పుణ్యతీర్థమున నూఱింతలును నారాయణ క్షేత్రమున కోటి రెట్లు పుణ్యఫల మబ్బును. ఈ పుణ్య భారతదేశమునందు పరభక్తితో గోదానము చేయువాడు పదివేలేండ్లు చంద్రలోకమునందు మహిమలు గాంచును. ఎవ్వాడు రెండు ముఖముల(ఈనుచున్న) గోవును బ్రాహ్మణునకు దానము చేయునో దాని వెండ్రుకలెన్నో యన్ని యేడులు విష్ణులోకమందు కీర్తిగాంచును. ఎవ్వడు బ్రాహ్మణునకు తెల్లగొడుగు దానము చేయునో యతడు వరుణాలయమున పదివే లేడులు సుఖసార మున తేలియాడును. వస్తర్రములులేని విప్రునకు రెండు వస్త్రముల దాన మిచ్చినవాడు వాయులోకమున పదివేలేండ్లు చల్లని గాలులు పీల్చుకొనును బ్రాహ్మణునకు సాలగ్రామమును వస్త్రములును దాన మొసంగినవాడు సూర్యచంద్రు లుండు నందాకవైకుంఠధామమున పరమానంద మొందును. బ్రాహ్మణునకు మేలైన పడకపానుపును దానమిచ్చిన పుణ్యాత్ముడు చంద్రలోకమున సూర్యచంద్రు లుండు నందాక ఉండును. దేవతలకును బ్రాహ్మణులకును దీపదానము చేయువాడు నొక మన్వంతర మంతవఱకుబ్రహ్మలోకమున సమ్ముదము నొందును.

కరోతి గజదానం చ యది విప్రాయ భారతే | యావదింద్రో నరస్తావ దింద్రస్యార్దాసనే వసేత్‌. 15

భారతే యోశ్వ దానం చ కరోతి బ్రాహ్మణాయ చ | మోదతే వారుణలోకే యావదిం ద్రా శ్చ తుర్దశ. 16

ప్రకృష్టాం శిబికాం యోహి దదాతి బ్రాహ్మణాయ చ | మోదతే వారుణలోకే యావదిం ద్రాశ్చ తుర్దశ. 17

ప్రకృష్టాం వాటికాం యోహి దదాతి బ్రాహ్మణాయ చ | మహీయతే వాయులోకే వర్ణాణామయుతం ధ్రువమ్‌. 18

యో దదాతి చ విప్రాయ వ్యజనం శ్వేతచామరమ్‌ | మహీయతే వాయులోకే వర్షాణామయుతం ధ్రువమ్‌. 19

ధాన్యం రత్నం యోదదాతి చిరం జీవీ భ##వేత్సుధీః | దాతా గ్రహీతాతౌ ద్వౌచధ్రువం వైకుంఠగా మినౌ. 20

సతతం శ్రీహరేర్నామ భారతే యోజపేన్నరః | స ఏవ చిరజీవీ చ తతో మృత్యుః పలాయతే. 21

యోనరో భారతే వర్షే డోలనం కారయే త్సుధీః | పూర్ణిమారజనీశేషే జీవన్ముక్తో భ##వేన్నరః. 22

ఇహలోకే సుఖం భుక్త్వా యాత్యంతే విష్ణు మందిరమ్‌ | నిశ్చితం నివసే త్తత్ర శతమన్వంతరావధి. 23

ఫల ముత్తర ఫల్గున్యాం తతోపి ద్వి గుణం భ##వేత్‌ | కల్పాంతజీవీ స భ##వే దిత్యాహ కమలో ద్బవః. 24

తిలదానం బ్రాహ్మణాయ యఃకరోతి చ భారతే | తిలప్రమాణ వర్షం చ మోదతే శివమందిరే. 25

తతః సు యోనిం సప్రాప్య చిరజీవీ భ##వే త్సు ఖీ | తా మ్రపాత్రస్య దానేన ద్విగుణం చ ఫలం లభేత్‌. 26

సాలం కృతాం చ భోగ్యాం చ సవస్త్రాం సుందరీం ప్రియామ్‌

యో దదాతి బ్రాహ్మణాయ భారతే చ పతివ్రతామ్‌. 27

మహీయతే చంద్రలోకే యావ దింద్రా శ్చ తుర్ధశ | తత్ర సర్వేశ్యయా సార్ధం మోదతే చ దివానిశమ్‌. 28

ఈ పవిత్ర భారతభూమిపై బ్రాహ్మణునకు గజదానము చేయువా డింద్రుని యాయు వంతకాల మింద్రుని యర్ధాసనమున గూర్చుండును. అశ్వదానమును బ్రాహ్మణునకు చేసినవాడు వరుణుని భవనమున పదునాలుగు రింద్రులంత కాలము సుఖము లనుభవించును. బ్రాహ్మణునకు పల్లకి దానము చేసినవాడు పదునల్గు రింద్రు లంతకాలము వరుణలోకమున సుఖసంతోషము లందుచుండును. మంచి పూదోటను దాన మిచ్చినవాడు మన్వంతర మంతకాలము వాయులోకమున మధుర మగు ఘుమఘుమలు పీల్చుకొనుచుండును. ఎవ్వడు బ్రాహ్మణునకు విసనకర్రను వింజామరమును దానము చేయునోయతడును పదివేలేండ్లు వాయులోకమున పిల్లగాలులు పీల్చుకొనుచుండును. ధాన్యమును రత్నమును దానము చేసినవాడు చిరంజీవి యగును. ఈ దాత-ప్రతిగ్రహీత యిర్వురును వైకుంఠమున కేగుదురు. ఈ ధన్య భారతభూమిపై నిరంతరమును శ్రీహరి రామ నామ సంకీర్తనము సలుపువాడు చిరంజీవి యగును. అతనిని చూచి మృత్యువు పారిపోవును. సుశ్లోకమైన భారత వర్షమున పున్నమినాడు రాతిరి దేవీ డోలోత్సవమును జరుపువాడు జీవన్ముక్తు డగును. అతడిచ్చట సుఖముల బడసి పిదప విష్ణులోకమున నూఱు మన్వంతరము లందాక సౌఖ్యము లనుభవించును. ఈ డోలోత్సవము నుత్తర ఫల్గుని నక్షత్రమందు జరిపినచో దానికి రెండింతల ఫల మబ్బును. అతడు ఆ కల్పాంతము జీవించునని బ్రహ్మయనెను. బ్రాహ్మణునకు తిలదానము చేయువాడు తిల లెన్నిగలవో యన్నియేడులు శివలోకమున మహిమ లొందుచుండును. అతడు పిదప నుత్తమ జన్మమొంది చిరంజీవి యగును. తామ్రపాత్రను దానమొసంగినవాడు దానికి రెండు రెట్లు ఫలము బొందును. ఈ రమ్యభారత ఖండమున సాలంకృత- సుందరి-భోగ్య-సువస్త్ర-పతివ్రత యగు తన ప్రియపత్నిని దాన మిచ్చినవాడు. పదునల్గు రింద్రు లంత కాలము దనుక చంద్రలోకమందున నచ్చరలేమలతో సుఖించును. (ఇట్టి భార్యను దాన మిచ్చి తిరిగి ఆ బ్రాహ్మణునకు ఆమె తూకముగల బంగార మిచ్చి యామెను కొనవలయును)

తతో గంధర్వలోకేచ వర్షాణా మయుతం ధ్రువమ్‌ | దివానిశం కౌతుకేన చోర్యశ్యా సహ మోదతే. 29

తతో జన్మ సహస్రం చ ప్రాప్నోతి సుందరీం ప్రియామ్‌ | సతీం సౌభాగ్యయుక్తాం చ కోమలాం ప్రియవాదినీమ్‌. 30

ప్రదదాతి ఫలం చారు బ్రాహ్మణా య చ నరః | ఫలప్రమాణ వర్షం చ శక్రలోకే మహీయతే. 31

పునః సుయోనిం సంప్రాప్య లభ##తే సుతముత్తమమ్‌ | సఫలానాం చ వృక్షాణాం సహస్రంచ ప్రళంసితమ్‌. 32

కేవలం పలిదానంవా బ్రాహ్మణాయ దదాతి చ | సుచిరం స్వర్గవాసం చ కృత్వాయాతి చ భారతే. 33

నానా ద్రప్యసమా యుక్త నానా సస్యసమన్వితమ్‌ | దదాతి యశ్చ విప్రాయ భారతే విపులం గృహమ్‌. 34

సురలోక వసేత్సోసి యావన్మ న్వం తరం శతమ్‌ | తతఃసుయోనిం సంప్రాప్య సమహాధనవాన్బ వేత్‌. 35

యోనరః సస్యసంయుక్తాం భూమిం చ సుచిరాం సతి | దదాతి భక్త్యా విప్రాయ పుణ్యక్షేత్రే చ భారతే. 36

మహీయతే చ వైంకుఠే మన్వంతర శతం ధ్రువమ్‌ | పునః సుయోనిం సంప్రాప్య మహాంశ్చ భూమిపో భ##వేత్‌. 37

తం న త్యజతి భూమిశ్చ జన్మనాం శతకం పరమ్‌ | శ్రీమాం శ్చ ధనవాం శ్చైవ పుత్రవాం శ్చ ప్రజేశ్వరః. 38

యో వ్రజం చ ప్రకృష్టం చ గ్రామంద ద్యా ద్ద్వి జాయచ | లక్షమన్వంతరం చైవ వైకుంఠేస మహీయతే. 39

పునః సయోనిం సంప్రా ప్య గ్రామ లక్షసమన్వితమ్‌ | నజహాతి చ తంపృథివీ జన్మనాం లక్షమేవచ. 40

సుప్రజం చ ప్రకృష్టం చ పక్వ సస్య సమన్వితమ్‌ | నానా పుష్కరిణీవృక్ష ఫలవల్లీ సమన్వితమ్‌. 41

నగరం యశ్చ విప్రాయ దదాతి భారతే భువి | మహీయతే సకైలాసే దశలక్షేంద్రకాలకమ్‌. 42

అతడా పిమ్మట గంధర్వలోక మేగి పదివేలేండ్లు రేబవళ్ళు సూర్వశిని గూడి సుఖించును. అతడా పిదప వేయిజన్మల వఱకును మధురవాణి-కోమలి-సౌభాగ్యవతి-సుందరియు నగు భార్యను పొందుచుండును బ్రాహ్మణునకు ఫలదానము చేయువాడు ఫలము లెన్నో యన్ని యేడుల దనుక నింద్రలోకమున సుఖము లొందును. అడు తరువాత నుత్తమ జన్మమొంది సుపుత్రులను బడయును. వేయి ఫలవృక్షములు దానము చేయుట చాలా శ్రేష్ఠము. కేవలము ఫలదానమే చేయువాడు స్వర్గసుఖము లనుభవించి తిరిగి దేవకామ్యమగు భారతమున జన్మించును. ధనధాన్య సంపన్నమైన మంచి యింటిని బ్రాహ్మణునకు దానముగ నిచ్చినవాడు నూఱు మన్వంతరములందాక సురలోక సౌఖ్యము లొంది పిదప నుత్తమ జన్మమొంది ధనవంతు డగును. సస్యశ్యామలమగు భారతభూమిపైపైరు-పంటల నలరారు పచ్చని పొలమును బ్రాహ్మణునకు దానము చేసినవాడు నూఱు మన్వంతరము లంతకాలము విష్ణులోకమున సుఖించును. ఆ పిదప నుత్తమ జన్మ మొంది మహారాజు గాగలడు. అతడు నూఱు జన్మముల వఱకును ప్రజాపతి-ధనవంతుడు-శ్రీమంతుడు-ప్రజావంతుడు-భూమి గలవాడునై వెలుగగల్గును. బ్రాహ్మణున కావులమందను మంచి గ్రామమును దానము చేయువాడు లక్ష మన్వంతరముల వఱకు వైకుంఠ సౌఖ్యము లొందును. అతడు పిమ్మట నుత్తమ జన్మ మొంది లక్ష గ్రామాధిపతి గాగలడు. అతడు లక్షజన్మముల వఱకును భూమి సంపదలు గలవాడగును. పండిన ఫలసస్యములు పండ్లతీగెలు పెక్కు పుష్కరిణులు ఫలవృక్షములును అను వానితో నలరారు నగరమును బ్రాహ్మణున కీ పరమపూతమైన భరతభూమిపై దాన మిచ్చినవాడు శివలోకమున పది లక్షల యింద్రు లంతకాలము సుఖము లొందును.

పునః సుయోనిం సంప్రాప్య రాజేంద్రో భారతే భ##వేత్‌ | నగరాణాం చ నియుతం సలభేన్నాత్ర సంశయః. 43

ధరా తం న జహాత్యేవ జన్మనా మయుతం ధ్రువమ్‌ | పరమేశ్వర్యనిలయుతో భ##దే దేవ మహీతలే. 44

నగరాణాం చ శతకం దేశం యోహి ద్విజాతయే | సుప్రకృష్టం మధ్య కృష్టం ప్రజాయుక్తం దదాతి చ. 45

వాఫీ తడాగ సంయుక్తం నానా వృక్ష సమన్వితమ్‌ | మమీయతే సవైకుంఠే కోటి మన్వంతరావధి. 46

పునః సుయోనిం సంప్రాస్య జంబుద్వీప పతిర్బవేత్‌ | పరమేశ్వర్య సంయుక్తో యథాశక్రస్తథా భువి. 47

మహీ తం న జహాత్యేవ జన్మనాం కోటి మేవచ | కల్పాంత జీవీ సభ##వే ద్రాజరాజోశ్వరో మహాన్‌. 48

స్వాధికారం సమగ్రంచ యోదదాతిద్వి జాతయే | చతుర్గుణం ఫలం చాంతే భ##వేత్తస్య న సంశయః. 49

జంబుద్వీపం యోదదాతి బ్రాహ్మణాయుతపస్వినే | ఫలం శతగుణం చాంతే భ##వేత్తస్య న సంశయః. 50

జంబుద్వీప మహీదాతుః సర్వతీర్థానిసే వితుః | సర్వేషాం తపసాంకర్తు స్సర్వేషాం వాసకారిణః. 51

సర్వ దానం ప్రదాతు శ్చ సర్వసి ద్దేశ్వరస్య చ | అస్త్యేవ పునరావృత్తిర్న భక్తస్య మహేశితుః 52

అ సంఖ్య బ్రాహ్మణాం పాతం పశ్యం తిభువనేశితుః | నివసంతి మణిద్వీపే శ్రీదేవ్యాః పరమేపదే. 53

దేవీ మంత్రో పాసకాశ్చ విహాయ మానవీం తనుమ్‌ | విభూతిం దివ్యరూపం చ జన్మమృత్యు జరాహరమ్‌. 54

లబ్ద్వా దేవ్యా శ్చ సారూప్యం దేవీ సేవాంచ కుర్వతే | పశ్యంతి తే మణిద్వీపే స ఖండం లోక సంక్షయమ్‌. 55

నశ్యంతి దేవాః సిద్ధా శ్చ విశ్వాని నిఖిలాని చ | దేవీభక్తా ననశ్యంతి జన్మమృత్యుజరాహరాః. 56

అతడా పిదప జన్మ మెత్తి మహారాజగును. లక్ష గ్రామములు తప్పక సంపాదించును. అతనిని పదివేలేండ్లు వఱకును భూమి వదలిపెట్టదు. అతడు నేలపై నైశ్వర్యవంతు డగును. ఉత్తమ-మధ్యమజాతులతో నలరారు నూఱు నగరముల దేశమును బ్రాహ్మణునకు దాన మీయవలయును. ఆ నగరములు-వాపీ-తటాకములతో పెక్కు వృక్షములతో నొప్పుచుండవలయును. ఆ విధముగ దానము చేసినవాడు కోటిమన్వంతరము వఱకును వైకుంఠ సౌఖ్యము లనుభవించును. అతడు పిదప నుత్తమ జన్మమొంది జంబూద్వీపమున కేలిక గాగలడు. అతడీ నేలపై నింద్రునివలై సకలైశ్వర్యము లందును. అట్టి మహాదాతను భూమాత కోటి జన్మముల వఱకును వదలదు. అతడు కల్పాంతజీవి - రాజరాజేశ్వరుడు గాగలడు. తనకున్న యధికార మంతయు నొక విప్రున కప్పగించినవాడు చివరకు దానికి నూఱు రెట్లుధికారము బడయ గలడు. ఒక తబిసియగు బాపనికి జంబూద్వీపమును దాన మిచ్చినవాడు తప్పక దానికి నూఱు రెట్లుగ నధికార మొందగలడు. ఇటుల జంబూద్వీపదాతకు నెల్ల తీర్థములు సేవించినవానికి నెల్లతపములు చేసినవానికి సర్వ తీర్థముల వసించిన వానికిని సకల దానము లొనర్చినవానికిని సకల సిద్ధులు బడసిన వానికిని పునరావృత్తి గలదు. కాని మహేశ్వరి భక్తులకు తిరిగి జన్మలేదు. పరమపదమైన శ్రీదేవి మణిద్వీపమున నివసించు పరభక్తు లెందరెందరో బ్రహ్మలుపుట్టి గిట్టుటలు చూచుచుందురు. శ్రీదేవీ మంత్రోపాసకు లీ మానవ శరీరము విడనాడి చావుపుట్టువులు ముదిమి లేనట్టి దివ్యరూపము దాల్తురు. వారు మణిద్వీపము చేరి దేవీ సారూప్యమొంది దేవి కైంకర్యములు-సేవలు చేయుచు నచటినుండి పెక్కు లోకములు నశించుట గాంచగల్గుదురు. ఎల్ల సిద్ధులు -దేవతలు సకల విశ్వములును నశించును గాని జన్మ-మృత్యు జరాదులులేని శ్రీదేవి భక్తులకు నాశము లేనేలేదు.

కార్తికే తులసీ దానం కరోతి హరయే చ యః| యుగత్రయప్రయాణం చ మోదతే భూరిమందిరే. 57

పునః సుయోనిం సంప్రాప్య హరిభక్తి లభేద్ద్రువమ్‌ | జితేంద్రియాణాం ప్రవర: సభ##వే ద్బారతే భువి. 58

మధ్యే యః స్నాతి గంగాయా మరుణోదయ కాలతః | యుగషష్టి సహస్రాణి మోదతే హరిమందిరే. 59

పునః సుయోనిం సంప్రాప్య విష్ణు మంత్రం లభేద్ద్రువమ్‌ | త్యక్త్వా చ మానుషం దేహం పునర్యాతి హరేఃపదమ్‌.

నాస్తి తత్పునరావృత్తిర్వై కుంఠా చ్చ మహీతలే | కరోతి హరి దాస్యం చ తథా సారూప్య మేవచ. 61

నిత్య స్నాయీ చ గంగాయాం స పూతః సూర్య పద్బువి | పదే పదే శ్వమేధస్య లభ##తే నిశ్చితం ఫలమ్‌. 62

తసై#్యవ పాద రజసా పద్యః పూతా వసుంధరా | మోదతేస చ వైకుంఠే యావచ్చంద్ర దివాకరౌ. 63

పునః సుయోనిం సంప్రాప్య హరిభక్తిం లభేద్ద్రువమ్‌ | జీన్ముక్తోతి తేజస్వీ తపస్వి ప్రవరో భ##వేత్‌. 64

స్వధర్మ నిరతః శుద్ధో విద్వాంశ్చ స జితేంద్రియః | మీన కర్కట యోర్మధ్యే గాఢం తపతి భాస్కరః. 65

భారతే యో దదాత్యేవ జలమేవ సువాసితమ్‌ | స మోదతే చ కైలాసే యావదింద్రాశ్చతుర్దశ. 66

పునఃసు యోనిం సంప్రాప్య రూపవాం శ్చ సుఖీభ##వేత్‌ | శివ భక్త శ్చ తేజస్వీ వేదవేదాంగ పారగః. 67

వైశాఖే సక్తు దానం చ యః కరోతి ద్వి జాతయే | సక్తు రేణు ప్రమాణా బ్దం మోదతే శివ మందిరే. 68

కరోతి భారతే యోహి కృష్ణజన్మాష్ట మీవ్రతమ్‌ | శతజన్మ కృతం పాపం ముచ్యతే నాత్ర సంశయః. 69

వైకుంఠే మోదతే సోపి యావదింద్రా శ్చ తుర్దశ | పునః సుయోనిం సంప్రాప్య కృష్ణే భక్తిం లభేద్ధ్రువమ్‌.

కార్తిక మాసమున శ్రీహరి కొక్క తులసీదళ మర్పించువాడు మూడు యుగముల వఱకును హరి మందిరమున మోదమొందును. ఆ పిదప నతడుప్రజ్ఞానఖని యగు భారతభూమిపై నుత్తమ జన్మమెత్తి జితేంద్రియుడు-హరిభక్తుడు గాగలడు. సూర్యోదయ మపుడు గంగలో మునుంగు వా డారువేల యుగముల వఱకును శ్రీహరి మందిరమున సుఖముల బడయును. అతడటు పిమ్మట పుణ్యపదమగు భారతమునందున్నతమైన కుటుంబమున జన్మించి విష్ణుమంత్రము జపించును. మేనువదలి హరిలోక మేగును. అల వైకుంఠపురంబునుండి పునరావృత్తి గల్గదు. హరి తన భక్తులకు సారూప్యముక్తి నొసంగును. గంగలో నిత్యమును స్నాన మొనర్చువాడు సూర్యునివలె పవిత్రుడగును. అతని కడుగడుగున నశ్యమేధ ఫలము లబ్బును. అతని పాదధూళి తగులగ భూమి పవిత్రమగును. అతడు సూర్యచంద్రు లుండు నందాక వైకుంఠ ధామమునందు సుఖించును. అతడు మఱుజన్మలో నుత్తమ వంశమందు బుట్టి విష్ణుభక్తుడగును. మఱియు తపస్వి తేజస్వి జీవన్ముక్తుడునగును. స్వధర్మనిరతుడు. జితేంద్రియుడు శ్రోత్రియుడు నిష్కాముడు శుచి యగు విద్వాంసుడు మీన కర్కట రాసుల మధ్య వెల్గు రవివలె ప్రకాశించును. ముని ప్రశాంతమగు భారతభూమిపైసుగంధజలము లిచ్చువాడు కైలాసమున పదునల్గు రింద్రు లుండు నందాక సుఖశాంతు లొందును. అతడా పిదప నుత్తమ జన్మమెత్తి రూపవంతుడు సుఖవంతుడు శివభక్తుడు తోజోవంతుడు వేదవేదాంగము లెఱిగినవాడు నగును. వైశాఖమున పేల పిండి దానముచేయువాడందలి రేణువు లెన్నిగలవో యన్ని యేడులు శివమందిరమునందు సుఖము లొందును. కోటిపుణ్యముల గనియగు భారతదేశమందు శ్రీకృష్ణ జన్మాష్టమీ మహోత్సవము జరుపువాడు తన నూఱు జన్మలనుండి చేసిన పాపముల నుండి విముక్తుడగును. అతడు పరమపదమగు వైకుంఠమున పదునల్గు రింద్రులుండు నంతకాలము సుఖసంతోషము లొంది పిదప నుత్తమ జన్మమెత్తి ధ్రువమైన కృష్ణభక్తి గలవా డగును.

ఇహైవ భారతే వర్షే శివరాత్రిం కరోతి యః | మోదతే శివలోకే స సప్తమన్వంతరావధి. 71

శివాయ శివరాత్రౌ చ బిల్వ పత్రం దదాతి చ | పత్రమాన యుగం తత్ర మోదతే శివ మందిరే. 72

పునఃసు యోనిం సంప్రాప్య శివభక్తిం లభే ద్ధ్రువమ్‌ |

విద్యావాన్పుత్రవామ్‌ శ్రీమాన్ర్పజా వాన్బూమి మాన్బవేత్‌. 73

చైత్ర మాసేథవా మాఘే శంకరం యోర్చ యేద్ర్వతీ కరోతి నర్త నం భక్త్యా వేత్ర పాణిర్దివా నిశమ్‌. 74

మాసంవా వ్యర్ధమాసం వా దశసప్త దినాని చ | దినమానయుగం సోపి శివలోకే మహీయతే. 75

శ్రీరామ నవమీం యో హి కరోతి భారతే పుమాన్‌ | సప్త మన్వంతరం యావన్మోదతే విష్ణు మందిరే. 76

పునః సుయోనిం సంప్రాప్య రామభక్తిం లభే ద్ద్రువమ్‌ | జితేంద్రియాణాం ప్రవరో మహాం శ్చ ధనవాన్బవేత్‌.

పునః సుయోనిం సంప్రాప్య రామభక్తిం లభేద్ధ్రువమ్‌ | జితేంద్రియాణాం ప్రవరో మహాం శ్చ దనవాన్బవేత్‌.

శారదీయం మహాపూజాం ప్రకృతేర్యః కరోతి చ | మహిషై శ్చా గలైర్మేషైః ఖడ్గై ర్బేకాదిభిః సతి. 78

నైవేద్యై రుపహారై శ్చ ధూప దీపాదిభి స్తథా | నృత్య గీతా దిభి ర్వాద్యై ర్నానా కౌతుక మంగళమ్‌. 79

శివలోకే వసేత్సోపి సప్తమ న్వం తరావధి | పునః సుయోనిం సంప్రాప్య నరోబుద్ధిం చ నిర్మలామ్‌. 80

అతులాం శ్రియ మాప్నోతి పుత్ర పౌత్ర వివర్ధనమ్‌ | మహాప్రభావ యుక్తశ్చ గజవాజి సమన్వితః. 81

రాజ రాజేశ్వరః సోపి భ##వే దేవ న సంశయః | తతః శుక్లాష్టమీం ప్రాప్యమహాలక్ష్మీంచ యోర్బయేత్‌. 82

నిత్యం భక్త్యా పక్ష మేకం పుణ్యక్షేత్రే చ భారతే | దత్వా తసై#్య ప్రకృష్టాని చోపచారిణి షోడశ. 83

గోలోకే చ వసేత్సోపియాపదింద్రా శ్చతుర్దశ | పునః సుయోనిం సంప్రాప్య రాజరాజేశ్వరో భ##వేత్‌. 84

కోటి రతనాలగని యగు భారతభూమిపై మహాశివరాత్రి వ్రతము జరపు వాడేడు మన్వంతరములంతకాలము శివ లోకమున సుఖములొందును. మహాశివరాత్రియందు పరమశివునకుబిల్వపత్రము లర్పించువాడెన్ని పత్రములిచ్చునో యన్ని యుగములు కైలాసగిరి మీద మోదములందుచుండును. అతడు తర్వాత నుత్తమజన్మమెత్తి శ్రీవిద్యావంతుడు ప్రజాపుత్ర వంతుడును శివభక్తుడును గాగలడు. చైత్రమునగాని మాఘమునగాని శంకరుని పూజలు సల్పుచు బెత్తము చేతబూని భక్తితో రాత్రింబగళ్ళు నాట్యము చేసినను లేక నెలగానినెలలో సగముగానిపది దినములుగాని వారముగాని దినముగాని యెన్ని దినములైన నన్ని యుగములు శివలోక సౌఖ్యములందును. తత్వనిలయమగు భారతభూమిపై శ్రీరామనవమీ మహోత్సవమును జరపువాడేడు మన్వంతరములవఱకును విష్ణులోకసౌఖ్యము లనుభవించును. అతడు పిమ్మట నుత్తమజన్మమెత్తి రామభక్తుడు గాగలడు. అతడుజితేంద్రియుడు మహాధనవంతుడు గాగలడు. ఎవ్వడు శరత్కాలమున దేవీనవరాత్రులు జరపునో దేవికి ఎనుబోతు మేక గొర్రె బలిచేసినైవేద్యమిచ్చునో దేవికి ధూపదీప నైవేద్యములర్పించునో మంగళకరములగు నృత్యగీతములతోమహోత్సవము జరపునో అతడు శివలోకమునందు నేడు మన్వంతరములవఱకు సుఖములొందురు. పిదప నుత్తమజన్మమెత్తి నిర్మలుడు బుద్ధిమంతుడు నగును. అతడు తులలేని సంపదలనుభవించును. పుత్రపౌత్రులతో సుఖించును. ఏనుగులు గుఱ్ఱములు గలవాడు ప్రభావయుతుడు నగును. అతడు కేవలము రాజరాజేశ్వరుడగును. ఇది ముమ్మాటికి నిజము. ఎవ్వడు శుక్లాష్టమినాడు మహాలక్ష్మిని పూజించునో భారతదేశమందలి యేదైన పుణ్యక్షేత్రమందొక పక్షమునాళ్లు లక్ష్మీ దేవిని షోడశోపచారములతో నర్చించునో అతడుగోలోకమునందు పదునల్గురింద్రులుండు నంతకాలము సుఖశాంతులు పొందుచుండును. పిదప నుత్తమ జన్మమెత్తి రాజరాజేశ్వరుడు గాగలడు.

కార్తికీ పూర్ణిమాయాం తు కృత్వాతు రాసమండలమ్‌ | గోపానాం శతకం కృత్వా గోపీనాం శతకం తథా. 85

శిలాయాం ప్రతిమాయాం చ శ్రీ కృష్ణం రాధయాసహ | భారతే పూజయేద్బ క్త్యా చోపహారాణి షోడశ. 86

గోలోకే వసతే సోపి యావద్వై బ్రహ్మణో వయః | భారతం పునరాగత్య కృష్ణే భక్తిం లభే ద్ధృఢామ్‌. 87

క్రమేణ సుదృఢాం భక్తిం లబ్ధ్వా మంత్రం హరేరహో | దేహం త్యక్త్వా చ గోలోకం పునరేవ ప్రయాతిసః. 88

తతః కృష్ణస్య సారూప్యం పార్షద ప్రవరో భ##వేత్‌ | పునస్త త్ప తనం నాస్తి జరామృత్యుహరో భ##వేత్‌. 89

శుక్లాం వాప్యథవా కృష్ణాం కరోత్యేకాదశీం చ యః | వైకుంఠే మోదతేసోపి యావద్వై బ్రహ్మణో వయః. 90

భారతం పునరాగత్య కృష్ణ భక్తిం లభే లభే ద్ద్రువమ్‌ | క్రమేణ భక్తిం సుదృఢాం కరోత్యేకాం హరే రహో. 91

దేహం త్య క్త్యా చ గోలోకం పునరేవ ప్రయాతి సః | తతః కృష్ణస్య సారూ ప్యం సంప్రాప్య పార్షదో భ##వేత్‌. 92

పున స్త త్పతనం నాస్తి జరామృత్యుహరో భ##వేత్‌ | భాద్రే మసే చ ద్వాద శ్యాం యః శక్రం పూజయే న్నరః. 93

షష్టి వర్ష సహప్రాణి శక్రలోకే మహీయతే | రవివారే చ సంక్రాం త్యాం సప్తమ్యాం శుక్లపక్షకే. 94

సంపూజ్యార్కం హ విష్యాన్నం యఃకరోతి చ భారతే | మహీయతే సోర్కలోకే యావదింద్రాశ్చ తుర్దశ. 95

భారతం పునరాగత్య చారోగీ శ్రీయుతో భ##వేత్‌ | జ్యేష్ఠ కృష్ణ చతుర్దశ్యాం సావిత్రీం యోహి పూజయేత్‌. 96

మహీయతే బ్రహ్మలోకే సప్తమన్వంతరా వధి | పునర్మ హీం సమాగత్య శ్రీమానతుల విక్రమః. 97

చిరజీవీ భ##వేత్సో7పి జ్ఞానవాన్సంపదాయుతః | మాఘస్య శుక్ల పంచమ్యాం పూజయేద్యః సరస్వతీమ్‌. 98

కార్తిక పూర్ణిమనాడు వందలాది గోపికలను గూర్చుకొని రాసమండల మహోత్సవము జరుపుచు శ్రీరాధాకృష్ణుల విగ్రహములను షోడశోపచారములతో భారతదేశమున భక్తితో పూజలు చేయు నతడు బ్రహ్మజీవిత మంత కాలమును గోలోకమున సుఖించి పిదప నుత్తమజన్మముదాల్చి భారతదేశమున శ్రీకృష్ణ భక్తిలో తన్మయుడగును. అతడు నిశ్చలభక్తితో శ్రీహరి మంత్రము జపించి శరీరము వదలిన పిమ్మట మరల గోలోకము చేరును. అతడచట హరికనుచురుడై కృష్ణసారూప్యమొందును. అతనికి మఱి జన్మలేదు. చావు లేదు. ముదిమి లేదు. శుద్ధమందుగాని బహుళమందుగాని యేకాదశీ పుణ్యవ్రతము జరుపువాడు బ్రహ్మ జీవితమంతకాలము వైకుంఠ సుఖములొందును. అతడు తిరిగి పరలోక యానమగు భారతభూమిపై పుట్టి కృష్ణభక్తుడై క్రమముగ హరిభక్తిలో మునిగిపోవును. అతడు మరల దేహము వదలి గోలోకమేగి కృష్ణ సారూప్యమొంది హరిపార్షదు డగును. అతనికి చావు పుట్టుకలు - ముదిమి గలుగవు. భాద్రపద శుద్ధ ద్వాదశియందు నింద్రుని పూజించినవాడు అరువదివేల యేడు లింద్రలోకమునందు సుఖములొందును. సంక్రాంతినాడుగాని శుద్ధ సప్తమినాడుగాని ఆదివారమునగాని భారతదేశమందు సూర్యునిపూజించు హవిష్యాన్నము తినువాడు పదునల్గు రింద్రులంతకాలము సూర్యలోకమున వెల్గును. అతడు కర్మభూమి యగు భారతమునకువచ్చి శ్రీమంతుడు ఆరోగ్యవంతుడు నగును. జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు సావిత్రిని గొలువవలయును. అతడేడు మన్వంతరములదాక బ్రహ్మలోకమున ప్రతిష్ట గాంచును. పిదప భూమిభాగ్య మగు భారతమును వచ్చి విక్రముడు ధనవంతుడు నగును. అతడు జ్ఞాని-ధని-చిరంజీవియు నగును. మాఘశుక్ల చవితినాడు మహా సరస్వతిని పూజించవలెను.

సంయతో భక్తితో దత్వాచోప చారాణి షోడశ | మహీయతే మణిద్వీపే యావద్ర్బహ్మ దివానిశమ్‌. 99

సంప్రాప్యచ పునర్జన్మ సభేవేత్కవి పండితః | గాం సువర్ణాదికం యోహి బ్రాహ్మణాయ దదాతి చ. 100

నిత్యం జీవన పర్యంతం భక్తి యుక్తశ్చ భారతే | గవాం లో మప్రమాణాబ్దం ద్విగుణం విష్ణు మందిరే. 101

మోదతే హరిణా సారం క్రీడాకౌతుక మంగళైః | తదంతే పునరాగత్య రాజరాజేశ్వరో భ##వేత్‌. 102

శ్రీమాంశ్చ పుత్రవాన్వి ద్వాన్‌ జ్ఞాన వాన్సర్వతః సుఖీ | భోజయే ద్యోపి మిష్టాన్నం బ్రాహ్మణభ్యశ్చ భారతే. 103

విప్రలోమ ప్రమాణాబ్దం మోదతే విష్ణుమం దిరే | తతః పునరిహాగత్యసుఖీ చ ధనవాన్బవేత్‌. 104

విద్వాన్సుచిర జీవీ చ శ్రీమానతుల విక్రమః | యోవక్తివా దదాత్యేవ హరేర్నామాని భారతే. 105

యుగం నామ ప్రమాణం చ విష్ణులోకే మహీయతే | తతః పునరిహాగత్య సుఖీ చ ధనవాన్బవేత్‌. 106

యదినారాయణ క్షేత్రే ఫలం కోటిగుణం భ##వేత్‌ | నామ్నాంకోటిం హరేర్యో హి క్షేత్రే నారాయణ జపేత్‌. 107

సర్వపాప వినిర్ముక్తో జీవన్ముక్తో భ##వే ద్ధ్రువమ్‌ | న లభేత్స పునర్జన్మ వైకుంఠే చ మహీయతే. 108

లభే ద్విష్ణో శ్చ సారూప్యం న తస్య పతనం భ##వేత్‌ | | విష్ణు భక్తిం లభేత్సోపి విష్ణు సారూప్యమాప్నుయాత్‌. 109

శివం యః పూజయేన్నిత్యం కృత్వా లింగం చ పార్థివమ్‌ | యావజ్జీవన పర్యంతం సయాతి శివమందిరమ్‌. 110

మృదోరేణు ప్రమాణాబ్దం శివలోకే మహీయతే | తతః పునరిహాగత్య రాజేంద్రో భారతే భ##వేత్‌. 111

శిలాం చపూజయేన్నిత్యం శిలాతోయంచ భక్షతి | మహీయతే చ వైకుంఠే యావద్వై బ్రాహ్మణః శతమ్‌. 112

కడు భక్తితో షోడశోపచారములతో సరస్వతి నర్చించువా డొక కల్పముదాక మణిద్వీపమున మహితు డగును. అతడు మఱల జన్మించి విద్వత్కవిశేఖరు డగును. ఆనా డెవడు గోవును బంగారమును బాపనికి దానము చేయునో అతడు భారత భూమిపై బ్రదికి నంతకాలము పరమభక్తుడగును. గోవురోమము లెన్నో యన్నిటికి రెండింతల సంవత్సరములు విష్ణులోకమున వెలుగుచుండును. అతడచ్చోట హరితోబాటు శుభములు వేడుకలు బడయుచుండును. ఆ పిదప తిరిగి వచ్చి రాజరాజేశ్వరు డగును. అతడు పుత్ర-ధన-విద్యా-జ్ఞాన-సుఖము లందును. పవిత్ర భారతదేశమునందు బ్రాహ్మణశ్రోత్రి యులకు తుష్టిగ భోజనము పెట్టినవాడు. బ్రాహ్మణుల కెన్ని రోమములు గలవో యన్ని యేడులు శ్రీవిష్ణుధామమున సుఖము లొందును. అతడు పిమ్మట నిచటి కేతెంచి శ్రీమంతుడు సుఖవంతుడు నగును. మఱియు అతడు విద్వాంసుడు దీర్ఘజీవి విక్రమి యగును. తపోభూమియగు భారతమున శ్రీహరినామ ముచ్చరించుచు నితరులచేత పలికించు పుణ్యాత్ముడు. ఒక యుగమువఱకు వైకుంఠధామమున విరాజిల్లు చుండును. అతడు తరువాత నిచటికి వచ్చి ధని-సుఖి యగును. నారాయణ క్షేత్రమున హరినామ ముచ్చరించిన దానికి కోటిరెట్లు ఫలమొందును. నారాయణక్షేత్రమున నారాయణ జపముకోటి చేసిన ధన్యుడు పాపముక్తుడై జీవన్ముక్తుడగును. అతనికి తిరిగి జన్మము లేదు. అతడు వైకుంఠమున పరమానంద మొందుచుండును. అతడచట విష్ణు సారూప్య మొందును. అతనికి పతనము లేదు. అతడు విష్ణుభక్తిలో లీనుడైపోవును. పార్థివ లింగములోని రేణువు లెన్నో యన్ని యేడులు శివలోకమందు వసించి యతడు తిరిగి భారతదేశమున మహారాజగును. ఏపుణ్యశీలి నిత్యమును సాలగ్రామమును బూజించి పాపహరమగు సాలగ్రామ తీర్థము పుచ్చుకొనునో యతడు నూర్గురు బ్రహ్మ లందాక వైకుంఠమున నుండును.

తతో లబ్ధ్వా పునర్జన్మ హరిభక్తించ దుర్లభామ్‌ | మహీయతే విష్ణులోకే న తస్య పతనం భ##వేత్‌. 113

తపాంసి చైవ సర్వాణి వ్రతాని నిఖిలాని చ | కృత్వా తిష్ఠతి వైకుంఠే యావదింద్రా శ్చతుర్దశ. 114

తతో లబ్ధ్వా పునర్జన్మ రాజేంద్రో భారతే భ##వేత్‌ | తతోముక్తో భేవేత్పశ్చా త్పునర్జన్మ న విద్యతే. 115

యః స్నాత్వా సర్వ తీర్థేషు భువః కృత్వా ప్రదక్షిణామ్‌ | స తు నిర్వాణతాంయాతి న చ జన్మ భేవేద్బువి. 116

పుణ్యక్షేత్రే భారతే చ యోశ్వమేధం కరోతి చ | అశ్వలోమమితాబ్ధం చ శక్రస్యార్దాసనం లభేత్‌. 117

చతుర్గుణం రాజసూయ ఫలం ప్రాప్నోతి మానవః | సర్వేభ్యోపి మఖేభ్యో హి పరో దేవీమఖఃస్మృతః. 118

విష్ణునా చ కృతః పూర్వం బ్రహ్మణా చ వరాననే | శంకరేణ మహేశేన త్రిపురాసురనాశ##నే. 119

శక్తి యజ్ఞః ప్రధానశ్చ సర్వ యజ్ఞేషు సుందరి | నానేన సదృశో యజ్ఞ స్త్రి షులోకేషు విద్యతే. 120

దక్షేణ చ కృతః పూర్వం మహాన్సంవాద సంయుతః | బభూవ కలహో యత్ర దక్షశంకరయోఃసతి. 121

శేపుశ్చ నందినం విప్రా నందీ విప్రాం శ్చ కోపతః | యద్దేతో ర్ద క్షయజ్ఞం చ బభంజ చంద్ర శేఖరః 122

చకార దేవీ యజ్ఞం స పురా దక్షః ప్రజాపతిః | ధర్మశ్చ కశ్య పశ్చైవ శేషశ్చాపి చ కర్ధమః. 123

స్వాయంభువో మనుశ్చైవ తత్పుత్రశ్చ ప్రియవ్రతః | శివః సనత్కుమారశ్చ కపిలశ్చ ధ్రువస్తథా. 124

రాజసూయ సహస్రాణాం ఫలమాప్నోతి నిశ్చితమ్‌ | దేవీయజ్ఞా త్పరో యజ్ఞో నాస్తివేదే ఫలప్రదః. 125

వర్షాణాం శతజీవీ చ జీవన్ముక్తో భ##వే ద్ధ్రువమ్‌ | జ్ఞానేన తేజసాచైవ విష్ణుభృత్యో భ##వే దిహ. 126

అతడు తిరిగి జన్మించి దుర్లభ##మైన హరిభక్తిని బడసి మరల విష్ణులోకమునందు ప్రమోదములో నుండును. అతనికి తిరిగి జన్మలేదు. ఎల్ల తపములు వ్రతములు జరిపినవాడు పదునలుగురింద్రు లంతకాలము వైకుంఠమునందు సుఖశాంతు లొందుచుండును. ఆ పిదప భారతవర్షమున జన్మించి మహారాజ పదవి నలంకరించును. భూ ప్రదక్షిణము చేయుచు నెల్ల పుణ్యతీర్థణులందు స్నానము చేయువాడు తిరిగి పుట్టడు. పరమ నిర్వాణమొందును. ఈ పవిత్ర భారతదేశమున నశ్వమేధము చేయువాడశ్వమున కెన్ని రోమములుగలవో యన్ని యేడులింద్రు నర్దాసమున గూర్చుండును. రాజసూయ యాగము చేసినవాడు అశ్వమేధ ఫలమునకు నాలుగురెట్లు ఫలమొందును. అన్ని యజ్ఞముల కన్న దేవీ యజ్ఞము గొప్పది. పూర్వము త్రిపురాసుర సంహారమునకు బ్రహ్మవిష్ణు మహేశులు గలిసి దేవీ మహాయజ్ఞము జరిపిరి. సుందరీ| అన్ని యజ్ఞములలో శక్తి యజ్ఞము ప్రధానమైనది. ముల్లోకములందును దేవీయజ్ఞముతో సమానమైన యజ్ఞము లేదు. పూర్వమొకప్పుడు దక్షుడు దేవీ యజ్ఞమొనరించెను. కాని దాని మూలమున శంకరునకు దక్షునకు మధ్య మహావివాదము కలహము సంభవించెను. విప్రులు నందిని-నంది విప్రులను శపించుకొనిరి. అపుడుశివుని దక్షుని యజ్ఞమును విధ్వంసమొనర్చెను. ఆవిధముగ దక్షప్రజాపతి జరిపిన దేవీయాగము ముగిసెను. శ్రీదేవీ యజ్ఞమును కశ్యపుడు కర్ధముడు ధర్ముడు శేషుడు ఆచరించిరి. స్వాయంభువ మనువు అతని పుత్రుడు ప్రియవ్రతుడు శివుడు సనత్కుమారుడు కపిలుడు ధ్రువుడును దేవీయజ్ఞమొనరించిరి. ఒక్కదేవీ యజ్ఞము వేయి రాజసూయ యాగములఫలమిచ్చును. దేవీయజ్ఞముమహా ఫలప్రదమగు యజ్ఞము. అది వేయి రాజసూయ యాగముల ఫలమిచ్చును. దేవీ యజ్ఞముకన్న ఫలప్రదమగు యజ్ఞము లేదని వేదము. ఈదేవీ యజ్ఞమొనర్చినవాడు వందల సంవత్సరములు సుఖముగ బ్రదికి తుదకు జీవన్ముక్తుడగును. జ్ఞానతేజములతో వెల్గుచు విష్ణుభక్తుడగును.

దేవానం చ యథా విష్ణుర్వైష్ణవానాం చ నారదః | శాస్త్రాణాం చ యథా వేదా వర్ణానాం బ్రాహ్మణో యథా. 127

తీర్థానాం చ యథాం గంగా పవిత్రాణాం శివోయథా | ఏకాదశీ వ్రతానాం చ పుష్పాణాం తులసీ తథా. 128

నక్షత్రాణాం యథా చంద్రః పక్షిణాం గరుడో యథా | యథా స్త్రీణాం చ ప్రకృతీరాధావాణీ వసుంధరా. 129

శీఘ్రాణాం చేంద్రియాణాం చ చంచలానాం మనోయథా | ప్రజాపతీనాం బ్రహ్మా చ ప్రజానాం చ ప్రజాపతిః. 130

బృందావనం వనానాం చ వర్షాణాం భారతం తథా | శ్రీమతాం చ యథా శ్రీశ్చ విదుషాం చ సరస్వతీ. 131

పవివ్రతానాం దుర్గా చ సౌభాగ్యానాం చ రాధికా | దేవీ యజ్ఞ స్తథా వత్సే సర్వయజ్ఞేషు భామిని. 132

అశ్వమేధ శ##తేనైవ శక్రత్వం చ లభే ద్ద్రువమ్‌ | సహస్రేణ విష్ణుపదం సంప్రాప్తః పృథురేవచ. 133

స్నానం చ సర్వ తీర్థానాం సర్వయజ్ఞేషు దీక్షణమ్‌ | సర్వేషాం చ వ్రతానాం చ తపసాం ఫలమేవ చ. 134

పాఠే చతుర్ణాం వేదానాం ప్రాదక్షిణ్య భువస్తథా | ఫలభూత మిదం సర్వం ముక్తిదం శక్తి సేవనమ్‌. 135

పురాణషుచ వేదేషు చేతిహాసేషు సర్వతః | నిరూపితం సారభూతం దేవీ పాదాంబుజార్చనమ్‌. 136

తద్వర్ణనం చ తద్ద్యానం తన్నామగుణ కీర్తనమ్‌ | తత్త్సోత్ర స్మరణం చైవం వందనం జపమేవచ. 137

తత్తపాదోదకనైవేద్య భక్షణం నిత్య మేవచ | సర్వ సమ్మత మిత్యేవం సర్వేస్సితమిదం సతి. 138

భజ నిత్యం పరం బ్రహ్మ నిర్గుణం ప్రకృతిం పరామ్‌ | గృహాణ స్వామినం వత్సే సుఖంవస చ మందిరే. 139

అయంతే కథితః కర్మవిపాకో మంగళో నృణామ్‌ | సర్వేప్సితః సర్వమత స్తత్త్వజ్ఞాన ప్రదఃపరః 140

ఇతిశ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే త్రింశోధ్యాయః

ఓ భామినీ ! ఎల్ల దేవతలందు విష్ణువును వైష్ణవులందు నారదుడును శాస్త్రములందు వేదములును వర్ణములందు బ్రహ్మణులును తీర్థములందు గంగయు పవిత్రకరులందు శంకరుడును వ్రతములం దేకాదశియును పూలలో తులసియును తారలందు చంద్రుడును పక్షులందు గరుటామంతుడును స్త్రీలలో ప్రకృతి రాధా వాణీ - వసుంధరలును చంచలములు శీఘ్ర గాములనగు నింద్రియములలో మనస్సును ప్రజాపతులందు ప్రజాపతియగు బ్రహ్మయును వనములందు బృందా వనమును వర్షములందు భారతవర్షమును శ్రీయుతులలో శ్రీదేవియును విద్వాంసులలో సరస్వతియును పతివ్రతలలో దుర్గయు సౌభాగ్యవతులలో రాధయునెటుల శ్రేష్ఠులో యటులే యెల్ల యజ్ఞములందు శ్రీదేవీయజ్ఞము శ్రేష్ఠము. నూఱు యజ్ఞములవలన నింద్ర పదవియును వేయిజన్మములవలన విష్ణు పదవియును గల్గును. పృథువువేయియాగములు చేసి విష్ణుపదమొందెను. ఎల్లతీర్థములందు మునుంగుట యజ్ఞముల దీక్ష వహించుట ఎల్ల తపముల వ్రతముల ఫలములొందుట నాల్గువేదములు చదువుట భూ ప్రదక్షిణములు చేయుట వీటన్నిటవలన గల్గుఫలమంతయు నొక్క దేవీయజ్ఞమున గల్గును. శక్తి సేవనము ముక్తిప్రదము. అన్ని వేదముల - పురాణముల - ఇతిహాసముల సారమంతయును శ్రీదేవీ పాదకమలములు సంసేవించుటయే సమా! శ్రీదేవిని వర్ణించుట ధ్యానించుట - నామగుణ సంకీర్తనములు చేయుట స్తోత్రము - స్మరణము - వందనము - జపము చేయుట దేవి పాదోద కము-నైవేద్యప్రసాదము తీసికొనుట యను నవన్నియును కోర్కెలన్నిటిని దీర్చగలవు. సర్వ సమ్మతములైనవి అమ్మాయీ ! నీవు నిత్యమును సుఖముగ నుండుము. పొమ్ము. ఇంతవఱకును మనుజుకు శుభకరమైన కర్మ విపాకము గూర్చి తెలిపితిని. ఇది తత్వ జ్ఞానప్రదము. సకల శాస్త్ర సమ్మతము.

ఇది శ్రీదేవీభాగవత నవమస్కంధమున ముప్పదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters