Paramacharya pavanagadhalu    Chapters   

5. మనవి

పరమాచార్య పావనగాథలను నూరింటిని కూర్చి పుస్తక రూపంగా వెలువరించాలన్న ఆలోచన ముందుగా శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారికి కలిగింది. ఆ సమయానికి నేనక్కడ వుండటం వలన ఈ అవకాశం అర్హత లేకపోయినా, పూర్వ జన్మ సుకృతమో, అదృష్టమో, ఏదయితేనేం నాకు దక్కింది.

కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన, జగద్గురువుల ఆశీస్సులవలన పుస్తకం అనుకొన్న గడువు కన్నాముందే పూర్తికావటం విశేషం.

ఈ ప్రయత్నానికి నన్ను పురికొల్పిన శ్రీ జ్వాలా నరసింహారావు గారికి, దీనికి అందంగా ముఖపత్రరచన చేసిన కుమారి ప్రేమమాలినికి, ఇందుకు ప్రకటనలిచ్చి సహాయపడిన వారికి, దీనిని ముచ్చటగా ముద్రించి యిచ్చిన మనోరూపా ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అధినేత శ్రీ నాగభూషణం గారికి, దీనికి అవసరమైన సమాచారసేకరణలో తోడ్పడిన శ్రీ నీలంరాజు మురళీధర్‌, శ్రీమతి వనం విజయలక్ష్మి శ్రీ హెచ్‌. రాఘవేంద్రరావు గారలకు, ఈ పుస్తక ప్రచురణ భారం వహించిన నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ వారికి, అడిగినంతనే 'ఆమంత్రణ' రాసిచ్చిన పెద్దలు శ్రీ మిరియాల వెంకట్రావు గారికి, అన్నివిధాలా తమ ప్రోత్సాహాన్ని అందించిన శ్రీ వి. చంద్రమౌళి, (ఐ.ఏ.ఎస్‌.) గారికి, ఇంకా ఎందరో మహానుభావులు| అందరికీ నా కృతజ్ఞతా పూర్వక అభివందనాలు.

-రచయిత

Paramacharya pavanagadhalu    Chapters