Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ సప్తదశోత్తరశతతమో7ధ్యాయః. అథ శ్రాద్ధకల్పః. అగ్ని రువాచ : కాత్యాయనో మునీనాహ యథా శ్రా ద్ధం తథా పదే | శ్రాద్ధం గయాదౌ కుర్వీత సంక్రాన్త్యాదౌ విశేషతః. 1 కాలే చాపరపక్షే చ చతుర్థ్యామూర్ధ్వమేవ వా | సంపాద్య చ పదర్షే చ పూర్వేద్యుశ్చ నిమన్త్రయేత్. 2 యతీన్ గృహస్థాన్ సాధూన్వా స్నాతకాఞ్ఛ్రోత్రియాన్ద్విజాన్ | అనవద్యాన్ కర్మనిష్ఠాన్ శిష్టానాచారసంయుతాన్. 3 వర్జయేచ్ఛ్విత్రికుష్ఠ్యాదీన్ న గృహ్ణీయాన్నిమన్త్రితాన్ | స్నాతాన్ శుచీం స్తథా దాన్తాన్ ప్రాఙ్ముఖాన్ దేవకర్మణి. 4 ఉపవేశ##యే త్త్రీన్ పిత్రాదీనేకైకముభయత్ర వా | ఏవం మాతామహాదీంశ్చ శాకైరపి చ కారయేత్. 5 తదహ్ని బ్రహ్మచారీ స్యాదకోపో7త్వరితో మృదుః | సత్యో7ప్రమత్తో7నధ్వన్యో అస్వాధ్యాయశ్చ వాగ్యతః. 6 సర్వాంశ్చ పంక్తిమూర్ధన్యాన్ పృచ్ఛేత్ర్ప శ్నే తథాసన్ | దర్భానాస్తీర్య ద్విగుణాన్ పిత్రే దేవాదికం చరేత్. 7 విశ్వాన్ దేవానావాహయిష్యే పృచ్ఛేదావాహయేతి చ | విశ్వేదేవాస ఆవాహ్య వికీర్యాథ యవాఞ్జపేత్. 8 విశ్వేదేవాః శృణుతేమం పితౄనావాహయి ష్యే చ | పృచ్ఛేదావాహాయేత్యుక్తే ఉశన్తస్త్వా సమాహ్వయేత్. 9 తిలాన్వికీర్యాథ జపేదాయన్త్విత్యాది పైతృకే | సపవిత్రీ నిసిఞ్చేద్వా శన్నోదేవీదబిత్ర్యుచా. 10 యవో7సీతి యవాన్దత్వా పిత్రే సర్వత్ర వై తిలాన్ | తిలో7సి సోమదైవత్యో గోసవే దేవనిర్మితః. 11 ప్రత్నవద్బిః ప్రత్తః స్వధయేహి ఇమాన్ పితౄన్ లోకాన్ ప్రీణాహి స్వధా నమః ఇతి | శ్రీశ్చతే ఇతి దదేత్పుష్టం పాత్రేహైమే థ రాజతే. ఔదుమ్బరే వాఖడ్గేవా పర్ణపాత్రే ప్రదక్షిణమ్ | దేవానామపసవ్యం తు పితౄణాం సర్వమాచరేత్. ఏకైకస్యచైవై కేన సపవిత్రకరేషుచ. అగ్నిదేవుడు చెప్పెను : కాత్యాయనమహర్షి మునులకు చెప్పిన శ్రాద్ధకల్పమును చెప్పదను. గయాదితీర్థములలో విశేషించి సంక్రాంత్యాదిసమయములందు శ్రాద్ధము చేయవలెను, అపరాహ్ణకాలమునందు, కృష్ణపక్షమున, చతుర్థీతిథియందుగాని శ్రాద్ధమునకు కావలసిన సామగ్రి సంపాదించుకొని ఉత్తమనక్షత్రమునందు శ్రాద్దము చేయవలెను. శ్రాద్ధదివసమునకు ఒక దివసము ముందుగనే బ్రాహ్మణుల నిమంత్రణము చేయవలెను. అనింద్యులును స్వస్వకర్మనిరతులును, శిష్టులును, సదాచారవంతులును అగు సంన్యాసులను గృహస్థులను సాధువులను వేద స్నాతకులను, లేదా శ్రోత్రియులను నిమంత్రించవలెను. బొల్లికలవారిని, కుష్ఠాదులు కలవారిని నిమంత్రించరాదు. నియంత్రితు లగు బ్రాహ్మణులను స్నానాచమనాద్యనంతరము దేవకర్మకై పూర్వాభిముఖముగ కూర్చుండబెట్టవలెను. దేవశ్రాద్ధ-పితృశ్రాద్దములందు ముగ్గురేసి కాని, ఒక్కొక్కరు గాని బ్రాహ్మణు లుండవలెను. మాతామహాదిశ్రాద్దమునందు గూడ ఇట్లే. శ్రాద్దకర్మ శాకాదులతో జరుపవలెను. శ్రాద్దదివసమున బ్రహ్మచర్య మవలంబించి క్రోధరహితుడుగా ఉండవలెను. ఆ రోజున చాల దూరము ప్రయాణము చేయకూడదు. స్వాధ్యాయాఢ్యయనము చేయరాదు. ప్రతి ఒక్క కర్మ విషయమునను, పంక్తిపావను లగు బ్రాహ్మణులగు అడుగుచుండవలెను, ఆసనములపై కుశలు పరచవలెను. పితృకర్మలందు కుశలురెండుగామడచి వేయవలెను. మొదట దేవకర్మచేసి పిదప పితృకర్మ చేయవలెను. దేవకర్మయందున్న బ్రాహ్మణులను - ''నేను విశ్వేదేవులను ఆవాహన చేసెదను''అని అడుగగావారు ''ఆవాహన చేయుము'' అని ఆనుజ్ఞ ఇవ్వవలెను. పిదప 'విశ్వేదేవాసః ఇత్యాదిమంత్రముచే విశ్వేదేవతల ఆవాహన చేసి ఆసనముపై యవలు చల్లవలెను, ''విశ్వేదేవాః శృణుతేమం'' ఇత్యాదిమంత్రము జపించవలెను పిదప ''నేనిపుడు పితృదేవతలను ఆవాహన చేసెదను.'' అని కర్మనియుక్తులగు బ్రాహ్మణులను అడగవలెను. ''ఆవాహన చేయుము'' అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిదప ''ఉశన్తస్త్వా'' ఇత్యాది మంత్రము చదువుచు ఆవాహన చేయవలెను. తిలల చల్లి ఆయన్తః ఇత్యాది మంత్రము జపించుచు, పవిత్రకసహితమగు అర్ఘ్యపాత్రమునందు ''శం నో దేవీ'' ఇత్యాదిమంత్రముతో ఉదకముపోయవలెను. పిదప 'యవోసి' ఇత్యాదిమంత్రముచే యవలు ఇవ్వవలెను. పితరుల విషయమున సర్వత్ర తిలలు ఉపయెగించవలెను. పితృదేవతల ఆర్ఘ్యపాత్రమునందు 'శం నో దేవీ' ఇత్యాదిమంత్రము చే ఉదకము పోసి ''తిలోసి సోమదేవత్యో గోసవే దేవ నిర్మితః ప్రత్నవద్భిః ప్రత్తః స్వధయా పితౄన్ లోకాన్ ప్రీణాహి స్వధానముః '' అను మంత్రము చదువుచు తిలలువేయవలెను. పిదప''శ్రీశ్చ తే'' ఇత్యాది మంత్రముచే అర్ఘ్య పాత్రముదందు పుష్పములుంచవలెను. అర్ఘ్యపాత్రము సువర్ణమయముగాని. రజతమయము గాని, ఉదుంబరమయము గాని, పత్రనిర్మితము గాని కావలెను, దేవతలకు సవ్యముగను పితృదేవతలకు అపసవ్యముగను ఈ వస్తువులను ఉంచవలెను. ఒక్కొక్కరికి ఒక్కొక ఆర్ఘ్యపాత్రము వినియోగించుట మంచిది. వితృ దేవతలకు చేతిలో ముందుగా పవిత్రమునుంచిన పిమ్మటనే ఆర్ఘ్యమీయవలెను. యా దివ్యా ఆపః పయసా సమ్బభూవుర్యా అన్తరిక్ష ఉత పార్థివీర్యాః | హిరణ్యవర్ణా యజ్ఞియాస్తాన ఆపః శివాః శం స్యోనాః సుహవా భవన్తు | విశ్వేదేవ ఏష వో7ర్ఘ్యః స్వాహా చ పితరేష తే. 13 స్వధైవం పితామహాదేః సంస్రవాత్ వ్రథమే చరేత్ | పితృభ్యః స్థానమసీతి న్యుబ్జపాత్రం కరోత్యధః. 