Paramacharya pavanagadhalu    Chapters   

6. ఆకాంక్ష

'నడిచే దేవుడు' గా పేరు పొందిన పరమాచార్య గారి దర్శనం తరచుగా చేసికొనే భాగ్యం ఇటీవల కొన్ని సంవత్సరాలుగా నాకు కలుగుతూ వచ్చింది. అందుకు ఆ మహానుభావుని అనుగ్రహం కారణం అనుకుంటాను.

కరుణ, సౌజన్యం, పవిత్రత, తపోశక్తి రూపుకట్టిన మనీషి మహిమాన్విత జీవితంలోని అద్బుత ఘట్టాలను కొన్నిటిని చిన్న కథలుగా మలిచి తెలుగు వారికి అందించిన శ్రీ భండారు పర్వతాల రావునూ, ఆ కథలకు పుస్తక రూపం ఇచ్చిన 'నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌' వారినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

అయితే యీ కృషి యింతటితో ఆగిపోరాదు. పరమాచార్య అనుగ్రహానికి పాత్రులైన భక్తులు వేలాదిగా, లక్షలాదిగా వున్నారు. వారి దివ్యానుభవాలలో గ్రంథస్థం చేయదగినవి ఎన్నో వున్నాయి. శ్రీ పర్వతాలరావు అటువంటి యదార్థ గాథలను మరి కొన్నింటిని సేకరించి, 'పరమాచార్య పావనగాథలు' - ద్వితీయ కుసుమంగా త్వరలోనే మనకు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.

28.4.1994 9; 9; రాయపాటి సాంబశివరావు

Paramacharya pavanagadhalu    Chapters