Mahayogama
Chapters
ఓం నమో భగవతే శ్రీరమణాయ మహా యోగము (ఉపనిషద్దర్శనము) రచయిత ''ఎవరు'' By 'WHO' ఆంగ్లమూలము : [ Maha yoga (Upanishadic Lore)] ఆంధ్రానువాదము : రామచంద్ర కౌండిన్య 14-4-81 - 19-7-81 ప్రకాశకులు : టి. ఎన్. వెంకటరామన్ ప్రెసిడెంటు-బోర్డు ఆఫ్ ట్రస్టీస్ శ్రీరమణాశ్రమము తిరువణ్ణామలై : 606 603. దుర్మతి వైశాఖ
శు ೧೧ గురువారం ఆషాఢ
బ ೨ ఆదివారం సర్వస్వామ్యములు
: ప్రకాశకులవి ప్రధమ
ముద్రణము : ఉగాది - ప్రభవ - 1987 ప్రతులు
: 1000 మూల్యము
: రూ. 15 - 00 ముద్రాపకులు
: పి.
రామకృష్ణమూర్తి వెల్‌కం
ప్రెస్ పై#్రవేట్ లిమిటెడ్ బ్రాడీపేట,
గుంటూరు. 522 002, ఫోను : 31086. ఓమ్ తొలి
పలుకు నిజంగా
మననైజమేమో కనుగొనేందుకు ఋజువైనమార్గం
మహాయోగము. యోగమంటే సామాన్యంగా
అందరూ ఊహించే దానికీ ఈ మహాయోగానికీ ఏపోలికలూ
లేవు. ఇది చాల సరళ##మైనది. దీనిలో
రహస్యమేమీలేదు. ఇది కేవలం మన
ఉనికీ, దాని యాధార్థ్యములకు సంబంధించింది.
ఇంతకన్న సహజమైనది వేరేముంటుంది
? ఈ
మార్గ మవలంబించేవారిలో పేరియున్న విశ్వాసాలనూ,
సిద్ధాంతాలనూ మహాయోగం వదల్చివేస్తుంది.
క్రొత్తసిద్ధాంతాలకు పెనవై చేందుకు గాదు
: అన్ని సిద్ధాంతాలకు అతీతమైన సత్ స్వరూపాన్ని
విచారించేయత్న సాఫల్యానికై. మహాయోగాన్ని
ఒక విధమైన విస్మృతిగా కొందరు వర్ణించారు.
దాన్ని అవలంబించి నతడు పూర్వం తానునేర్చినదాన్ని
మఱవవలె, అది అంతా సాపేక్షజ్ఞానం : అజ్ఞానం.
కాబట్టి అది మహాయోగానికి అవరోధం ఉపనిషత్తులలోని
బోధయంతా ఈ మహాయోగయాధార్థ్యమే.
ఈ యోగంవల్ల తెలియగల సత్యం నిత్యమైనది.
కాని అది యట్టిదిగా నానాట జీవిస్తున్న మహానుభావుల
ప్రామాణ్యం కావలసివస్తున్నది. ఈ గ్రంధానికి
ప్రాతిపదిక యిట్లు - ఔపనిషదమైన సత్యం
కేవలం గురుముఖతః తెలియవలసిందే
: కాని ఉపనిషత్తులవల్లగాదు. ఉపనిషత్తులు
పదముల ప్రోవులు మాత్రమే. జీవద్గురువులన్ననో
మనం నెమకే ఆ నిత్యసత్యం దాల్చిన ప్రత్యక్షమూర్తులే.
అట్టి జీవద్గురువు మన యీనాళ్లలో అరుణాచలమహర్షి,
భగవాన్ శ్రీరమణులు. వారి జీవితాన్ని సంగ్రహంగా
యీ పుస్తకం మొదటి ప్రకరణంలో స్పృశించాను.
ఈ రచనకు సంబంధించినవరకు వారిబోధ
పరమప్రమాణం. ఉపనిషదర్థాలు ప్రాధాన్యతఃగౌణాలు,
వారు ప్రవచించిన వానికి వ్యాఖ్యామాత్రాలు, వివరణాలున్నూ.
ఆయోగివరిష్ఠులు ప్రవచించిన వానికి విరుద్ధంగా
ఏవేని యీ రచనలో దొరలితే వానిని గ్రహించ
నక్కఱలేదు. రచయిత