Satyanveshana    Chapters   

మున్నుడి

సార్వస్వతేయులకు మా'రసోదయ' అందించు ఏకాదశకుసుమగుచ్ఛము ఈ ''సత్యాన్వేషణ''. మా దశమకుశమగుచ్ఛమగు 'ధర్మప్రబోధ'ను ఆమోదించిన విద్వజ్జనుల సలహాలు, ఏతత్‌ గ్రంధకృతి భర్త బ్రహ్మశ్రీ కరెడ్ల నరసింహంగారి కోరిక నా చిరంతర చింతనాజనిత ఊహలు, ఈ గ్రంధ రూసమున వెలయించుటకు ప్రోత్సహించినవి. వారికి కృతజ్ఞుడను. ఇందలి విషయవివరణ, మంచి చెడ్డలు నిర్ణయించు భారము, సుధీనిధులగు పఠితలదే.

నేను కోరినంత మాత్రమున దయతో శ్రమకోర్చి తమ అమూల్యమైన ఆమోదముద్రచే నా యీరచనకు గౌరవము గూర్చిన బ్రహ్మవిద్యావేత్త శ్రీ మండలీక వెంకటశాస్త్రీ మహోదయులకు, చక్కని విమర్శనాత్మకమైన ప్రవేశిక వ్రాసిన శ్రీవసంతరావు వెంకట్రావు యం ఎ. గారికి సదా కృతజ్ఞుడను.

ఈ గ్రంధ రచన సంకల్పము విని మారసోదయకు పోషకులుగా రు. 116.00 విరాళ మిచ్చిన సహృదయులు. ఆధ్యాత్మిక భావ సంపన్నులు అయిన శ్రీ గుడ్లవల్లేటి లక్ష్మణరావు ఎమ్‌.బి.బి.యస్‌ గారి వదాన్యతకు మా సంస్థ ఋణపడి యున్నది.

అందరికి సులభముగ తెలియునటులుండవలయునని వీలయినంతవరకు, అన్వయకాఠిన్యము భాషాక్లిష్ణత లేకుండ చూడబడినది ఆ కారణమున విసంధులు మొదలగు వ్యాకరణశాస్త్ర దొసగులు అందందు దొరలినవి.

ఇట్లు

సుహృజ్జన విధేయుడు

గ్రంధకర్త

Satyanveshana    Chapters