Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ అష్టచత్వారింశదు త్తరశతతమో7ధ్యాయః. అథ సంగ్రామవిజయపూజాః. ఈశ్వర ఉవాచ : ఓం డే ఖ ఖ్యాం సూర్యాయ సంగ్రామవిజయాయా నమః హ్రాం హ్రీం హ్రూం హ్రేం హ్రోం హ్రః షడజ్గాని తు సూర్యస్య సంగ్రామే జయస్య హి. ఓం హం ఖం ఖఖోల్కాయ స్వాహా. స్ఫూం హూం హుం క్రూం. ఓం హోం క్రేం ప్రభూతం విమలం సారమారాధ్యం పరమం సుఖమ్. 1 ధర్మజ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యాద్యష్టకం యజేత్ | అనన్తాసనం సింహాసనం వద్మాసనమతః పరమ్. 2 కర్ణికాకేసరాణ్యవ సూర్యసోమాగ్నిమణ్డలమ్ | దీప్తా సూక్ష్మా జయా భద్రా విభూతిర్విమలా తథా. 3 అమోఘా వైద్యుతా పూజ్యా నవమీ సర్వతోముఖీ | సత్త్వం రజస్తమళ్చైవప్రకృతిం పురుషం తథా. 4 ఆత్మానం చాన్తరాత్మానం పరమాత్మానమర్చయేత్ | సర్వే బిన్దుసమాయుక్తా మాయానిలసమన్వితాః. 5 ఉషాప్రభాచసన్ద్యా చ సాయా మాయా బలాన్వితా | బిన్దువిష్టుసమాయుక్తా ద్వారపాలాస్తథాష్టకమ్. 6 సూర్యం చణ్డం ప్రచణ్డం చ పూజాయేద్గన్దకాదిభిః | పూజయా జపహోమాద్త్యెర్యుద్దాదౌ విజయో భ##వేత్. 7 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్దజయార్ణవే సంగ్రామవిజయపూజానామాష్ట చత్వారింశదధికశతతమో7ధ్యాయః పరమేశ్వదుడు పలికెను:- ఓం డే ఖ ఖ్యాం సూర్యాయ సంగ్రామ విజయాయనమః-ఇది మంత్రము. హ్రాం హ్రీం హ్రః ఇవి సంగ్రామమునందు విజయము నిచ్చు సూర్యుని ఆరు అంగములు. ఓం హం ఖం ఖఖోల్కాయ స్వాహా ఇది పూజామంత్రము. స్ఫూం హ్రూం హుం క్రూం ఓం హ్రోం క్రేం ఇవి అంగన్యాస బీజమత్రములు. పీఠస్థానమున ప్రభూత- విమల-సార-ఆరాధ్య పరమసుఖములను పూజించవలెను. పిఠపాదములందును, మధ్యనున్న నాల్గుదిక్కులందును వరుసగా ధర్మ-జ్ఞాన-వైరాగ్య-ఐశ్వర్మ-అధర్మ-అజ్ఞాన-అవైరాగ్య-అనైశ్వర్యములను పూజించవెలను. పిదప అనంతాసన-సింహా సన-పద్మాసనములను పూజించి కమలకర్ణికను, కేసరములను, అచ్చటనే సూర్యమండల-సోమమండల -వహ్నిమండలమును అర్చించి, దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, విమల, ఆమోఘ, విద్యత, సర్వతోముఖీ అను నవశక్తులను పూజించవలెను. పిదప సత్త్వ-రజస్ - తమస్సులను, ప్రకృతి-పురుషులను, ఆత్మాంతరాత్మ పరమాత్మలను పూజించవలెను. ఆద్య క్షరమును అనుస్వారయుక్తము చేసి ఆంతమున నమః చేర్చి చతుర్థ్యంతము చేయగా పూజామంత్రము లగును. (ఉదా. సం సత్త్వాయ నమః మొ.) ఉష, ప్రభ, సంధ్య, సాయా, మాయా, బల, బిందు, విష్ణువులను, ఎనమండుగురు ద్వారపాలులను పూజించి, గంధాదులతో సూర్య-చండ-ప్రచండులను పూజించవలెను. ఈ విధముగ పూజా-జప-హోమాదులు చేయుటచే యుద్ధాదులందు జయము కలుగును. అగ్నిమహాపురాణమునందు సంగ్రామ విజయదాయక సూర్యపూజావర్ణమన మను నూటనలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.