Sri Madhagni Mahapuranamu-1
Chapters
శ్రీః శ్రీ గణశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మదగ్ని మహాపురాణము మూలము : శ్రియం సరస్వతీం గౌరీం గణశం స్కన్దమీశ్వరమ్ | బ్రహ్మాణం వహ్నిమిన్ద్రాదీన్వాసుదేవం నమామ్యహమ్. ఆంధ్రానువాదము : నత్వా శ్రీతాతపాదాదీన్ శాస్త్రమన్త్రాది సద్గురున్ | మహాపురాణ మగ్గేయ మాన్ధ్య్రా మనువదామ్యహమ్. శ్రీ మహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునకును, అగ్ని దేవునకును, ఇంద్రాదులకును, శ్రీమహావిష్ణువు నకును నమస్కరించుచున్నాను. నైమిషే హరిమీజానా ఋషయః శౌనకాదయః | తీర్థయాత్రాప్రసజ్గేన స్వాగతం సూతమబ్రువన్. నైమిషారణ్యమునందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్రాసందర్భమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి. ఋషయ ఊచుః: సూత త్వం పూజితో7స్మాభిః సారాత్సారం వద్సవ నః | యేన విజ్ఞాత మాత్రేణ సర్వజ్ఞత్వం ప్రజాయతే. ఋషులు పలికిరి : ఓ సూతుడా! నీవు (మాచేత పూజింపబడినావు) మాకు పూజ్యుడవు. దేనిని తెలసికొనినంత మాత్రముచే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సార మైనదానిని మాకు చెప్పుము. సూత ఉవాచ: సారాత్సారో హి భగవాన్విష్ణుః సర్గాది కృద్విభుః | బ్రహ్మాహమస్మి తం జ్ఞాత్వా సర్వజ్ఞత్వం ప్రజాయతే. సూతుడు పలికెను - సృష్ట్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీమహావిష్ణువే సారములలో కెల్ల సారమైన వాడు. " నేనే ఆ పరబ్రహ్మస్వరూపుడను" అని ఆ విష్ణువును గూర్చి తెలిసికొన్నచో సర్వజ్ఞత్వము కలుగును. ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్దబ్రహ్మపరం చ యత్ | ద్వే విద్యే వేదితవ్యే హి ఇతి చాథర్వణీ శ్రుతిః. శబ్దములకు గోచర మగు సగుణబ్రహ్మయు, పర మగునిర్గుణబ్రహ్మయు తెలియదగినవి. అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు గూడ -" రెండు విద్యలు తెలిసికొనవలెను" అని చెప్పుచున్నది. అహం శుకశ్చ పైలాద్యా గత్వా బదరికాశ్రమమ్ | వ్యాసం నత్వా పృష్టవన్తః సో7స్మాన్సరమథాబ్రవీత్. 6 నేనును, శుకుడను, పైలుడు మొదలగువారును బదరికాశ్రమమునకు వెళ్ళి వ్యాసుని నమస్కరించి ప్రశ్నింపగా అపుడాతడు మాకు సారము నుపదేశించెను. వ్యాస ఉవాచ:- శుకాద్యైః శృణు సూత త్వం వసిష్ఠో మాం యథా బ్రవీత్ | 7 బ్రహ్మసారం హి వృచ్ఛన్తం మునిభిశ్చ పరాత్పరమ్. వ్యాసుడు పలికెను: నేను మునులతో కలిసివెళ్ళి, పరముకంటె పరమును, సారభూతముము అగు బ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వసిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ! సూతా! నీవును శుకాదులును వినుడు. వసిష్ఠ ఉవాచ : ద్వివిధం బ్రహ్మ వక్ష్యామి శృణువ్యాసాఖిలానుగమ్ | 8 యథాగ్నిర్మా పురా ప్రాహ మునిభిర్దైవత్తెః సహ. వసిష్ఠుడు పలికెను ః ఓ వ్యాసా! పూర్వము అగ్ని దేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్త మగు, ద్వివిధ మైన బ్రహ్మను గూర్చి చెప్పదను; వినుము. పురాణం పరమాగ్నేయం బ్రహ్మవిద్యాక్షరం పరమ్ | 9 ఋగ్వేదాద్యపరం బ్రహ్మ సర్వదేవసుఖావహమ్. బ్రహ్మవిద్య నాశనరహిత మగు పరవిద్య. అందుచే తత్ప్రతిపాదక మగు అగ్నే యపురాణము పరము. సర్వ దేవతలకును సుఖమును కలిగించు ఋగ్వేదాదికము అపర బ్రహ్మ. ఆపరబ్రహ్మను ప్రతిపాదించున దగుటచే దాని కాపేరు. అగ్నినోక్తం పురాణం యదాగ్నేయం బ్రహ్మసంమితమ్ | భు క్తిముక్తిప్రదం దివ్యం పఠతాం శృణ్వతాం నృణామ్. 10 అగ్ని చెప్పిన పురాణము అగ్నేయపురాణము. ఇది వేదముతో సమానమైనది. చదువువారికిని, వినువారికిని భుక్తిముక్తుల నొసగునది. కాలాగ్ని రూపిణం విష్ణుం జ్యోతిర్బ్రహ్మ పరాత్పరమ్ | 11 మునిఖిః పృష్టవాన్దేవం పూజితం జ్ఞానకర్మభిః కాలాగ్ని స్వరూపుడును. జ్యోతిఃస్వరూపుడును, పరాత్పరమైన బ్రహ్మయు, జ్ఞాన- కర్మలచే పూడింపబడువాడును ఆగు విష్ణుదేవుని మునిసమేతుడై (విసిష్ఠుడు) ప్రశ్నించెను. వసిష్ఠ ఉవాచ ః సంసారసాగరోత్తార నావం బ్రహ్మేశ్వరం వద | విద్యాసారం యద్విదిత్వా సర్వజ్ఞో జాయతే నరః . 12 వసిష్ఠుడు పలికెను : సకల విద్యల సారమగు ఏ బ్రహ్మను గూర్చి తెలిసికొని నరుడు సర్వజ్ఞత్వమును పొందునో అట్టిదియు, సంసారసాగరమును దాటించుటలో నావయు, సర్వశ క్తమును అగు బ్రహ్మను గూర్చి చెప్పుము. అగ్నిరూవాచ: విష్ణుః కాలాగ్ని రుద్రోహం విద్యాసారం వదామి తే | విద్యాసారం పురాణం యత్సర్వం సర్వస్య కారణమ్. 13 అగ్ని పలికెను : విష్ణువు నైన నేనే కాలాగ్నిరుద్రుడను. సర్వస్వరూపమును, సర్వకారణమును, అతి ప్రాచీనమును అగు వద్యాసారమును గూర్చి నీకు చెప్పెదను. సర్గస్య ప్రతిసర్గస్య వంశమన్వన్తరస్య చ | వంశానుచరితాదేశ్చ మత్స్యకూర్మాది రూపధృక్. 14 మత్స్యకూర్మాది రూపములను ధరించిన నేను సృష్టికిని, ప్రలయమునకు, వంశములకను, మన్వంతరములకును, వంశాను చరితము మొదలగుదానికిని కారణ మైనవాడను (ముని ఋష్యాదుల వంశముల వర్ణనము వంశము. ప్రధాన రాజవంశముల వర్ణనము వంశాను చరితము) ద్వే విద్యే భగవాన్విష్ణుః పరా చైవాపరా చ హ | ఋగ్యజుఃసామాథర్వాఖ్యా వేదాఙ్గాని చ షట్ ద్విజ. 15 శిక్షా కల్పోవ్యాకరణం నిరుక్తం జ్యోతిషాం గతిః | ఛన్దోభిధానం మీమాంసా ధర్మశాస్త్రం పురాణకమ్. 16 న్యాయ వైద్యక గాంధర్వం ధనుర్వేదో7ర్థశాస్త్రకమ్ | అపరేయం; పరా విద్యా యయా బ్రహ్మాభిగమ్యతే. 17 యత్తదదృశ్యమగ్రాహ్యమగోత్ర చరణం ధ్రువమ్. పర, అపర అను ఈ రెండు విద్యలును విష్ణు స్వరూపములే. ఓ బ్రహ్మణా! ఋగ్యజస్సామాథర్వవేదములును, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను వేదాంగమూలారును, కోశము, మీమాంస, ధర్మ శాస్త్రము, పురాణము, న్యాయశాస్త్రము, అయుర్వేదము, సంగీతశాస్త్రము, ధనుర్వేదము, అర్థశాస్త్రము - ఇవన్నియు అపరవిద్య. చూడ శక్యము కానిదియు, పట్టుకొన శక్యము కానిదియు, గోత్రము గాని శాఖ గాని లేనిదియు, నిత్యమును అగు బ్రహ్మను బోధించు విద్య పరవిద్య, విష్ణునోక్తం యథా మహ్యం దేవేభ్యో బ్రహ్మణా పురా! తథా తే కథయిష్యామి హేతుం మత్స్యాది రూపిణమ్. 18 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ప్రశ్నో నామ ప్రథమో7ధ్యాయః పూర్వము బ్రహ్మ దేవతల కెట్లు చెప్పెనో, విష్ణువు నా కెట్లు చెప్పెనో ఆ విధముగ మత్స్యాదిరూపములను ధరించిన జగత్కారణభూతు డగు విష్ణువును గూర్చి నీకు చెప్పెదను. అగ్ని మహాపురాణములో 'ప్రశ్నము' అను ప్రథమాధ్యాయము సమాప్తము.