Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సృష్టివర్ణనమ్‌

అగ్ని రువాచ :

జగత్సర్గాదికాం క్రీడాం విష్ణోర్వక్ష్యే7ధునా శృణు | స్వర్గాదికృత్స సర్గాదిః సృష్ట్యాదిః సగుణో7గుణః. 1

అగ్ని పలికెను- ఇపుడు విష్ణువుయొక్క జగత్సృష్టలి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.

బ్రహ్మావ్యక్తం సదగ్రే7భూన్న ఖం రాత్రిదినాదికమ్‌ ప్రకృతిం పురుషం విష్ణుం ప్రవిశ్యాక్షోభయత్తతః. 2

ప్రారంభమున సద్రూప మేన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్య) ప్రకృతిని, పురుషు డైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.

సర్గకాలే మహత్తత్త్వ మహఙార స్తతో7భవత్‌ | వైకారిక సై#్తజసశ్చ భూతారిశ్చైవ తామసః. 3

సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్త్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణ మైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.

అహఙ్కారాచ్ఛబ్దమాత్రమాకా శమబవత్తతః | స్పర్శమాత్రో7నిల స్తస్మాద్రూపమాత్రోనలస్తతః. 4

రసమాత్తరా ఆప ఇతో గన్ధమాత్రా మహీ స్మృతా | అహఙ్కారాత్తామసాత్తు తైజసానీన్ద్రియాణి చ. 5

వై కారికా దశ దేవా మన ఏకాదశేన్ద్రియమ్‌ | తతః స్వయమ్భూర్భగవాన్‌ సిసృక్షుర్వివాధాః ప్రజాః. 6

అప ఏవ సనర్జాదౌ తాసు వీర్యమపాసృజత్‌ | ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః. 7

ఆయనం తస్య తాః పూర్వం తేన నారాయణః స్మృతః |

ఆహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్లెను. కదా. పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణు డని చెప్పబడెను.

హిరణ్యవర్ణమభవత్తదణ్డముదకేశయమ్‌. 8

తస్మిఞ్జజ్ఞే స్వయం బ్రహ్మా స్వయంభూరితి నః శ్రుతమ్‌ |

ఉదకములో నున్న ఆ వీర్యము బంగారు వర్ణము గల అండముగా అయెను. దానియందు స్వయంభు దైన బ్రహ్మ జనించెనని మేము వింటిమి.

హిరణ్యగర్భో భగవానుషిత్యా పరివత్సరమ్‌. 9

తదణ్డమకరోద్ధ్వెదం దివం భువమథాపి చ | తయోః శకలయోర్మధ్యే ఆకాశమసృజత్ర్పభుః. 10

అప్సు పారిప్లవాం పృథ్వీం దిశశ్చ దశధాదధే | తత్ర కాలం మనో వాచం కామం క్రోధమథో రతిమ్‌. 11

ససర్జ సృష్టిం తద్రూపాం స్రష్టుమిచ్ఛన్‌ ప్రజాపతిః |

బగవంతు డైన హిరణ్యగర్భుడు ఆ అండమునందు పరివత్సరము కాల ముండి, దానిని రెండు వ్రక్కలుగా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను ఆ రెండు వ్రక్కల మధ్మయందు ఆకాశమును సృజించెను. ఉదకము నుందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధమును, మరియు రతిని నిర్మించెను. ప్రజాపతి ఈ రాబోవు సృష్టిని పైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.

విద్యుతో7శనిమేఘాంశ్చ రోహితేన్ద్రధనూషి చ. 12

వయాంసి చ ససర్జాదౌ వర్జన్యం బాధ వక్త్రతః | బుచో యజూంషి సామాని నిర్మమే యజ్ఞసిద్దయే. 13

మేఱుపులను, వజ్రమును (పిడుగును). మేఘములను, రక్తమును, ఇంద్రధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్రధనుస్సులను, పక్షులను వర్జన్యుని సృజించెను పిదప యజ్ఞసిదికొరకై ముఖమునుండి బుగ్యజుఃసామవేదములను సృజించెను.

సాధ్యాం సై#్తరయజద్దేవాన్‌ భూతముచ్ఛావచం భుజాత్‌ | సనత్కుమారం రుద్రం చ సర్జ క్రోధసమ్బవమ్‌.

మరీచిమత్ర్యజీరసం పులస్త్యం పులహం క్రతుమ్‌ | వసిష్ఠం మానసాః సప్త బ్రహ్మాణ ఇతి నిశ్చితాః. 15

సపై#్తతే జనయన్తి స్మ ప్రజా రుద్రాశ్చ సత్తమ |

ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధముల లగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధమునుండి రుద్రుని సృజించెను. మరీచి, ఆత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు. క్రతువు, వసిష్ఠుడు అనువారిని సృజించెను. ఈ ఏడుగురును బ్రహ్మమానసపుత్రు లగు బ్రహ్మ లని ప్రసిద్ది చెందిరి. ఈ సప్త బ్రహ్మలును. రుద్రులను ప్రజాసృష్టి చేసిరి.

ద్విదా కృత్వాత్మనో దేహమర్దేన పురుషో7భవత్‌ | అర్దేన నారీ తస్యాం స బ్రహ్మా వై చాసృజత్ర్పజాః. 16

తన దేహమును రెండు భాగములుగా చేసి. ఒక భాగము పురుసుడు గాను, మరొక భాగము స్త్రీగాను అయి బ్రహ్మ ఆమె యందు ప్రజలను సృజించెను.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే జగత్సర్గవర్ణనం నామ సప్తదశో7ధ్యాయః.

అగ్ని మహాపురాణమునందు జగత్సృష్టివర్ణన మను సప్తదశాధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters