Naa Ramanasrma Jeevitham    Chapters   

37. ఎవరు సేవకులు? ఎవరు రక్షకులు?

భగవా9 చేతికురుపు నుండి రక్తం స్రవించడం కదలిక వల్లనే నని కొందరి అభిప్రాయం. అందువల్ల కట్టుకట్టుబడ్డ ఆ చెయ్యి కదల్చరా దన్నారు. భగవా9 ఒక్క చేత్తోనే విసరుకోవలసి వస్తోందప్పుడు. ఫాను పెడతామంటే ఏ కొంచెం సేపో తప్ప ఒప్పుకోవటం లేదు. ఎవరినీ విసరనీయరాయె. ఎట్లాగైనా శ్రీవారికి తెలియకుండా విసరాలని సేవకులందా వెనకపాటుగా నుంచుని అయిదారు రోజుల నుండీ అప్పుడప్పుడు విసరుతూ వచ్చారు. భగవా న్నేమార్చడానికి ఎవరి వశం. ''వద్దు వద్ద'' ని వారిస్తూనే వున్నారు భగవా9. మంచిపనే గదా అని వాళ్ళు మానలేదు. చాలావరకూ నిదానం గానే చెప్పారు భగవా9.

24-4-49 వ తేదీన పట్నంనుండి సుందరం అనే డాక్టరు వచ్చి ఆ పుండుకు ఎక్సరే తీసి ఆ వెనుక రేడియం సూదులు వేసి కట్టు కట్టటానికి ఆరంభంచేసి వెళ్ళాడు. ఇక్కడి డాక్టర్లు నిత్యం కట్టు కట్టుతూ వున్నారు. అవి కట్టితే ఒళ్ళంతా ఉడికి నట్లుంటుందట. ఎండలా విపరీతం. భగవా9 ఎట్లా భరిస్తున్నారోగాని యథాప్రకారం ఒక చేత్తోనే విసరుకుంటూ అందరితోనూ మాట్లాడుతూ కార్యక్రమం నడుపుతునే వున్నారు. ఆ స్థితిలోనే ఆత్మబోధ అనువాదమున్నూ ఒకే చేత్తో వ్రాసి ముగించారు.

27-4-49 సాయంకాలం నాలుగూ ముప్పావుకు భగవాన్‌ బయటికి వెళ్ళిన సమయంలో అధికారవర్గంలో చేరినవారు కొందరు (అంటె ఆశ్రమ సంబంధమైన అధకార వర్గ మన్న మాట) జూబ్లీ ''హాల్లో నిలిచి'' భగవాన్‌ శరీరం బలహీనంగా ఉన్నది గనుక ఆట్టే మాట్లాడకుండా చూడాలి. అందువల్ల శ్రీవారి నెవరూ మాట్లాడించరాదని'' అక్కడున్న భక్తు లందరినీ ఆజ్ఞాపించి చక్కా పోయారు. గోశాలవద్ద భగవానుకు ఈ సంగతి ఎవరో చెప్పారు గాబోలు చిరాకుగానే వచ్చి కూర్చున్నారు భగవాన్‌. కూర్చోగానే వెంకటరత్నం విసరడానికి ఆరంభించాడు. భగవా9 ఈసారి చూచీ చూడవట్లు వురుకున్నారు. ఇంకేం ఇష్టమే ననుకొని మరీ జోరుగా విసురుతూ నుంచున్నాడాతను. వేదపారాయణ ముగిసింది. భగవా9 వెంకట రత్నాన్ని చూచి ''ఇదిగో, ఈ చేష్ట ఇకనైనా విడుస్తావా? లేదా? అయిదారు దినాలుగ మీ అందరికీ చెపుతునే వున్నాను. వింటారా? వినండి. లేకుంటే ఇక ముందు ఏదీ చేప్పను, ఎవరుగాని రెండు మూడు సార్లు చెప్పి చూస్తాను. వింటారా సరే, వివరూ వెనక వారికిక ఏదీ చెప్పను. ఏమి నీ సంగతి? '' అని గద్దించారు.

ఆత డంతటతో విసరడం ఆపి ''భగవానుకు చెమట పోస్తున్నదని విసురుతున్నా నన్నాడు''. ''ఓహో! ఇంత మందిలో నా వొక్కడికే చెమట పోస్తున్నదన్నమాట. వారందరికీ విసురుతున్నావా? అంత భక్తి వుంటే అట్లా నుంచునీ అందరికీ విసరరాదూ? అందరిలోనూ భగవాన్‌ లేరు గాబోలును. పుణ్యం రావాలన్న ఆశతో కొందరు సభలో నుంచుని అందరికీ విసురుతారట. నీకూ ఆ ఆశ వుంటే అట్లా నుంచుని అందరికీ విసురు బాబూ. పుణ్యం వస్తుంది'' అన్నారు భగవాన్‌. ఇంతలో ఇంటికి వద్దామని లేచా నేను. భగవాన్‌ చూచి ''ఇదుగో చూడూ వీడి చేష్టలు. రోజూ వద్దని చెపుతునే వున్నాను, వినడు, వాడి ఇష్టప్రకారం నే నుండాలన్నమాట. ఒక్కొక్కరికీ ఇదే అభిప్రాయం. వాళ్ళకు నేను వశపడి వుండాలి. వాళ్ళు చెప్పి నట్లు వినాలి. మాట్లాడమంటే మాట్లాడాలి. కూడదంటే కూడదు. వాళ్ళందరీని మాట్లాడవద్దని అనకపోతే నన్నే మాట్లాడకూడదని ఆజ్ఞాపించరాదూ? వీరంతా స్వామికి అలసట కాకుండా కాపాడుతారట. అంతా నాకు రక్షకులే. వీళ్ళే రక్షించేది. పాపం అంగరక్షకులు'' అంటూ ఏమేమో ఏ కరువు పెట్టారు భగవాన్‌.

వెంకటరత్నం ఏదో బదులు చెప్పబోతూ వుంటే ''పొరపాటయిందని ఒప్పుకోరాదా! '' అని నే నతనితో అనబోయి ''పొరపాటు'' అన్నమాట నా నోట వచ్చే సరికి భగవా నందుకొన్నారు. ''పొరపాటా? చిన్న పిల్లడు. పాపం పాలు త్రాగుతున్నాడు. నోట్లో వేలు పెడితె కొఱకలేడు. తెలియకనా చేస్తాడు. వీడు. తానూ అందరితో చేరాడు. మొదటిసారి గనుక చెపుతున్నాను. వింటే వింటాడు వినకపోతే పోతాడు. మనకేమి?'' అంటూ ఎంతోసేపు నేను కూర్చునేట్లు చేసి విరామంలేకుండా తామే మాట్లాడిస్తూ ఎన్నో విషయాలు మాట్లాడసాగారు భగవాన్‌. సాయంకాలం భగవానుని పలుకరించరాదని బోధించినవారంతా పక్కపక్కలకు జారి కుక్కిన పేనులల్లే కూర్చున్నారు.

ఆడవా రుండదగిన వేళ అతిక్రమించటంవల్ల భయపడుతూ లేచా నేను. భగవాన్‌ గడియారం చూచి తమ దృష్టి పక్కనున్న మరొక భక్తుని వైపు తిప్పారు. నమస్కరించి నే నింటికి వచ్చాను. రాత్రి భోజనశాలలో గంట కొట్టేవరకూ భగవాన్‌ దానిని గుఱించి ఒకే ధారగా మాట్లాడుతునే వున్నారట. ఈ త్యాగమూర్తికి, ఈ జగద్రక్షకునకు ఎవరు సేవకులు ఎవరు సేవకులు ఎవరు రక్షకులు?

Naa Ramanasrma Jeevitham    Chapters