Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ దశాధికశతతమోధ్యాయః.

అథ గఙ్గామాహాత్మ్యమ్‌

అగ్నిరువాచ :

గఙ్గామహాత్మ్యమాఖ్యాస్యే సేవ్యా సా భుక్తిముక్తిదా | యేషాం మధ్యే యాతి గఙ్గా తే దేశాః పావనా పరాః.1

గతిర్గఙ్గా తు భూతానాం గతకిమన్వేషతాం సదా | గఙ్గతారయతే చోభౌ వంశౌ నిత్యంహి సేవితా. 2

చాన్ద్రాయణహస్రాచ్చ గఙ్గామ్భః పానముత్తమమ్‌ | గఙ్గా మానం తు నంసేవ్య సర్వయజ్ఞఫలం లభేత్‌. 3

సకలాఘహరీ దేవీ స్వర్గలోకప్రదాయినీ | యావదస్థి చ గఙ్గాయాం తావత్స్వర్గే స తిష్ఠతి. 4

అన్దాదయస్తు తాం సేవ్య దేవైర్గచ్ఛన్తి తుల్యతామ్‌ | గఙ్గాతీర్థసముద్భూతమృద్ధారీ సో7ఘహార్కవత్‌. 5

దర్శనాత్స్పర్శనాత్పానాత్తథా గఙ్గేతి కీర్తనాత్‌ | పునాతి పుణ్యపురుషాఞ్ఛతశో7థ సహస్రశః. 6

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే గఙ్గామాహాత్మ్యం నామ దశాధిక శతతమో7ధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను : ఇపుడు గంగామాహాత్మ్యమును చెప్పెదను. సర్వాదా గంగను సేవించవలెను. గంగ భుక్తిముక్తిప్రదాయిని. ఏ దేశములందు గంగ ప్రవహించునో ఆ దేశములు పవిత్రములు. ఉత్తమగతిని అన్వేషించువారికి గంగ ఒక్కటియే సర్వోత్తమగతి. గంగను సేవించినచో మాతృపితృవంశములు రెండును ఉద్ధరింపబడును. వేయి చాంద్రాయణవ్రతములు చేయుటకంటె గంగాజలపానము ఉత్తమము. ఒక మాసము గంగాసేవ చేసినవాడు సకలయజ్ఞముల ఫలములు పొందును. గంగాదేవి సకల పాపములను తొలగించును, స్వర్గము నిచ్చును. గంగాజలములో ఎముక పడి యున్నంత కాలము, ఆ జీవుడు స్వర్గములో నివసించును. అంధాదులు గంగాసేవ చేసి దేవతాతుల్యు లగుదురు. గంగాతీర్థమునుండి మట్టి తీసి ధరించువాడు సూర్యుడు వలె సకలపాపములను నశింపచేయును. గంగాదర్శన - స్పర్శ - జలపానములు చేయువాడును, గంగానామ సంకీర్తన చేయువాడును తన వంశము నందలి ఎన్నో వేల తరముల వారిని పవిత్రముచేయును.

అగ్నిమహాపురాణమునందు గంగామహిమవర్ణన మను నూటపదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters