Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్య్రధికశతతోమో7ధ్యాయః

అథ జీర్ణోధ్ధారవిధిః

ఈశ్వర ఉవాచ :

జీర్ణాదీనాం చ లిఙ్గానాముద్ధారం విధినా వదే | లక్ష్మోఙ్ఘితం చ భగ్నం చ స్థూలం వజ్రహతం తథా. 1

సంపుటం స్ఫుటితం వ్యఙ్గం లిఙ్గమిత్యేవమాదికమ్‌ | ఇత్యాదిదుష్టలిఙ్గానాం యోజ్యా పిండీ తథా వృషః. 2

చాలితం చలితం లిఙ్గమత్యర్థం విషమస్థితమ్‌ | దిజ్మూఢం పాతితం లిఙ్గం మధ్యస్థం పలితం తథా. 3

ఏవంవిధం చ సంస్థాప్య నిర్ర్వణం చ భ##వేద్యది | నద్యాదిప్రవాహేణ తదపాక్రియతే యది. 4

తతో7న్యత్రాపి సంస్థాప్య విధిదృష్టేన కర్మణా | సుస్థితం దుఃస్థితం వాపి శివలిఙ్గం న చాలయేత్‌. 5

శ##తేన స్థాపనం కుర్యాత్సహస్రేణ తు చాలనమ్‌ | పూజాదిభిశ్చ సంయుక్తం జీర్ణాద్యమపి సుస్థితమ్‌. 6

యామ్యే మణ్డపమీశే వా ప్రత్యగ్ద్వారైకతోరణమ్‌ | విధాయ ద్వారపుజాది సణ్డిలే మన్త్రపూజనమ్‌., 7

మన్త్రాన్‌ సంతర్ప్య సంపూజ్య వాస్తుదేవాంస్తు పూర్వవత్‌ | దిగ్భలిం చ బహిర్ధత్త్వా సమాచమ్య స్వయం గురుః.

బ్రాహ్మణాన్‌ భోజయిత్వా తు శమ్భుం విజ్ఞాపయేత్తతః | దుష్టలిఙ్గమిదం శమ్భోః శాన్తిరుద్దరణస్య చేత్‌. 9

రుచిస్తవాదివిధినా అధితిష్ఠస్వ మాం శివ | ఏవం విజ్ఞాప్యదేవేశం శాన్తిహోమం సమాచరేత్‌. 10

మధ్వాజ్యక్షీరదూర్వాభిర్మూలేనాధిష్టాధికం శతమ్‌ | తతో లిఙ్గం చ సంస్థాప్య పూజయేత్థ్సణ్డిలే తథా. 11

పరమేశ్వరుడు చెప్పెను : స్కందా : జీర్ణాదిలింగముల శాస్త్రీయోద్ధారక్రమమును గూర్చి చెప్పెదను : చిహ్నములు అరిగిపోవుట, బ్రద్ధ లగుట, మాలిన్యాదులచే స్థూల మగుట, వజ్రాహతమగుట, సంపుటిత మగుట, విరిగిపోవుట, అంగభంగము ఏర్పడుట-ఇట్టి దోషము లేర్పడిన లింగముల పిండులను, వృషభమును వెంటనే త్యజించవలెను. శివలింగమును ఎవరైన చలింపచేసినను, స్వయముగా అది చలించినను, చాల క్రిందికి దిగిపోయినను, విషమస్థానస్థిత మైనను, దిజ్మోహ మున్నను, ఏ కారణముచేతనైన క్రింద పడినను, లేదా మధ్యనే ఉన్నను జారిపోయినను దానిని మరల స్థాపించవలెను. అది వ్రణరహిత మైననే అట్లు స్థాపించవలెను. నదీజలముచే కొట్టుకొనిపోయిన శివవలింగమును గూడ మరల స్థాపన చేయవచ్చును. సుదృఢముగా నున్న శివలింగమును దాని స్థానమునుండి కదల్చగూడదు. అస్థిర మైన శివలింగమును చలింపచేసినచో, శాంతినిమిత్తమై వెయ్యి హోమములను, పునఃస్థాపనార్థమై నూరు హోమములును చేయవలెను. శివలింగము జీర్ణతాదిదోషయుక్త మైనను, దానికి నిత్యపూజాదికము జరుగుచున్నచో దానిని కదల్చకూడదు. జీర్ణోద్ధారార్థమై దక్షిణమునగాని ఈశాన్యమున గాని ఒక మండపము ఏర్పరచి, పశ్చిమమున ఒకద్వార మేర్పరుపవలెను. ద్వారపూజాద్యనంతరము, వేదికపై శివపూజ చేయవలెను. మంత్రపూజ - తర్పణానంతరమువెనుకటి వలె వాస్తుపూజ చేయవలెను. పిదప గురువు, బైటకు వెళ్ళి, భూతబలి ఇచ్చి, ఆచమనము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. పిదప శివునితో ఈ విధముగ నివేదించవలెను- ''శంభూ! ఈ లింగము దోషయుక్త మైపోయినది. దీనిని ఉద్ధరించినచో శాంతికలుగు నని నీవే చెప్పియున్నావు. అందుచే యథావిధిగా ఈ కార్యము చేయబడుచున్నది. శివా! నీవు నాలో ఉండి, ఈ కార్యమును సుసంపన్నము చేయుము.'' శివునితో ఈ విధముగా విజ్ఞాపన చేసి, మధుఘృతమిశ్రమగు పాయసముతోను, దూర్వలతోను, మూలమంత్రముతో నూటెనిమిది హోమములు చేసి, శాంతిహోమము కూడ పూర్తిచేయవలెను. పిదప లింగమునకు స్నానము చేయించి వేదికపై దానికి పూజ చేయవలెను.

ఓం వ్యాపకేశ్వరాయేతి నాత్యన్తం శివవాహినా | ఓం వ్యాపకం హృదయేశ్వరాయ నమః

ఓం వ్యాపకేశ్వరాయ శిరసే నమః ఇత్యాద్యంగమన్త్రాః | తత స్తత్రాశ్రితం తత్త్వం శ్రావయేదస్త్రమ న్త్రతః. 12

సత్త్వః కో7పీహ యః కో7పీ లింగమాశ్రిత్య తిష్ఠతి | లింగం త్యక్త్వా శివాజ్ఞాభిర్యత్రేష్టం తత్ర గచ్ఛతు.

విద్యావిద్యేశ్వరైర్యుక్తః స భవో7త్ర భవిష్యతి | సహస్రం ప్రతిభాగే చ తతః పాశుపతాణునా. 14

హుత్వా శాన్త్యమ్బునా ప్రోక్ష్య స్పృష్ట్వా కుశైర్జ పేత్తతః |

దత్త్వార్ఘ్యం చ విలోమేన తత్త్వతత్త్వాధిపాం స్తథా.

అష్టమూర్తీశ్వరాన్‌ లింగపిణ్డకాసంస్థితాన్‌ గురుః | విసృజ్య స్వర్ణపాశేన వృషస్కన్దస్థయా తథా. 16

రజ్జ్వా బద్ధ్వా తయా నీత్వా శివమన్త్రం గృణఞ్చనైః | తజ్జలే నిక్షిపేన్మన్త్రీ పుష్ట్యర్థం జుహుయాచ్ఛతమ్‌. 17é

తృప్తయే దిక్పతీనాం చ వాస్తుశుద్ధ్యై శతం శతమ్‌ | రక్షాం విధాయ తద్ధామ్ని మహాపాశుపతాస్త్రతః. 18

లిఙ్గమన్యత్తతస్తత్ర విధివత్‌ స్థాపయేద్గురుః | అసురైర్మునిభిర్గోత్రైస్తన్త్రవిద్భిః ప్రతిష్ఠితమ్‌. 19

జీర్ణం వా ప్యథవా భగ్నం విధినాపి న చాలయేత్‌ | ఏష ఏవ విధిః కార్యో జీర్ణధామసముద్ధృతౌ. 20

ఖడ్గే మన్త్రగణం న్యస్య కారయేన్మన్దిరాన్తరమ్‌ | సంకోచే మరణం ప్రోక్తం విస్తారే తు ధనక్షయః. 21

తద్ద్రవ్యం శ్రేష్ఠద్రవ్యం వా తత్కార్యం తత్ప్రమాణకమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే జీర్ణోద్ధారవిధిర్నామ త్ర్యధికశతతమో7ధ్యాయః.

పూజ ''వ్యాపకేశ్వారాయ శివాయ నమః'' అను మంత్రము ఉచ్చరించుచు చేయవలెను. ''ఓం వ్యాపకేశ్వరాయ హృదయాయ నమః'' ఓం వ్యాపకేశ్వారాయ శిరసే నమః'' ఇత్యాదులు అంగమంత్రములు. పిదప అస్త్రమంత్రము ఉచ్చరించుచు శివలింగము ఆశ్రయించి యున్న భూతముతో- ''ఏదైన భూతము ఈ శివలింగమును ఆశ్రయించి ఉన్నచో, అది శివాజ్ఞ ప్రకారము, ఈ లింగమును విడచి, తన కిష్టము వచ్చిన చోటునకు పోవలెను. విద్యావిద్యేశ్వరులతో భగవంతుడైన శివుడు ఇచట నివసింపనున్నాడు'' అని చెప్పవలెను. పాశుపతమంత్రముతో ఒక్కొక్క భాగమునకు వేయి చొప్పున హోమములు చేసి, శాంతిజలముతో ప్రోక్షణము చేయవలెను. కుశలతో స్పృశిచి పై మంత్రమును జపించవలెను. పిదప గురువు విలోమక్రమముతో అర్ఘ్య మిచ్చి లింగముపైనను, పిండికయందును, ఉన్న తత్త్వములను, తత్త్వాధిపతులను, ఎనమండుగురు మూర్తీశ్వరులను స్వర్ణపాశమునుండి విసర్జింపచేసి, వృషభము భుజముపై నున్న రజ్జువుచే పట్టి తీసికొనిపోయి, జనసముదాయముతో కూడ శివనామసంకీర్తనము చేయుచు, ఆ వృషభమును నీటిలో పడవేయవలెను. మంత్రజ్ఞుడైన ఆచార్యుడు పుష్టికొరకై నూరు హోమములు చేయవలెను. దిక్పాలకుల తృప్తి కొరకును, వాస్తుశుద్ధి కొరకును గూడ నూరేసి హోమములు చేయవలెను.

పిదప మహాపాశుపత మంత్రముతో ఆ దేవాలయమునుండి రక్షణము ఏర్పాటు చేసి, అచట విధిపూర్వకముగ మరియొక లింగమును స్థాపించవలెను. అసురులు, మునులు, దేవతలు, తత్త్వవేత్తలు స్థాపించిన లింగము జీర్ణమైనను, భగ్నమైనను, దానిని యథావిధిగా కూడ కదల్చరాదు. జీర్ణదేవాలయోద్ధార విషయమునందు గూడ ఈ విధినే అవలంబించవలెను. మంత్రగణములను ఖడ్గమునందు న్యాసము చేసి, మరొక ఆలయము నిర్మించవలెను. దానిని మొదటి దాని కంటె చిన్నది చేసినచో కర్త మరణించును. పెద్దది చేసినచో ధనహాని కలుగును. అందుచే వెనుకటి ఆలయమునందలి వస్తువులతో గాని, మంచివైన ఇతర వస్తువులతో గాని, ఆ స్థానమునందు, మొదటి ఆలయము ఎంత ఉండెడిదో అంత ఆలయమే నిర్మించవలెను.

అగ్ని మహాపురాణమునందు జీర్ణోద్ధారవిధి యను నూటమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters