Mahayogama    Chapters   

ఓమ్‌

మహాయోగము

9. ఆత్మవిచారము

-*-

పై ప్రకరణాల్లో జెప్పిన వాని సారాంశాన్నీ, ఈ ప్రకరణాని కుపోద్ఘాతాన్నీ మహర్షి యిట్లు సమకూర్చారు? 'నేను' (అహము) పుట్టక యున్నస్థితియె మనము అదిగ నున్నస్థితి. 'నేను' పుట్టుచోటును వెదకి చేరక 'నేను' పుట్టని తన నాశము నందుట యెటులు? దానిని బొందక తానదియగు స్థితియందు నిలకడజెందుట యెటులు? చెప్పుము''1 ఇచట నిర్దేశించిన మనస్సు మూలం (జన్మస్థానము) హృదయం. అది ఆత్మకు ఏక నిలయమని తాత్కాలికంగా గ్రహింపవలె. పరమార్థ ముగ నైతే ఆత్మ తానే నిజమైన హృదయం. ఈ సందర్భంలో మహర్షి నిరహంస్థితి నన్వయిస్తూ దానిని సహజ స్థితి యన్నారు. అటమనం, ఉన్న రూపు. అంటే, శుద్ధ జ్ఞానంగా ఉంటాము.

అహంతా నాశ విషయంగా మతాలన్నీ ఏకీభవిస్తాయి. వానిలో గల భేదం మోక్షస్వభావాన్ని గూర్చే. దైవమూ ఆత్మా ఒకేటేనా వేర్వేరాయని ప్రశ్నిస్తే, మహర్షి మందలించారు : ''అహమిక వదల వలెనని అందరి మతం : మొదటదాన్ని సాధించండి.'' ఆ విధాన మేదో తెలిపే బోధయే ప్రధానం : ఇతరాలన్నీ అముఖ్యాలు : అహమిక యెట్టిది, దానిని నష్టం గానీక ప్రపంచం ఎట్లు అడ్డుతున్నది - యీ తర్జన భర్జనలు వ్యర్థాలు''.2

1. చూ. అనుబంధం, 'క' శ్లో. 32 : ఉ. న, 27.

2. బంధం పుట్టువుపై వివాదలుడుపుటకు గౌతమ ఋషి యొక కథ చెప్పారు - ''ఇహం లో భయకామనలు మీ కాళ్ళు చేతులూ కట్టివేశాయి: మీ విమోచనకు ఋజు మార్గం

(తరువాత 143 వ పేజీలో)

వివిధమతాలు మోక్షానికై జెప్పిన వివిధోపాయాలు కొంతకు కొంత సరియే. కాని ఋజుమార్గం మహర్షి తెల్పిందే. ఇతరమార్గాలన్నీ మనస్సును సరళమార్గాని కనువుగా తీరుస్తవి. వాని ప్రయోజనం ఆ పాటియే. దీనిని మహర్షి యిట్లు వివరించారు : ''అహమిక నిజమనుకొనే వాడెవడూ దాన్ని లొంగ దీయలేడు. అది తన నీడ వంటిది. నీడయిట్టిదని తెలియని వాని నొకని నూహించుకో. తానెక్కడికి కదలినా వెంటాడుతున్న నీడను చూచి వాడు దాన్ని వదల్చుకోగోరుతాడు : వదలి పారిపోతాడు : కాని అది అంటిపెట్టుకునే ఉంటుంది. నీడ ఉన్నవైపు పెద్దగోయిద్రవ్వి దానిలా పాతిపెట్టి పైన మట్టిగప్పుతాడు. కాని అది గోతిపైకి వచ్చి వాణ్ణి వెంబడిస్తుంది. దాన్ని వదల్చుకోటానికి చూడవలసింది ఆ నీడకు విముఖంగా, దానికి మూలమైన తన్ను. అప్పుడానీడ వానినేవిధంగానూ బాధించదు.

(142 వ పేజీ తరువాత)

యిక్కడున్నది, ఎలా బద్ధులైనారన్న ప్రశ్నలు అప్రస్తుతాలు. ఎలా ముక్తులు కాగలరో తెలిసి తృప్తి పడండి. అవసర మెఱుగని ప్రశ్నలతో, వాని యర్థాలకై మూర్ఖించి నశించిన వాని గతి బోవద్దు. వాడు గహనారణ్యంలో పోతున్నాడు, వానికై పొంచి యుండి శత్రువు విషాక్తమైన బాణం వానిలో గాడ వేశాడు. ఆ దెబ్బతిన్న వాణ్ణి ఒక మిత్రుడు చూడ తటస్థించింది. వాడు వెళ్ళి చెప్పితే బందుగులు మందులూ మ్రాకులూ వలసిన ఉపకరణాలతో పచ్చి చేరారు. ఆ బాణం వెలికి తీసి వాణ్ణి బ్రతికించవలెనని వారి యత్నం. కాని గాయపడ్డవాడు వారినడ్డి, తన ప్రశ్నలకు ముందు సహదానాలిస్తే నేచికిత్స కొప్పుఉంటాను లేకుంటే లేదని పట్టు పట్టాడు. ఆ శత్రువెవరో, వాని ఆచూకీ, వాని గూర్చి అన్ని అంశాలూ తెలిసికోవలె ; ఏ వర్ణంవాడు; ఏ కులం? పొడుగా, పొట్టియా ; ఎఱుపా నలుపా? ఆ బాణం ఎలాటిది? దాన్నెవడు చేశాడు? ఇలాంటివే ఎన్నెన్నో, వీని కన్నిటికి జవాబులు తరువాత తీరికగా వెదకవచ్చు, ముందు ప్రాణం కాపాడుకోవటం ముఖ్యం; ఔషధం సేవించరా, తండ్రీ, యనిబంధువులు వానినెంతో బ్రతిమాలినారు. కాని వాడు తన మూర్ఖపు పట్టు వదలలేదు. అమూల్యమైన కాలం వ్యర్ధమై వాడు చనిపోయినాడు, మీ రాగతి కాకండి. ప్రశ్నలాపి, మోక్షోపాయం విని ఆచరించండి.''

ముక్తిని నెమకే వాడూ యీ కథలోని వానివలెనే. అహమిక స్వస్వరూపానికి ఛాయయని వారు గ్రహించరు. వారు చేయతగ్గది అహమికకు విముఖులై దాని మూలమగు ఆత్మ కభిముఖులు కావడమె.''

ఆత్మ విచార మారంభింపక పూర్వం తొట్ట తొలిగా అహంవృత్తిని విశ్లేషించి, దాని మిధ్యాభాగంనుండి సత్యాంశను వేర్పరచవలె. ఆ సత్యాంశ 'నేనున్నా' నంటూ వ్యక్తమయ్యే చిత్‌ ప్రకాశం ఈ ''నేనున్నాను'' అన్న స్ఫూర్తి నిత్యమూ నిర్వికారమూ గనుక సత్యం. మిధ్యాభాగమైన కోశాది ఉపాధులను విసర్జించి, మిగిలిన ''శుద్ధఅహము''నే గ్రహించవలె. యదార్థ స్వరూపాన్ని కన్గొనే రహస్యం ఈ 'నేనున్నాను'లో ఉంది. ఇది చేజిక్కించుకుంటే ఆత్మసిద్ధి నిశ్చయమన్నారు మహర్షి. ఒకమారు మహర్షి సాధకుని యజమానికి దూరమైన శునకంతో పోల్చినారు. దానికి దారిజూపేందుకు యజమాని పసి ఉంది. ఇతరమంతామాని, పసిజాడనే వెళ్ళి తుదకది యజమానిని చేరుకుంటుంది. అహమికలో యీ 'అహమహం' స్ఫూర్తి ఆ శ్వానానికి యజమాని పసివంటిది. ఆత్మను కనుగొనేందుకు వేరు సాధనమే లేదు : కాని ఉన్న ఆ యొక్కటీ అమోఘమైనది. దానిని పట్టి విడువరాదు. ఇతరము లన్నిటినీ మాని అందే మనస్సును లగ్నం చేయవలె. అప్పుడు నిశ్చయంగా మనస్సు అహం వృత్తి మూలమగు సత్యాత్మను చేరుతుంది.

విశ్లేషణ మీ విధం - నేను స్థూల దేహాన్ని గాదు; కలలో వేరొక శరీరం దాని స్థాన మాక్రమిస్తుంది. మనస్సునూకాను, గాఢ సుప్తిలో నేనుంటాను, అది ఉండదు. లేవగానే నాకు నిద్రలోని రెండు లక్షణాలు స్మృతికి వస్తాయి - అచ్చంగా అనుభవించిన శుద్ధానందమూ, అదృశ్యమై అనిశ్చితమైన జగత్తూ, మనోదేహాలు మాటి మాటికీ ఉంటూ ఉడుగుతుంటాయి గనుక అవి సత్యాలు కావు. నేను శుద్ధాహముగా సతతమూ ఉంటాను గనుక నేను నిజము. ఇతరాలు దృశ్యాలు నేను చూచేవి : వానిని 'నేను' గానని నిరాకరించగలను, కాని యీ ''నేనున్నాను'' నుత్రోసిపుచ్చలేను : దాని నుండే మనో దేహాలు బహిష్కరింపబడ్డవి. కాబట్టి యధార్థమైన నేను ఆ ''నేనున్నాను'' : ఇతరమంతా 'నా7హం' - 'నేను' కాదు.

మనకింకా ('నేనున్నాను') అహమహమనుభూతి క్రియకు రాలేదు. ఈ విశ్లేషణ వల్ల మనకు లభించేది ఆత్మసత్యాన్ని బుద్ధ్యా గ్రహించటమే. ఆత్మ విషయకంగా మనదింకా పరోక్షజ్ఞానమే. మన మనుభవింపగోరేది సాక్షాదాత్మస్థితి. అందుకై అవస్థాత్రయమనే విషవలయాన్ని ఛేదింపవలె. అందుకు ఒకే ప్రక్రియ - మహర్షి బోధించిన రీతి ఆత్మవిచారము.

ప్రాచీన ఋషులు గూడ యిదే విధాన మనుసరించారనుకో వచ్చును. ఉపనిషత్తులలో నొకవాక్యం ''ఆత్మనన్వేషింపవలె'' అని ఉంది. గౌతమ బుద్ధుడుకూడా ఈమార్గమే అవలంబించినట్లుతోస్తుంది. అదెట్లో తెలియదుగాని, యీ విధానా రహస్యం మధ్యలో నెచ్చటో లుప్తమై నట్లుంది. కాకుంటే మను గ్రంధాల్లో అగుపించే విధానం వేరు విధం. దాన్ని సాంప్రదాయకమందాం. మొదట దానినే యిచట పరిశీలిస్తాము.

ఆ సాంప్రదాయక పద్ధతిలో సాధకుడు ఉపనిషదాది గ్రంధాల్లో నిబంధించిన ఆత్మసత్యవివరాలన్నీ అధ్యయనం చేస్తాడు. ఆ ఉపనిషత్తులూ ఇతర గ్రంధాలూ చూచి అతడు వెనుకటి ప్రకరణాల్లో ప్రస్తావించిన తాత్త్విక విచారం సాగిస్తాడు. ఆత్మ 'నేతి' 'నేతి' - ఇదికాదు ఇదికాదు అంటూ అప్పటికి తాను ఆత్మ అనుకుంటూన్న ఒక్కొక్కటిని నిరాకరిస్తూ వస్తాడు. ఈ క్రమంగా, స్థూలశరీరం ప్రాణం మనస్సు అహమిక వర్జింపబడతవి. అట్లు కాకపోతే మరొక పద్ధతిలో అవస్థాత్రయమూ అందందు గోచరించే వ్యక్తులూ సహజమహనీయమగు ఆత్మ ఎట్లు కాజాలవో నిరూపిత మౌతాయి. ఈ 'కాండ' అంత ముగిశాక మిగిలియున్నది సత్యాత్మ, పరమాత్మ, మనమూహించిన సర్వవిశ్వకర్తా, భర్తా. ఆ బ్రహ్మము స్వయంస్థితమూ, పరమమూ, నామరూప రహితమూ, దిక్కాలాద్యనవచ్ఛిన్నమూ, ఏకమూ, అద్వితీయమూ, అవికారము, అవికార్యమూ, పూర్ణమూ, ఆనంద స్వరూపమూ. అతని నిస్సృతియే యీ ప్రపంచమూ అందలి సకల కళ్యాణ కారణమూను.

దీని తరువాత దశ నుననం (Reflection). ఆత్మయధార్థ్యమూ పరమాత్మస్వరూపమూ ఎట్టివి? వీని నిరూపణకు అనుకూల ప్రతికూల నిదర్శనాలూ ఉపనిషత్తులూ, శోధింపవలె. గమనించవలసిందేమంటే, ఆత్మసత్యాన్ని గూర్చిన సాక్ష్యం సర్వమూ వైదిక దర్శనాలలోనిదే. కాని ఆత్మ అతీంద్రియ విషయము : బుద్ధి గ్రాహ్యం కాదు. సత్య ద్రష్టలయిన పరమర్షుల సాక్ష్యాన్ని నిబంధించుకొన్నవి గనుక వైదిక దర్శనాల ప్రామాణ్యం శిరోధార్యం. సాధకుడు తర్కించి వివేచించవలె, వారి ప్రామాణ్యాన్ని పూర్వపక్షం చేయడానికి కాదు, ధృఢీకరించడానికి. తర్కం శుష్కమైనది, వాదించే వాని అభిరుచి నైపుణ్యాలబట్టి, ఏ పక్షాన్నైనా సమర్థించవచ్చు. స్వతహా అది నిశ్చాయకంగాదు. మన ప్రాచీన తత్త్వబోధమే సరియని మననం నిర్ధారిస్తుంది. ఈ సరణిని అతడు పదేపదే మననం జేస్తే 'నేనది' (I am That) అన్న ఆత్మ సత్యంలో వాని విశ్వాసం ధృఢమౌతుంది.

చివరిదశ నిదిధ్యాసము - ఆ బోధమునే ధ్యానించడం. 'నేనది' యన్న తలపుపైన మనస్సును నిలపవలె. అందే తలపు పూర్తిగ కేంద్రీకరిస్తే మనస్సు నిరతమైన ప్రవాహంవలె దాని చింతన సాగిస్తుంది. అది కుదురు కొన్నపుడు, గ్రంధాల్లో చెప్పినట్లు, ఆత్మసాక్షాత్కరిస్తుంది : ఆజ్ఞానమూ బంధనములూ నశిస్తాయి.

గ్రంధ పరిచయంతోడి శ్రవణమూ, మననమూ, నిదిధ్యాసమూ యీ మూడూ ఆదరణీయములన్నారు మహర్షి : వీనివలన మనస్సు శుద్ధమూ దృఢమూనై తాము చెప్పిన ఆత్మ విచారానికి యోగ్యమైన సాధనగా పనికి వస్తుంది. ఎన్నో తలపులు ముసరి శక్తిని దిగలాగుతవి; ఆ విక్షేపాలనుండి బయట పడటమే మనోదార్ఢ్యం. శాస్త్రాలూ, మహర్షీ దుర్పల మానసులకు గమ్యం జేరట మసాధ్యమని, దానికి మనోదార్ఢ్య మెంతైనా అవనరమనీ చెప్పియున్నారు.

మహర్షి తెలిపినారు : 'నేను' అని నోటితో బలుకక లోన ముణుగు మనస్సు వలన 'నేను' అని యెచ్చట వెలుగునని వెదకుటయే జ్ఞాన విచారమగునుగాని, 'ఇది నేను కాదు, అది నేనగుదును' అని తలంచుట సహాయమేగాక, అదియె విచారమగునా?3 చూడ వచ్చిన యొకరితో మహర్షి, ''అహమిక నీ సత్యస్వరూపం కాదని నీకు తెలిపినారు. అది సమ్మతమైతే ఈవు చేయవలసింది, అన్వేషించి అహమిక దేని ఆభాసమో ఆ సద్వస్తును కనుగొనటమే. మరి ఎందుకా 'నేనది' యనిధ్యానం? అందువల్ల అహమిక తనజీవితాన్ని మరింత కూడ గట్టుతుంది. మందు తీసుకొనేప్పుడు కోతిని మఱచిపో యత్నించే విధమే యిది. ఆయత్నమే ఆ తలపు ననుమతించడం గదా? అహం వృత్తి జాడతీసి కనుగోవలె. 'నేనది' యని ధ్యానించి ప్రయోజనం లేదు : ధ్యానం మనస్సుతో, ఆత్మ మనస్సు కవ్వలిది. తాను తన సత్యస్వరూపం వెదకుటలో అహంకారం తనుతాన నశిస్తుంది. అందు చేతనే అన్వేషణం ఋజుమార్గం. ఇతర మార్గాలన్నిటా అహంతను నిలుపుకోవటమున్నది. అందువల్లనే అన్ని సంశయాలూ, ఎడతెగని ప్రశ్నలూ, ఇంతకూ ఆ పరమ ప్రశ్న మిగిలే ఉంటుంది. దానిని ప్రతిఘటించనంతదాకా అహమిక కంతం లేదు. మరి ఆ ప్రశ్ననే

_______________

3. చూ. అనుబంధము 'క' శ్లో. 34 : ఉ. న 29

సూటిగా ఎదుర్కొనక, యితరవిధానాల ప్రసక్తి ఎందుకు?'' తగు జాగ్రత్తలో ఉండకపోతే ప్రకటంగానో, అంతర్లీనంగానో అహమిక యొక్క సత్యాన్నూహించేది ప్రతిదీ మనలను గమ్యమైన నాహంస్థితికి మరింత దూరం చేస్తుంది.

ఈ సాంప్రదాయక పద్ధతిని మహర్షి విమర్శించారు : '' 'అది నీవు' అని వేదములుద్ఘోషించుచుండ దనను దానెదియని తెలిసికొని నిలువక, 'అదినేను' - 'ఇదికాదు' అని తలంచుట మనోబలము లేనందువలననే, ఎప్పుడునూ అది తానుగనే వెలుగుచున్నది గదా''4 ఇచట 'అదినీవు' అన్న ఉపనిషద్వాక్యం నాహంస్థితిలో అనుభూతమైన ఆత్మయే పరసత్యమని నిరూపిస్తున్నది. సరియైన మార్గాన మనమా నిరహంస్థితిని సాధించవలె. అది 'సో7హ' మని ధ్యానించు మనదు. పై వాక్యార్థం ఒకే యత్నంలో పైకి భిన్నాలు అనిపించే రెంటిని - ఆత్మను, పరబ్రహ్మమునూ సాధించుకోగలమని, నిజంగా ఆ రెండూ ఏకవస్తువే గనుక.

ఆత్మాన్వేషణకై మనం విజాతీయాలగు తలపులన్నిటినీ వెడల గొట్టి, మనోదేహబలములు కూడగట్టి, ఆ శక్తినంతటినీ 'నేనెవ'రన్న ప్రశ్నకు నిశ్చిత సమాధానానికై ఏకముఖంగా ప్రవహింప జేయవలె. ఆ ప్రశ్ననే 'నేనెటనుండి' యనీవేయవచ్చు. 'నేనెవ'రంటే నా సత్యస్వరూపమేమి? 'నేనెటుండి' అంటే నా అహమికలోని ఆత్మభావనకు మూలమేమి? ''ఆత్మవిచారణ సందర్భంలో మూలమంటే అర్థం, అతిదూరగుడూ ప్రాచీనుడూనైన పితరుడో యీసృష్టిక్రమ పరిణామానికాదిపూరుషుడో, యీ దేహం పుట్టుకకు పూర్వజుడో కాదు : తన అస్తిత్వానికి లేక ఉనికికి ఆధారము అని. పూర్వజన్మ జ్ఞానమెట్లని

______________

4. చూ. అనుబంధం, 'క', శ్లో 37 : ఉ. న, 32

యొకరు. ''మునుపటి పుట్టువులగూర్చి నీకెందుకీ ఆతురత? ఇప్పుడు నీవు పుట్టియున్నావేమో పరికించు,'' అని మహర్షి. ఈ ఉబుసుపోక ప్రశ్నల వెనుక అహంకారం పొంచియుంటుంది, సత్యాన్వేషిని ఒక్కడుగు పెడద్రొక్కిస్తామని. నిజంగాచూస్తే ఆత్మపుట్టనేలేదు. కాబట్టి మూలాన్ని వెదక వలసింది గతంలో కాదు, ప్రస్తుతంలోనే

మూడవస్థలముడి త్రెంచడానికి నిశ్చిత మార్గం ఆత్మవిచారమే. మనస్సునది స్తిమిత పఱచటమేగాక, నిదురగూరి చేతోస్మృతిని కోల్పోనీక ఆపుతుంది. అందువల్లనే దాన్ని 'జాగ్రత్‌ సుప్తి' యన్నారు. తలపు తలపునకూ చెదరబారే మెలకువలోగాని, 'నేనున్నాను' అన్న మూలజ్ఞానంగూడ మునిగియుండే నిద్రలోగాని, మనస్సు ఆ మూడవ స్థలనూ దాటిపోలేదు. కాని నిద్రలో పూర్ణస్థబ్ధతనుండి మెలకువలోని ద్రిమ్మరి తనానికి జారనున్న అంతరంలో మనస్సు శుద్ధజ్ఞానంగా, విషయరహితమైన 'నేనున్నాను' గ మెదలుతుంది. ఆత్మవిచారమందలి దృఢ దీక్ష యీ, జ్ఞానాన్ని స్థిరీకరించి విషయజ్ఞాన రహితమగు సమాధిస్థితికి చేరుస్తుంది. ఇట్లు అవస్థాత్రయం దాటి నాహంస్థితి సిద్ధిస్తుంది.

ఈ విచార విధానాన్ని మహర్షి యిట్లు వర్ణించారు. ''ఒక మనుజుడు నీటిలోబడిన వస్తువును గొనుటకై నీటముణుగు తెఱగున 'నేను' బుట్టుచోటిని తీక్‌ష్ణమైన బుద్ధిచేత వాక్‌ ప్రాణ బంధనముతో లోనముణిగి యెఱుగవలయును.''5 ఇది ఆత్మవిచారణావసరంలో భక్తి సంబంధం సూచిస్తుంది. నీటిలోమునిగే వాని ఉద్దేశ్యం అందులో బడిన వస్తువును తిరిగి గైకొనడం. ఆ ప్రయత్నంలో మగ్నుడై, ఊపిరి బిగయబట్టి తనబరువంతా వినియోగించి నీటిలో మునిగేట్లు, అన్వేషి అహంలోని 'నేనున్నాను'కు మూలమగు ఆత్మను సాధించుటకై తన మనఃప్రాణ శక్తులన్నీ కూడగట్టి వాటిని హృదయాభి ముఖంగా మర

_____________

5. చూ, అనుబంధం, 'క' శ్లో. 33 : ఉ, న. 28

లించి ఆ హృదయమందు మునగవలె. ఆత్మను కనుగొనే ఇచ్ఛకు విచారము క్రియాశక్తి, అదిలేక హృదయంలో మునుగుటే లేదు, ''నే నెవరు? ఎటనుండివ నేను?'' అనే ప్రశ్నల్లో ఈ యిచ్ఛయిమిడిఉంది. అట్లు మునిగిన వానికి సాఫల్యం తప్పదని మహర్షి వాక్కు వారు వివరిచినట్లు , అప్పుడు ఎదోనిగూఢశక్తిలోనుండి ఉద్భవల్లి వాని మనస్సును ఆవేశించి దాన్ని సూటిగా హృదయానికి చేరుస్తుంది. సాధకుడు శుద్ధమానసుడూ, వ్యక్తిత్వాభియాన రహితుడూనై నిరవశేషంగా తన్నాశక్తికి అచ్చించుకుంటే, అంటే పూర్ణశరణాగతుడైతే, ఉత్తమోత్తమ పురస్కృతి లభిస్తుంది, వానికి పరాయణమైన ఆసక్తియెందో, ఆదేవానికి ప్రాప్తిస్తుంది. ఆత్మలాభానికి మించినది వేరోకటి కలదా? ఈ పూర్ణభక్తి లేనివాడు, మనస్సుశుద్ధబమూదృఢమూ అయిన దాకా విచారణను పదేపదే అభ్యసించవలె; లేక పోతే ఏదోనొక ధ్యానమో, దైవ భక్తియో సలుపవలె.

భక్తి త్యాగాన్ని కోరుతుంది. త్యాగమంటే అసద్విషయము లందనాసక్తి అట్లని ఋషులు వచించారు. ఎవనికిగాను, ఏవిషయమందైనా అభిరుచి ఎంతలెంతలో, యితరాలంటే వాని యనాదర మంత లంతలే. లోని ఆత్మయం దెంత భక్తియో, వెలుపలి ప్రపంచమందంత వైముఖ్యం భక్తి త్యాగాలు ఒకే నాణమందంటు ఇటువలె: అవి విడదీయరానివి. త్యాగం మనస్సుకు దార్ఢ్యమిస్తుంది విచారాన్ని సఫలం చేస్తుంది. ఇది అందరి అనుభవం లోనిదే. ఏదేని ఎక్కువగా కాంక్షించినతడు దాని కాతం కాలుగ నున్నవానిని స్వయంతా పరిత్యజించి తన కోరినదాన్ని సంపాదిస్తాడు. అతి మహీయమైన నాహంస్థితి లాభానికి గూడ సంపరిత్యాగం అవసరమౌట సహజమే. కాని త్యాగమంటే యేమో సరిగా అర్థం జేసుకోవటం ముఖ్యం . అది మనస్సును నిర్మలంజేసి గమ్యాని కభిముఖంగా చిత్తైక్యతను సంధించటం , స్వార్థం త్యాగమనే పేరిట బాహ్యాచారణలూ ఆడంబరాలు కావు.

వాక్‌ ప్రాణాల నియమనం అవసరమన్నాము. కాని మహర్షి శ్వాస నిరోధ విషయంలో పెద్ద పట్టింపు అక్కఱ లేదన్నారు. విచారము ఉత్కటమూ, నిరతమూ అయితే, శ్వాస తనంతనే నియతమౌ తుండి: అంతవరకు దేహంలో ప్రకృత్తాలైన శక్తులన్నీ ఉపసంహృతాలై మనస్సుతో ఏకమై, అది హృదయంలో మునగడానికి సాయం జేస్తాయి. అంతఃప్రాణఃశక్తాలచేరిక చాల ముఖ్యం. అవి దేహవ్యాప్తమై యున్నంతవరకూ మనస్సు తను ప్రపంచాలనుండి వెనుదిరిగి హృన్నిమగ్నంకాలేదు. విచారతీవ్రతవల్ల శ్వాసఅడగినపుడు మనస్సుకు తను ప్రపంచముల ధ్యాసే ఉండదు. దేహం శవసమ మవుతుంది.

విచారకుని భక్తి శ్రద్ధలు వలసినంతగా లేకుంటే, శ్వాస స్వయంగా ఆగిపోదు. ఆతడు శ్వాస గమనాన్ని పరికిస్తుండవలె. ఈ అవేక్ష శ్రద్ధగా సాగితే శ్వాస క్రమంగా సన్నగిల్లి, చివరకు రుద్ధమౌతుంది. మనస్సు విక్షేపాలనుండి ముక్తమై శాంతమవుతుంది, అపుడది విచారాన్ని అవధానంతో ఆచరించ గలదు.

అదెట్టి విషయంగానైనా, ధ్యానంలోవలెను విచారానుష్ఠానం లోగూడ చిత్రవిచిత్రాలైన తలపులు గుమికూడి మనస్సుకు విక్షేపం కలిగించి సాధకుని వైఫల్య నిరుత్సాహాలతో క్రుంగదీస్తాయి. మహర్షి చెప్పెట్లు ఈ తలపు లెగయడం అడచుట కొఱకే. కాబట్టి ఆత్మవిచారకుడు ధైర్యం కోల్పోయి ఓటమి నొప్పుకో నక్కఱలేదు. సాఫల్యం దీర్ఘకాలానికే గాని సత్వరం సమూకూడదనిపిస్తే, దానికి ప్రతిగా, అతడు కాలభావనే కల్లయని, ఆత్మదాని పరిధిలోనికి కాదని స్మరించవలె. ఒక ప్రాచీన గ్రంధంలో ఆత్మసాధనకు కావలసిన ఓర్పును వర్ణించారు; నీటి నొక్కక్క బిందువుగా వెలిదీస్తూ సముద్రాన్నింకింప యత్నించే వాని కున్నంత అట. అట్టిదే మరోక గ్రంథంలో ఒక కథ ఉంది. గువ్వజంట యొకటి, సముద్రపు ఒడ్డున తుంగల్లో గూడు కట్టుకొన్నది. సముద్రపు పొంగులో గూటిలోని గ్రుడ్లు కొట్టుకొనిపోయినవి. ఆ గువ్వలకు చాల దుఃఖమూ కోపమూ వచ్చి అవి దృఢంగా నిశ్చయించుకొన్నవి. ఆ గ్రడ్లను తిరిగీ సంపాదించవలె, సముద్రుణ్ణి శిక్షించవలె, అంబుధికి తగిన శిక్ష దానిని శోషింజేయుటయే, అందుకై అవిమాటిమాటికి సమద్రంలో మునిగి ఒడ్డుకువచ్చి తమ రెక్కల కంటుకున్న నీటి బొట్ల నక్కడ విదిల్చేవి. ఇట్లు ఎంతకాలమో గడిచింది. చివరకు దేవతలు మధ్యవర్తులై వాటి గ్రుడ్ల నిప్పించారు.

విచారసమయంలో కలిగే ప్రతికూలమైన తలపు నొక్కొక్క టిని అణచేకొద్దీ అంతంతగ మనోదార్ఢ్యం హెచ్చి సాధకుని గమ్యానికి ఒక్కొక్క మెట్టు దరియజేస్తుంది.

సాధకుని విచారానుష్ఠానం చాలినంత జరిగి, లోని శక్తియుద్భుద్ధమై వాని మనస్సు నావేశిస్తే, హృదయం సత్వరం సన్నిహితమౌతుంది. అంటే మనస్సుకేవల జ్ఞానంగా శుద్ధాహంగా నిలిచి వెలుగమొదలిడుతుంది. ఈ కేవల జ్ఞానాన్ని మహర్షి ''అహమహ'' మన్నారు; దీనికి భిన్నం, 'నేనిది' (ఈదేహం) లోని 'నేను' అను అహమికా రూపం; అహమహం స్ఫురణతో అహం వృత్తినాశం సూచితం , సావధికమైన అహం నిరవధికమైన ఆత్మచే కబలితమైంది. అహంకారంతో పాటు జీవితాన్ని వేధించే అన్నికొఱతలూ నశిస్తాయి. భయకామనలూ పాపభాధ్యతలూ తుదముట్టుతవి. ఆత్మయెన్నడూ వీనికి లోగదు. ఇవియన్ని అహంకారపు అంగాలు, అహంకారాన్ని మిగిలి యుండవు. నిరహం స్థితిలోని ఆత్మస్థిరమై తానుగ భాసిస్తుంది. ఆత్మనట్టిదిగ తెలిసిన మహర్షిని, అహంతను వర్జించినందున, వ్యక్తి మాత్రుడనరాదు., అపక్వ శిష్యులకు, యితర ప్రపంచానికి అట్లగపడినా కూడా.

కేవలము 'అహమస్మి ' (నేనున్నాను) లేక 'అహం' (నేను) అన్న ధ్యానం గూడ ఆత్మవిచా సమమని మహర్షి శ్లాఘించారు. ఆయన న్నారు. ''అహం ' (నేను) అతని పేరు కనుక 'అహము'(నేను) పై అనారతము ధ్యానము నిల్పువాడు, ఆత్మలోకమగు హృదయమును చేరును''6

ప్రపంచంలో నిత్యవ్యవహారాలలోని తగులమునకూ, ఆత్మశ్రద్ధకూ సమస్వయ మెట్లన్న వానికి మహర్షి యిట్లు ప్రత్యుత్తరమిచ్చినారు:'' కర్మలు చేస్తున్నది'' 'నీవు' అనుకొవట మెందుకు? ఇచ్చటికి నీవు రావటమే చూడు బండిలో ఎక్కి యిల్లు వదిలావు, రైలు లో ఒకచోట కూర్చున్నావు, తిరువణ్ణామలైస్టేషన్‌లో దిగినావు. మళ్ళీ ఒక బండియెక్కి యిక్కడ ఉన్నట్లు కనుగొన్నావు, ఎవరన్నా అడిగితే మీ యూరినండి నీవిక్కడికి వచ్చానంటావు. అది నిజమేనా? నిజానికి నీవున్నచోటనే ఉన్నావు: కదిలినవి ఆయావాహనాలు ఆ కదలికలను నీవిగా ఊహించావు. అట్టివే నీ యితరవృత్యాలూనూ అవి నీవి గావు: అవి దైవకృత్యాలు'' పృచ్ఛకుడొప్పుకోలేదు ఆ విధానం శూన్య మనస్కతరకు దారి తీస్తుంది. లోక వ్యవహారాలు స్తభించిపోతవి. అని వాదించాడు. ''అయితే ఆ శూన్యతవరకూ వెళ్ళి , ఆపైన చెప్పు'' మన్నారు మహర్షి. తాత్పర్యం, కర్తతాను కాదను కొన్నవరకూ ఆ శ్రద్ధాళు సాధకుడ ఆత్మవిచారం సాగించటానికి లోకవ్యవహారల నుండి విరమించి పరదేసియో, గహనంలో వర్ణకుటీన వాసియే కానక్కఱలేదు. తాను కర్తకాదన్నది మఱవక, తన మనస్తునూ ఇంద్రియాలనూ వాని వాని పనులను చేసుకొ అనుమతించవచ్చు అంతకాలమూ అతడు, నడుస్తూ ఆలోచించేట్లే, ధ్యానమో ఆత్మవాచారమో సాగిస్తూనే ఉండవచ్చు.

మహర్షి వాక్కుల అర్థాన్ని పరికిస్తే మనలో చాలమందిలోక

_____________

6. చూ.అనుబంధ 'చ' శ్లో 108

వ్యవహారాల్లో వ్యాపృతులుగా ఉండటమే, ఆత్మవిచార సంవిధానంగా కోరతగిందని వారియభిప్రాయంగా తోస్తుంది. మనస్సు ఆత్మలోలీనం కావడానికి అది ఆత్మయొక్క అభాసమాత్రమేనన్న భావం రూఢిగా అలవరచుకోవటమే ఉపాయం. ఇది నిత్యవ్యవహారాలు చూచుకుంటూనే చేయవచ్చు. వీనిని విచార సన్నాహంగా ఉపయోగించుకో వచ్చు. అట్లు సన్నధ్ధమైనాక విచామారంభించితుదివరకూ సాగించటం సులువౌతుంది.

ఇల్లూవాకిలీ, సతీసుతాదులను వదలి భిక్షాటనం చేసే సన్న్యాసి కావటం అవసరమా అని ఎందరో మహర్షిని పలుమార్లడిగారు. సన్న్యాసికావలెనని వాని నొసట వ్రాసియంఉటే, యీ ప్రశ్నేరాదు. సన్న్యాసి విధిగా కావలసిన పనిలేదు, అని మహర్షి యన్నారు. అట్లే 'నెనిల్లు వదలవలెనా, లేక అందే ఉండవచ్చా? అని ప్రశ్నిస్తే ''మహర్షి యడిగారు: ఇంట్లో నీవున్నావా, నీలో యిల్లు ఉన్నదా? ఎక్కడ నీవిప్పుడూ ఉన్నావో, అక్కడే ఉండు. ఎన్నడూ దానికి దూరం కాలేవు." 'అయితే నే నింటిలో ఉండవచ్చున్నమాట''నే నట్లనలేదు; శ్రద్ధగా విను, సర్వదా సహజంగా నీ దైవస్థానంలో స్థిరంగా ఉండవలె'', తానింటిలో నున్నాడని పృచ్ఛకుని భావం. కాని నిజంగా సద్వస్తువుగా ప్రపంచం సర్వమూ వానిలో ఉంది. అందుచేత వానిని ఆత్మ స్థితుణ్ణి కమ్మన్నారు: అంటే జగత్తు సత్యమనుకోవడం మానుమన్నారు. మరొకమారు మహర్షి---- 'తాను గృహస్థుడనను కోని గృహస్థుడు నిజమైన సన్న్యాసి;క తాను సన్న్యాసి ననుకోనే సన్న్యాసి సన్న్యానియే కాడు, ఆత్మగృహస్థూకాదు, సన్న్యాసీకాదు?''

సన్న్యాసి జీవితం చాల గురుతర కార్యం . మహర్షి చెప్పినట్లు యింతకూ మనస్సువిచారంతో సమ్మితంకావలె. ఇది యింట్లో సాధ్యం కాకుంటే వేరెక్కడైనా అంత అసాద్యమే.

సర్వశోభానాలనూ గూర్పసమర్థమూ, అనువైనపుడెల్ల శిష్యుడలవరచుకోవలసింది. సాధుజన సాంగత్యం దాన్ని కొనియాడటంలో మన పూజ్య గ్రంధాల కెన్ని యుత్ప్రేక్షలూ చాల లేదు. వీనిని మహర్షి బహుళంగా ఉదహరించారు. ఆసత్సంగలాభ పరిమాణం , సద్గురునెడల భక్తి, వారి నర్థం చేసుకొనే శక్తుల బట్టి యుంటుంది. ఆ భక్తి ప్రాముఖ్యమింతని వర్ణింపలేము.

శిష్యుని కత్యావరసమైన హెచ్చరిక ఒకటి.7 అది శంకరుల ప్రకరణ గ్రంధాల్లో కానవస్తుంది. దానినే మహర్షి ''అద్వైత భావమెప్పుడూ నుండ వలెనే తప్ప అద్వైతాచరణ మెప్పుడును సలుపవలదు. మూడు లోకములతో అద్వైత ముండినను గురువుతో మాత్రమది కూడదు,''8 అన్నారు. ఈ నియోగాలకు (Injunctions) కారణ మూహించటం కష్టం. సత్యసిద్ధికై అహంతానాశం చేసే సరళయత్నాలకు భంగమూ విపర్యయుమూ కలిగించటంలో అహమికకు గల బలాన్ని గుర్తించిన మనకు యిందు వ్యాకులపాటుకు కారణం లేదు. అద్వైత తత్త్వ విచారం అహంతా విలయం జేసి సత్యము నెడల భక్తిని పెంపొందిస్తుంది. అద్వైతాచరణ ఆత్మహననమే, ఆ ఆచరణ శత్రువగు అహంత అధీనంలోదిగనుక. అజ్ఞానం మిగిలియుండగా అహం కారం వల్ల ద్వైతం సత్యంగానే (ఆ) భాసించి యదార్థమగు అద్వైతాచరణ అసాధ్యమవుతుంది. అహంత లేదు గనుక ఋషి యొక్కడే అద్వైతాన్ని ఆచరించగలడు. అందుకే మన వైదిక గ్రంధాలూ మహర్షిగూడా వృత్తినియతి నాదేశించారు గాని వాని నిస్తృతిని గాదు. వ్యాపారాలు తగ్గితే, మన ప్రయత్నాలను భంగించే అవకాశం

_____________

7. భావాద్వైతం సదా కుర్యాత్‌, క్రియాద్వైతం న కర్హిచిత్‌

అద్వైతం త్రిషులోకేషు నా ద్వైత్వం గురుణా సహ || తత్త్వోపదేశం, 87

8. సూక్తిసుధ, 39 |

అహమికకు తక్కువౌతుంది,9 అంతశ్శత్రులైన అహంతను నాశంచేయటానికి పరోక్షజ్ఞానం మాత్రం చాలదు.

గురవీశ్వరుడని భక్తి సేయడం యుక్తము, అహంతానాశం కానంతవరకు తానే గురువని ఎంచితే ప్రమాదం తప్పదు. అదితాను గురుసముడనే దాకా వెళ్ళుతుంది. నిజంగా అహంత నశించి నప్పుడే గురునిలో సమత సాధ్యము. అందుకే గురునితో మాత్రం అద్వైతము కూడదన్నారు.

''గురు రమణ వచన మాల'' సాధకాచార ప్రకణములోనివి ఈ క్రింది ప్రత్యాదేశాలూ, ఉపదేశాలూః-10

'ప్రమాదము(ఆత్మవిస్మృతి) మృత్యువే; విచారముచే మృత్యువును జయింప యత్నించు వానికి ప్రమాదవర్జనము తప్పరాని నియమము.

'నిజకర్మలే ప్రమాద హేతువులు కాగల్గినపుడు, ఆత్మవిచారకుడు ఇతరుల కర్మలను పై వైచుకోరాదని వేర చెప్పవలెనా?

'నియమము లెన్ని యోగలవు. అందు సాధకునికి నియతాహారనియముము మొక్కటే చాలును. అది అతని సత్త్వగుణ సంపద నధి కము చేయును.

_____________

9. ఋషిజన సన్నిధి తేనివారు, అద్వైత వేదాంతపు లోతుల నెఱుగరు. వారుపై యాదేశము తెలియక అద్వైతము ను ఆచరణలో చూప యత్నిస్తారు; అదీ అంశమాత్రమే. వారి పెద్ద పొరబాటు'సమత' పదాన్ని అర్థం చేసుకొవటంలో ఈ దోషం వారి అద్వైత వేదాంత అర్థ గ్రహణాన్నే బాధిస్తుంది. నిజమైన ''సమదృష్టి మహర్షులకే సాధ్యము?

10. చూ.అనుబంధం'చ' శ్లో.170,172,176,178,182,185,187,188,198,196,199, 291-08, 214

'ఉదరమునకు తగవైన విశ్రామమిచ్చి ఆకలియైనపుడే సాత్వికాహారమును11 మితముగ భుజించుటే అన్న నియమము.

'అహంత నాశమగుదనుక, సాధకునికి శుభమిచ్చునది వినయము. ఒరుల నమస్కారము లంగీకరించుట సర్వదా త్యాజ్యము.

'నీరముల గొని కుండమునుగును, కొనని కొయ్యతేలును; విషయాసక్తుడు బుధ్దుడు, అనాసక్తుడు ఇంటనున్నను ముక్తుడే.

'మనఃస్థైర్య మొసగుటకే విపత్తులు పరమేశ్వరు కృపవలన కలిగినవని నమ్మి సాధువు వానిని శాంతముగ కడద్రోయవలయును.

పరాత్పరునందు చిత్తముంచిన సాధువు ఇహస్థితి ఒరుల కీసుగొల్పెడు నదిగాక, అత్యనుకంపార్హముగ నుండుట మేలు.

'సర్వదా సర్వత్ర విషయములందౌదాసీన్యము, శాంతమాన సము, రాగద్వేష రాహిత్యములు గల సాధకుడు శోభిల్లును.

'విధియన్నది స్వప్రయత్నమున పూర్వము తానొనర్చిన కర్మ యే కావున మనుజుడు యోగ్యకర్మలచేత విధిని కడిగివేయశక్తుడే.

'ప్రశాంతమును శుద్ధమునడు మనస్‌ఉతో చేసెడి కర్మనే సుకృత మందురు. క్షోభించిన మనస్సుతో కోరికతో చేసెడిది సర్వమూ దుష్కృతము.

'తనభారమంతయూ నాపరమేశ్వరునందే చక్కనుంచి, విరాగియు శాంతడునై యుండు స్థితియే ఉత్తమమగు తపోబలమని తెలియును.

_____________

11. సత్త్వరజస్తమముని మనస్సునకు గుణములు మూడు. మొదటిది ప్రసన్నము శాంతము: రెండవది కర్మలయందు స్థిరత; మూడవది తామసికము, ఆలసము, సత్త్వము సలపరచుకొని మిగత రెంటిని అధిగమింప తగును.

'తిరుగలి నడిమి బొండు(శంకు) మూలమున నున్న ధాన్యకణములు నలుగని రీతి పరముని ఆశ్రయించి నతడు భేదము లెంత దుస్సహములై విచలితుడు కాడు.

'అయిస్కాంతములోని సూచి యితరదిశల గాక ఉత్తరమునే చూపునట్లు, ప్రేమతో పరముని భజించు నతడు మోహవశుడై ఎన్నడును వేరుమార్గముల ద్రొక్కక ఋజుమార్గముననే పయనించును.

'నేనీస్థితిని (ఆత్మస్థితిని) చేరుటెన్నడను చితంలో విషణ్ణడవు కావలదు. అది కాలదేశముల కందనిది, కావున అది దాపూకాదు, దూరమూకాదు.

''సహజస్థితి చేతనే ఆత్మ సర్వవ్యాపి, సదాముక్తమునూ, అది మాయచే నెట్లు బద్ధమగును? కావున నో సాధూ! విషాదమందకుము.

'సహజమగు'అచాల్య స్థితిని చేజార్చి, చపలజీవుడవను భావ నను పెంచుకొంటిని. సాధువీ భావనను త్రోసి పరమ మౌనము నాశ్రయింపవలెను.

'చిత్త చాంచల్య మణచు నుపాయమిదియే. సకల దృశ్యమూనూ ద్రష్టనూ ఆత్మాకారముగ కన్గొనుము.

'కంటకమును వెలిదీయు నుపయుక్తమైన కంటకమును పారవైచునట్లు, చెడుతలంపుల జెఱుపు శుద్ధవృత్తుల సైతము త్యజింపవలెను.

'బరువైన రాతిని చేగొని సముద్రమున మునిగి ముత్తెముల దీయు వానివలె, విరాగియై హృదయమున మునిగి, ఆత్మలాభమందతగును''.

మోక్షలబ్థికై సాధారణంగా ఆచరణలోనున్న అన్ని విధానాలకూ మహర్షి తెల్పిన మార్గానికీ మూలతత్వంలోనే భేదమున్నది. ఆ యితర మార్గాలను యోగములన్నారు. అవి కర్మ భక్తి యోగ (రాజ లేక హఠ) జ్ఞానములు వానిని ఆత్మవిచారములతో పోల్చి మహర్షి యిట్లన్నారు: కర్మ, విభక్తి, వియోగ అజ్ఞానము లెవరికి? అని విచారించుటయే కర్మము, భక్తి యోగము, జ్ఞానము లెవరికి? అని విచారించుటయే కర్మము, భక్తి, యోగము, జ్ఞానము అట్లు విచారింపగా మూలపురుషుడు పోవును; ఆ యోనిమిదియు బోవును ఈ తొమ్మిదియు నెప్పుడును లేని తానుగా నిలుచుటయే సత్యము''12 ఇట్లు యీ నాల్గు యోగాల్లోనూ సాధకుడు అహమికను తానుగా నెంచి, ఆ భ్రాంతి మూలంగా తనలోని లోపాల్లో నెదోయొక దాన్ని ఆత్మకారోపిస్తాడు. కర్మయోగి తనకర్మలకు తాను కర్తననీ కావున కర్మఫలభోక్తననీ భావించి ప్రతికూల కర్మలతో సమఫలముల జేయుగోరుతాడు. దైవము తనకు విశిష్టుడనీ అతనితో ఐక్యము కావుటవ సరమనీ భక్తి యోగి నమ్మకము. జ్ఞాన యోగికి జీవుడజ్ఞానియని, ఆ అజ్ఞానాన్ని తొలగింప కోరిక, రాజయోగి జీవుడాత్మనుండి వేర్పడి మనో నియమనం వల్ల ఆత్మతో పునః ఏకము కాగోరుచున్నాడని తలపోస్తాడు. ఈ యూహలన్నీ సరియైనవి గావు. సృష్ఠిక్రమము సర్వమూ భ్రాంతియే గనుక ఆత్మ వైయక్తికంగాదు. సద్వస్తువును వెదకి కన్గొననాడు అది పూర్ణమనీ, నిర్నిబంధనమనీ తెలయనౌతుంది. ఆత్మ విచారంవల్ల అహంతి నశించినప్పుడు, యదార్థమే అయిన నాహంస్థితిలో యీ నాల్గు దోషాలకు గాని వాని నాల్గు ఔషధక్రియ లకు గాని తావు లేదని తెలుస్తుంది ఒకమారు మహర్షి ఆత్మవిచారము ఉత్తమ యోగమని మహాయోగమని ప్రాసంగికంగా యీ రచయితతో అన్నారు. నిజమే ఈ ఆత్మవిచారంలో అన్ని యోగములూ విలీనములే.

_____________

12. చూ. అనుబంధము' కి. శ్లో. 60: సూక్తి సుధ 14.

Mahayogama    Chapters