Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ శతతమో7ధ్యాయః.

అథ ద్వార ప్రతిష్ఠావిధానమ్‌

ఈశ్వర ఉవాచ:

ద్వారాశ్రితప్రతిష్ఠాయా వక్ష్యామి విధిమప్యథ | ద్వారాఙ్గాణి కషాయాద్యైః సంస్కృత్య శయనే న్యసేత్‌ . 1

మూలమధ్యాగ్రభాగేషు త్రయమాత్మాదిసేశ్వరమ్‌ | విన్యస్య సన్ని వేశ్యాథ హుత్వా జప్త్వాత్ర రూపతః. 2

ద్వారాదధో యజేద్వాస్తుం తత్రైవాన న్తమస్త్రతః | రత్నాదిపఞ్చకం న్యస్య శక్తిహోమం విధాయ చ. 3

యవసిద్దార్థకాక్రాన్తా బుద్ధివృద్ధిమహాతిలాః | గోమృత్సర్షపరాగేన్ద్రమోహనీలక్ష్మణామృతాః. 4

రోచనారుగ్వచాదూర్వాప్రాసాదాధశ్చపోటలిమ్‌ | ప్రకృతోదుమ్బరే బద్ధ్వా రక్షార్థం ప్రణవేన తు. 5

ద్వారముత్తరతః కిఞ్చిదాశ్రితం సన్నివేశ##యేత్‌ | ఆత్మతత్త్వమధో న్యస్య విద్యాతత్త్వం చ శాఖయోః. 6

శివమాకాశ##దేశే చ వ్యాపకం సర్వమణ్డలే | తతో మహేశనాథం చ విన్యసేన్మూలమన్త్రతః. 7

ద్వారాశ్రితాంశ్చతల్పాదీన్‌ కృతయుక్తైః స్వనామభిః | జుహుయాచ్ఛతమర్దం వా ద్విగుణం శక్తితో7థవా. 8

న్యూనాదిదోషమోషార్థం హేతితోజుహుయాచ్ఛతమ్‌ | దిగ్బలిం పూర్వవద్దత్వా ప్రదద్యాద్దక్షిణాదికమ్‌. 9

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ద్వార ప్రతిష్ఠావిధానం నామ శతతమో7ధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను : ఇపుడు ద్వారమునకు సంబంధించిన ప్రతిష్ఠావిధి చెప్పెదను. ద్వారాంగభూతములగు ఉపకరణములను కషాయజలాదులతో సంస్కరించి, శయ్యపై ఉంచవలెను. ద్వారము యొక్క మూల-మధ్య-అగ్రభాగములందు ఆత్మ-విద్యా-శివతత్త్వముల న్యాసము చేసి సంరోధనీముద్రచే వాటిని నిరోధించవలెను. పిదప తగిన హోమజపములు చేసి, ద్వారాధోభాగమున అనంతదేవతామంత్రముతో వాస్తుదేవతాపూజ చేయవలెను. అచటనే రత్నాదిపంచక ముంచి శాంతి హోమము చేయవలెను. పిదప యవలు, ఆవాలు, ఆక్రాంతా-బుద్ధి-వృద్ధులను ఓషధులు, తెల్ల ఆవాలు, మహాతిలలు, గోపిచందనము, దరదము నాగకేసరము, మోహిని, లక్ష్మణ, అమృత, గోరోచనము, ఆగర్వధము దూర్వలు దేవాలయము పునాదుల క్రింద వేసి, పొట్లము కట్టి ద్వార రక్షణార్థమై దాని పైన ప్రణవ ముచ్చరించుచు కట్టవలెను. ద్వారము కొంచెము ఉత్తరము వైపు నిలుపవలెను. ద్వారాధోభాగమును ఆత్మతత్త్వమును రెండుపార్శములందును విద్యాతత్త్వమును, ఆకాశ##దేశమునందును, పూర్తి ద్వారమండలమునందును సర్వవ్యాపిశివతత్త్వమును న్యాసము చేయవలెను. పిదప మూలమంత్రముతో మహేశనాధుని న్యాసముచేయవలెను. ద్వారము నాశ్రయించి ఉండు నందిమొదలగు ద్వారపాలకులకొరకు, వారినామములకు నమఃచేర్చి నూరు లేదా ఏబది హోమములు చేయవలెను. శక్తియున్నచో రెట్టింపు హోమములుచేయవలెను, న్యూనాతిరిక్తతాదోషపరిహారార్థమై అస్త్రమంత్రముతో నూరుహోమములు చేయవలెను. పిదప మొదట చెప్పిన విధముగ దిక్కులందు బలు లిచ్చి దక్షిణాది ప్రదానము చేయవలెను.

అగ్నిమహాపురాణమునందు ద్వార ప్రతిష్ఠావిధానమను నూరవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters