Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకషష్ట్యధిక శతతమోధ్యాయః

అథ యతిధర్మ నిరూపణమ్‌ :

పుష్కర ఉవాచ :

యతిధర్మం ప్రవక్ష్యామి జ్ఞానమోక్షాది దర్శకమ్‌ | చతుర్థమాయుషో భాగం ప్రాప్య సఙ్గాత్పరివ్రజేత్‌. 1

యదహ్ని విరజేద్ధీరస్తదహ్ని చ పరివ్రజేత్‌ | ప్రాజాపత్యం నిరూప్యేష్టిం సర్వవేదసదక్షిణామ్‌. 2

ఆత్మన్యగ్నీన్సమారోప్య ప్రవ్రజేద్బ్రాహ్మణో గృహాత్‌ | ఏక ఏవ చరేన్నిత్యం గ్రామమన్నార్థమాశ్రయేత్‌. 3

ఉపేక్షకోసఞ్చయకో మునిర్జానసమన్వితః| కపాలం వృక్షమూలం చ కుచైలమసహాయతా. 4

సమతా చైవ సర్వస్మిన్నేతన్ముక్తస్య లక్షణమ్‌ | నాభినన్దేత మరణం నాభినన్దేత జీవనమ్‌. 5

కాలమేవ ప్రతీక్షేత నిదేశం భృతకో యథా | దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్‌. 6

సత్యపూతాం వదేద్వాచం మనః పూతం సమాచరేత్‌| అలాబుదారుపాత్రాణి మృణ్మయం వైణవం యతేః. 7

విధూమే న్యస్తముసలే వ్యఙ్గారే భుక్తవజ్జనే| వృత్తే శరావసంపాతే భిక్షాం నిత్యం యతిశ్చరేత్‌. 8

మధూకరమసంక్లప్తం ప్రాక్ప్రణీతమయాచితమ్‌ | తాత్కాలికం చోపపన్నం భైక్షం పఞ్చవిధం స్మృతమ్‌. 9

పాణిపాత్రీ భ##వేద్వాపి పాత్రే పాత్రాత్సమాచరేత్‌ | అవేక్షేత గతిం నౄణాం కర్మదోషసముదృవామ్‌. 10

శుద్ధభావశ్చరేద్ధర్మం యత్ర తత్రాశ్రమే రతః| సమః సర్వేషు భూతేషు న లిఙ్గం ధర్మకారణమ్‌. 11

ఫలం కతకవృక్షస్య యద్యప్యమ్బుప్రసాదకమ్‌ | న నామగ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి. 12

అజిహ్మః పణ్డకః పఙ్గురన్ధో బధిర ఏవ చ | సద్బిశ్చముచ్యతేసద్భిరజ్ఞానాత్సంసృతో ద్విజః. 13

అహ్ని రాత్య్రాం చ యాన్‌ జన్తూన్‌ హీనస్త్వజ్ఞానతో యతిః |

తేషాం స్నాత్వా విశుద్ధ్యర్థం ప్రాణాయామాన్‌ షడాచరేత్‌. 14

అస్థిస్థూణం స్నాయుయుతం మాంసశోణితలేపనమ్‌ | చర్మావనద్ధం దుర్గన్ధపూర్ణం మూత్రపురీషయోః. 15

జరాశోకసమావిష్టం రోగాయతనమాతురమ్‌ | రజస్వలమనిత్యం చ భూతావాసమిమం త్యజేత్‌. 16

పుష్కరుడు పలికెను : జ్ఞానమోక్షాది ప్రదర్శక మగు యతిధర్మమును చెప్పెదను. ఆయుర్దాయములోని నాల్గవభాగములోనికి రాగానే సంన్యసించవలెను. ధీరుడు ఏ రోజున వైరాగ్యము కలుగునో ఆ రోజునే సంన్యసించవలెను.

(అ) 55

సర్వవేదసదక్షిణ మగు ప్రాజాపత్యేష్టి నిర్వర్తించి, అగ్నులను తనలోనే ఆరోపించుకొని బ్రాహ్మణుడు గృహమునుండి నిష్క్రమించవలెను. ఒంటరిగానే సంచరించవలెను. అన్నముకొరకు మాత్రమే గ్రామములోనికి ప్రవేశించవలెను. సంన్యాసి ఏది వచ్చినను ఉపేక్షాబుద్ధితో చూచుచు, ధనాదికమును కూడబెట్టక, జ్ఞానసమన్వితుడై ఉండవలెను. చేత కపాలము, వృక్షమూలనివాసము, మాసిన వస్త్రము, ఏకాకిత్వము, సర్వసమదృష్టి - ఇవి ముక్తుని లక్షణములు. మరణమును అభినందించ గూడదు; జీవనమును గూడ అభినందించగూడదు. భృత్యుడు ప్రభ్వాజ్ఞకై ఎదురు చూచుచున్నట్లు కాలమునకై ఎదురు చూచుచుచుండవలెను. క్రింద చూచుకొని అడుగు పెట్టవలెను. వస్త్రముతో వడబోసిన నీరు త్రాగ వలెను. సత్యముచే పవిత్ర మైన మాటలే పలకవలెను. మనస్సుచేత పవిత్ర మైనదానిని ఆచరించవలెను. ఆనపకాయ బుర్ర, దారుపాత్ర, మట్టిపాత్ర, వెదురు పాత్ర - ఇవి సంన్యాసికి విధింపబడినవి. యతీశ్వరుడు ఎల్లపుడును గ్రామములోని ఇండ్లలో ధూమము శాంతించిన పిమ్మటను, రోకళ్ళు ఆగిపోయినపుడును, నిప్పులు ఆర్పివేయబడిన పిమ్మటను, జనులందరును భోజనము చేసిన పిమ్మటను పాత్రలు కడిగివేసిన పిమ్మటను భిక్షకు బైలుదేరవలెను. మాధుకరము (అనేక గృహములనుండి కొంచెము కొంచెము సంగ్రహింపబడినది), అసంక్లప్తము (ముందుగా అనుకొని తయారు చేయబడనిది), ప్రాక్రృణీతము (ముందుగా తయారుచేబడినది) అయాచితము, తాత్కాలికోపపన్నము (అప్పటి కప్పుడు లభించినది) అని భైక్షము ఐదు విధములు. హస్తములే పాత్రగా ఉపయోగించవలెను. లేదా మరి యొక పాత్ర నుండి హస్తపాత్రలోనికి తీసికొనవలెను. కర్మదోషముల వలన ప్రాణులు ఏ ఏ విధముల బాధపడుచున్నారో గమనించవలెను. ఏ ఆశ్రమములో నున్నను మానవుడు పరిశుద్ధ చిత్తముతో ధర్మాచరణము చేయవలెను; అన్ని భూతములందును సమదృష్టి చూపవలెను. అంతియే కాని ఆశ్రమలింగములను ధరించినంత మాత్రమున ప్రయోజనము లేదు. కతకవృక్షఫలము (ఇందుపకాయ) నీటిలోని బుదరను తొలగించి దానిని నిర్మలము చేయు నను మాట నిజమే; కాని దాని పేరు చెప్పినంతమాత్రమున నీరు ప్రసన్నముకాదు కదా? అజ్ఞానవశముచే సంసారములో చిక్కుకొనిన ద్విజుడు కుంటివా డైనను, గ్రుడ్డివా డైనను, చెవిటివాడైనను, కుటిలత్వము లేని సంన్యాసి యైపచో - సత్కర్మల నుండియు, అసత్కర్మల నుండియు విముక్తుడగును. సన్యాసి పగటియందును, రాత్రియందును తనచే చంపబడిన ప్రాణుల విశుద్ధికై స్నానము చేసి ఆరు ప్రాణాయామములు చేయవలెను. ఎముక లనెడు స్తంభములు గలదియు, నాడులతో కూడినదియు, మాంసశోణితములచే పూయబడినదియు, చర్మముచే కప్పబడినదియు, మూత్రపురీషదుర్గంధముతో నిండినదియు, జరాశోకములతో కూడినదియు, అనిత్యముమ, జీవునికి నివాసమును అగు ఈ శరీరమును త్యజించవలెను.

ధృతిః క్షమా దమోస్తేయం శౌచమిన్ద్రియనిగ్రహః | హ్రీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్‌.

చతుర్విధా భిక్షవస్తు కుటీచక బహూదకౌ | హంసః పరమహంసశ్చ యో యః పశ్చాత్స ఉత్తమః. 18

ఏకదణ్డీ త్రిదణ్డీ వా యోగీ ముచ్యేత బన్ధనాత్‌ | అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ. 19

యమాః పఞ్చాథ నియమాః శౌచం సంతోషణం తపః | స్వాధ్యాయేశ్వరపూజా చ పద్మకాద్యాసనం యతేః.

ప్రాణాయామస్తు ద్వివిధః సగర్భోగర్భ ఏవ చ | జపధ్యానయుతో గర్భో విపరీతస్త్వగర్భకః. 21

ప్రత్యేకం త్రివిధః సోపి పూరకుమ్భకరేచకైః | పూరణాత్పూరకో వాయోర్నిశ్చలత్వాచ్చ కుమ్భకః. 22

రేచనాద్రేచకః ప్రోక్తో మాత్రాభేదేన చ త్రిధా | ద్వాదశాత్తు చతుర్వింశః షట్త్రింశన్మాత్రికోపరః. 23

తాలో లఘ్వక్షరో మాత్రా ప్రణవాది చరేచ్ఛనైః | ప్రత్యాహారో జాపకానాం ధ్యానమీశ్వరచిన్తనమ్‌. 24

మనోధృతిర్ధారణా స్యాత్సమాధిర్బ్రహ్మణి స్థితిః | అయమాత్మా పరం బ్రహ్మ సత్యం జ్ఞానమనన్తకమ్‌. 25

విజ్ఞానమానన్దం బ్రహ్మ తత్త్వమస్యమహస్మి తత్‌ | పరం బ్రహ్మ జ్యోతిరాత్మా వామదేవో విముక్త ఓమ్‌.

దేహేన్ద్రియమనోబుద్ధిప్రాణాహఙ్కారవర్జితమ్‌ | జాగ్రత్స్వప్నసుషుప్త్యాదిముక్తం బ్రహ్మ తురీయకమ్‌. 27

నిత్యశుద్ధబుద్ధముక్తసత్యమానన్దమద్వయమ్‌ | అహం బ్రహ్మ పరం జ్యోతిరక్షరం సర్వగం హరిః. 28

యోసావాదిత్యపురుషః సోహమఖణ్డ ఓమ్‌ | సర్వారమ్భపరిత్యాగీ సమదుఃఖసుఖః క్షమీ. 29

భావశుద్ధశ్చ బ్రహ్మాణ్డం భిత్త్వా బ్రహ్మ భ##వేన్నరః |

ఆషాఢ్యాం పౌర్ణమాస్యాం చ చాతుర్మాస్యవ్రతం చరేత్‌. 30

తతో వ్రజేన్నవమ్యాదౌ హ్యృతుసన్ధిషు వాపయేత్‌ | ప్రాయశ్చిత్తం యతీనాం చ ధ్యానం వాయుయమస్తథా.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యతిధర్మనిరూపణం నామైకషష్ట్యధిక శతతమోధ్యాయః.

స్థైర్యము, ఓర్పు, మనోనిగ్రహము, పరధనాపహారము చేయకుండుట, ఇంద్రియనిగ్రహము సిగ్గు, జ్ఞానము సత్యము అక్రోధము ఈ పదియు ధర్మలక్షణములు, కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస అని సన్న్యాసులు నాలుగు విధములు. వీరిలో ఉత్తరోత్తరుడు ఉత్తముడు. ఏకదండి యైనను, త్రిదండి యైనను యోగి బంధనములనుండి విముక్తుడగును. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, ఆపరిగ్రహము, ఈ ఐదును యమములు. శౌచము సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరపూజ- ఇవి నియమములు. సంన్యాసికి పద్మాసనాదులు విహితములు. సగర్భము, అగర్భము అని ప్రాణాయామము రెండు విధములు. జపధ్యానాదులు కలిసినది సగర్భము. మరల ఆ రెండును ఒక్కొక్కటి పూరకము, కుంభకము, రేచకము అని మూడేసి విధములు. వాయువు నింపుట పూరకము; బంధించినచో కుంభకము. విడచుటచే రేచకము. ప్రాణాయామము- ద్వాదశమాత్రాకము, చతుర్వింశన్మాత్రాకము అని మరల మూడేసి విధములు. తాళము, లేదా లఘ్వక్షరము ఒక మాత్ర. ప్రాణయామసమయమున ఓం కారాదులను మెల్లగా జపించవలెను. ఇంద్రియసంయమము ప్రత్యాహారము. జపము చేయు సాధకులు ఈశ్వరుని స్మరించుట ధ్యానము. మనస్సును స్థిరముగా నిలుపుట ధారణ. బ్రహ్మయందు స్థితి సమాధి. ఈ ఆత్మయే వరమాత్మ. ఆత్మ సత్యము జ్ఞానరూపము. అనంతము, విజ్ఞానము, ఆనందరూపమ. ఇదియే బ్రహ్మ. నీవు ఆ బ్రహ్మయే నేను ఆ బ్రహ్మనే. పరబ్రహ్మ జ్యోతిరూపము. అదియే ఆత్మ. వామ(సు)దేవుడు, నిత్యయుక్తము ఓంకారరూపము. దేహేంద్రియ మనో బుద్ధిప్రాణఅహంకారశూన్యమైనది. ఈ బ్రహ్మజాగ్రత్‌ -స్వప్న -సుషుప్త్యాదిముక్త మైనది. అందుచే తురీయము, నిత్యము శుద్ధము, జ్ఞానరూపము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వితీయము, పరజ్యోతియు, అక్షరము, సర్వవ్యాప్తము, హరియు అగు బ్రహ్మయే నేను. ఆదిత్యునిలో ఉన్న అఖండపురుషుడు నేను. ఓం మనుష్యుడు సర్వకర్మలను పరిత్యజించి సుఖదుఃఖములందు సముడై ఓర్పు కలవాడై, భావమునందు పరిశుద్ధుడై, బ్రహ్మాండమును భేదించుకొని బ్రహ్మ యగును. అషాఢపౌర్ణమాసియందు చాతుర్మాస్యవ్రతము ప్రారంభించి చేయవలెను. కార్తికశుక్లనవమి మొదలు సంచారము చేయవలెను. ఋతుసంధిదివసమలందు ముండనము చేయించుకొనవలెను. సన్యాసులకు ధ్యాన - ప్రాణాయామములే ప్రాయశ్చిత్తము.

అగ్ని మహాపురాణమునందు యతిధర్మవర్ణన మను నూట అరువదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters