Viveka Panchakm anu Jeevitha Rahashyam
Chapters
వివేక పంచకము అను జీవిత
రహస్యము గ్రంథకర్త : ''సంథ్యాశ్రీ'' సూరవరపు లక్ష్మీపతిశాస్త్రి మైలవరం : :
కృష్ణాజిల్లా. కాపీ రైట్.
వెల : 12-00 ప్రధమ
ముద్రణము : 1979
జూన్ వెల
: రూ. 12-00 గ్రంథకర్త
: సూరవరపు
లక్ష్మీపతిశాస్త్రి ప్రాప్తిస్థానం
: మైలవరం, కృష్ణాజిల్లా. ముద్రణ
: ప్రోగ్రెసివ్
ప్రింటర్స్, విజయవాడ
2. వాగేశ్వర్యైనమః శ్రీ మహాగణాధిపతయే నమః. తొలిమాట దివ్యాత్మ స్వరూపులారా! ప్రేమతత్త్వ వేదులారా! పరతత్త్వమును తెలిసికొనుటకు సాధనముగా భగవానుడు స్వప్నమును కల్పించెను. స్వప్నము వలన మానవుడు నేర్చుకొన తగిన విషయమెయ్యది? దాని ప్రయోజనమెయ్యది? అని మనమున పొడగట్టి దైవ ప్రేరణముచే 1 స్వప్నతత్త్వ వివేకము 2 కుల మత తత్త్వ వివేకము, 3 దైవతత్త్వ వివకము 4 జన్మతత్త్వ వివేకము 5 మృత్యు తత్త్వ వివేకము అను పంచ తత్త్వములు ఇందు వ్రాయబడుటచే దీనిని ''వివేకపంచము'' అను పేరిడి పరం జ్యోతి స్వరూపమగు పరమాత్మకు అంకితముగా సమర్పించకొను చున్నాడను. 20 పొత్తములు ఇట్లు వ్రాయబడినవి. పాఠకులు ప్రతుల నందుకొని, గ్రంధ ముద్రణమునకు ద్రవ్య సహాయ మొనరించినచో తక్కిన భాగములు ముద్రణము చేయటకు ప్రోత్సహించిన వారలగుదురు. దైవము పాఠకులకును, ముద్రాకులకును, చందాదారులకును ఆయురారోగ్య భోగ భాగ్య త్యాగములను కలిగించి వాలించుగాక య నా ఇష్టదైవమగు గాయత్రీ మంత్ర ప్రతిపాద్యనుప పరబ్రహ్మమును గూర్చి అనవరతము థ్యానించుచు ముగింతురు. ఇట్లు గ్రంథకర్త సంధ్యాశ్రీ అభిమతము మహారాజ రాజశ్రీ కేరళ రాష్ట్ర గవర్నరుగారును, చుతర్దశ భాషా పాండితీ ప్రతిభావంతులను, సహృదయులును అగు మహారాజశ్రీ బూర్గుల రామకృష్ణారావు మహాశయులు దయచేసిన కృపాపత్రము. Rajabhavan Trivendrum Dt. 15-7-1958 శ్రీః బ్ర.శ్రీ. దారకాచార్య సురవరపు లక్ష్మీపతిశాస్త్రిగారి దివ్య సముఖమునకు అనేక నమస్కారానంతరము బూర్గుల రామకృష్ణారావు చేయు విన్నపము. తా మను గ్రహ పూర్వకముగా పంపించిన సంధ్యోపాసనా రహస్యములకు సంబంధించిన గ్రంథ రాజములను కృతజ్ఞతతో నందుకొంటిని. కాల విపర్యాసమునకు గుఱియై అడుగంటుచున్న సనాతన వైదికాచారాములను నిలిపి యుంచుటకు, వాని రహస్యములను సోపపత్తికముగా వివరించి, ప్రచారమునకు దీసికొని వచ్చు టత్యంత మవసరము. అట్టి పవిత్ర బ్రాహ్మణోచిత కర్మమును తాము పాలించుచుండుట, ఎంతేని ప్రశంసాపాత్రము. తమరు గావించుచుండిన సేవను కొనియాడుచు హర్దిక ధన్యవాద పురస్సరమగు సమోవాకముల నర్వించుచున్నాడను. ఇట్లు భవదీయుడు బూర్గుల రామకృష్ణారావు బ్రహ్మశ్రీ వేదమూర్తులను, ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సంఘ కార్యదర్శులును, ధర్మ శాస్త్రాలంకార, ఆర్ష విద్యాభూషణ బిరుదాంకితులును, చిత్ర శతకాద్యనేక గ్రంధకర్తలును, అగు శ్రీ జటావల్లభుల పురుషోత్తము ఎం.ఏ.గారు కృషచేసిన అభిప్రాయము. ''నమస్కారములు. తామొసగిన బ్రహ్మ సూత్ర వివేకమును చదివినాను. ఈ విషయమై యింత సవిమర్శముగాను, వివరముగాను, వ్రాయబడిన గ్రంధమును నేను చూడలేదు. బహు గ్రంధముల పరిశీలనమే గాక వివిధ దృక్కోణములతో విషయమును ప్రతిపాదించుట మీ గ్రంధమునకు తేజస్సు నిచ్చినది అంతియేకాదు. మీ గ్రంధమును శ్రద్ధగా చదివిన వారికి యజ్ఞోపవీతమును గూర్చిన సంశమయులన్నియు తీరునని నేను తలచుచున్నాను. అభివాదన వివేకము అను గ్రంధమునకు గూడ పై వర్ణనమే వర్తించును.'' ఇట్లు ది. 12-2-1960 జటావల్లభుల పురుషోత్తము M.A. సత్యనారాయణపురం సంస్కృతోపన్యాసకులు విజయవాడ - 11 యస్.ఆర్. ఆర్. అండ్ సి.వి.ఆర్. గవర్నమెంటు కాలేజి విజయవాడ శ్రీమదఖిలాంధ్ర దేశీయ బ్రాహ్మణ గురుకులాశ్రమ సంస్థాపకులును, సంచాలకులును, సర్వోపద్రష్టలును, తర్కవేదాంత విశారదులును, బ్రహ్మ విద్యాచార్యులును అగు బ్రహ్మశ్రీ వేదమూర్తులు ముదిగొండ వెంకట రామశాస్త్రిగారు కృప చేసిన అభిప్రాయము. ''బ్రహ్మశ్రీ వేదమూర్తులగు ''దారకాచార్య'' శ్రీ సూరవరపు లక్ష్మీపతిశాస్త్రి మహాశయులు అద్యతన బాల బోధోపయుక్తములగు యుక్తులతో రచించినట్టి ''సంధ్యాకాలము - అందలి రహస్యార్థము'' అను గ్రంధము నవలోకించితిని. అందు కాకతాళీయముగా 30, 31. పత్రముల సంధి వాక్యములలో ''నక్షత్రజ్యోతి యుండగా నారంభించి భానుడుదయించు పర్యంతము ప్రాతస్సంధ్యయనియు, సూర్యుడస్తమించుటకు పూర్వ మారంభించి తారకోదయ పర్యంతము సాంయసంధ్యయనియు, ఈ రెండు సంధ్యాకాలములకు మధ్యకాలము మాధ్యాహ్నిక సంధ్య అనియు వేదముచేతను, వేదవిదులగు మహర్షుల చేతను వచింపబడెను.'' ఈ విధముగ సంధ్యాకాలము యొక్కయు 40, 41 పత్రముల సంధి వాక్యములో "ఆదిత్య మండలాంతర్యర్తియగు బ్రహ్మ చైతన్యమే సంధ్యా దేవతయని యెఱింగి యుపాసించుటయే సంధ్యోపాసనము" ఈ విధముగ అందలి రహస్యార్థము యొక్కయు సారంశములు విద్వదాదరణీయములు గోచరించినవి. కనుక నీ గ్రంధ మాపండిత పామర మాదరణీయమగునని నా భావము. ఇట్లు ఓంకార మందిరము ముదిగొండ వెంకటరామశాస్త్రి చౌటపాపాయపాలెం తర్క వేదాంత విశారదః గుంటూరు జిల్లా బ్రహ్మవిద్యాచార్య. ది. 4-1-1960 అభిమతము బ్ర.శ్రీ. వేదమూర్తులు సూరవరపు లక్ష్మీపతిశాస్త్రిగారి సన్నిధికి నమస్కారములు. ఆర్యా! తాము చేసిన వైదిక కృషి సర్వులకు శ్రేయోదాయకమైనది. తమ అడ్రసు సాధన గ్రంధమండలి వారి శ్రీతత్వము అను గ్రంధములో లభ్యమైనది. మీ ప్రచారమును మా మిత్రుల కెరింగింతును. మీ రచనలను పది పొత్తములను మీరు పంపగా చదివి మోదమందితిని. జంగంపల్లె గ్రామం ఇట్లు అప్పాయపల్లెగ పోస్టు హిమకుంతల ఆత్మారామశర్మ కమలాపురం తాలూకా ఎస్ట్రాలజర్ - జ్యోతిషికులు కడప జిల్లా. ది. 29-12-1967 అభిమానము శ్రీ శాస్త్రిగారి సముఖమునకు ఆర్యా! తాము పంపిన పది పుస్తకములు అందినవి. అమందానంద భరితుడనైతిని. అచ్చపు చీకటిలోబడి తెన్నుగానక పరితపించుచున్న మాబోటి అజ్ఞానాంధులకు తమ రచనలు దివ్య తేజస్సునకు దారితీయు వెలుగుబాట వంటిది మీరు శిష్టాచార పద్ధతిలో యీశ్వరానుగ్రహమును పొందగోరు ముముక్షువులకు మీ రచనల ద్వారా మీరు చేసిన మేలు మిగుల శ్లాఘ్యమైనది. అవకాశము లభించినపుడు మీ సంస్థకు కొంత ద్రవ్య సహాయము చేసి కృతకృత్యుడ నగుదును గాక. ఇట్లు గురజాడ గ్రామము చల్లా శేషాచలశర్మ (వయా) మంటాడ మేనేజరు, వుయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ స్టోర్సు, వుయ్యూరు. అభిరుచి ఆర్యా ! నమస్తే శ్రీ మఱ్ఱిపాటి వేంకట నరసింహారావు గారిచే రచింపబడిన శ్రీ తత్త్వమును జదువు సందర్భమున నాకు కొంత సందేహ నివృత్తికి, శ్రీ లక్ష్మీపతిశాస్త్రిగారి విరచిత తైత్తిరీయ సంధ్యోపాసనము వైదిక సంధ్యా ఫలితము మొదలగు గ్రంధములను ఉదహరించినారు. వానిని చదువవలయునని చాల కుతూహలమున్నది. కాన దయతో ఆ గ్రంధములను పంప కోరెదను. ఇట్లు కళ్యాణ దుర్గము డాక్టరు జి.రామశర్మ అనంతపురం జిల్లా ది. 16-8-67 సంతోషము మహాశయా : నేనిటీవల నా భాగ్యవశమున తాము రచించిన ''సంధ్యాకాలము - అందలి రహస్యార్థం'' అను గ్రంధమును పరిశీలించి కృతార్థుడనైతిని. తమ సంధ్యా గ్రంధమాలిక యందలి గ్రంధములను సేకరించి చదువ వేడుక కలిగెను. 