Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రయోదశోత్తర శతతమో7ధ్యాయః.

అధ నర్మదాదిమాహాత్మ్యమ్‌.

అగ్నిరువాచ :

నర్మదాదికమాహాత్మ్యం వక్ష్యే7హం నర్మదాం పరామ్‌|సద్యః పునాతి గాఙ్గేయం దర్శనాద్వారి నార్మదమ్‌.

విస్తరాద్యోజనశతం యోజనద్వయ మాయతా | షష్టిస్థీర్త సహస్రాణి షష్టికోట్యస్తథాపరాః. 2

పర్వతస్య సమన్తాత్తు తిష్ఠన్త్యమరకంటకే | కావేరీ సంగమం పుణ్యం శ్రీపర్వతమతః శృణు. 3

గౌరీ శ్రీరూపిణీ తేపే తపస్తామబ్రవీద్దరిః | అవాప్స్యసి త్వమధ్యాత్మ నామ్నా శ్రీ పర్వతస్తవ. 4

సమన్తాద్యోజనశతం మహాపుణ్యం భవిష్యతి | అత్ర దానం తపో జప్యం శ్రాద్ధం సర్వమథాక్షయమ్‌. 5

మరణం శివలోకాయ సర్వదం తీర్థముత్తమమ్‌ | హరో7త్ర క్రీడతే దేవ్యా హిరణ్యకశిపుస్తధా. 6

తపస్తప్త్వా బలీ చాభూన్మునయఃసిద్దిమాప్నువన్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నర్మదాశ్రీపర్వతాదిమాహాత్మ్యం నామ త్రయోదశాధిక శతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను : ఇపుడు నర్మదాదిమహార్మ్యమును చెప్పెదను. నర్మద శ్రేష్ఠమైన తీర్థము. గంగా జలము స్పర్శచే వెంటనే పవిత్రింపచేయును. కాని నర్మద దర్శనమాత్రముచేతనే పవిత్రింపచేయును. నర్మదాతీర్థము నూరు యోజనముల పొడవు, రెండు యోజనముల వెడల్పు ఉన్నది. అమరకంటతకపర్వతము నలువైపుల నర్మదానదికి సంబంధించిన అరువదికోట్ల అరువదివేల తీర్థములున్నవి. కావేరీసంగమతీర్థము చాల పవిత్ర మైనది. ఇపుడు శ్రీపర్వతమాహాత్మ్యమును చెప్పెదను. ఒకమారు గౌరి శ్రీదేవిరూపమ ధరించి గొప్పతపస్సు చేసెను. దానిచే ప్రసన్నుడైన శ్రీహరి ఆమెకు వరము లిచ్చుచు ఇట్లుచెప్పెను. ''దేవీ! నీకు ఆధ్యాత్మజ్ఞానము లభించును. ఈ పర్వతము శ్రీపర్వతమను పేరవిఖ్యాతి నొందును. దీని నలువైపుల నాలుగు వేల యోజనముల ప్రదేశము చాల పవిత్రమగును.'' ఇచట చేసిన దాన-తపో-జప-శ్రాద్ధములు అక్షయఫలము లగును. ఈ ఉత్తమతీర్థము అన్నియు ఇచ్చును. ఇచట మరణించువారికి శివలోకప్రాప్తి కలుగును. ఈ పర్వతముపై శివుడు సర్వాదా పార్వతితో క్రీడించుచుండును, హిరణ్యకశిపుడు ఇచటనే తపస్సుచేసిన చాల బలవంతు డయ్యెను. మునులు గూడ ఇచట తపస్సు చేసి సిద్ది పొందిరి.

అగ్ని మహాపురాణమునందు నర్మదాదిమాహాత్మ్యవర్ణన మను నూటపదమూడవ అద్యాయము సమాప్తము.

(అ) 41

Sri Madhagni Mahapuranamu-1    Chapters