Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చదశోత్తర శతతమో7ధ్యాయః.

అథ గయాయాత్రావిధిః.

అగ్ని రువాచ :

ఉద్యతశ్చేద్గయాం యాతుం శ్రాద్దం కృత్వా విధానతః | విధాయ కార్పటీవేషం గ్రామస్యాపి ప్రదక్షిణమ్‌. 1

కృత్వాప్రతిదినం గచ్ఛేత్సంయతశ్చాప్రతిగ్రహే | గృహాచ్చలితమాత్రస్య గయాయా గమనం ప్రతి. 2

స్వర్గారోహణ సోపానం పితౄణాం తు పదే పదే | బ్రహ్మజ్ఞానేన కిం కార్యం గోగృహే మరణన కిమ్‌. 3

కిం కురుక్షేత్రవాసేన యదా పుత్రో గయాం వ్రజేత్‌ |

గయాప్రాప్తం సుతం దృష్ట్వా పితౄణాముత్సవో భ##వేత్‌. 4

పద్భ్యామపి జలం స్పృష్ట్వా అస్మభ్యం కిం న దాస్యతి |

బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్దం గోగృహేమరణం తథా. 5

వాసః పుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధా | కాంక్షన్తి పితరః పుత్రం నరకాద్భయభీరవః. 6

గయాం యాస్యతి యఃపుత్రః స నస్త్రాతా భవిష్యతి | ముణ్డనం చోపవాసశ్చ సర్వతీర్థేష్వయం విధిః.7

న కాలాదిర్గయాతీర్థే దద్యాత్పిణ్డాంశ్చ నిత్యశః |పక్షత్రయనివాసీ చ పునాత్యాసప్తమం కులమ్‌. 8

అష్టకాసు చ వృద్దౌ చ గయాయాం మృతవాసరే | అత్ర మాతుః పృథక్‌ శ్రాద్ధమన్యత్ర పతినా సహ. 9

పిత్రాదినవదైవత్యం తథా ద్వాదశ##దైవతమ్‌ | ప్రథమే దివసే స్నాయాత్తీర్థే హ్యుత్తరమానసే. 10

ఉత్తరే మానసే పుణ్య ఆయురారోగ్యవృద్దయే | సర్వాఫ°ఘవినాశాయ స్నానం కుర్యాద్విముక్తయే. 11

సన్తర్ప్య దేవపిత్రాదీఞ్ర్భాద్దకృత్పిణ్డదో భ##వేత్‌ | దివ్యాన్తరిక్షభౌమస్థాన్‌ దేవాన్‌ సంతర్పయామ్యహమ్‌. 12

అగ్ని పలికెను : గయ వెళ్ళవలె ననుకొన్నవాడు విధిపూర్వకముగ శ్రాద్దము చేసి, తీర్థయాత్రవేషము ధరించి, గ్రామప్రదక్షిణము చేసి, ప్రతిదినము పాదచారి యై యాత్ర చేయవలెను. ఇంద్రియములను మనస్సును వశములో నుంచుకొనవలెను. ఎవరినుండియు దానము గ్రహింపరాదు. గయ వెశ్ళుటకు ఇంటినుండి బయలుదేరగనే, అడుగడుగునను పితృదేవతలకు స్వర్గసోపానము లేర్పడును. పితరులు శ్రాద్ధముకొరకై గయకు వెళ్ళుటవలన కలుగు పుణ్యము ముందు బ్రహ్మజ్ఞాన మెంత? గోవులను సంకటమునుండి రక్షించుటవలన కూడ అంత పుణ్యముకలుగదు. అట్టివాడు కురుక్షేత్రములో నివసించవలసిన ఆవశ్యకతయే యుండదు. పుత్రుడు గయకు చేరగనే పితరులు ఉత్సవము చేసికొందురు. ''ఈతడు పాదాలతోడ నైనా జలస్పర్శ చేసి తర్పణము చేయడా?'' అని వారు అనుకొనుచుందురు. బ్రహ్మజ్ఞానము, గయలో చేసిన శ్రాద్దము, గోశాలలో మరణము, కురుక్షేత్రములో నివాసము-ఇవి మనుష్యుని ముక్తికి నాలుగు సాధనములు. నరకము నుండి భయపడిన పితరులు పుత్రుడుకావలె నని కోరుకొందురు. గయకు వెళ్ళి మన కుమారుడు మనలను ఉద్ధరింపగలడు. అని వారు ఆలోచించుచుందురు. ముండనోపవాసములు సర్వతీర్థములందును ఆచరించవలసిన సామాన్యవిధులు. గయాతీర్థమునందు కలాదినియమ మేదియు లేదు. అచట ప్రతి దినము పిండదానము చేయవలెను. అచట మూడు పక్షములు నివసించువాడు ఏడు తరములవరకు పితరులను ఉద్ధరించును. అష్టకాతిథులందును, అభ్యుదయక కర్మలయందును, పిత్రాదుల క్షయాహతిథియందును, గయలో తల్లికొరకై వేరుగ శ్రాద్దవిధాన మున్నది. అన్య తీర్థములలో స్త్రీ శ్రాద్దమును ఆమె భర్తతో కలిపి మాత్రమే చేయవలెను. గయలో పిత్రాది క్రమమున నవదేవతాకముగ గాని, ద్వాదశ##దేవతాకముగ గాని శ్రాద్దము చేయవలెను. మొదటి రోజున ఉత్తరమానస తీర్థమునందు స్నానము చేయవలెను పరమ పవిత్ర మగు ఉత్తరమానస తీర్థమునందు చేసిన స్నానము ఆయురారోగ్య వృద్ధి కలిగించి, పాపరాశులను నశింపజేసి, మోక్షము నిచ్చును. శ్రాద్దకర్త దేవతాపిత్రాదులకు తర్పణము లిచ్చు నప్పుడు- ''నేను స్వర్గ అంతరిక్ష భూములపై నున్న సంపూర్ణ దేవతలను తృప్తిపరచుచున్నాను'' అని భావన చేయుచు, పిదప పిండ ప్రదానము చేయవలెను.

దివ్యాన్తరిక్షభౌమాది పితృమాత్రాది తర్పయేత్‌ | పితా పితామహశ్చైవ తతైవ ప్రపితామహః. 13

మాతా పితామహీ చైవ తథైవ ప్రపితామహీ | మాతామహః ప్రమాతామహో వృద్ధ ప్రమాతామహః. 14

తేభ్యో7న్యేభ్య ఇమాన్‌ పిణ్డానుద్దారాయ దదామ్యహమ్‌ | ఓం నమః సూర్యదేవాయ సౌమభౌమజ్ఞరూపిణ. 15

జీవశుక్ర శ##నైశ్చారి రాహుకేతు స్వరూపిణ | ఉత్తరే మానసేస్నాత ఉద్దరేత్సకలం కులమ్‌. 16

సూర్యం నత్వా వ్రజేన్మౌనీ నరో దక్షిణామానసమ్‌ | దక్షిణ మానసే స్నానం కరోమి పితృతృప్తయే. 17

గయాయామాగతః స్వర్గం యాన్తు మే పితరో7ఖిలాః

శ్రాద్దం పిణ్డం తతః కృత్వా సూర్యం నత్వా వదేదిదమ్‌. 18

ఓం నమో భగవతే భ##ర్త్రే భవాయ భవ మే విభో | భుక్తితముక్తిప్రదః సర్వపితౄణాం భవభావితః. 19

కవ్యవాహో7నలః సోమో యమశ్చైవార్యమా తథా | అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః పితృదేవతాః. 20

ఆగచ్ఛన్తు మహాభాగా యుష్మాభీ రక్షితాస్త్విహ | మదీయాః పితరో యే చ మాతృమాతామహాదయః. 21

తేషాం పిణ్డప్రదాతాహమాగతో7స్మి గయామిమామ్‌ | ఉదీచ్చాం ముణ్డపృష్ఠస్య దేవర్షిగణపూజితమ్‌. 22

నామ్నా కనఖలం తీర్థం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ | సిద్ధానాం ప్రీతిజననైః పాపానాం చ భయఙ్కరైః. 23

లేలిహానైర్మహానాగైరక్ష్యతే చైవ నిత్యశః | తత్ర స్నాత్వా దివం యాన్తి క్రీడన్తే భువి మానవాః. 24

స్వర్గ - అంతరిక్ష, భూదేవతాదులకును, మాతా పిత్రాదులకును తర్పణములు ఈయవలెను. ''పితృ పితామహా ప్రపితామహుల ఉద్ధారముకొరకును, మాతృ - పితామహీ - ప్రపితామహుల ఉద్ధారముకొరకును మాతామహ - ప్రమాతామహ - వృద్దప్రమాతామహుల ఉద్ధారము కొరకును, అన్నపితరుల ఉద్ధారము కొరకును నే నీ పిండ ప్రదానము చేయుచున్నాను. సోమ - మంగల -బుధ -బృహప్పతి - శుక్ర, శని - రాహు - కేతురూపు డగు సూర్యునకు నమస్కారము'' అని చెప్పవలెను. ఉత్తరమానసతీర్థమునందు స్నానము చేయువాడు తన కులము నంతను ఉద్ధరించును. సూర్యునకు నమస్కరించి మౌనముగా దక్షిణమానస తీర్థమునకు వెళ్ళి - ''నేను పితరుల తృప్తికొరకై దక్షిణమానస తీర్థమునందు స్నానము చేయుచున్నాను. పూర్వపురుషు లందరును స్వర్గలోకమునకు వెళ్ళుదురు గాక అను ఉద్ధేశ్యముతో నేను గయకు వచ్చినాను'' అని భావన చేయవలెను. పిమ్మట శ్రాద్ధపిండదానములు చేసి, సూర్యునకు నమస్కరించి ''సర్వప్రాణులను పోషించు సూర్యునకు నమస్కారము, ప్రభూ! నీవు నాకు అభ్యుదయము నిచ్చువాడవు, నిన్ను ధ్యానించుచున్నాను నీవు నా పూర్వీకు లందరకిని భుక్తి ముక్తుల నిచ్చువాడవు, కవ్యవాట్‌, అనల, సోమ, తమ, అర్యమన్‌, అగ్నిష్వాత్త, బర్హిషద, ఆజ్యపులను మహానుభావులగు పితృదేవతలు ఇచటకు వచ్చెదరు గాక! మీచే సురక్షితు లగు నా పితృ మాతృ - పితామహాదులకు పిండదానము చేయవలెనను ఉద్దేశ్యముతో నే నిచటకు వచ్చితిని'' అని ప్రార్థించవలెను. ముండపృష్ఠమునకు ఉత్తరభాగమునందు ఋషి - దేవాదిపూజిత మగు కనఖల క్షేత్రము మూడు లోకము లందును విఖ్యాత మైనది. సిద్దులకు ఆనందదాయకములును, పాపాత్ములకు భయంకరములును అగు పెద్ద పెద్ద నాగములు, కదలుచున్న నాలుకలతో, ప్రతిదినము ఈ తీర్థమును రక్షించుచున్నవి. అచట స్నానము చేసి మనుష్యులు ఈ భూతలముపై సుఖముగా క్రీడించి, ఆంతమున స్వర్గమునకు పోవుదురు.

ఫల్గుతీర్థం తతో గచ్ఛేన్మహానద్యాం స్థితం పరమ్‌ | నాగాజ్జనార్ద నాత్కూపాద్వటాచ్చోత్తర మానసాత్‌. 25

ఏతద్గయాశిరః ప్రోక్తం ఫల్గుతీర్థం తదుచ్యేత | ముణ్డపృష్ఠనగాద్యాశ్చ సారాత్సారమథాన్తరమ్‌. 26

యస్మిన్‌ ఫలతి శ్రీర్గౌర్వా కామధేనుర్జలం మహీ | దృష్టిరమ్యాదికం యస్మాత్ఫల్గుతీర్థం న ఫల్గువత్‌. 27

ఫల్గుతీర్థే నరః స్నాత్వా దృష్ట్వా దేవం గదాధరమ్‌ | ఏతేన కిం న పర్యాప్తం నృణాం సుకృతకారిణామ్‌. 28

పృథివ్యాం యాని తీర్థాని ఆసముద్రాత్సరాంసి చ | ఫల్గుతీర్థం గమిష్యన్తి వరమేకం దినే దినే. 29

ఫల్గుతీర్థే తీర్థరాజే కరోతి స్నానమాదృతః | పితౄణాం బ్రహ్మలోకాపై#్త్య ఆత్మనో భుక్తిముక్తయే. 30

స్నాత్వా శ్రాదీ పిణ్డదో7థ నమేద్దేవం పితామహమ్‌ | కలౌ మాహేశ్వరా లోకా అత్ర దేవో గదాధరః. 31

పితామహో లిఙ్గరూపీ తం నమామి మహేశ్వరమ్‌ | గదాధరం బలం కామమనిరుద్ధం నరాయణమ్‌. 32

బ్రహ్మవిష్ణునృసింహాఖ్యం వరాహాదిం నమామ్యహమ్‌ | తతో గదాధరం దృష్ట్వా కులానాం శతముద్ధరేత్‌. 33

ధర్మారణ్యం ద్వితీయే7హ్ని మతఙ్గస్యాశ్రమే వరే | మతఙ్గవాప్యాం సంస్నాయ శ్రాద్ధకృత్పిణ్డదో భ##వేత్‌. 34

మతఙ్గేశం సుసిద్ధేశం నత్వా చేదముదీరయేత్‌ | ప్రమాణం దేవతాః సన్తు లోనిపాలాశ్చ సాక్షిణః. 35

మయాగత్య మతఙ్గే7స్మిన్‌ పితౄణాం నిష్కృతిః కృతా |

స్నానతర్పణ శ్రాద్దాదిర్ర్బహ్మతీర్థే7 త్ర కూపకే. 36

తత్కూపయూపయోర్మధ్యే శ్రాద్దం కులశతోద్ధృతౌ | మహాబోధతరుం నత్వా ధర్మవాన్‌ స్వర్గలోకభాక్‌. 37

తృతీయే బ్రహ్మసరసి స్నానం కుర్యాద్యతవ్రతః | స్నానం బ్రహ్మసరస్తీర్థే కరోమి బ్రహ్మభూతయే. 38

పితౄణాం బ్రహ్మలోకాయ బ్రహ్మర్షిగణసేవితే | తర్పణం శ్రాద్ధకృత్పిణ్డం ప్రదద్యాత్తు ప్రసేచనమ్‌. 39

పిదప మహానదిపై నున్న ఉత్తమక్షేత్ర మగు ఫల్గుతీర్థమునకు వెళ్లవలెను. ఇది నాగ-జనార్దన-కూప-వట-ఉత్తరమాసములకంటె గూడ శ్రేష్ఠమైనది. దీనికి 'గయాశిరోభాగము' అని పేరు. ఇది ముండవృష్ఠ-నగాదితీర్థములకంటె సారవత్తరమైనది. దీనికి ''ఆభ్యంతరతీర్థము'' అని పేరు. ఈ తీర్థమున లక్ష్మీ-కామధేను-జల-పృథ్వులు ఫలదాయకములు. దీనిచే దృష్టిరమణీయము లగు మనోహరవస్తువులు ఫలించును. ఇది సామాన్యతీర్థము కాదు. ఫల్గుతీర్థమునందు స్నానముచేసి, గదాధర దర్శనము చేసికొనిన పుణ్యాత్మునకు లభ్యముకాని దేది? భూతలమున సముద్రపర్యంతము ఉన్న తీర్థములును, సరోవరములును, దినమున కొక పర్యాయము ఫల్గుతీర్థమునకు వచ్చుచుండును. శ్రాద్ధవంతుడు ఫల్గుతీర్థమునందు చేయు స్నానము ఆతని పితరులకు బ్రహ్మలోకము నిచ్చును. ఆతనికి భుక్తిముక్తులను ప్రసాదించును. శ్రాద్ధకర్త స్నానానంతరము బ్రహ్మకు నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. ''కలియుగమున అందరును మహేశ్వరోపాసకులు, కాని ఈ గయాక్షేత్రమున ఉపాస్యుడు గదాధరుడు. ఇచట బ్రహమ లింగరూపమున నివసించుచున్నాడు. అయనకు నమస్కరించుచున్నాను. గదాధర-బలరామ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణ-బ్రహ్మ-విష్ణు-నృసింహ వరాహాదులకు నమస్కరించుచున్నాను.'' పిదప గదాధరుని దర్శనము చేసికొనినవాడు నూరు తరములవారిని ఉద్ధరించును. మరునాడు ధర్మారణ్యతీర్థసందర్శనము చేసికొనవలెను. ఆచట మతంగాశ్రమము నందలి మతంగవాపిలో స్నానము చేసి పితండదానము చేయవలెను. ఆచట మతంగేశ్వర-సుసిద్ధేశ్వరులకు నమస్కరించి ''సకలదేవతలు సాక్షిగా సమస్తలోకపాలులు సాక్షిగా, నేను మతంగ తీర్థమునకు వచ్చి పితరుల ఉద్ధారము చేసితిని.'' అని పలుకవలెను. పిదప బ్రహ్మతీర్థ మను కూపమునందు స్నానతర్పణ-శ్రాద్దములు చేయవలెను. ఆ కూపమునకును యూపమునకును మధ్యచేసిన శ్రాద్ధము నూరు తరముల వారిని ఉద్ధరించును. మహాబోధివృక్షమునకు నమస్కారము చేసిన పుణ్యాత్ముడు స్వర్గలోకమును పొందును. మూడవ రోజున వ్రతపాలనము చేయుచు బ్రహ్మసరోవరతీర్థమునందు పితరుల బ్రహ్మలోకప్రాప్తికై స్పానము చేయుచున్నాను'' అని చెప్పుచు స్నానము చేసి, తర్పణములు చేసి, పిండదానము చేయవలెను. పిదప వృక్షమును తడుపవలెను. వాజపేయయజ్ఞఫలమును సొందగోరువాడు బ్రహ్మ స్థాపించిన యూపమునకు ప్రదక్షిణము చేయవలెను.

ఏకో మునిః కుమ్భకుశాగ్రహస్త ఆమ్రస్య మూలే సలిలం దదాతి |

ఆమ్రాశ్చ సిక్తాః పితరశ్చ తృఫ్తా ఏకా క్రియా ద్వ్యర్థకరీ ప్రసిద్ధా. 40

బ్రహ్మాణం చ నమస్కృత్య కులానాం శతముద్ధరేత్‌ | ఫల్గుతీర్థే చతుర్థే7హ్ని స్నాత్వా దేవాది తర్పణమ్‌.

కృత్వా శ్రాద్ధం సపిణ్డం చ గయాశిరసి కారయేత్‌ | పఞ్చక్రోశం గయాక్షేత్రం క్రోశ##మేకం గయాశిరః. 42

తత్ర పిణ్డప్రదానేన కులానాం శతముద్దరేత్‌ | ముణ్డపృష్ఠే పదం న్యస్తం మహాదేవేన ధీమతా. 43

ముణ్డపృష్టే శిరః సాక్షాద్గయాశిర ఉదాహృతమ్‌ | సాక్షాద్గయాశిరస్తత్ర ఫల్గుతీర్థాశ్రమం కృతమ్‌. 44

అమృతం తత్ర వహతి పితౄణాం దత్తమక్షయమ్‌ | స్నాత్వా దశాశ్వమేధే తు దృష్ట్వా దేవం పితామహమ్‌.

రుద్రపాదం నరః స్పృష్ట్వా నేహ భూయో7భిజాయతే | శమీపత్రప్రమాణన పిణ్డం దత్త్వా గయాశిరే. 46

నరకస్థా దివం యాన్తి స్వర్గస్థా మోక్షమాప్నుయుః | పాయసేనాథ పిష్టేన సక్తునా చరుణా తథా. 47

పిణ్డదానం తణ్డులైశ్చ గోధూమైస్తిలమిశ్రితైః | పిణ్డం దత్త్వా రుద్రపదే కులానాం శతముద్ధరేత్‌. 48

తథా విష్ణుపదేశ్రాద్ధపిణ్డదో హ్యృణముక్తికృత్‌ | పిత్రాదీనాం శతకులం స్వాత్మానం తారయేన్నరః. 49

అచట ఒక ముని జలకుంభమును, కుశాగ్రమును హస్తమునందు గ్రహంచి చూతవృక్షములకు నీళ్ళు పోయుచుండెడివాడు. దానితో మామిడిచెట్లకు నీళ్ళు పోసి నట్లు అయినది; పితృదేవతలకు తృప్తి కలిగినది. ఈ విధముగ ఒక పని రెండు లాభములను చేకూర్చినది. బ్రహ్మకు నమస్కారము చేయుటచే నూరు తరములవారిని ఉద్దరించును. నాల్గవ దివసమున ఫల్గుతీర్థమునందు స్నానము చేసి దేవతాదితర్పణము చేయవలెను. గయాక్షేత్రము ఐదుక్రోసులు క్షేత్రము. దానిలో ఒక క్రోసు గయాశీర్షము. అచట పిండదానము చేసిన వాడు నూరు తరములవారిని ఉద్ధరించును. మహాదేవుడు ముండపృష్ఠముపై తన పాద ముంచెను. గయాసురుని శిరస్సు సరిగా ఆ ముండపృష్టమునందే ఉన్నది. అందుచేతనే దానికి 'గయాశిరస్సు' అని పేరు. గయాశీర్ష మున్న స్థానము ఫల్గుతీర్థము, ఫల్గునందు అమృతధార ప్రవహించును. పితరులనుద్దేశించి అచట చేసిన దానము అక్షయ మగును. దశాశ్వమేధతీర్థమున స్నానము చేసి, బ్రహ్మదర్శనము చేసికొని, రుద్రపాదస్పర్శ చేసినవానికి మరల ఈ లోకమున జన్మ ముండదు. గయాశీర్షమున శమీపత్రప్రమాణము గల పిండములను ఇచ్చినచో నరకములో నున్న పితరులు స్వర్గమునకు పోవుదురు. స్వర్గములో నున్నవారు మోక్షము పొందుదురు. అచట పిండప్రదానము, క్షీరము, పిండి, చరువు, బియ్యము వీటితో చేయవలెను. తిలమిశ్రము లగు గోధుమలతో గూడ రుద్ర పాదమునందు పిండదానము చేయుటచే మానవుడు నూరు తరముల వారిని ఉద్ధరించును. విష్ణుపదిపై పిండప్రదానము చేయువాడు పితృబుణవిముక్తుడై, తండ్రి మొదలు నూరు తరములు పైవారిని, తననుకూడ తరింపచేయును.

తథా బ్రహ్మపదే శ్రాద్ధీ బ్రహ్మలోకం నయేత్పితౄన్‌ | దక్షిణాగ్ని పదే తద్వద్గార్హపత్యపదే తథా. 50

పదే చాహవనీయస్య శ్రాద్ధీయజ్ఞఫలం లభేత్‌ | ఆవసథ్యస్య చన్ద్రస్య సూర్యస్య చ గణస్య చ. 51

అగస్త్యకార్తి కేయస్య శ్రాద్దీ తారయతే కులమ్‌ | ఆదిత్యస్య రథం నత్వా కర్ణాదిత్యం నమేన్నరః. 52

కనకేశపదం నత్వా గయాకేదారకం నమేత్‌ | సర్వపాపవినిర్ముక్తః పితౄన్‌ బ్రహ్మపురం నయేత్‌. 53

విశాలో7పి గయాశీర్షే పిణ్డదో7భూచ్ఛ పుత్రవాన్‌ |

విశాలాయాం విశాలో7 భూద్రాజపుత్రో7బ్రవీద్ద్విజాన్‌.

కథం పుత్రాదయః స్యుర్మే ద్విజా ఊచుర్విశాలకమ్‌ | గయాయాం పిణ్డదానేన తవ సర్వం భవిష్యతి. 55

విశాలో7పిగయాశీర్షే పితృపిణ్డాన్‌ దదౌ తతః | దృష్ట్వాకాశే సితం రక్తః పురుషాంస్తాంశ్చ పృష్టవాన్‌. 56

కే యూయం తేషు చైవైకః సితః ప్రోచే విశాలకమ్‌ | అహం సితస్తే జనక ఇన్ద్రలోకం గతః శుభాత్‌. 57

మమ రక్తః పితా పుత్ర కృష్టశ్త్చైవ పితామహః | అబ్రవీన్నరకం ప్రాప్తాస్త్వయా ముక్తీకృతా వయమ్‌. 58

పిణ్డదానాద్బ్రహ్మలోకం వ్రజామ ఇతి తే గతాః |

విశాలః ప్రాప్తపుత్రాదిః రాజ్యం కృత్వా హరిం య¸°. 59

(అ) 42

బ్రహ్మపదమున శ్రాద్దము చేసినవాడు పితరులను బ్రహ్మలోకమునకు పంపును. దక్షిణాగ్ని-గార్హపత్యాగ్ని- ఆహవనీయాగ్నుల స్థానములందు శ్రాద్ధము చేసినవాడు యజ్ఞఫలమును పొందును. ఆవసథ్యాగ్ని, చంద్ర-సూర్య-గణశ-అగస్త్య-కార్తికేయుల స్థానములందు శ్రాద్ధము చేసినవాడు తన కులములు ఉద్ధరించును. సూర్యుని రథమునకు నమస్కరించి కర్ణాదిత్యునికి శిరము వంచవలెను. కనకేశ్వరుని పదమునకు నమస్కరించి గయాకేదారతీర్థమును నమస్కరించవలెను. దానిచే అన్ని పాపములనుండియు విముక్తుడై తన పితరులను బ్రహ్మలోకమునకు పంపును. గయాశీర్షమునందు పిండదానము చేయుటచే విశాలుడు పుత్రవంతుడాయెను.

విశాలనగరమునందు విశాలు డను రాజపుత్రు డుండెను. ''నాకు పుత్రోత్పత్తి ఎట్లు కలుగును'' అని ఆతడు బ్రాహ్మణులను ప్రశ్నించెను. ''గయలో పిండదానము చేసినచో పుత్రులు కలుగుదురు'' అని వారు చెప్పగా ఆతడు గయా తీర్థమునందు పితరులకు పిండ ప్రదానము చేసెను, అపుడు ఆయనకు ఆకాశమునందు తెల్లగాను, ఎర్రగాను, (నల్లగాను) ఉన్న పువుషులు కనపడిరి. మీ రెవ రని విశాలు డడుగగ వారిలో తెల్లని పురుషుడు పలికెను- ''తెల్లగా నున్న నేను నీ తండ్రిని. నేను చేసిన పుణ్యకర్మలచే ఇంద్రలోకమునకు వెళ్ళితిని. ఎఱ్ఱగా నున్నవాడు నా తండ్రి; నల్లనివాడు నా పితామహుడు. వీరు నరకములో పడి యుండిరి. నీవు మమ్ములందరిని ముక్తులను చేసితివి. నీవు పిండదానము చేయుటచే మేము బ్రహ్మలోకమునకు పోవుచున్నాము'' అట్లు పలికి వారు ముగ్గురును వెళ్లిపోయిరి. విశాలునకు పుత్రపౌత్రాదులు కలిగిరి. అతడు రాజ్యము అనుభవించి మరణానంతరము విష్ణులోకమును పొందెను.

ప్రేతరాజః స్వముక్త్యై చ వణిజం చుదమబ్రవీత్‌ | ప్రేత్తెః సర్త్వెః సహార్తః సన్‌ సుకృతం భుజ్యతే ఫలమ్‌. 60

శ్రవణద్వాదశీయోగే కుమ్భః సాన్నశ్చ సోదకః | దత్తః పురా స మధ్యాహ్న జీవనాయోపతిష్ఠతి. 61

ధనం గృహీత్వా రే గచ్ఛ గయాయాం పిణ్డదో భవ |

వణిగ్ధనం గృహీత్వా తు గయాయాం పిణ్డదో7భవత్‌. 62

ప్రేతరాజః సహ ప్రేత్తెర్ముక్తో నీతో హరేః పురమ్‌ | గయాశీర్షే పిణ్డదానాదాత్మానం స్వపితౄంస్తథా. 63

పితృవంశే మృతా యే చ మాతృవంశే తథైవ చ | గురుశ్వశురబన్ధూనాం యే చాన్యే బాన్దవా మృతాః. 64

యే మే పూర్వే లుప్తపిణ్డాః పుత్రదారవివర్జితాః | క్రియాలోపగతా యే చ జాత్యన్ధాః పఙ్గవస్తథా. 65

విరూపా ఆమగర్భా యే జ్ఞాతాజ్ఞాతాః కులే మమ | తేషాం పిణ్డో మయాదత్తో హ్యక్షయ్యముపతిష్ఠతామ్‌.66

యే కేచిత్ర్పేతరూపేణ తిష్ఠన్తి పితరో మమ | తే సర్వే తృప్తి మాయాన్తు పిణ్డదానేన సర్వదా. 67

పిణ్డో దేయస్తు సర్వేభ్యః సర్వైర్వై కులతారకైః | ఆత్మనస్తు తథా దేయో హ్యక్షయ్యం లోకమిచ్ఛతా. 68

పఞ్చమే7హ్ని గదాలోకే స్నాయాన్మంత్రేణ బుద్దిమాన్‌ | గదాప్రక్షాలనే తీర్థే గదాలోలే 7తిపావనే. 69

స్నానం కరోమి సంసారగదశాన్త్యై జనార్దన | నమో7క్షయవటాయైవ అక్షయస్వర్గదాయినే. 70

పిత్రాదీనామక్షయామ సర్వపాపక్షయాయ చ | శ్రాద్ధం వటతలే కుర్యాద్ర్భాహ్మణానాం చ భోజనమ్‌. 71

ఏకస్మిన్‌ భోజితే విప్రే కోటిర్భవతి భోజితా | కిమ్పునర్బహుభిర్భుక్తైః పితౄణాం దత్తమక్షయమ్‌ 72

గయాయామన్నదాతా యః పితరస్తేన పుత్రిణః | వటం వటేశ్వరం నత్వా పూజయేత్ర్పపితామహమ్‌. 73

అక్షయాన్‌ లభ##తే లోకాన్‌ కులానాం శతముద్దరేత్‌ | క్రమతో7క్రమతో వాపి గయాయాత్రా మహాఫలా. 74

ఇత్యాదిపురాణ ఆగ్నేయే గయామాహాత్మ్యే గయాయాత్రా నామ పంచదశాధిక శతతమో7ధ్యాయః.

ఒక ప్రేతరాజు, ఇతర ప్రేతములతో చాల కష్ట కడుచుండెను. ఇత డొకనాడు తన కఢేనివిముకోరుచుఒతోనివర్తకు ఇట్లుచెప్పెను- ''మేము ఒకే పుణ్యము చేసితిమి. తత్ఫలితముగనే ఇపుడు అనుభవించుచున్నాము. ఒకమారు శ్రావణ-ద్వాదశీయోగము నందు మేము అన్న జలసహితకుంభదానము చేసితిమి. ప్రతి దినము మధ్యహ్నమున అంతే మా జీవనరక్షకొరకై వచ్చుచున్నది. నీవు మానుండి ధనము తీసికొని వెళ్ళి మా నిమిత్తమై గయలో పిండదానము చేయుము. ఆ వర్తకుడు ధనము గ్రహించి గయలో పిండదానము చేసెను. తత్ఫలితముగా ఆ ప్రేతరాజు విముక్తిచెంది విష్ణు లోకమును పొందెను. గయా శీర్షమునందు పిండదానము చేయుటచే మనుష్యుడు తనను, తన పితరులను గూడ ఉద్ధరించును. అచట పిండదానము చేయునపు డిట్లు చెప్పవలెను-- ''నా పితృమాతృవంశములకు సంబంధించినవారును, గురుశ్వశుర బంధువులు వంశములకు సంబంధించినవారును తదితరబంధువులును భార్యాపుత్రాదులు లేకపోవుటచే శ్రాద్దకర్మలుప్త మైపోయిన నాకులమునకు సంబంధించినవారును , పుట్టుకనుండియు గ్రుడ్డివారును, కుంటివారును, వికృతరూపము గలవారును, గర్భస్రావముచే మరణించినవారును, ఈ విధముగ నా కులమునకు సంబంధించిన జ్ఞాతాజ్ఞాతులగు పితరు లందరును, నేను చేయుచున్న ఈ పిండ ప్రదానమున శాశ్వతతృప్తిని పొందుదురు గాక. ప్రేతరూపమున నున్న నాపితరులు ఈ పిండప్రదానముచే సర్వదా తృప్తు లగుదురు గాక. తమ వంశమును తరింపజేయదలచిన వారు తమ తమ పితరుల నందరిని ఉద్దేశించి అచట పిండప్రదానము చేయవలెను. అక్షయపుణ్యలోక ప్రాప్తికొరకై తప్పక తనకు తాను పిండప్రదానము చేయవలెను, బుద్దిమంతుడు, ఐదవ దివసమున 'గదాలోలము' అను తీర్థము నందు స్నానము చేయవలెను. ఆ సమయమున-- ''జనార్దనా! నీవు గదాప్రక్షాళనము చేసిన అత్యంతపావన మగు గదాలోలక్షేత్రమునందు సంసారరోగ నివృత్తికొరకై స్నానము చేయుచున్నాను'' అను అర్థముగల మంత్రమును చదువలెను, ''అక్షయస్వర్గము నిచ్చు అక్షయ వటమునకు నమస్కారము, పితృపితామహాదులకు అక్షయాశ్రయము సర్వపాపవినాశకము అగు ఆక్షయవటమునకు నమస్కారము'' అని ప్రార్థించి అక్షయవటము క్రింద శ్రాద్ధము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. అచట ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో కోటిబ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలము లభించును. అనేక బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో ఇక చెప్పవలెనా? పితరుల నుద్దేశించి ఆచట ఏమి చేసినను అది అక్షయ మగును. గయకు వెళ్ళి అన్న దానము చేసిన పుత్రు డుండిన యెడలనే తమకు పుత్రు డున్నట్లు పితరులు భావింతురు. వట-వటేశ్వరులకు నమస్కారము చేసి ప్రపితామహుని పూజించవలెను. ఇట్లు చేయువాడు తనను తానను ఉద్ధరించుకొనుటయే కాక నూరు తరములవారిని కూడ ఉద్ధరించును. సక్రమముగ నైనను అక్రమముగనైనను చేసిన గయాయాత్ర గొప్ప ఫలము నిచ్చును.

ఆగ్నేయమహాపురాణమునందు గయాయాత్రావిధివర్ణన మను నూటపదునైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters