Sri Madhagni Mahapuranamu-1    Chapters   

éఅథ ఏకత్రింశదధికశతతమో7ధ్యాయః

అథ ఘాతచక్రాదివర్ణనమ్‌.

ఈశ్వర ఉవాచ:

ప్రదక్షిణమకారాదీన్స్వరాన్వూర్వాదితో లిఖేత్‌ | చైత్రాద్యం భ్రమణాచ్చక్రం ప్రతిపత్పూర్ణిమాతిధిః. 1

త్రయోదశీ చతుర్దశీ హ్యష్టమ్యేకా చ సప్తమీ | ప్రతిపత్త్రయోదశ్యన్తాస్తిథయో ద్వాదశ స్మృతాః. 2

చైత్రచక్రేతు సంస్పర్శాజ్జయలాభాదికం విదుః | విషమే తు శుభం జ్ఞేయం సమే చాశుభమీరితమ్‌. 3

యుద్ధకాలే సముత్పన్నే యస్య నామ హ్యుదాహృతమ్‌|

మాత్రారూఢం తు తన్నామ హ్యాదితో గురురేవ చ.

జయస్తస్య సదా కాలం సంగ్రామే చైవ భీషణ | హ్రస్వనామ యదా యోధో మ్రియతే హ్యనివారితః. 5

ప్రథఘో దీర్ఘ ఆదిస్థో ద్వితీయే మధ్యే హ్యన్తకః | ద్వౌమధ్యేన ప్రథమాన్తౌ జాయేతే నాత్ర సంశయః. 6

పునశ్చాన్తే యదా చాదౌ స్వరారూఢం తు దృశ్యతే | హ్రస్వస్య మరణం విద్యాద్ధీర్ఘసై#్యవ జయో భ##వేత్‌. 7

నరచక్రం ప్రవక్ష్యామి హ్యృక్షపిణ్డాత్మకం యథా | ప్రతిమామాలిఖేత్పూర్వం పశ్చాదృక్షాణి విన్యసేత్‌. 8

శీర్షే త్రీణి ముఖే చైకం ద్వే ఋక్షే నేత్రయోర్న్యసేత్‌ |

వేదసంఖ్యాని హస్తాభ్యాం కర్ణే హ్యృక్షద్వయం పునః 9

హృదయే భూతసంఖ్యాని షడృక్షాని తు పాదయోః |

నామ హ్యా%ృక్షం స్ఫుటం కృత్వా చక్రమధ్యేతు విన్యసేత్‌. 10

నేత్రే శిరోదక్షకర్ణే యామ్యహస్తే చ పాదయోః | హృద్గ్రీవావామహస్తే తు పునర్గుహ్యే తు పాదయోః. 11

యస్మిన్‌ ఋక్షే స్థితః సూర్యః సౌరిర్భౌమన్తు సైంహికః| తస్మిన్‌ స్థానే స్థితే విద్యాద్ఘాతమేవ న సంశయః.

పరమేశ్వరుడు చెప్పెను: పూర్వాదిదిక్కులందు ప్రదక్షిణ క్రమమును అకారాది స్వరములు వ్రాయవలెను. దాని యందు శుక్లపక్షప్రతిపత్తు పూర్ణిమ, త్రయోదశి, చతుర్దశి, శుక్లపక్షాష్టమి మాత్రము, సప్తమి, కృష్ణపక్షపతిపత్తు మొదలు త్రయోదశి వరకు (అష్టమి విడచి) పండ్రెండు తిథుల న్యాసము చేయవలెను. ఈ చైత్రచక్రమునందు పూర్వాదిదిశలో స్పర్శవర్ణములను వ్రాయుటచే జయపరాజయములను గూర్చియు లాభమును గూర్చియు నిర్ణియంచవచ్చును, విషమదిక్కు, విషమస్వరము, విషమవర్ణము ఆయినతో శుభ మగును. అది సమములైనచో అశుభ మగును. యుధ్ధారంభసమయమునందు సేనాపతి మొదట ఎవరి పేరు పెట్టి పిలుచునో అతని పేరు దీర్ఘాక్షరముతో ప్రారంభ మైనచో ఘోరసంగ్రామమునందు గూడ వానికి (సేనాపతికి) విజయము కలుగును. పేరు హ్రస్వాక్షరముతో ప్రారంభ మైనచో తప్పక మృత్యువు కలుగును. ఉదాహరణమునకు ఒకని పేరు ఆదిత్యుడు మరి యొకని పేరు గురుడు. వీటిలో మొదటి పేరు మొదటి అక్షరము ఆ' దీర్ఘము రపెండవ పేరు మొదటి అక్షరము హ్రస్వము. అందుచేత అద్యక్షరము దీర్ఘాక్షరముగా గల పేరు గలవానిని పిలచినచో మృత్యువు కలుగును. నక్షత్రపిండమునుబట్టి పరచక్రమును గూర్చి చెప్పెదను. మొదలు ఒక మనుష్యుని ఆకారము తయారు చేయవలెను. దానిపై నక్షత్రముల న్యాసము చేయవలెను సూర్యనక్షత్రము మొదలుగా నామనక్షత్రము వరకు లెక్క పెట్టవలెను. మొదటి మూడింటిని శిరస్సు పైనను, ఒకటి ముఖముపైనను, రెండు నేత్రములందును, నాలుగు చేతులపైనను, రెండు చెవులపైనను, ఐదు హృదయముపైనను, ఆరు పాదములపైనను, వ్రాయవలెను. నామక్షత్రమును స్పష్టముగ చక్రమఢ్యమున వ్రాయవలెను. ఇట్లు వ్రాసిన పిమ్మట నేత్ర-శిరో-దక్షిణహస్త-పాద-హృదయ-కంఠ నామహస్తగుహ్యాంగములందు ఎచట శని-కుజ-రవి-రాహు నక్షత్రములుండునో ఆ అవయములపై యుద్ధమునందు దెబ్బతగులును.

జయచక్రం ప్రవక్ష్యామి ఆదిహాన్తాంశ్చ వై లిఖేత్‌ | రేఖాస్త్రయోదశాలిఖ్య షడ్రేఖాస్తిర్యగాలిఖేత్‌. 13

దిగ్గ్రహా మునయః సూర్యా ఋత్విగ్రద్రస్థితిః క్రమాత్‌ | మూర్ఛనాస్మృతివేదర్‌క్షజినా అకడమా హ్యధః 14

ఆదిత్యాద్యాః సప్త హృతే నామాన్తా బలినో గ్రహాః | ఆదిత్యసౌరిభౌమఖ్యా జయే సౌమ్యాశ్చ సన్దయే. 15

రేఖా ద్వాదశ చోద్దృత్య షట్చ యామ్యాస్తథో త్తరాః మనుశ్చైవ తుఋక్షాణి నేత్త్రే చ

రవిమణ్డలమ్‌. 16

తిథయశ్చ రాసా వేదా అగ్నిః సప్త దశాథ వా | వసురన్ద్రాః సమాఖ్యాతా అకటపానధో న్యసేత్‌. 17

ఏకైకమక్షరం న్యస్య శేషాణ్యవం క్రమాన్న్యసేత్‌ | నామాక్షరకృతం పిణ్డం వసుభిర్భాజయేత్తతః. 18

వాయసాన్మణ్డలో7త్యుగ్రో మణ్డలాద్రాసఖో వరః | రాసభాద్వృషభః శ్రేష్ఠో వృషభాత్కుఞ్జరో వరః. 19

కుఞ్జరాచ్చ పునః సింహాః సింహాచ్చైవ ఖరుర్వరః | ఖరోశ్చైవ బలీ ధూమ్ర ఏవమాది బలాబలమ్‌. 20

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ఘాతచక్రాదికం నామైకత్రింశదధిక శతతమో7ధ్యాయః

తూర్పునుండి పశ్చిమమునకు పదమూడు రేఖలు గీసి ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డగీతలు గీయవలెను. దానిపై అ నుండి '' వరకు అక్షరములు వ్రాసి, 10, 9, 7, 12, 4, 11, 15, 24, 18, 4, 27, 24 అంకెలను కూడ వేయవలెను. అంకెలు అకారద్యక్షముల పైన ఉండునట్లు వ్రాయవలెను, శత్రునామము నందలి స్వర-వ్యంజనములకు ఎదురుగా అంకెలు కూడి పిండము (మొత్తము) చేయవలెను. దానిని ఏడుచే భాగించగా మిగిలిన ఒకటి మొదలగు దానిని బట్టి సూర్యాదిగ్రహముల భాగలను తెలిసికొనవలెను. శేషము 1సూర్యుడు; 2చంద్రుడు; 3కుజుడు; 5గురుడు; 6 శుక్రుడు; 7 శని- వీరి భాగము లగును రవి-శని-కుజ భాగములు వచ్చినచో జయము కలుగును. శుభగ్రహభాగ మైనచో సంధి కుదురును. తూర్పునుండి పశ్చిమమువరకు పండ్రెండు రేఖలు గీయవలెను. ఆరు లేఖలుఉత్తరదక్షిణముగ వ్రాయవలెను. దీని పై కోష్ఠమున 14, 27, 12, 15, 6, 4, 3, 17, 8, 8 అంకెలు వ్రాసి కోష్టములందు అకారాదిస్వరములు మొదలు హవరకు నుండు అక్షరములు వ్రాయవలెను. పిదప పేరు లోని అక్షరములు ద్వార ఏర్పడిన మొత్తమును ఎనిమిదిచే భాగించి, ఏకాదిశేషమును బట్టి వాయస - మండల-రాసభ-వృషభ-కుంజర-సింహా-ఖర- ధూమ్రములను భాగనామములు అగును, వీటిలో వాయసముకంటె మండలము, దానికంటె రాసభము-ఈ విధముగ పూర్వముకంటె ఉత్తరోత్తరము బలీయము.

అగ్నిమహాపురాణమునందు ఘాతచక్రాది వర్ణన మను నూటముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters