Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుర్దశోత్తర శతతమోధ్యాయః

అథ గయామాహాత్మ్యమ్‌.

అగ్ని రువాచ :

గయామాహాత్మ్యమాఖ్యాస్యే గయా తీర్థోత్తమోత్తమమ్‌ | గయాసురస్తపస్తేపే తత్తపస్తాపిభిః సురైః. 1

ఉక్తః క్షీరాబ్దిగో విష్ణుః పాలయాస్మాన్గయాసురాత్‌ | తథేత్యుక్త్వా హరిర్దైత్యం వరం బ్రూహీతి చాబ్రవీత్‌. 2

దైత్యో7బ్రవీత్పవిత్రో7హం భ##వేయం సర్వతీర్థతః |

తథేత్యుక్త్వా గతో విష్ణుర్దైత్యం దృష్ట్వా నరా హరిమ్‌. 3

గతాః శూన్యా మహీ స్వర్గే దేవా బ్రహ్మాదయః సురాః |

గతా ఊచుర్హరిం దేవాః శూన్యా భూ స్త్రిదివం హరే | 4

దైత్యస్య దర్శనాదేవ బ్రహ్మాణం చాబ్రవీద్దరిః | యాగార్థం దైత్యదేవం త్వం ప్రార్థయ త్రిదశైః సహ. 5

తచ్ఛ్రుత్వా ససురో బ్రహ్మా గయాసుర మథాబ్రవీత్‌ |

అతిథిః ప్రార్థయామి త్వాం దేహం యాగాయా పావనమ్‌. 6

గయాసురస్తథైత్యుక్త్వాపతత్తస్య శిరస్యథ | యాగం చకాచ చలితే దేహి పూర్ణాహుతిం విభుః. 7

పునర్చ్రహ్మాబ్రవీద్విష్ణుం పూర్వకాలే7సురో7చలత్‌ |

విష్ణుర్దర్మమథాహూయ ప్రాహ దేవమయీం శిలామ్‌. 8

ధారయధ్వం సురాః సర్వే యస్యాముపరి సన్తు తే | గదాధరో మదీయాథ మూర్తి ః స్థాస్యతి సామరైః. 9

ధర్మః శిలాం దేవమయీం తచ్ర్ఛుత్వా7ధారయత్పరామ్‌ |

యాధర్మాద్దర్మవత్యాం చ జాతా ధర్మవ్రతా సుతా. 10

మరీచిర్ర్బహ్మణః పుత్రస్తామువాహ తపోన్వితామ్‌ | యథా హరిః శ్రియా రేమే గౌర్యాశమ్భుస్తథా తయా. 11