14 అత్రగన్దపుష్పధూపదీపాచ్ఛాదనదానకమ్ | ఘృతాక్తమన్నముద్ధృత్య పృచ్ఛత్యగ్నౌ కరిష్యే చ. 15 కురుష్వేత్యభ్యనుజ్ఞాతో జుహుయాత్సాగ్నికో నమేత్ | అనగ్నికః పితృహస్తే సపవిత్రేతు మన్త్రతః. 16 అగ్నయే కవ్యవాహనాయేతి ప్రథమాహుతిః | సోమాయ పితృమతే7థ యమాయాఙ్గిరసే పరే. 17 హుతశేషం చాన్నపాత్రే దత్త్వా పాత్రం సమాలభేత్ | పృథివీ తే పాత్రం ద్యౌరపిధానం బ్రహ్మణస్త్వా ముఖే అమృతే ఆమృతం జుహోమి స్వాహేతి జప్త్వేదం విష్ణురిత్యన్నే ద్విజాఙ్గుష్ఠం నివేశ##యేత్. 18 అపహతేతి చ తిలాన్వికీర్యాన్నం ప్రదాపయేత్ | జుషధ్వమితి చోక్త్వాథ గాయత్ర్యాది తతో జపేత్. 19 దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ | నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. 20 తృప్తాన్ జ్ఞాత్వాన్నం వికిరేదపో దద్యాత్సకృత్సకృత్ | గాయత్రీం పూర్వవజ్జప్త్వా మధుమధ్వితి వై జపేత్. తృప్తాః స్థ ఇతి సంపృచ్ఛేత్తృప్తాః స్మ ఇతి వై వదేత్ | శేషమన్నమనుజ్ఞాప్య సర్వమన్నమథైకతః. 22 ఉద్ధృత్యోచ్ఛిష్టపార్మ్వే తు కృత్వా చైవావనేజనమ్ | దద్యాత్కు శేషు త్రీన్ పిణ్డానాచా న్తేషు పరే జగుః. 23 పిదప ''ఓం యా దివ్యా అపః..... సుహవా భవన్తు'' అను (మూలములో ఇచ్చిన) మంత్రము చదువుచు విశ్వేదేవాః ఏష నో హస్తార్ఘ్యః స్వాహా అని చెప్పి, విశ్వదేవతలకు అర్ఘ్య మిచ్చి పాత్రలను దక్షిణ (కుడి) భాగమున ఉంచవలెను. పిత్రాదులకు కూడ స్వధా అని చిపర చెప్పుచూ ఇదే విధముగ అర్ఘ్యము ఇవ్వవలెను. పితామహాదులకు కూడ ఇదే విధముగ ఇవ్వవలెను. అర్ఘ్యావశేషము నంతను మొదటి పాత్రలో ఉంచవలెను. పాత్రలను మూడింటిని పిత్రాసన వామభాగమునందు ''పితృభ్యః స్థానమసి'' అని చెప్పుచు బోర్లించవలెను. పిదప దేవతలను పితరులను గంధ - పుష్ప - ధూప దీప - వస్త్రాదులతో పూజించవలెను. పిదప పాత్రనుండి ఘృతయుక్తమగు అన్నము తీసి, ''నే నీ అన్నమును అగ్నిలో హోమము చేసెదను'' అని బ్రాహ్మణులను అడిగి, ''చేయుము''. ఆని వారు అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట అగ్నిలో హోమము చేయవలెను. సాగ్ని యైనవాడు పవిత్రయుక్త మగు పితృహస్తమునందు మంత్రముతో హోమము చేయవలెను. ''అగ్నయే కవ్యవాహనాయ స్వాహా'' అని మొదటి ఆహుతి చేయవలెను'' రెండవది ''సోమాయ పితృమతే స్వాహా'' అని చేయవలెను యముని, అంగిరసుని ఉద్దేశించి ఆహుతి ఇవ్వవలెనని కొందరి మతము. హోమము చేయగా మిగిలిన అన్నము వరుసగ దేవతా - పితృపత్రములందు వడ్డించి, పాత్రను హస్తముతో కప్పి ''ఓం పృథివీ తే పాత్రమ్.... జుహోమి స్వాహా'' అను మంత్రము జపించుచు, ఇదం పిషుర్విచక్రమే'' ఇత్యాది మంత్రముతో బ్రాహ్మణుని అంగుష్ఠముతో ఆ అన్నమును స్పృశింప చేయవలెను '' అపహతా అసురా'' ఇత్యాది మంత్రముతో పితృపాత్రమున తిలలు చల్లి సంకల్ప పూర్వకముగ అన్నము అర్పించవలెను. పిదప ''జుషధ్వమ్'' (భుజింపుడు) అని చెప్పి, గాయత్ర్యాదిమంత్రములను జపించవలెను. ''దేవతాభ్యః...... నమో నమః. '' అనుమంత్రమును గూడ జపించవలెను. పితృదేవతలు తృప్తి చెందిన విషయము తెలిసికొని, పాత్రము నందలి అన్నము చల్లవలెను. ఒక్కొక్కసారి అందరికిని జల మీయవలెను, సవ్యముగా నుండి గాయత్రీ మంత్రజపము చేసి ''మధువాతా'' ఇత్యాది బుక్కును జపించి, మీరు తృప్తిచెందినారా?'' అని బ్రాహ్మణులను అడుగవలెను మేము తృప్తుల మైతిమి' అని వారు సమాధానము చెప్పవలెను. బ్రాహ్మణుల అనుమతిచే శేషాన్నమును కలిపి పిండము చేయుటకై పాత్రనుండి బైటకుతీసి, పితృచ్ఛిష్టాన్న సమీపమున అవనేజనము చేసి, కుశములపై సంకల్ప పూర్వకముగా పిండదానము చేయవలెను. బ్రాహ్మణులు చేతులు కడిగికొని ఆచమనము చేసిన పిమ్మట పిండప్రదానము చేయవలెనని కొందరి మతము. ఆచాన్తేషూదకం పుష్పాణ్యక్షతాని ప్రదాపయేత్ | అక్షయ్యోదకమేవాథ ఆశిషః ప్రార్థయేన్నరః. 24 అఘోరాః పితరః సన్తు గోత్రం నో వర్దతాం సదా | దాతారో నో7భివర్దన్తాం వేదాః సన్తతిరేవ చ. 25 శ్రద్ధా చ నో మా వ్యగమద్బహు దేయం చ నో7స్త్వితి | అన్నం చ నో బహు భ##వేదతిథీంశ్చ లభేమహి. యాచితారశ్చ నః సన్తు మా చ యాచిష్మ కం చన | స్వధా వాచనీయాన్ కుశానాస్తీర్య సపవిత్రకాన్. 27 స్వధాం వాచయిష్యే పృచ్ఛేదనుజ్ఞాతశ్చ వాచ్యతామ్ | పితృభ్యః పితామహేభ్యః ప్రపితామహముఖ్యకే. 28 స్వధోచ్యతామస్తు స్వధా ఉచ్యమానస్తథైవ చ | అపో నిషిఞ్చే దుత్తానం పాత్రం కృత్వాథ దక్షిణామ్. 29 యథాశక్తి ప్రదద్యాచ్చ దై వై పైత్రే7థ వాచయేత్ | విశ్వేదేవాః ప్రీయన్తాం చ వాజే వాజే నవిర్జయేత్. 30 ఆమావాజస్యేత్యనువ్రజ్య కృత్వా విప్రాన్ ప్రదక్షిణమ్ | గృహే విశేదమావాస్యాం మాసి మాసి చరేత్తథా. 31 అ (43) ఆచమనానంతరము ఉదకము పుష్పములు, అక్షతలు సమర్పించవలెను. పిదప అక్షయ్యోదక మిచ్చి ఆశీర్వాదమును కోరుచు, ''నా పితృదేవతలు సౌమ్యులుగా నుందురుగాక'' అని పలికి ఉదకము వదలవలెను. ''మా గోత్రము సర్వదా వృద్ధి పొందుగాక, వేదముల పఠన - పాఠనక్రమము అవిచ్ఛిన్నముగ కొనసాగుగాక! సంతానవృద్ధి అగు గాక, మాకు శ్రద్ధ లోపించకుండుగాక. దానము చేయుటకై మా వద్ద వివిధ వస్తు సామగ్రి ఉండుగాక, మావద్ద అన్నము కూడ అధికముగా నుండుగాక. మా యింటికి అతిథులు వచ్చుచుందురుగాక. యాచకులు మావద్దకు వచ్చి యాచించుదురు, గాక. మేము మాత్రము ఎవ్వరిని యాచించకుందుముగాక'' అని ప్రార్థించవలెను. స్వధావాచనము నిమిత్తము పిండములపై పవిత్రకసహిత మగు కుశములు కప్పి నేను స్వధావచనము చేయించెదను'' అని బ్రహ్మణులను అడిగి,, ''స్వధావాచనము చేయుము'' అని వారి అనుజ్ఞపొంది ఈ విధముగా చెప్పవలెను ''బ్రహ్మణులారా! మీరు మా పితృ - పితామహ- ప్రపితామహులకొరకై స్వధావాచనము చేయుడు'' అపుడు బ్రాహ్మణులు ''అస్తు స్వధా'' అని అందురు. పిమ్మట కుశలపై దుగ్ధమిశ్రజలమును దక్షిణాగ్రధారగా పోసి, అర్ఘ్యపాత్రను ఉత్తానము చేసి, దేవశ్రాద్ధ ప్రతిష్ఠార్థమై యథా శక్తిగ సువర్ణ రజత దక్షిణ ఈయవలెను. ''విశ్వేదేవా: ప్రియన్తామ్'' అని చెప్పి దేవతావిసర్జన చేసి ''వాజే వాజే'' ఇత్యాది మంత్రముచే పిత్రాదులను విసర్జించవలెను. ''అమావాజస్య'' అను మంత్రము పఠించుచు బ్రాహ్మణులను అనుసరించి నడచి ప్రదక్షిణము చేసి ఇంటిలోనికి వెళ్ళవలెను. ప్రతి అమావాస్యయందును ఈ విధముగనే పార్వణ శ్రాద్ధము చేయవలెను. ఏకోద్దిష్టం ప్రవక్ష్యామి శ్రాద్ధం పూర్వవదాచరేత్ | ఏకం పవిత్రమేకార్ఘమేకం పిణ్డం ప్రదాపయేత్. 32 నావాహనాగ్నౌకరణం విశ్వేదేవా న చాత్రహి | తృప్తిప్రశ్నే స్వదితమితి వదేత్సుస్వదితం ద్విజః. 33 ఉపతిష్ఠతామిత్యక్షయ్యే విసర్గే చాభిరమ్యతామ్ | అభిరతాఃస్మ ఇత్యపరే శేషం పూర్వవదాచరేత్. 34 సపిణ్డీకరణం వక్ష్యే అబ్దాన్తే మధ్యతో7పి వా | పితౄణాం త్రీణి పాత్రాణి ఏకం ప్రేతస్య పాత్రకమ్. 35 సపవిత్రాణి చత్వారి తిలపుష్పయుతాని చ | గన్ధోదకేన యుక్తాని పూరయిత్వాభిపిఞ్చతి. 36 ప్రేతపాత్రం పితృపాత్రే యే సమానా ఇతి ద్వయాత్ |పూర్వవత్పిణ్డదానాది ప్రేతానాం పితృతా భ##వేత్. అథాభ్యుదయికం శ్రాద్ధం వక్ష్యే సర్వం తు పూర్వవత్ | జపేత్పితృమన్త్రవర్జం పూర్వాహ్ణే తత్ప్రదక్షిణమ్. 38 ఉపచారా ఋజుకుశాస్తిలార్థైశ్చయవైరిహ | తృప్తిప్రశ్నస్తు సంపన్నం సుసంపన్నం వదేద్ద్విజః. 39 దధ్యక్షతబదరాద్యాః పిణ్డా నాన్దీముఖాన్ పితౄన్ | ఆవాహయిష్యే పృచ్ఛేచ్చ ప్రియన్తామితి చాక్షయే. #9; 40 నాన్దీముఖాశ్చ పితరో వాచయి ష్యేథ పృచ్ఛతి | నాన్దీముఖాన్ పితృగణాన్ ప్రీయన్తామిత్యథో వదేత్. 41 నాన్దీముఖాశ్చ పితరస్తత్పితా ప్రపితామహః | మాతామహః ప్రమాతామహో వృద్ధప్రమాతామహః. 42 స్వధాకారం న యుఞ్జీత యుగ్మాన్విప్రాంశ్చ భోజయేత్ | తృప్తిం వక్ష్యే పితౄణాం చ గ్రామ్యైరోషధిభిస్తథా. 43 మాసం తృప్తిస్తథారణ్యౖః కందమూలఫలాదిభిః | మత్య్సైర్మాసద్వయం మార్గైస్త్రయం వై శాకునేన చ. 44 చతురో రౌరవేణాథ పఞ్చ షట్ ఛాగకేన తు, కూర్మేణ సప్త చాష్టౌ చ వారాహేణ నవైవ తు. 45 మేషమాంసేన దశ చ మాహిషైః పార్వతైః శివైః | సంవత్సరం తు గవ్యేన పయసా పాయసేన వా. 46 వార్ద్రీనసస్య మాంసేన తృప్తిర్ద్వాదశవార్షికీ | ఖడ్గమాంసం కాలశాకం లోహితచ్ఛాగలో మధు. 47 మహాశల్కాశ్చ వర్షాసు మఘాశ్రాద్దమథాక్షయమ్ | ఇపుడు ఏకోద్దిష్టశ్రాద్ధమును గూర్చి చెప్పెదను. ఈ శ్రాద్ధము కూడ వెనుకటివలనే చేయవలెను. భేద మేమనగా దీనిలో ఒకే పవిత్రకము. ఒకే అర్ఘ్యము. ఒకే పిండము ఇవ్వవలెను. దీనిలో ఆవాహనము అగ్నౌకరణము, విశ్వేదేవ పూజనము ఉండవు తృప్తిని ప్రశ్నించినపుడు ''స్వదితమ్'' అని ప్రశ్నించవలెను బ్రాహ్మణుడు సుస్వదితమ్ అని ప్రత్యుత్తరమీయవలెను. ''ఉపతిష్టతామ్'' అని చెప్పి అర్పణము చేయవలెను. - అక్షయ్యోదకము కూడ ఇవ్వవలెను. విసరజ్న సమయమున ''అభిరమ్యతామ్'' అని పలుకవలెను. బ్రాహ్మణులు ''అభిరతాఃస్మః'' అని ప్రత్యుత్తర మీయవలెను. మిగిలిన దంతము వెనుకటి వలనే చేయవలెను. ఇపుడు సపిండీకరణమును గూర్చి చెప్పెదను ఇది సంవత్సరాంతమునందును మధ్యయందును కూడ చేయవచ్చును. దీనిలో పితరులకొరకు మూడు పాత్రలను, ప్రేతకు వేరుగా ఒక పాత్రయు ఉంచవలెను, నాలుగు అర్ఘ్యపాత్రములందును పవిత్రము, తిలలు, పుష్పములు, చందనము, జలము నింపవలెను. వాటి నుండియే, అర్ఘ్యము నిచ్చు చుండవలెను. 'తే సమానాః' ఇత్యాది మంత్రద్వయముతో ప్రేతార్ఘ్యపాత్రను క్రమముగా పితృపితామహ ప్రపితామహ పాత్రలతో కలపవలెను ఈ విదముగనే పిండదానము, దానము మొదలగు గూడ చేసి, ప్రేత పిండమును పితరుల పిండములతో కలప వలెను. ఇట్లు చేయుటచే ప్రేతకు పితృత్వము ప్రాప్తించును. ఇపుడు అభ్యుదయిక శ్రాద్ధమును గూర్చి చెప్పుచున్నాను. దీని విధి యంతము వెనుకటి వలనే. దీనియందు పితృదేవతామంత్రమును తప్ప ఇతరమంత్రముల జపము చేయవలెను. కోమల కుశలను ఉపయోగించవలెను. తిలలకు బదులు యవలు ఉపయోగించవలెను పితరుల తృప్తిని గూర్చి బ్రాహ్మణులను ప్రశ్నించు నపుడు 'సంపన్నమ్' అని ప్రశ్నించవలెను. వారు సుసంపన్నమ్ అని సాధానము చెప్పవలెను. దీనిలో - పెరుగు, అక్షతలు, బదరీఫలములు మొదలగు వాటితో చేసిన పిండముల ప్రదానము చేయవలెను. ఆవాహనసమయమున- ''నేను నాందీముఖులను పేరుగల పితృదేవతలను అవాహన చేసెదను'' అని ప్రశ్నించవలెను. అక్షయ్యతృప్తి విషయమున 'ప్రీయతామ్' అనవలెను. ''నేను నాందీముఖ పితృదేవతల తృప్తి వాచనము జేయించదను'' అని అడిగి, బ్రాహ్మణుల అనుజ్ఞ గొని, నాన్దీముఖాః పితరః ప్రియన్తామ్'' అని చెప్పవలెను. పితృ-పితామహ-ప్రపితామహులు, మాతామహ - ప్రమాతామహ- వృద్ధవ్రమాతామహులను నాందీముఖపితృదేవతలు అభ్యుదయిక శ్రాద్ధమునందు 'స్వధా' ఉయోగింపరాదు బాహ్మణద్వయమునకు భోజనము పెట్టవలెను. ఇపుడు నేను పితృదేవతల తృప్తిని గూర్చి చెప్పెదను గ్రామ్యాన్నము చేతను అరణ్యకంద - మూల - ఫలాదులచేతను ఒక మాసము తృప్తి కలుగును మత్స్యములచే రెండు మాసములు, మృగ మాంసము చే మూడు మాసములు, పక్షిమాంసముచే నాలుగు మాసములు, రురు మృగమాసంముచే అయిదుమాసములు, మేక మాంసముచే ఆరు మాసములు, కూర్మమాంసముచే ఏడుమాసములు, వరాహమాం సముచే ఎనిమిది మాసములు మేషమాంసముచే ఆరు మాసములు, కూర్మమాంసముచే ఏడుమాసములు, వరాహమాంసముచే ఎనిమిది మాసములు మేషమాంసముచే తొమ్మిది మాసములు, మహిష - పర్వత శృగాలమాంసములచే పది మాసములు, గోక్షీర - పాయసములచే సంవత్సరము తృప్తి కులుగును. వర్ధ్రీనసమాంసముచే పండ్రెండు సంవత్సరములు పాటు తృప్తికలుగును. ఖడ్గమృగమాసంము, కాలశాకము, లోహితచ్ఛాగలము, మధువు మహాశల్కము వర్షకాలమున మఘాశ్రాద్ధము ఇవి అక్షయతృప్తి నిచ్చును. మన్త్రాధ్యాయ్యగ్నిహోత్రీ చ శాఖాధ్యాయీ షడఙ్గవిత్. 48 త్రిణాచికేతస్త్రిమధుర్దర్మద్రోణస్య పాఠకః | త్రిసుపర్ణజ్యేష్ఠసామజ్ఞానీ స్యుః పఙ్త్కి పావనాః. 49 కామ్యానాం కల్పమాఖ్యాస్యే ప్రతిపత్సు ధనం బహు | స్త్రియః పరా ద్వితీయాయాం చతుర్థ్యాం ధర్మకామదః. 50 పఞ్చమ్యాం పుత్రకామస్తు షష్ఠ్యాం చ శ్రైష్ఠ్యభాగపి | కృషిభాగీ చ సప్తమ్యామష్టమ్యామర్దలాభకః. 51 నవమ్యాం చైకశఫా దశమ్యాం గోగణో భ##వేత్ | ఏకాదశ్యాం పరీవారీ ద్వాదశ్యాం ధనధాన్యకమ్. 52 జ్ఞాతిశ్రైష్ఠ్యం త్రయోదశ్యాం చతుర్దశ్యాం చ శస్త్రతః | మృతానాం శ్రాద్ధం సర్వాప్తమమావాస్యాం సమీరితమ్. సప్త వ్యాధా దశారణ్య మృగాః కాలఞ్జరే గిరౌ | చక్రవాకాః శరద్వీపే హంసాః సరసి మానసే. 54 తే7పి జాతాః కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః|ప్రస్థితా దూరమధ్వానం యూయం తేభ్యో7వసీదత. 55 శ్రాద్దాదౌ పఠితే శ్రాద్ధం పూర్ణం స్యాద్భ్రహ్మలోకదమ్ | శ్రాద్ధం కుర్యాచ్చ పిత్రాదిః పితుర్జీవతి తత్పితుః. 56 తత్పితుస్తత్పితుః కుర్యాజ్జీవతి ప్రపితామహే | పితుః పితామహస్యాథ పరస్య ప్రపితామహాత్. 57 ఏవం మాత్రాదికస్యాపి తథా మాతామహాదికే | శ్రాద్ధకల్పం పఠేద్యస్తు స లభేచ్ఛ్రాద్దకృత్ఫలమ్. 58 తీర్థే యుగాదౌ మన్వాదౌ శ్రాద్ధం దత్తమథాక్షయయ్ | ఆశ్వయుక్ఛుక్లనవమీ ద్వాదశీకార్తికే తథా. 59 తృతీయా చైవ మాఘస్య తతా భాద్రపదస్య చ | ఫాల్గునస్యా మావాస్యా పౌషసై#్యకాదశీ తథా. 60 ఆషాఢస్యాపి దశమీ మాఘమాసస్య సప్తమీ | శ్రావణ చాష్టమీ కృష్ణా తథాషాఢే చ పూర్ణిమా. 61 కార్తికే ఫాల్గునీ తద్వజ్జ్యేష్ఠే పఞ్చదశీ సితా | స్వాయుమ్భువాద్యా మనవస్తేషామాద్యాః కిలాక్షయాః. 62 గయా ప్రయాగో గఙ్గా చ కురుక్షేత్రం చ నర్మదా | శ్రీపర్వతః ప్రభాసశ్చ శాలగ్రమో వారాణసీ. 63 గోదావరీ తేషు శ్రాద్దం శ్రీపురుషోత్తమాదిషు. ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే శ్రాద్ధకల్పో నామ సప్తదశాధిక శతతమో7ధ్యాయః మంత్రపాఠము చేయువాడు, అగ్నిహోత్రి, శాఖాధ్యయనము చేయువాడు, షడంగవేత్త, త్రిణాచికేతుడు, త్రిమధువు ధర్మ ద్రోణము పఠించునాడు, త్రిసుపర్ణ, బృహత్సామములు తెలిసినవాడు, ఇట్టి బ్రాహ్మణులు పంక్తిపానములు. ఇపుడు కామ్యశ్రాద్ధకల్పమును గూర్చి చెప్పెదను. ప్రతిపత్తునందు శ్రాద్ధము చేయుటచే అధికముగ ధనము లభించును. ద్వితీయయందు శ్రేష్ఠస్త్రీ, చతుర్థియందు ధర్మకామములు, పంచమినాడు పుత్రుడు, షష్ఠియందు శ్రేష్ఠత్వము, సప్తమినాడు వ్యవసాయములో లాభము, అష్టమినాడు ధనము, నవమినాడు గుఱ్ఱములు మొదలగు ఒక డెక్క గల మృగములు, దశమినాడు గోసముదాయము ఏకాదశినాడు పరివారము, ద్వాదశినాడు ధనధాన్యవృద్ధి, త్రయోదశినాడు స్వీయజాతి శ్రేష్ఠత్వము లభించును. చతుర్దశియందు శస్త్రహతులకు మాత్రమే శ్రాద్ధము పెట్టవచ్చును. దశార్ణదేశమునందుండెడు ఏడుగురు వ్యాధులు, కాలంజరగిరిపై మృగములుగాను, శరద్వీపమునందు చక్రవాకములుగాని, మానససరోవరమునందు, హంసలుగాను, అయిరి, వారే ఇపుడు కురుక్షేత్రమునందు వేదపారగతు లైన బ్రహ్మణులైరి. వారు చాలా దూరము దాటివేసినారు. మీరు వారికంటె చాల వెనుకబడి కష్టపడుచున్నారు. శ్రాద్ధసమయమున దీనిని చదువుటచే శ్రాద్ధము పరిపూర్ణమై బ్రహ్మలోకము నిచ్చును. పితామహుడు జీవించి యున్నచో పుత్రాదులు తమ తండ్రికిని, పితామహుని తండ్రికిని, ఆతని తండ్రికిని శ్రాద్ధము పెట్టవలెను. ప్రపితామహుడు జీవించియున్నచో పితృ-పితామహ-వృద్ధప్రపితామహులకు శ్రాద్ధము పెట్టవలెను. మాతృ- మాతామహాది శ్రాద్ధము విషయమునందు గూడ ఇట్లే చేయవలెను. ఈ శ్రాద్ధకల్పమును పఠించువానికి, శ్రాద్ధఫలము లంభించును. ఉత్తమతీర్థములందును, యుగాది-మన్వాదితిథులందును చేసిన శ్రాద్ధము అక్షయము. ఆశ్వినశుక్లనవమి, కార్తికద్వాదశి, మాఘ-భాద్రపదతృతీయలు, పాల్గునఅమావాస్య, పౌషశుక్లైకాదశి, ఆషాఢదశమి, మాఘసప్తమి శ్రావణకృష్ణఅష్టమి, ఆషాడ-కార్తిక-ఫాల్గున-జ్యేష్ఠపూర్ణిమలు,-ఈ తిథులు స్వాయంభువాదిమనువులకు సంబంధించినవి. వీటి ఆది భాగమునందు చేసిన శ్రాద్ధము అక్షయమగును. గయా-ప్రయాగ-గంగా-కురుక్షేత్ర-నర్మదా-శ్రీపర్వత-ప్రభాస-శాలగ్రామతీర్థ-కాలీ-గోదావరీశ్రీపురుషోత్తమక్షేత్రాదులలో చేసిన శ్రాద్ధము ఉత్తమము. అగ్ని మహాపురాణమునందు శ్రాద్ధకల్పవర్ణన మను నూటపదునేడవ అధ్యాయము సమాప్తము.