Paramacharya pavanagadhalu    Chapters   

22. నీ పాపానికి నిష్కృతి

శృంగేరీ శంకరాచార్యులు చంద్రశేఖర భారతి ఎప్పుడూ బ్రహ్మతత్వమననం చేస్తూ ఒళ్లు తెలియని స్థితిలో వుంటుండేవారు. అలౌకికానందం అనుభవిస్తూ ఆయన మరి ఏ విషయాలను పట్టించుకొనేవారు కాదు. కొందరు ఆయన గొప్ప తనం గ్రహించలేక ఆయనకు పిచ్చి అని పొరపడేవారు.

ఒకసారి పండితులొకాయన కంచి పెద స్వామిని కలిసి మాట్లాడుతూ శృంగేరి స్వామికి పిచ్చి ఎక్కిందని చెప్పారు. దానికి పరమాచార్య 'శివ! శివ!' అని చెవులు మూసికొని పెద్దగా నిట్టూరుస్తూ 'ఆ మహనీయుని విషయంలో యీ విధంగా మాటలాడిన నీ పాపానికి నిష్కృతి లేదు. వెళ్లి ఆ చంద్రమౌళీశ్వరుని పాదాల నాశ్రయించు' అని తీవ్రంగా మందలించారు.

మనకు కలిగే యిబ్బందులన్నిటికీ కారణం కోరికలే. కోరికలను పూర్తిగా జయించలేకపోయినా, వాటని అదుపులో వుంచుకోడానికి నిరంతరం ప్రయత్నించాలి. ఏదో విధంగా మనం కోరికలను జయించగలిగితే, సంపూర్ణమైన శాంతిని మనం పొందగలం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters