Naa Ramanasrma Jeevitham    Chapters   

ఓం

నమో భగవతే శ్రీ రమణాయ

నా రమణాశ్రమ జీవితం

సూరి నాగమ్మ

ప్రకాశకులు :

టి. ఎస్‌. వేంకటరామన్‌

ప్రెసిడెంట్‌-బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌

ప్రకాశకులు :

శ్రీ రమణాశ్రమము

తిరువణ్ణామలై - 606 603

సర్వస్వామ్య సంకలితము] 1987 [వెల : రూ. 12-50

''విఘ్నేశ్వర ప్రార్థన''

''ఉరుబొజ్జ సొంపుతో నీ

వరుదుగ మద్రచన కాదియందుండవె శ్రీ

కరుడవుగద నిను గనిన&

దరిజేరగ వెరచు విఘ్నతతులు గణశా''

''సరస్వతీ ప్రార్థన''

''వాణికి నంచిత నతగీ

ర్వాణికి సుఖఖనికి సరస వరవీణాస

త్పాణికి మృదుఘన నుందర

వేణికి నే నతులభక్తి వినతు లొనర్తున్‌''

''శ్రీ గురుస్తుతి''

''శ్రీకారుణ్యపయోధిదేల్చి శుభముల్‌ జేకూర్చి రక్షింపగా

సాకారంబున బొల్చినట్టి రమణా! సర్వేశ! సర్వాత్మకా!

శోకారణ్యదవానలా! భవహరా! శుద్ధాత్మ ని& గొల్చెద&

లోకానందముగాగ యీకృతిని యా లోకించి న& బ్రోవవే''

''శ్రీ కరములైన నీకథ

లే కరణిని విన్న క్రొత్తవేయగు ననుచు&

అకర్ణించిన వారలు

వా కొనుటంజేసి దీని వ్రాసితి ననఘా''

''సదమలమతి నా కృతిగొని

హృదయాంతరమందు నిలిచి యూర్జితమగు నీ

పదఘట్టన విషయేచ్ఛల

మదమరణచి సుఖాబ్ధిదేల్చి మనుపవె రమణా''

జయము దురిత దూర

సజ్జన మందార

జయము మౌననిరత

జన్మరహిత |

జయము రమణమూర్తి

సాధు హృద్వశవర్తి

జయము జయము యోగి

చక్రవర్తీ ||

మంగళము యోగి హృదయాబ్జ

మదిరునకు

మంగళము సచ్చిదానంద

మయున కెపుడు |

మంగళము చిత్కళాపూర్ణ

మహిత కాంతి

మండనునకు సదా జయ

మంగళము ||

Naa Ramanasrma Jeevitham    Chapters