అగ్ని దేవుడు చెప్పెను. ఇపుడు నేను గయామాహాత్మ్యమును చెప్పెదను. గయ ఉత్తమతీర్థములలో ఉత్తమ మైనది. గయుడను అసురుడు గొప్ప తపస్సు ప్రారంభించెను. దానిచే దేవతలు పీడితు లై క్షీరసాగరశాయి యగు విష్ణువు వద్దకు వెళ్ళి ''భగవంతుడా! నీవు గయాసురునినుండి మమ్ము రక్షించుము'' అని ప్రార్థించిరి. అటులనే అని పలికి శ్రీ మహా విష్ణువు గయాసురుని వద్దకు వెళ్ళి ''వరకు కోరుకొనుము'' అని పలికెను. ''మహావిష్ణూ: నేను సకల తీర్థములకంటెను అతి పవిత్రుడను అగుదును గాక!'' అని గయుడు పలికెను. ''అటులనే అగుగాక'' అని పలికి శ్రీమహావిష్ణువు వెడలిపోయెను. పిదప మానవులందరును ఆ దైత్యుని దర్శనము చేసి భగవంతుని చేరుచుండిరి. భూమి శూన్య మైపోయెను. అపుడు బ్రహ్మదిదేవతలు మహావిష్ణువువద్దకు వెళ్ళి- ''దేవా! స్వర్గము భూలోకము కూడ శూన్య మైపోయినవి. ఆ దైత్యుని దర్శనము చేసికొనినంతమాత్రముననే ఆందరును నీ లోకమును చేరుకొనుచున్నారు'' అని పలికిరి. ఆ మాటలు విని శ్రీ హరిబ్రహ్మతో ''నీవు దేవతాసమేతుడవై వెళ్ళి యజ్ఞభూమిగా చేయుటకై నీ శరీరమునిమ్ము అని గయాసురుని కోరుము'' అని పలికెను. బ్రహ్మ దేవతాసమేతుడై గయునిదగ్గరకువెళ్ళి ''దైత్యశ్రేష్ఠా: నేను అతిథి నై నీ ద్వారమువద్దకు వచ్చితిని. నీ పవిత్రశరీరమును యజ్ఞముకొరకై ఇమ్ము'' అని కోరెను. ''తథాస్తు'' అని పలికి గయాసురుడు భూమిపై పరుండెను. బ్రహ్మ ఆతని శిరముపై యజ్ఞము ప్రారంభించెను. పూర్ణాహుతి సమయము వచ్చుసరికి గయుని శరీరము కదలిపోయెను. అది చూచి బ్రహ్మాదేవుడు విష్ణువుతో ''దేవా! పూర్ణాహుతి సమయమున గయాసురుని శరీరము కదలి పోవుచున్నది'' అని చెప్పెను. అపుడు విష్ణువు ధర్మదేవతను పిలిచి ''నీవు అసురుని శరీరముపై ధర్మమయశిలను ఉంచుము. దేవతలందరును ఆ శిలపై కూర్చుండవలెను దేవతలతోపాటు నా గదాధరమూర్తికూడ ఆ శిలపై ఉండగలదు'' అని పలికెను. ఆ మాట విని ధర్మ దేవత విశాల మగు దేవమయశిలను తీసికొని వచ్చి ఆ అసురుని దేహముపై ఉంచెను. (ఆ శిల కథ యిది) :- ధర్మునకు తన భార్య యగు ధర్మవతి గర్భమున ధర్మవ్రత యను కుమార్తె జనించెను. ఆమె గొప్ప తపశ్శాలిని. బ్రహ్మకుమారుడైన మరీచిమహర్షి ఆమెను పరిణయమాడెను. శ్రీ మహావిష్ణువు లక్షీదేవితో వలె, శివుడు పార్వతితో వలె, మరీచి ధర్మవ్రతతో సుఖముగా నుండెను.

కుశపుష్పాద్యరణ్యాచ్చహ్మానీయాతిశ్రమాన్వితః | భుక్త్వా ధర్మవ్రతాం ప్రాహ పాదసంవాహనం కురు. 12

విశ్రాన్తస్య మునేః పాదౌ తథేత్యుక్త్వా ప్రియాకరోత్‌ | ఏతస్మిన్నన్తరే బ్రహ్మా మునౌ సుప్తే తథాగతః. 13

ధర్మవ్రతా7 చిన్తయచ్చ కిం బ్రహ్మణం సమర్చయే |

పాదసంవాహనం కుర్వే బ్రహ్మా పూజ్యో గురోర్గురుః. 14

విచిన్త్య పూజయామాస బ్రహ్మాణం చార్హణాదిభిః | మరీచిస్తామపశ్యన్స శశాపోక్తివ్యతిక్రమాత్‌. 15

శిలా భవిష్యసి క్రోధాద్ధర్మవ్రతా7 బ్రవీచ్చ తమ్‌ | పాదాభ్యఙ్గం పరిత్యస్య త్వద్గురుః పూజితోమయా. 16

అదోషాహం యతస్త్వం హి శాపం ప్రాప్స్యసి శఙ్కరాత్‌ |

ధర్మవ్రతా పృథక్‌ శాపం ధారయిత్వా7గ్ని మధ్యగాత్‌. 17

తపశ్చచార వర్షాణాం నహస్రాణ్యయుతాని చ | తతో విష్ణ్వాదయో దేవా వరం బ్రూహితి చాబ్రువన్‌. 18

ధర్మవ్రతాబ్రవీద్దేవా ఞ్ఛాపం నిర్వర్త యన్తు మే.

దేవా ఊచుః :

దత్తో మరీచినా శాపో భవిష్యతి న చాన్యధా. 19

శిలా పవిత్రా దేవాఙ్ఘ్రిలక్షితా త్వం భవిష్యసి | దేవవ్రతా దేవశిలా సర్వదేవాదిరూపిణీ. 20

సర్వదేవమయీ పుణ్యా నిశ్చలా యా7సురస్య హి |

దేవవ్రతోవాచ :-

యది తుష్టాః స్థ మే సర్వే మయి తిష్ఠన్తు సర్వదా. 21

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రాద్యా గౌరీలక్ష్మీముఖాః సురాః |

అగ్ని రువాచ :

దేవవ్రతావచః శ్రుత్వా తథేత్యుక్త్వా దివంగతాః. 22

ఒకనాడు అడవినుంచి కుశ సమిధాదులు తెచ్చిన బుషి చాల అలసిపోయెను. అతడు భోజనానంతరము ధర్మవ్రతను తన పాదము లొత్తు మని యాజ్ఞాపింపగా ఆమె సరేనని అలసి యున్న ఆ మహర్షి పాదములను ఒత్తసాగెను. ముని నిద్రించెను. ఇంతలో బ్రహ్మ వచ్చెను. ''నేను బ్రహ్మదేవునిని సత్కారములు చేయవలెనా, లేదా? మహాముని పాదము లొత్తవలెనా?'' బ్రహ్మ గురువునకు గూడ గురువు నా భర్తకు కూడ పూజ్యుడు. అందుచే ఈయనను పూజించవలెను.'' అని ఆలోచించి ధర్మవ్రత బ్రహ్మాను పూజించుచుండెను. మేల్కొన్న ముని ధర్మవ్రత అచట లేకుండుట జూచి, ఆజ్ఞనుల్లంఘించి నందులకు ''నీవు శిలవు కమ్ము'' అని ఆమెను శపించెను. అది విన్న ధర్మవ్రత కుపితురాలై ''మునీ ! నీ చరణసేవ విడచి నేను నీకు కూడ పూజ్యుడైన నీ తండ్రికి, పూజ చేసితి. అందుచే నేను సర్వధా నిర్దోషురాలను. ఇట్టి పరిస్థితులలో నన్ను శపించితిరి. ఆందుచే నీకు గూడ శివునివలన శాపము లభించగలదు.'' అని పలికి శాపమును దూరముగానుంచి, అగ్నిలో ప్రవేశించి వేలకొలది సంవత్సరములు తీవ్ర తపస్సుకు చేసెను. ఆ తపస్సుకు సంతసించిన విష్ణ్వాది దేవతలు వరము కోరుకొను మని పలికిరి. ''మీరు నా శాపమును తొలగింపుడు'' అని ధర్మవ్రత ప్రార్థించెను. దేవతలు పలికిరి - పూజ్యురాలా! మరీచిమహర్షి ఇచ్చిన శాపము అన్యధా కాజాలదు. నీవు దేవతా చరణచిహ్నములచే అంకితమైన శరీరము గల పరమపవిత్రమైన శిలగా అవగలవు. గయాసురుని శరీరమును స్థిరముగా నుంచుటకై నీవు శిలారూపమును ధరించవలసి యున్నది. అపుడు నీకు ''దేవవ్రతా, దేవశిలా, సర్వదేవస్వరూపా, సర్వతీర్థమయీ, పుణ్యశిలా'' అను పేర్లు లభింపగలవు. దేవవ్రత పలికెను : దేవతలారా! మీరు నాపై అనుగ్రహించినచో బ్రహ్మవిష్ణురుద్రాది దేవతలును, గౌరీ లక్ష్మ్యాది దేవులును నాపై సర్వదా ప్రకాశింతురు గాక. '' అగ్ని దేవుడు పలికెను; దేవవ్రత మాటలు విని ఆ దేవత లందరును 'అట్లే అగుగాక' అని పలికి స్వర్గమునకు వెళ్ళిపోయిరి.

సా ధర్మేణాసురస్యాస్య ధృతా దేవమయీ శిలా | సశిలశ్చలితో దైత్యః స్థితారుద్రాదయస్తతః. 23

సదేవశ్చలితో దైత్యస్తతో దేవైః ప్రసాదితః | క్షీరాబ్దిగో హరిః ప్రాదాత్స్వమూర్తిం శ్రీగదాధరమ్‌. 24

గచ్ఛన్తు భోః స్వయంస్థాస్యేమూర్త్యా వై దేవగమ్యయా | స్థితో గదాధరో దేవో వ్యక్తావ్యక్తో భయాత్మకః. 25

నిశ్చలార్థం స్వయం దేవః స్థిత ఆదిగదాధరః | గదో నామాసురో దైత్యః సహతో విష్ణునా పురా. 26

తదస్థి నిర్మితా చాద్యా గదా యా విశ్వకర్మణా | ఆద్యయా గదయా హేతిప్రముఖా రాక్షసాహతాః. 27

గదాధరేణ విధివత్తస్మాదాది గదాధరః | దేవమయ్యాం శిలాయాం చ స్థితే చాదిగదాధరే. 28

గయాసురే నిశ్చలే7థ బ్రహ్మా పూర్ణాహుతిం దదౌ | గయాసురో7బ్రవీద్దేవాన్‌ కిమర్థం వఞ్చితో హ్యహమ్‌.

విష్ణోర్వచనమాత్రేణ కిం న స్యాం నిశ్చలో హ్యహమ్‌ | ఆక్రాన్తో యద్యహం దేవా దాతుమర్హథ మే వరమ్‌.

ఆ దేవమయీ శిలనే ధర్మదేవత గయాసురుని శరీరముపై నుంచెను. కాని గయుడు శిలతో సహ కదల నారంభించెను. అది చూచి రుద్రాదిదేవతలు కూడ ఆ శిలపై కూర్చుండిరి. ఆ దేవతలతో సహా అతడు కదల మొదలిడెను, అపుడు దేవతలు క్షీరసాగరముపై శయనించి యున్న విష్ణువును ప్రసన్నుని చేసికొనగా శ్రీమహావిష్ణువు తన గదాధరమూర్తిని వారికిచ్చి- ''దేవతలారా మీరు వెళ్ళుడు. దేవగమ్య మైన ఈమూర్తి ద్వారా నేను ఈ విధముగ గయుని శరీరము స్థిరముగా నుండు నట్లు చేయుటకై సాక్షాత్‌ వ్యక్తావ్యక్తోభయస్వరూపు డగు గదాధారి యగు విష్ణువు అచట ఉండెను. ఆదిగదాధరుడను పేరుతో శ్రీమహావిష్ణువు అచట నున్నాడు. పూర్వము గదు డను ఒక భయంకరు డగు రాక్షసుని శ్రీమహావిష్ణువు సంహరించగా, వాని ఎముకలతో విశ్వకర్మ గదను నిర్మించెను. అది ''ఆదిగద''. ఆ ఆదిగదతో గదాధరుడు హేతి మొదలగు రాక్షసులను సంహరించెను. అందుచే ఆతడు ''అదిగదాధరుడు'' ఆయెను. దేవమయీశిలపై గదాధరుడు కూర్చుండగనే గయాసురుడు కదలకుండ నుండెను. అపుడు బ్రహ్మ పూర్ణాహుతి ఇచ్చెను. గయాసురుడు దేవతలతో- ''మీరు నన్నిట్లు ఏల వంచించితిరి? శ్రీవిష్ణువు చెప్పినచో నేను స్థిరముగానుండ కుందునా! దేవతలారా మీరు నన్ను శిలాదులచే అణచి ఉంచినారు గాన నాకు వర మీయవలెను'' అని పలికెను.

దేవా ఊచుః :

తీర్థస్య కరణ యత్త్వమస్మాభిర్నిశ్చలీకృతః | విష్ణోః శమ్భోర్ర్బహ్మణశ్చ క్షేత్రం తవ భవిష్యతి. 31

ప్రసిద్దం సర్వతీర్థేబ్యః పిత్రాదేర్ర్బహ్మలోకదమ్‌ | ఇత్యుక్త్వా తే స్థితా దేవా దేవ్యస్తీర్థాదయః స్థితాః. 32

యాగం కృత్వా దదౌ బ్రహ్మా బుత్విగ్భ్యో దక్షిణాం తదా |

పంచక్రోశం గయాక్షేత్రం పఞ్చశత్పఞ్చచార్పయేత్‌. 33

గ్రామాన్స్వర్ణిగిరీకృత్వా నదీర్దుగ్ధమధుస్రవాః | సరోవరాణి దధ్యాజ్యైర్బహూనన్నాదిపర్వతాన్‌. 34

కామధేనుం కల్పతరుం స్వర్ణరూప్యగృహాణి చ | న యాచయన్తు విప్రేన్ద్రా అల్పానుక్త్వా దదౌ ప్రభుః. 35

ధర్మయాగే ప్రలోభాత్తు ప్రతిగృహ్య ధనాదికమ్‌ | స్తితా యదా గయాయాం తే శప్తాస్తే బ్రహ్మణా తదా.

విద్యావివర్జితా యూయం తృష్ణాయుక్తా భవిష్యథ | దుగ్ధాది వర్జితా నద్యః శైలాః పాషాణరూపిణః. 37

బ్రహ్మాణం బ్రాహ్మణాశ్చోచుర్నష్టం శాపేన చాఖిలమ్‌ |

జీవనాయ ప్రసాదం నః కురు విప్రాంశ్చ సో7బ్రవీత్‌. 38

తీర్థోపజీవికా యూయామాచన్ద్రార్కం భవిష్యథ | యే యుష్మాన్‌ పూజయిష్యన్తి గయాయామాగతా నరాః.

