sri Shankara chidvilasamu    Chapters   

జగద్గరువులైనన శ్రీ ఆదిశంకర భగవత్పూజ్యపాదులకు

అంకితము

''వ్యుప్తకేశాయచ'' అని వేదములో వర్ణింపబడిన ప్రకారము ఆ పరమేశ్వరుని వ్యుప్తకేశరూపులు, కలియుగ జ్ఞానావతారులునై నట్టియు-

ఊనషోడశ వయఃకాలములో భాష్య ప్రకరణస్తోత్రాది సార్థశతాథికామూల్య గ్రంథరాశిని జగదుద్ధరణార్థమై అనుగ్రహించిన సర్వజ్ఞ లైనట్టియు -

అపౌరుషేయములై జ్ఞానపేటిక లనదగు ఉపనిషత్తులలోని అద్వైత సిద్ధాంతముల నుద్ధరించి ప్రచారము చేసి సర్వదర్మతములను ఖండించి అద్వైతమునకు ఆధ్యాత్మిక సామ్రాజ్య పట్టాభిషేకమును గావించి భారతదేశములో చతుర్దిశలందును పీఠ చతుష్టయమునమర్చి షణ్మతముల గూడ స్థాపించి 'జగద్గురువులు' అను సార్ధక బిరుదముతో విరాజితులైనట్టియు-

దయాసముద్రులైనట్టియు-

శ్రీమదాదిశంకర భగవత్పూజ్యపాదులకు

వారి యనుగ్రహ విశేషముచే రచింపబడిన ''శ్రీశంకర చిద్విలాసము'' అను ఈ గ్రంథమును బద్ధాంజలినై అంకితము చేయుచున్నాను.

విద్యాశంకర భారతీస్వామి

శంకరమఠము శ్రీగాయత్రీపీఠము

బందరు

క్రోధిసంవత్సరవైశాఖశుక్లపంచమీస్థిరవారము

శంకరజయంతి

16-5-1964

sri Shankara chidvilasamu    Chapters