29-10-68. ఇంతలో తాము పంపిన 11 గ్రంధములు అందినవి. ఎల్లకాలము కృతజ్ఞుడను. మీ కృషి చాలా అపూర్వము, అమోఘము. తమకు వేదమాత సర్వకాల సర్వావస్థల యందును తోడునీడగ నుండి రక్షించుగాక. తమ కృషికి చేయూత నొసంగి రక్షించుగాక. తమ ధర్మ ప్రచారము యొక్క యుద్దేశము ఎల్లప్పుడు నెరవేరుటలో తమకు యీ అనుంగుమిత్రుడు చిక్రోడభక్తితో సేవ యొనర్చుట కంగీకరింతురు గాక. దోనెపూడి లక్ష్మీనారాయణ మూర్తి 16-11-68 ధర్మవరము అనంతపురము జిల్లా. బ్ర.శ్రీ. సూరవరపు లక్ష్మీపతిశాస్త్రిగారికి నమస్కారములు. మాది ముక్కామల గ్రామము. వేదార్థ ప్రవచనమునందున ఘనపఠన పాఠములందును సుప్రసిద్ధి చెందిన మహర్షితుల్యులగు బ్ర.శ్రీ భమిడిపాటి సింహాద్రి సోమయాజులు గారి జ్వేష్ఠ కుమారులగు శ్రీ నరసింహావధానులుగారి కనిష్ఠ పుత్రుడను. మీరు మా గ్రామములో చదువుకొన్నారని తెలిసికొని చాల సంతోషించినాను. నా విషయమై తెలిసికొనుటకు ఇంత శ్రద్ధ చూపుచున్నందులకు ఆశ్చర్యము సంతోషము కలిగినని. శ్రీ విద్యోపాసనమందు నాకంతగా ప్రవేశము లేకున్నను పరమేశ్వరుని మాతృరూపమున ధ్యానించుట యందు నామనము పరుగులిడును. అందుచే ఆ విషయమైన గ్రంధములు సేకరించి పరిశీలించుచుందురు. శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మజ్జగద్గురు పూజ్యపాద శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులగు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి చరణులు తూర్పు గోదావరీ మండలమున పర్యటింపుచు కాకినాడకు దయచేసి యుండగా వారి దర్శనమునకై వెళ్ళినాను. వారిని దర్శించిన పిమ్మట వారి మకాములోనున్న పుస్తక విక్రయశాలలోనికి వెళ్ళి పుస్తకములను పరిశీలింపగా అందులో శ్రీ మఱ్ఱిపాటి వేంకట నరసింహారావుగారు రచించిన ''శ్రీతత్తము'' అను పుస్తకమును కొని, ఇంటికి వచ్చి చదువగా, అందులో వారు మీ ''సంధ్యా సందేహ నివారిణి'' నుండి కొన్ని విషయములు వ్రాసియున్నారు. అంతేకాక మిమ్ములను గూర్చి యీ క్రింది విధముగా వ్రాసినారు. శ్రీ శాస్త్రిగారు బహు ప్రయాసమునకు లోనై నిస్వార్థులై తమ యావదా స్తిని క్రింద నుదహరించిన గ్రంధ ప్రచురణకై వినియోగించి సాధకలోకమునక, ఆంధ్ర మహాజనులకు, మహోపకారము చేసిరి. తైత్తి రీయ సంధ్యోపాసనము వగైరా గ్రంధములు'' ఇది చూచి కొన్ని గ్రంధములకు మీకు వ్రాసితిని. మీరు దయతో పంపినారు. వి.పి.గా పంపమని వ్రాయగా వి.పి. కాకుండా మామూలు పార్సెలుగా వచ్చిన తోడనే నేను ఆశ్యర్యపడినాను. ఇతోధికముగా మీరు సనాతన గ్రంధసేవ చేయుచున్నందులకు వందనీయులు! ఆ పరాభాట్టారికయగు మహాశ క్తియే మీకు కావలసిన శక్తి నొసంగుగాత మని ప్రార్థన చేయుచున్నాను. నేను ''సంధ్యోపాసనము''ను గూర్చి హూణ భాషలో నొక వ్యాసము రచించి గోరఖ్‌పూర్ సందలి ''కళ్యాణీ కల్పతరువు'' అను పత్రికకు పంప తలచుకొనియున్నాను. ఆ పత్రికా సంపాదకులు సుప్రసిద్ధ భక్తులగు ''హానుమాన్ ప్రసాద్ పోద్దార్''గారు నన్ను ఉపాసనము గూర్చి వ్యాసమును వ్రాయుడని కోరుచు ఆహ్వానమును పంపినారు. అందుచేత మీ గ్రంధములు నాకీ వ్యాసరచనలో చాల యుపయోగింపగలవని యాశించుచున్నాను. వూర్తిగా పరిశీలన చేసిన తరువాత మీకు నా అభిప్రాయమును తెలియజేసెదను. ''ధర్మోరక్షతి రక్షితః'' ధర్మమును రక్షించువారిని ఆధర్మమే రక్షించును. ''నహికల్యాణకృత్ కశ్చిద్దుర్గతింతా తగచ్ఛతి'' పుణ్యాత్మునకు ఎన్నడును దుర్గతిలేదు. ఇత్యాది శ్రుతి స్మృతి ప్రమాణముల వల్ల మీకే లోటును ఉండదు. భగవంతుడు సనాతన ధర్మ ప్రచారము కు శక్తి సామర్థ్యముల నిచ్చుగాక అని ప్రార్థించుకున్నాను. ది. 12-7-1967 ఇట్లు పిఠాపురము భమిడిపాటి వెంకట సుబ్బారాయుడు తూర్పుగోదావరి జిల్లా. డెప్యూటీ తహశీల్‌దారు. అభిమతము మహాశయాః సూరవరపు లక్ష్మీపతిశాస్త్రిణః అభిప్రాయ ఎకో7స్తి సర్వేషాం. ''సంధ్యోపాసనం నిర్దుష్టంకేనవాపి క్రియతేవా?'' ఇది వేదాధ్యయన సంపన్నానామప్త్యయమను మానో స్త్యేవ. తాదృశాయాంస్థితౌ యుష్మద్గ్రంధః సర్వేషామపి శరణమితి మన్యే7హమ్ అనేక విషయాః గ్రంధే7స్మిన్ సమ్యగాలోచ్యంతే. ఇతి శివమ్. పశ్చిమగోదావరి జిల్లా పండిత మైలవరపు ఆంజనేయశాస్త్రీ హేలాపురి శ్రౌతస్మార్త వాస్తు-ముహుర్త ది. 22-2-1959 జ్యోతిష ధర్మశాస్త్రాగమ పారీణః ఆశయము బ్రహ్మశ్రీ సంధ్యాతత్వ ప్రబోధదీక్షా విచక్షణులగు లక్ష్మీపతిశాస్త్రి గారి దివ్య సముఖమునకు సహస్ర నమోవాకములు. ఉభయ కుశలోపరి. సుధీవర్యా! మీరత్యాదరముతోఁబంపిన ''ఆభివాదన వివేకము'' బ్రహ్మసూత్ర వివేకము'' అను గ్రంధముల నందుకొంటిని, ఒకమారు సమగ్రముగా పఠించి నంతమాత్రముననే నాకు కలిగిన ఆమందానందము నిందు బొందుఁబఱుపఁ జాలకున్నాడను. యజ్ఞోపవీతము సంధ్యావిధి, వందన విధానము, వీని విషయమే నాకు కలిగియుండిన భావములెన్ని యో మీ రచనలందు ప్రస్ఫూటిత దివ్వ రూపములతో తేజరిజల్లచున్నవి. నాకందని విషయము లెన్నియో నిందు బోధింపఁబడినవి ''సహస్ర కిరణుఁడగు సవితృ దేవుని దివ్యభర్గస్సు'' ననుదినము నుపాసించుట చేతనే, మీధీశక్తి తద్విషయ ప్రభోధమున సహస్రకాంతులతో నిందు ప్రకాశించినదని భావింతును. మీ రచన యందుగల వివేచన మత్యద్భుతము. అసాధారణము. మీకు బహువిధ శాస్త్ర గ్రంధములఁబరిశీలిన వలనఁ గలిగిన యర్ధావ బోధము ఈ గ్రంధరూపమున వెలసినది. భగవానుడు మీ నుండి ఇట్టి గ్రంధములను లోకమున కనుగ్రహించుగాక యని ప్రార్థించుచున్నాను. వైదిక ధర్మ ప్రబోధమున మనకు ''సమానాశయ బంధుత్వము'' గలదని భావింతును. ఇతినతయః. మీ యోగ క్షేమముల తఱచు వినగోరుచుందును. ఇట్లు ఉయ్యాలవాడ. కోయిలకుంట్ల తాలూకా
భవదీయుడు కర్నూలు జిల్లా,
పాణ్యం నరసింహయ్య ది. 18-7-1958
ధర్మజ్యోతి ద్యాదిక బహుళ గ్రంధకర్త. ఆశీర్వాదము సంస్కృతాంధ్ర హూణ భాషా విశారదులును, స్కంధత్రయ వేత్తలును, సిద్ధాంతి శిరోమణులను, చంద్రాలోక రసమంజర్యాద్యలంకార శాస్త్ర గ్రంధాంధ్రాను వాదకులును, భారతదృశ్య ప్రబంధ కర్తలును, మంత్రశాస్త్ర మహాజ్ఞానార్ణవులను, పూర్ణ దీక్షాపరులును, ప్రాస్థానత్రయ శాంతులును, దాంతులును, ధర్మశాస్త్రా లంకారులును, సద్గుణోదారులను సోమపీథులును, బహుళ శిష్య సంతతియుతులును, శ్రీ రామానందనాధ దీక్షా నామోపనామకులును అగు బ్రహ్మశ్రీ అమరవాది నీలకంఠయజ్వ సిద్ధాంతి మహోదయులు దయచేసిన యాశయము. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన చి|| సూరవరపు లక్ష్మీపతిశాస్త్రిగారికి మనః పూర్వకాశీర్యాదము. అయ్యా ! తమ రంచించిన గ్రంథ పంచకము నామూలాగ్రముగ నా శిష్యుడు చిరంజీవి పెమ్మరాజు వేణుగోపాల కృష్ణమూర్తిగారు చదివి వినిపించగా విని చాల బ్రహ్మానంద భరితాంతః కరుణుండనైతిని. జగదుపకారార్ధమై యత్యంత శ్రద్ధతో శ్రమచేసి చక్కగ విమర్శించి విషయ నిర్దారణ చేసి విపులముగా సర్వులకు బోధపడదగిన మృదు మధుర భాషతో లలిత పదములతో మిక్కిలి శ్రమకోర్చి వ్రాయుటయేగాక తదమూల్య గ్రంధములను చేజాపకను, ఇతరుల నాశ్రయింపకను, వ్యయ ప్రయాసలకోర్చి లొకముస కందకేసిన మీవదాన్యతాగరిమకును, మీ యోగ్యతకును మీ పాండితికిని, మీ సునిశిత విమర్శనాశ క్తికిని, నా హృదయ పూర్వకముగ జనించిన నా ఆనందమునకు మేర లేక తమకు శతసహస్ర వేదోక్తా శీస్సుల నందజేయుచున్నాడను. తమచే సంగ్రధితము కాబడిన తక్కిన గ్రంధములను సాధ్యమైనంత త్వరలో పాఠక లోకమున కందజేయుదురు గాకమని మిమ్ములను ప్రోత్సహించుచు, అట్టి అవకాశము నను గ్రహింపుమని మదుపాస్య దైవమగు శ్రీమద్రాజ రాజేశ్వరీ పరాభట్టారికను అనుక్షణము వేడికొనుచున్నాడను. ఇట్లు తిరువూరు
అమరవాది నీలకంఠయజ్వసిద్ధాంతి