హవ్యకవ్యైర్దైన్తెః శ్రాద్దైస్తేషాం కులశతం వ్రజేత్‌ | నరకాత్స్వర్గలోకాయ స్వర్గలోకాత్పరాం గతిమ్‌. 40

గయో7పి చాకరోద్యాగం బహ్వన్నం బహుదక్షిణమ్‌ | గయాపురీ తేన నామ్నా పాణ్డవా ఈజిరే హరిమ్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే గయామాహాత్మ్యం నామ చతుర్దశాధిక శతతమో7ధ్యాయః.

దేవతలు పలికిరి : ''తీర్థమును నిర్మించుటకై నీ శరీరము స్థిరముగా నుండు నట్లు చేయబడినది గాన నీ క్షేత్రము బ్రహ్మవిష్ణుమహేశ్వరుల నివాసస్థానము కాగలదు. ఈ తీర్థము అన్ని తీర్థములకంటెను ఎక్కువ ప్రసిద్ధి పొందగలదు. పితృదేవతలకు ఇది బ్రహ్మలోకము నిచ్చును'' ఇట్లు పలికి దేవత లందరును అచటనే నివసించిరి. దేవీ-తీర్థాదులు కూడ అచటనే నివాస మేర్పరచుకొనిరి. బ్రహ్మ యజ్ఞము పూర్తి చేసి బుత్విక్కులకు దక్షిణగా ఐదు శ్రోశుల దూరము గయా క్షేత్రమును ఏబది యైదు గ్రామములను సమర్పించెను. అనేక మైన బంగారు పర్వతములను నిర్మించెను. పారు తేనె ప్రవహించు నదుల నిచ్చెను. దధి-మధువులతో నిండిన సరోవరములనిచ్చెను. అనేక మైన అన్నాదిపర్వతములను, కామధేనువును, కల్పవృక్షమును, వెండి బంగారముల గృహములను కూడ ఇచ్చెను. వీటి నన్నింటిని ఇచ్చుచు బ్రహ్మదేవుడు ఆ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను - ''విప్రవరులారా! ఇక మీరు నాకంటె తక్కువవానివద్దకు వెళ్లి ఎన్నడును యాచన చేయరాదు''. ఇట్లుపలికి అతడు ఆ వస్తువుల నన్నింటిని వారికి సమర్పించెను. తరువాత ధర్ముడు యజ్ఞము చేయగా లోభముచే ఆ బ్రాహ్మణులు అతని నుండి ధనాది దానములు స్వీకరించి గయలో ఉంటూండగా బ్రహ్మ వారిని శపించెను. ''మీరు విద్యావిహీనులును లుబ్ధులును అగుదురు గాక''. ఈ నదులలో ఇకపై క్షీరాదులు ఉండవు, ఈ సువర్ణశైలములు కూడ శిల లైపోవును'', అపుడు బ్రాహ్మణులు బ్రహ్మతో ఇట్లుపలికిరి- ''దేవా! మీ శాపముచే మా సర్వస్వము నష్టమైపోయినది. మాజీవికకు ఏదైనమార్గము చూపుము''. బ్రహ్మదేవు డిట్లు పలికెను - ''ఇటుపై మీ జీవిక ఈ తీర్థము ద్వారా జరుగును. సూర్యచంద్రు లున్నంతవరకును మీరు ఈ వృత్తితోడనే జీవించగలరు. గయకు వచ్చువా రందరును మిమ్ములను పూజింతురు. హవ్య-కవ్య-ధన-శ్రాద్ధాదులతో మిమ్మును సత్కరించు వారి వంశములోనివారునూరు తరములవరకును స్వర్గమునకు వెళ్ళుదురు. స్వర్గములోనే ఉన్నవారు ముక్తి పొందుదురు''. గయమహారాజు కూడ ఈ క్షేత్రమునందు బహ్వన్నదక్షిణలు గల యజ్ఞము చేసెను. అతని పేరుచేతనే గయానగరమునకు ఆ పేరు వచ్చినది. పాండవులు కూడ గయ వెళ్ళి అచట శ్రీమహావిష్ణువును పూజించిరి.

అగ్నిమహాపురాణమునందు గయామాహాత్మ్యవర్ణన మను నూటపదునాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters