Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తషష్ట్యధిక శతతమో7ధ్యాయః

అథ పునరయుతలక్షకోటిహోమాః.

అగ్నిరువాచ :

శ్రీశాన్తివిజయాద్యర్థం గ్రహయజ్ఞం పునర్వదే | గ్రహయజ్ఞోయుతుహోమలక్ష కోట్యాత్మకస్త్రిధా. 1

వేదైరైశే హ్యగ్నికుణ్డాద్గ్రహానావాహ్య మణ్డలే | సౌమ్యే గురుర్బుధశ్చై శే శుక్రః పూర్వదలే శశీ. 2

ఆగ్నేయే దక్షిణ భౌమే మధ్యే స్యాద్భాస్కర స్తథా | శనిరాప్యేథ నైరృత్యే రాహుః కేతుశ్చ వాయవ్యే 3

ఈశశ్చోమా గుహో విష్ణుర్బ్రహ్మేన్ద్రో యమకాలకౌ | చిత్రగుప్తశ్చాధిదేవా అగ్ని రాపః క్షితిర్హరిః. 4

ఇన్ద్ర ఐన్ద్రీ దేవతా చ ప్రజేశోహిర్విధిః క్రమాత్‌ | ఏతే ప్రత్యధిదేవాశ్చ గణశో దుర్గయానిలః. 5

ఖమశ్వినీ తాన్‌ సంపూజ్య యజేద్బీజైశ్చ వేదజైః | అర్కః పలాశః ఖదిరో హ్యపామార్గశ్చ పిప్పలః. 6

ఉదుమ్బరః శశీ దూర్వా కుశాశ్చ సమిధః క్రమాత్‌ | మధ్వాజ్యదధిసంమిశ్రా హోతవ్యాశ్చాష్టధా శతమ్‌. 7

ఏకాష్టచతురః కుమ్భా న్పూర్య పూర్ణాహుతిం తథా | వసోర్దారాం తదా దద్యాద్దక్షిణాం చ తతో దదేత్‌. 8

యజమానం చతుర్బిసై#్త రభిషిఞ్చేత్సమన్త్రకైః | సురాస్త్వామభిషిఞ్చన్తు బ్రహ్మవిష్ణుమహేశ్వరాః. 9

వాసుదేవో జగన్నాథస్తథా సఙ్కర్షణః ప్రభుః | ప్రద్యుమ్నశ్చానిరుద్ధశ్చ భవన్తు విజయాయ తే. 10

ఆకణ్డలోగ్నిర్బగవాన్యమో వై నైరృతస్తథా | వరుణః పవనశ్చైవ ధనాధ్యక్షస్తథా శివః. 11

బ్రహ్మణా సహితః శేషో దిక్పాలాః పాన్తు వః సదా | కీర్తిర్లక్ష్మీర్ధృతిర్మేధా పుష్టిః శ్రద్ధా క్రియా మతిః. 12

బుద్ధి ర్లజ్జా వపుః శాన్తిస్తుష్టిః కాన్తిశ్చ మాతరః | ఏతాస్త్వామభిషిఞ్చన్తు ధర్మపత్న్యః సమాగతాః. 13

ఆదిత్యశ్చన్ద్రమా భౌమో బుధజీవసితార్కజాః | గ్రహాస్త్వామభిషిఞ్చన్తు రాహుః కేతుశ్చ తర్పితాః. 14

దేవదానవ గనర్వా యక్షరాక్షసపన్నగాః | బుషయో మనవో గావో దేవమాతర ఏవ చ. 15

దేవపత్న్యో ద్రుమా నగా దైత్యాశ్చాప్సరసాం గణాః | అస్త్రాణి సర్వశస్త్రాణి రాజానో వాహనాని చ. 16

ఔషధాని చ రత్నాని కాలస్యావయవాశ్చ యే | సరితః సాగరాః శైలాస్తీర్థాని జలదా నదాః. 17

ఏతే త్వామభిషిఞ్చన్తు సర్వకామార్థసిద్దయే |

అగ్ని పలికెను : ఐశ్వర్యము, శాంతి, విజయము మొదలగునవి లభించుటకై గ్రహయజ్ఞమును గూర్చి మరల చెప్పెదను. పదివేల హోమములు, లక్షహోమములు, కోటి హోమములు అని గ్రహయజ్ఞము మూడు విధములు. అగ్ని కుండవేదికి ఈశాన్యమునందు మండలమున గ్రహములను ఆవాహన చేయవలెను. ఉత్తరమున గురువును, ఈశాన్యమునందు బుధుని, పూర్వదళమునందు శుక్కుని, ఆగ్నేయమున చంద్రుని, దక్షిణమున కుజుని. మధ్యభాగమున సూర్యుని, పశ్చిమము నందు శనిని, నైరృతియందు రాహువును, వాయవ్యమునందు కేతువును, ఆవాహన చేయవలెను. శివ-పార్వతీ-కార్తికేయ-విష్ణు-బ్రహ్మ-ఇంద్ర-యమ-కాల-చిత్రగుప్తులు అధిదేవతలు. అగ్ని-వరుణ-భూమి-విష్ణు-ఇంద్ర-శచీ-ప్రజాపతి-సర్ప-బ్రహ్మలు ప్రత్యధిదేవతలు. గణశ-దుర్గా-వాయు-ఆకాశ-అశ్వనీకుమారులు కర్మసాద్గుణ్యదేవతలు ఈ దేవతల నందరిని వైదికబీజాక్షరములతో పూజించవలెను. అర్క-పలాశ-ఖదిర-అపామార్గ-పిప్పల ఉదుంబర-శమీ-దూర్వా-కుశలు-వరుసగ రవ్యాదులకు సమిధలు. వీటిని మధువు, ఆజ్యము, పెరుగు-వీటితో నూరు చొప్పున ఎనిమిది పర్యాయములు హోమములు చేయవలెను. నూట ఎనిమిది మరియు నాలుగు పూర్ణకుంభములు ఉంచి, పూర్ణాహుతి, వసుధార ఇవ్వవలెను. పిదప బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వవలెను. నాలుగు కలశలలోని జలముతో యజమానునకు అభిషేకము చేయవలెను. ''బ్రాహ్మవిష్ణు మహేశ్వరాది దేవతలు నీకు అభిషేకము చేయదురు గాక. వాసుదేవుడు, జగన్నాథుడైన సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు నీకు విజయము నిచ్చుగాక. దేవరాజైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, ధనాధ్యక్షుడైన కుబేరుడు, శివుడు, బ్రహ్మ, ఆదిశేషుడు, సకలదిక్పాలకులు, సర్వదా నిన్ను రక్షింతురుగాక. కీర్తి, లక్ష్మీ, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ద, క్రియ, మతి, బుద్ధి, లజ్జ, వపుష్‌, శాంతి, తుష్టి, కాంతి, లోకజననులైన ఈ ధర్మపత్నులు నీకు అభిషేకము చేయుదురు గాక. ఆదిత్య-చంద్ర-కుజ-బుధ-గురు-శుక్ర-శని, రాహు-కేతువులు పరితృప్తులై నీకు అభిషేకము చేయుదురుగాక! దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సర్పములు, బుషులు, మునులు, గోవులు, దేవమాతలు, దేవాంగనలు, వృక్షములు, నాగులు, దైత్యులు, అప్సరస్సమూహములు, అస్త్రశస్త్రములు, రాజులు వాహనములు, ఓషధులు, రత్నములు, కాలవిభాగములు, నదీనగరములు, సముద్రముల, పర్వతములు, తీర్థములు, మేఘములు నీ సకలాభీష్టసిద్ధికై నీకు అభిషేకము చేయుదురుగాక.''

అలఙ్కృతస్తతో దద్యాద్ధేమగోధువాదికమ్‌ 18

కపిలే సర్వదేవానాం పూజనీయాసి రోహిణి | తీర్థదేవమయీ యస్మాదతః శాన్తిం ప్రయచ్ఛ మే. 19

పుణ్యస్త్వం శఙ్ఖపుణ్యానాం మఙ్గలానాం చ మఙ్గలమ్‌ | విష్ణునా విధృతో నిత్యమతః శాన్తిం ప్రయచ్ఛ మే

ధర్మ త్వం వృషరూపేణ జగదానన్ద కారకః |అష్టమూర్తేధిష్ఠానమతః శాన్తిం ప్రయచ్ఛమే. 21

హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః | అనన్త పుణ్యఫలదమతః శాన్తిం ప్రయచ్ఛ మే. 22

పీతవస్త్రద్వయం యస్యాద్వాసుదేవస్య వల్లభమ్‌ |

ప్రదానాత్తస్య వై విష్ణురతః శాన్తిం ప్రయచ్ఛ మే. 23

విష్ణుస్త్వం మత్స్యరూపేణ యస్యాదమృతసమ్భవః | చన్ద్రార్కవాహనో నిత్యమతః శాన్తిం ప్రయచ్ఛ మే. 24

యస్మాత్త్వం పృథివీ సర్వా ధేనుః కేశవసన్నిభా | సర్వపాపహరా నిత్యమతః శాన్తింత ప్రయచ్ఛ మే. 25

యస్మాదాయసకర్మాణి తవాధీనాని సర్వదా | లాంగలాద్యాయుధాదీని హ్యతః శాన్తిం ప్రయచ్ఛ మే. 26

యస్యాత్త్వం సర్వయజ్ఞానామఙ్గత్వేన వ్యవస్తితః | యోనిర్విభావసోర్నిత్యమతః శాన్తిం ప్రయచ్ఛ మే. 26

యజమానుడు పిదప అంలకృతుడై ఈ క్రింది మంత్రములు చదువుచు సువర్ణ-గో-భూదానాదులు చేయలెను. ''ఓ కపిలధేనువా! రోహిణీ! నీవు సర్వదేవతలచే పూజించదగినదానవు. నీవు సకలతీర్థ-దేవతాస్వరూపిణివి. అందుచే నాకు శాంతి నిమ్ము. '' ''ధర్మమా! నీవు వృషభరూపమున జగదానందకారకుడువు. శివునకు వాహన మైనదానవు. అందువలన నాకు శాంతి నిమ్ము. '' ''హిరణ్యగర్భుని గర్భమునం దున్న సూర్యుని హేమబీజము ఆనంతపుణ్యఫలముల నిచ్చును. అందు వలన నాకు శాంతినిమ్ము''. ''పీతవస్త్రద్వయము విష్ణువునకు చాల ఇష్టమైనది. దానిని సమర్పించుటచే విష్ణువు సంతసించును. అందుచే నాకు శాంతినిమ్ము''. ''విష్ణు వైన నీవు మత్స్యరూపముతో అమృతమునకు కారణభూతుడవు. చంద్రార్కవాహనుడవు. అందుచే నాకు శాంతి నొసగుము.'' ''పృథివి యైన నీవు ధేనువుగా నుండి కేశవునితో సమానురాలవు. సర్వపాపములను నశింపచేయుదానవు. అందువలన నాకు శాంతి నిమ్ము.'' ''ఓ, అయోవికార మైనదానా! ఎల్లపుడును అన్ని పనులు నీ అధీనములో నుండును. లాంగలాదులు ఆయుధాదులు ఆయుధాదులు కూడ నీ అధీనము. అందుచే నాకు శాంతి నొసగుము.'' ''నీవు సర్వయజ్ఞములకును అంగముగా నున్నావు. అగ్నికి కారణ మైనదానవు. అందుచే నాకు శాంతి నిమ్ము.''

గవామఙ్గేషు తిష్ఠన్తి భువనాని చతుర్దశ | యస్మాత్తస్మాచ్ఛివం మే స్యాదిహ లోకే పరత్ర చ. 28

యస్మాదశూన్యం శయనం కేశవస్య శివస్య చ | శయ్యా మమాప్యశూన్యాస్తు దత్తా జన్మని జన్నని. 29

యథా రత్నేషు సర్వేషు సర్వదేవాః ప్రతిష్ఠితాః | తథా శాన్తిం ప్రయచ్ఛన్తు రత్నదానేనమే సురాః. 30

యథా భూమిప్రదానస్య కలాం నార్హన్తి షోడశీమ్‌ | దానాన్యన్యాని మే శాన్తిర్భూమిదానాద్భవత్విహ. 31

గ్రహయజ్ఞోయుతహోమో దక్షిణాచ రణ జితిః | వివాహోత్సవయజ్ఞేషు ప్రతిష్టాదిషు కర్మసు. 32

సర్వకామాప్తయే లక్షకోటిహోమద్వయం మతమ్‌ |

గృహదేశే మణ్డపేథ హ్యయుతే హస్త మాత్రకమ్‌. 33

మేఖలాయోని సంయుక్తం కుణ్డం చత్వార బుత్విజః | స్వయమేకోపి వా లక్షే సర్వం దశగుణంహితత్‌.

చుతర్హస్తం ద్విహస్తం వా తార్ష్యం చాత్రాధికం యజేత్‌ | సామధ్వనిశరీరస్త్వం వాహనం పరమేష్ఠినః. 35

విషస్యాపహారో నిత్యమతః శాన్తిం ప్రయచ్ఛ మే | పూర్వవత్కుణ్డమామన్త్ర్య లక్షహోమం సమాచరేత్‌. 36

వసోర్ధారాం తతో దద్యా చ్ఛయ్యాభూషాదికం దదేత్‌ | తత్రాపి దశచాష్టౌ చ లక్షహోమే తథర్త్విజః. 37

పుత్రాన్నరాజ్యవిజయభుక్తి ముక్త్యాది చాప్నుయాత్‌ | దక్షిణాభిః ఫలేనాస్మాచ్ఛత్రుఘ్నః కోటిహోమకః. 38

చతుర్హస్తం చాష్టహస్తం కుణ్డం ద్వాదశ చ ద్విజాః |

పఞ్చవింశంషోడశం వా పటే ద్వారే చతుష్టయమ్‌. 39

కోటిహామీ సర్వకామీ విష్ణులోకం స గచ్ఛతి | హోమస్తు గ్రహమన్త్రైర్వా గాయత్ర్యా వైష్ణవైరపి. 40

జాతవేదోముఖైః శైవైర్వైదికైః ప్రథితైరపి | తిలైర్యవైర్ఘృతైర్ధాన్యైరశ్వమేధ ఫలాదిభాక్‌. 41

విద్వేషణాభిచారేషు త్రికోణం కుణ్డమిష్యతే | సమిధో వామహస్తేన శ్యేనాస్థ్యనలసంయుతాః. 42

రక్తభూషైర్ముక్త కేశైర్ధ్యాయద్భిరశివం రిపోః | దుర్మిత్రియాస్తసై#్యసన్తు యోద్వేష్టి హూం ఫడితి. 43

ఛిన్ద్యాత్‌ క్షారేణ ప్రతిమాం పిష్టరూపం రిపుం హనేత్‌ |

యజేదేకం పిణ్డకం వా యః స కృత్వా దివం వ్రజేత్‌. 44

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఆయుతలక్షకోటి హోమో నామ సప్తషష్ట్యధిక శతతమోధ్యాయః.

''గోవుల అవయవములందు చతుర్దశభువనములును ఉన్నవి. అందువలన నాకు ఇహపరలోకములందు మంగఃమగుగాక.'' ''కేశవుని శయ్యము, శివుని శయ్యయుఎన్నడును శూన్యములు కావు. నేనిచ్చు శయ్య కూడ అన్ని జన్మ లందును శూన్యము కాకుండ ఉండుగాక. సర్వదేవతలును సర్వరత్నములందు ప్రతిష్టితులై యున్నారు. అందుచేత ఈ రత్నదానముచే దేవతలు నాకు శాంతి నిత్తురుగాక. ఇతర దానము లేవియు భూదానము పదునారవ అంశమునకు సాటిరావు. అదుచే ఈ భూదానమువలన నాకు శాంతి కలుగుగాక. అయుతహోమములతో సదక్షిణముగా చేసిన గ్రహయజ్ఞము యద్ధము నందు విజయము నిచ్చును. వివాహములు, ఉత్సవములు, యజ్ఞములు, ప్రతిష్ఠలు మొదలగు కర్మలో ఈ గ్రహయజ్ఞము చేయవలెను. లక్ష హోమ-కోటిహోమములను సకల కామావాస్తికొరకు చేయవలెను. గృహమునందు మండపము ఏర్పరచి, ఆయుతహోమముల నిమిత్తము ఒక హస్తము ప్రమాణము గల కుండమును ఏర్పరుపవలెను. దానికి మేఖలలు, యోని ఉండవలెను. నలుగురు బుత్విక్కులు, లేదా తానొక్కడే చేయవచ్చును. లక్షహోమములందు అన్నియు పది రెట్లు ఉండును. కుండము నాలుగు లేదా రెండు హస్తముల ప్రమాణమున ఉండవలెను. ఇందు అధికముగ తార్యుని కూడ పూజించవలెను. ''ఓ తార్‌క్ష్య! నీశరీరము సామధ్వనిరూపము. నీవు పరమాత్ముని వాహనము. విషమును నశింపచేయుదువు. అందుచే నాకు నిత్యముశాంతినిమ్ము.'' వసోర్ధారను పిమ్మట శయ్యాభూషణాదికములను దానము చేయవలెను. లక్షహోమమునందు పదిమంది లేదా ఎనమండుగురు బుత్విక్కులుందురు. దాని వలన పుత్రులను, అన్నమును, రాజ్యమును, విజయమును, భుక్తిముక్త్యాదులను పొందును. కోటిహోమయజ్ఞము సదక్షిణాకముగా చేసినచో వెనుక చెప్పిన స్థలములే కాక శత్రు వినాశనమును గూడ చేయును. నాలుగు లేదా ఎనిమిది హస్తముల కుండము, పన్నెండు బుత్విక్కులు, పటమునందు ఇరువదియైదులేదాపండ్రెండు కలశలను ద్వారమునందు నాలుగు కలశలను ఉంచవలెను. కోటి హోమములు చేసినవాడు సర్వకామములను పొంది విష్ణులోకము చేరును. గ్రహమంత్రములతో గాని, గాయత్రితో గాని, వైష్ణవమంత్రములతో గాని, జాతవేదోముఖమంత్రములతో గాని, శైవమంత్రములతో గాని, ప్రసిద్ధములైన వైదికమంత్రములతో గాని, తిల-యవ-ధాన్య-ఘృతములతో హోమములు చేయవలెను. ఇట్లు చేసినవాడు అశ్వమేధాది యాగఫలమును పొందును. ద్వేషముతో అభిచారహోమములు చేయనపుడు కుండము త్రికోణాకారములో నుండును. డేగ ఎముకలతో అగ్నితో కూడిన సమిధలను ఎడమచేతితో హోమము చేయవలెను. హోమము చేయువారు శత్రువునకు అమంగళమును కోరుచు, ఎఱ్ఱని అలంకరణములు ధరించి, జుట్టు విరబోసికొని ''దుర్మిత్రాస్తసై#్మ సన్తు యో ద్వేష్టి హుం ఫట్‌'' అను మంత్రము చదువుచు హోమము చేయవలెను. క్షురముతో ప్రతిమను ఛేదించవలెను. పిష్టముతో చేసిన శత్రువును చంపవలెను. దానిని అగ్నియందు హోమము చేయవలెను. ఈ విధముగా చేసినవాడు స్వర్గము పొందును.

అగ్నిమహాపురాణమునందు అయుతలక్షకోటిహోమ మను నూటఅరువదిఏడవ అధ్యాయము సమాప్తమ.

Sri Madhagni Mahapuranamu-1    Chapters