Naa Ramanasrma Jeevitham    Chapters   

63. లేఖల ముద్రణ

చాలామంది రమణ భక్తులు అముద్రితంగా వున్న లేఖలు 3, 4, 5 భాగాలు ప్రచురించండని ఆశ్రమంవారిని ప్రోత్సహించారు గాని అప్పటి సందర్భంలో వారందుకు పూనుకొనలేదు. అందువల్ల 1958 లో మూడవ భాగం ''రమణలేఖావళి'' అనే పేరుతో మా చిన్నన్నగారే ప్రచురించారు. దానికి ''అవతరిణిక'' శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారు వ్రాసియిచ్చారు. అప్పుడే 4, 5 భాగాలుగ వున్న లేఖలు ఆంధ్రప్రభ వారపత్రికలోనూ ప్రకటించారు. పాఠకులంతా అవన్నీ చాలా బాగున్నవి. ఆశ్రమం వారే ప్రకటించుట మంచిదని ప్రోత్సహించుట వల్లనూ, అప్పటికి ఆశ్రమ పరిస్థితులన్నీ చక్కబడినందువల్లనూ 1964-1965 మధ్యలో ఆశ్రమంవారే 3, 4, 5 భాగాలున్నూ తామే ముద్రించారు. నాల్గవ భాగానికి అఖండం సీతారామశాస్త్రి గారు ''అవతరిణిక'' వ్రాశారు. ఐదవ భాగానికి విశ్వనాథ సత్యనారాయణగారు పీఠిక వ్రాసి, నా భాష శిష్టవ్యావహారిక భాష అని నిర్ణయించారు. ఆ ఐదు భాగాలకు మా చిన్నన్న డి.యస్‌. శాస్త్రి గారిచేత ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి ఆశ్రమంవారే ప్రకటించారు.

Naa Ramanasrma Jeevitham    Chapters