Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనవింశత్యుత్తర శతతమో7ధ్యాయః

అథ మహాద్వీపాదివర్ణనమ్‌.

అగ్నిరువాచ :

లక్షయోజన విస్తారం జమ్భూద్వీపం సమావృతమ్‌ | లక్షయోజనమానేన క్షారోదేన సమన్తతః. 1

సంవేష్ట్య క్షారముదధిం ప్లక్షద్వీపస్తథా సితః | సప్త మేధాతిథేః పుత్రాః ప్లక్షద్వీపేశ్వరాస్తథా. 2

స్యాచ్ఛాన్తభయః శిశిరః సుఖోదయ ఇతః పరః | అనన్దశ్చ శివః క్షేమో ధ్రువస్తన్నామ వర్షకమ్‌ . 3

మర్యాదాశైలో గోమేధశ్చన్ద్రో నారదదున్దుభీ | సోమకః సుమనాః శైలో వైభ్రాజాస్తజ్జనాః శుభా. 4

నద్యః ప్రధానాః సప్తాత్ర ప్లక్షాచ్ఛాకాన్తికేషు చ | జీవనం పఞ్ఛ సాహస్రం ధర్మో వర్ణాశ్రమాత్మకః. 5

ఆర్యకాః కురువశ్చై వివింశా భావినశ్చతే | విప్రాద్యాసై#్తశ్చ సోమో7ర్య్యో ద్విలక్షశ్చాబ్ధిలక్షకః. 6

మానేనేక్షురసోదేన వృతో ద్విగుణశాల్మలః | వపుష్మతః సప్త పుత్రాః శాల్మలేశా స్తథాభవన్‌. 7

శ్వేతో7థ హరితశ్చైవ జీమూతో లోహితః క్రమాత | వైద్యుతో మానసశ్చైవ సుప్రభో నామ వర్షకః. 8

ద్విగుణో ద్విగుణనైవ సురోదేన సమావృతః | కుముదశ్చానలశ్చైవ తృతీయస్తు బలాహకః. 9

ద్రోణః కఙ్కో7థ మహిషః కకుద్మాన్‌ సప్త నిమ్నగాః | 10

కపిలాశ్చారుణాః పీతాః కృష్ణాః స్యుర్భ్రాహ్మణాదయః.

వాయురూపం యజన్తిస్మ సురోదేనాయ మావృతః |

జ్యోతిష్మతః కుశేశాః స్యురుద్దిదో ధేనుమాన్‌ సుతః .11

ద్వైరథో లమ్బనోధైర్మః కపిలశ్చ ప్రభాకరః | విప్రాద్యా దధిముఖ్యాస్తు బ్రహ్మరూపం యజన్తి తే. 12

విద్రుమో హేమశైలశ్చ ద్యుతిమాన్‌ పుష్పవాంస్తథా | కుశేశయో హరిః శైలో వర్షార్థం మన్దరాచలః. 13

వేష్టితో7యం ఘృతోదేన క్రౌఞ్చద్వీపేన సో7ప్యథ | క్రౌఞ్చేశ్వరా ద్యుతిమతః పుత్రాస్తన్నామ వర్షకాః.14

అగ్నిదేవుడు చెప్పెను: జంబూద్వీపము ఒక లక్ష యోజనముల విస్తారము కలది. అది నలు మూలలందును ఒక లక్ష యోజనముల విస్తారముగల క్షార సముద్రముచే పరవేష్టిత మైనది. ఆ క్షీరసముద్రమును చుట్టి ప్లక్షద్వీప మున్నది. మేధాతిథిపుత్రలు ఏడుగురు ఆ ప్లక్షద్వీపమునకు అధిపతులు. శాంతభయ-శిశిర-సుఖోదయ-ఆనంద-శివ-క్షేమ-ధ్రువులను పేరు గల ఆ ఏడుగురి పేర్లతో ఏడు వర్షము లున్నవి. గోమేధ-చంద్ర-నారద-దుందుభి-సోమక-సుమనస్‌-శైలములను పర్వతములు ఈ వర్షముల మర్యాదాపర్వతములు. అచట వైభ్రాజు లను సుందరులు నివసించుచుందురు. ఈ ద్వీపము నందు ఏడు ప్రధాననదులున్నవి. ప్లక్షద్వీపమునుండి శాకద్వీపమువరకును ఉండు ప్రదేశమున నివసించువారి ఆయుర్దాయము ఐదు వేల సంవత్సరములు, అచట వర్ణశ్రమధర్మములు పాలింపబడుచుండును. ఆర్య-కురు-వివింశ-భావి-అనునవి అచట నుండు బ్రాహ్మణాదులపేర్లు. ఆరాధ్యదేవత చంద్రుడు. ప్లక్షద్వీప విస్తారము రెండు లక్షల యోజనములు. అంతయే ప్రమాణము గల ఇక్షురస సముద్రము దానిన చుట్టి యున్నది. దాని తరువాత నున్నది శాల్మలిద్వీపము. ఇది ప్లక్షద్వీపముకంటె రెట్టింపు ఉండును. వపుష్మంతుని ఏడుగురు కుమారులు-శ్వేత-హరిత-జీమూత-లోహిత-వైద్యుత మానససుప్రభ నామధేయులు ఈ ద్వీపమునకు అధిపతులు. అచట వీరి పేర్లతో ఏడు వర్షము లేర్పడినవి. దానికంటె రెట్టింపు వైశాల్యము గల సురోదసముద్రము దానిని చుట్టి యున్నది. కుముద-అనల-బలాహక-ద్రోణ-కంక-మహిష-కుకుద్మ పర్వతములు దీని మర్యాదాపర్వతములు. ఏడు ప్రధాననదులున్నవి. అచటి బ్రాహ్మణాది వర్ణములకు కపిల-అరుణ-పీత-కృష్ణులని పేరు. అచటివారు వాయుదేవతారాధకులు. దీని తర్వాత కుశద్వీపము జ్యోతిష్మంతుని ఏడుగురు కుమారులు-ఉద్భిదుడు, ధేనుయుతుడు, ద్వైరథుడు, లంబనుడు, ధైర్యుడు, కపిలుడు, ప్రభాకరుడు అనువారు దీని అధిపతులు., వీరి పేర్లతోడనే ఏడు వర్షము లేర్పడినవి. దధి మొదలగువారు ఇచట నుండు బ్రహ్మణాదులు. వీరు బ్రహ్మరూపధారి వయగు విష్ణువును పూజింతురు. విద్రుమ-హేమశైల-ద్యుతిమత్‌-పుష్పవత్‌-కుశేశయ-హరి-మందరాచలమలు ఇచటి వర్షప్రవతములు. ఈ కుశద్వీపము చుట్టి, దానితో సమాన మైన వైశాల్యము గల ఘృతసముద్ర మున్నది. ఈ ఘృతసముద్రమును క్రౌంచద్వీపముపరివేష్టించి యున్నది. ద్యుతిమంతుని కుమారులు ఈ ద్వీపమునకు అధిపతులు వారి పేర్లతోడనే ఇచటి వర్షములు ప్రసిద్ధములైనవి.

కుశలో మనోనుగశ్చోష్ణః ప్రధానో7థాన్దకారకః | మునిశ్చ దున్దుభిః సప్త సప్త శైలాశ్చ నిమ్నగాః. 15

క్రౌఞ్చశ్చ వామనశ్చైవ తృతీయశ్చాన్ధకారకః | దేవావృత్పుణ్డరీకశ్చ దున్దుభిర్ధ్విగుణో మిథః. 16

ద్వీపా ద్వీపేషు యే ళైలా యథా ద్వీపాని తే తథా | పుష్కరాః పుష్కలాధన్యాస్తీర్థా విప్రాదయో హరిమ్‌.

యజన్తి క్రౌఞ్చద్వీపస్తు దధిమణ్డోదకావృతః | సమావృతః శాకద్వీపేన హవ్యాచ్ఛా కేశ్వరాః సుతాః. 18

జలదశ్చ కుమారశ్చ సుకుమార్యో మణీవకః | కుశోత్తరో7థ మోదాకీ ద్రుమస్తన్నామవర్షకాః. 19

ఉదయాఖ్యో జలధరో రైవతః శ్యామకోద్రవౌ | ఆమ్బికేయస్తథా రమ్యః కేసరీ సప్త నిమ్నగాః. 20

మగామగధ మానస్యా మన్దగాశ్చ ద్విజాతయః | యజన్తి సూర్యరూపం తు శాకః క్షీరాబ్దినావృతః. 21

పుష్కరేణావృతః సో7పిద్వౌపుత్రౌ సవనస్య చ మహావీతో ధాతకిశ్చ వర్షే ద్వే నామ చిహ్నితే. 22

ఏకో7ద్రిర్మానసాఖ్యో7త్ర మధ్యతో వలయాకృతిః |

యోజనానాం సహస్రాణి విస్తారోచ్ఛ్రాయతః సమః.23

జీవనం దశసాహస్రం సురైర్బ్రహ్మాత్ర పూజ్యతే | స్వాదూదకేనోదధినా వేష్టితోద్వీపమానతః. 24

హీనాతిరిక్తతా చాపాం సముద్రేషు న జాయతే |

ఉదయాస్తమనేష్విన్దోః పక్షయోః శుక్లకృష్ణయోః. 25

దశోత్తరాణి పంచైవ అజ్గులానాం శతాని వై | అపాం వృద్ధిక్ష¸° దృష్టౌ సాముద్రీణాం మహామునే. 26

స్వాదూదకా బహుగుణా భూర్హైమీ జన్తువర్జితా | లోకాలోకస్తతః శైలో యోజనాయుతవిస్త్రతః. 27

లోకాలోకస్తు తమసా77వృతో7థాణ్డకటాహతః | భూమిః సాణ్డకటాహేన పఞ్చాశత్కోటివిస్తృతా. 28

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మహాద్వీపవర్ణనం నామైకోనవింశత్యధికశతతమో7ధ్యాయః

కుశలుడు, మనోనుగుడు, ఉష్ణుడు ప్రధానుడు, అంధకారకుడు. మతి, దుందుభిఅనువారు ద్యుతిమంతుని ఏడుగురు కుమారులు. ఆ ద్వీపమున ఏడు మర్యాదాపర్వతములు, ఏడు నదులు ఉన్నవి. క్రౌంచ-వామన-అంధకారక-రత్నశైల దేవావృత-పుండరీక-దుందుభులు పర్వతములు. ఈ ద్వీపములు క్రమముగ రెట్టింపువిస్తారము గలవి. పూర్వపూర్వద్వీపముల ప్రమాణము కంటె ఉత్తరోత్తరద్వీపపర్వతముల ప్రమాణము రెట్టింపు ఉండును. అచటి బ్రాహ్మణాది వర్ణములకు వరుసగ పుష్కర-పుష్కల-ధన్య-తిష్యులని పేర్లు. వారు శ్రీమహావిష్ణువును ఆరాధించుచుందురు. క్రౌంచద్వీపమును చుట్టి తక్ర (మజ్జిగ) సముద్రమున్నది. ఆసముద్రమును శాకద్వీపము పరివేష్టించి యున్నది. అచటి రాజైన భవ్యుని ఏడుగురు కుమారులు-జలద-కుమార-సుకుమార-మణీవక-కుశోత్తర-మోదాకి-ద్రుములనువారు, శాకద్వీపపాలకులు. అచటి వర్షములు గూడ వీరి పేర్లతో ప్రసిద్ది పొందినవి. ఉదయగిరి-జలధర-రైవత-శ్యామ-కోద్రక-ఆంబికేయ-కేసరి, అను ఏడు పర్వతమలు, ఏడు నదులు ఉన్నవి. అచట నున్న బ్రాహ్మణాదులకు మగ-మగధ-మానస్య-మందగు అని పేర్లు. వారు సూర్య రూపధారి యగు నారాయణుని అరాధించుచుందురు. శాకద్వీపమును చుట్టి క్షీరసాగర మున్నది.దానిని పుష్కర ద్వీపము పరివేష్టించి యున్నది. అచటి ప్రభు వగు సవనమహారుజునకు మహావాతుడు. ధాతకి అను ఇద్దరు పుత్రులుండిరి అచటి రెండు వర్షములు వారి పేర్లుతో ప్రసిద్ధి చెందినవి. మానసోత్తర మను ఒకే వర్షపర్వతము. వర్షమధ్యమున వలయా కారమున నున్నది. దాని విస్తారము కొన్ని వేల యోజనములు. ఎత్తు విస్తారముతో సమానము. ఆనాటి జనలులు పది వేల సంవత్సరములు జీవింతురు. అచట దేవతలు బ్రహ్మనుపూజింతురు. పుష్కరద్వీపము చుట్టు మధురజలసముద్ర మున్నది. దాని విస్తారము ద్వీపవిస్తారముతో సమానము. మహామునీ! అచట సముద్రజలము పెరుగుట గాని, తరుగుట గాని ఉండదు. శుక్లపక్షములందు చంద్రోదయాస్తమయము లందు సముద్రజలమున కేవలము ఐదువేల పది అంగుళముల జలము పెరుగుట తరుగట కనబడును. తియ్యని నీరు గల సముద్రము నలు వైపులరెట్టింపు మ్రాణము గల సువర్ణమయ భూమి యుండును. కాని అచట ప్రాణు లేవియు ఉండవు. దాని తరువాత లోకాలోకపర్వత మున్నది. దాని వైశాల్యము పది వేల యోజనములు. లోకాలోకపర్వతము ఒక వైపున అంధకారవృతమై యుండును. ఆ అంథకారము అండకటాహముచే అవరింపబడి యున్నది. అండకటాహసహిత మగు మొత్తము భూమి వైశాల్యము ఏబది కోట్ల యోజనములు

అగ్ని మహాపురాణమునందు మహాద్వీపాది వర్ణన మను నూటపందొమ్మిదవఅధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters