Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్వావింశత్యుత్తరశతతమో೭ధ్యాయః. అథ కాలగణనమ్ ః అగ్ని రువాచ : కాలః సమాగణో వక్ష్యే గణితం కాలబుద్ధయే | కాలః సమాగణోర్కఘ్నో మాస్తెశ్చైత్రాదిభిర్యుతః. 1 ద్వి ఘ్నో ద్విష్ఠః సవేదః స్యాత్పఞ్చాష్టాఙ్గయుతో గుణః | త్రిష్ఠో మధ్యో వసుగుణః పునర్వేదగుణశ్చ సః. 2 (అ.మ.పు.) 45 అష్టరన్ధ్రాగ్ని హీనః స్యాదధః సైకరసాష్టకైః | మధ్యో హీనః షష్టిహతో లబ్ధయుక్తస్తథోపరి. 3 న్యూనః సప్తకృతో వారస్తదధస్తిథినాడయః | సుగుణో ద్విగుణశ్చోర్ధ్వం త్రిభిరూనో గుణః పునః. 4 అధః స్వరామసంయుక్తో రసాష్టార్కపలైర్యుతః | అష్టావింశ##చ్ఛేషపిణ్డస్తిథినాడ్యా అధః స్థితః. 5 గుణ స్తిసృభిరూనో7ర్ధం ద్వాభ్యాం చ గుణయేత్పునః | మధ్యే రుద్రగుణః కార్యో హ్యధః సైకో నవాగ్నిభిః. 6 లబ్ధహీనోభ##వేన్మధ్యో ద్వావింశతివిర్జితః | షష్టిశేషే బుణం జ్ఞేయం లబ్ధమూర్ధ్వం వినిక్షిపేత్. 7 సప్తవింశతిశేషస్తు ధ్రువో నక్షత్రయోగయోః | మాసి మాసి క్షిపేద్వారం ద్వాత్రింశద్ఘటికాస్తిథౌ. 8 ద్వేపిణ్డ ద్వే చ నక్షత్రే నాడ్య ఏకాదశ హ్యృణ | వారస్థానే తిథిం దద్యాత్సప్తభిర్భాగమాహరేత్. 9 శేషవారాశ్చ సూర్యాద్యా ఘటికాసు చ పాతయేత్ | పిణ్డ కేషు తిథిం దద్యాద్ధరేచ్చైవ చతుర్దశ. 10 అగ్నిదేవుడు పలికెను :- మహామునీ! ఇపుడు సంత్సరసముదాయరూప మగు కాలమును గూర్చి చెప్పెదను. కాలమును గూర్చి తెలుసుకొనుటకై గణితమును చెప్పెదను (బ్రహ్మదినాది కాలమునుండి గాని, సృష్ట్యా రంభకాలమునుండి గాని, లేదా నిర్ణీత మైన శకప్రారంభమునుండి గాని) వర్షసముదాయమును పండ్రెండు (12)చే గణించవలెను. దానితో గడచిన చైత్రాది మాసముల సంఖ్య చేర్చవలెను. దానిని రెండుచే గుణించి రెండు స్థానములందుంచుకొనవలెను. ప్రథమస్థానము నందు నాలుగు కలుపవలెను. ద్వితీయ స్థానమునందు ఎనిమిదివందల అరువదియైదు (865) కలుపవలెను. ఈ విధముగ ఏర్పడిన రెండు అంకములకు సుగుణములనిపేరు. దానిని మూడుస్థానములందుంచవలెను. వాటిలోమధ్యనున్న దానిని ఎనిమిదిచే గుణించి మరల నాలుగుచే గుణించవలెను. ఈ విధముగ మధ్యనున్న దాని సంస్కారముచేసిగోమాత్రికా క్రమమునఉంచబడిన మూడింటిని యథాస్థానముగ కూడవలెను. మొదటిదానిని ఊర్ధ్వమనియు, రెండవస్థానమున నున్న దానిని మధ్యమనియు, తృతీయస్థానమున ఉన్నదానిని అధః అనియు పేర్లతో ఉంచుకొనవలెను. అధోంకమునుంచి 388, మధ్యాంకమునుంచి 87 తీసివేయవలెను. పిదప దానిని 60చే విభజించి శేషమును వేరుగాఉంచుకొనవలెను. పిదప లబ్ధమును తరువాతి అంకముతోకలిపి 60తో భాగించపలెను. ప్రథమ స్థానాంకమును 7చే భాగించగా శేషించిన సంఖ్యను అనుసరించి రవ్యాదివారములు వచ్చును. మిగిలిన రెండు స్థానముల అంకములు తిథిధ్రువ లగును 'సగుణ'మును రెండుచే గుణించి, దానినుండి మూడు తీసివేసి, దానిక్రింద సగుణము వ్రాసి దానికి 30 కలపవలెను. పిదప 6; 12; 8; అంకములను మూడు స్థానములందును కలపవలెను. మరల 60 చే భాగించి ప్రథమస్థానమును 28చే భాగించి శేషమును వ్రాయవలెను. దాని క్రింద పూర్వానీత తిథిధ్రువను వ్రాయవలెను. అన్నింటిని కలపగా ధ్రువ ఏర్పడును. మరల ఆ సగుణమునే చేయవలెను. దానిలో మూడు తీసివేసి రెండుచే గుణించవలెను. మధ్యను పదకొండుచే గుణించి. క్రింద ఒకటి కలపవలెను. ద్వితీయస్థానమునందు 39తో భాగించి, లబ్ధమును ప్రథమస్థానమున తగ్గించవలెను. దానికే మధ్య మని పేరు. మధ్యయందు 22 తీసివేయవలెను. దానిని 60చే భాగించగా శేషము బుణము. లబ్ధిని ఊర్ధ్వమునందు, అనగా నక్షత్రధ్రువయందు కలపవలెను. 27చే భాగించగా శేషము నక్షత్ర-యోగముల ధ్రువ అగును. ఇపుడు తిథినక్షత్రముల మాసిక ధ్రువ చెప్పబడుచున్నది. (2-32-00) ఇది తిథిధ్రువ (2-11-00) ఇది నక్షత్రద్రువ. ఈ ధ్రువమును ప్రతి మాసమునందును జోడించి, వారస్థానమున ఏడుచే భాగించి, శేషమును వారమునందు తిథియొక్క దండపలముగా గ్రహించవలెను. నక్షత్రముకొరకు 27 చే భాగించి. అశ్విని నుండి శేషసంఖ్య గల నక్షత్రముయొక్క దండాదిగా. గ్రహించవలెను. బుణం ధనం ధనమృణం క్రమాద్దేయం చతుర్దశీ | ప్రథమే త్రయోదశే పఞ్చ ద్వితీయే ద్వాదశే దశ. 11 పఞ్చదశ స్తృతీయే చ తథా చైకాదశే స్మృతమ్ | చతుర్థే దశ##మే చైవ భ##వేదేకోనవింశతిః. 12 పఞ్చమే నవమే చైవ ద్వావింశతిరుదాహృతాః | షష్ఠాష్టమే త్వఖణ్డాః స్యుశ్చతుర్వింశతిరేవ చ. 13 సప్తమే వఞ్చవింశః స్యాత్ఖణ్డశః పిణ్డకాద్భవేత్ | కర్కటాదౌ హరేద్రాత్రిమృతువేదత్రయైః క్రమాత్. 14 తులాదౌ ప్రాతిలోమ్యేన త్రయో వేదరసాః క్రమాత్ | మకరాదౌ దీయతే చ రసవేదత్రయః క్రమాత్. 15 మేషాదౌ ప్రాతిలోమ్యేన త్రయో వేదరసాః క్రమాత్ | ఖేషవః సయుగా మైత్రం మేషాదౌ వికలా ధనమ్. 16 కర్కటే ప్రాతిలోమ్యం స్యాదృణమేతత్తులాదికే | చతుర్గుణా తిథిర్జేయా వికలాశ్చే హ సర్వదా. 17 హన్యాల్లిప్తా గతాగామిపిణ్డసంఖ్యాపలాన్తర్తెః | షష్ట్యాప్తం ప్రథమోచ్చార్యే హానౌ దేయం ధనే ధనమ్. 18 ద్వితీయోచ్చారితే వర్గే వైపరీత్యమితి స్థితిః | తిథిర్ద్విగుణితా కార్యా షడ్భాగపరివర్జితా. 19 రవికర్మవిపరీతా తిథినాడీ సమాయుతా | ఋణ శుద్ధే తు నాడ్యః స్యురృణం శుద్ధం తు నో యదా. 20 సషష్టికం ప్రదేయం తత్ షష్ట్యాధిక్యే చ తత్త్యజేత్ | నక్షత్రం తిథిమిశ్రం స్యాచ్చతుర్భిర్గుణితాతిథిః. 21 తిథిస్త్రిభాగసంయుక్తా హ్యృణన చ తథాన్వితా | తిథిరత్ర చితా కార్యా తదేతద్యోగశోధనమ్. 22 రవిచన్ద్రౌ సమౌ కృత్వా యోగో భవతి నిశ్చలః | ఏకోనా తిథిర్ద్విగుణా సప్తభిన్నాకృతిర్ద్విధా. 23 ప్రథమే తిథ్యర్ధతో హి కింస్తుఘ్నం ప్రతిపన్ముఖే. ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే కాలగణనం నామ ద్వావింశత్యధిక శతతమో7ధ్యాయః. (పైన చెప్పిన విధముగ తిథ్యాదిమానము మధ్యమానమును అనుసరించి నిశ్చయింపబడినది. దానిని స్పష్టము చేయుటకై సంస్కారమును చెప్పుచున్నాడు.) చతుర్దశ్యాదితిథులందు చెప్పిన ఘటికలను క్రమముగా బుణ-ధనములుగాను చేసికొనవలెను. చతుర్దశియందు శూన్యఘటిని, త్రయోదశీ-ప్రతిపత్తులందు ఐదు ఘటికలను క్రమముగా బుణముగాను, ధనముగాను చేయవలెను. ద్వాదశీ-ద్వితీయలయందు పది ఘటికలు ఋణధనములుగా చేయవలెను. తృతీయైకాదశులందు 15 ఘటికలు, చతుర్థీదశములందు 19 ఘటికలు, పంచమీ-నవములందు 22 ఘటికలు, షష్ఠీ-అష్టములందు 24 ఘటికలు, సప్తమియందు 25 ఘటిలకు ధన-ఋణసంస్కారము చేయవలెను. ఈ అంశాత్మకఫలమును చతుర్దశ్యాదితిథిపిండమునందు చేయవలెను. కర్కటకాదిరాశిత్రయమునందు 6; 4; 3, తులాదిరాశిత్రయమునందు 3, 4, 6, సంస్కారము చేయుటకై 'ఖండ' ఏర్పడును. మేషాదిరాశిత్రయమునందు 50, 40, 12లను ధనము చేయవలెను. కర్కటకాది రాశిత్రయమునందు 12, 40, 50లు చేయవలెను. తులాదిరాశిషట్కమునందు వీటితో బుణసంస్కారము చేయవలెను. చతుర్గుణిత మగు తిథియందు వికలాత్మకఫలసంస్కారము చేయవలెను. 'గత' 'ఏష్య' ఖండల అంతరముచే కలను గుణించవలెను. 60 చే భాగించవలెను. లబ్ధము ప్రథమోచ్చారమునందు బుణఫలమైనను, ధనము చేయవలెను. ధనమైనచో ధనముగనే ఉంచవలెను. ద్వితీయోచ్చారితవర్గ మున్నప్పుడు విపరీతము చేయవలెను. తిథిని రెట్టించి దాని ఆరవభాగమును దాని నుంచి తీసివేయవలెను. సూర్యసంస్కారమునకు విపరీతముగ తిథిదండమును కలపవలెను. బుణఫలమును తగ్గించగా తిథిదండాదిమాన మేర్పడును, బుణఫలము తీసివేయ వీలుకానిచో దానియందు 60 కలిపి సంస్కారము చేయవలెను. ఫలమే 60 కంటె అధికమైనచో దానిలోనుండి 60 తీసివేసి మిగిలినదాని సంస్కారము చేయవలెను. దానిచే తిథితోపాటు నక్షత్రమానము కూడ ఏర్పుడును. చతుర్గుణిత మగు తిథియందు తిథిత్రిభాగమును కలిపి దానికి బుణఫలము కూడ కలపవలెను. తష్టితము చేయగా యోగమానము వచ్చును. తిథిమానము స్పష్టమే. లేదా సూర్యచంద్రయోగము చేసికూడ యోగమానము సాధించవచ్చును. తిథిసంఖ్యనుండి ఒకటి తీసివేసి, దానిని రెట్టించి, మరల ఒకటి తీసివేయగా చరాదికరణము లేర్పడును. కృష్ణపక్ష చతుర్దశి పరార్ధమునుండి శకుని, చతుష్పదము, కింస్తుఘ్నము, నాగము అను నాలుగు స్థిర కరణములు వచ్చును. శుక్లపక్షప్రతిపత్పూర్వార్దమున కింస్తుఘ్నకరణ ముండును. అగ్ని మహాపురాణమునందు కాలగణన మను నూటఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.