Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకసప్తత్యధిక శతతమోధ్యాయః

అథ పునః ప్రాయశ్చిత్తాని

పుష్కర ఉవాచ :

ప్రాయశ్చిత్తం రహస్యాది వక్ష్యే శుద్ధికరం పరమ్‌ | పౌరుషేణ తు సూక్తేన మాసం జప్యాది నాఘహా. 1

ముచ్యతే పాతకైః సర్వైర్జప్త్వా త్రిరఘమర్షణమ్‌ | వేదజప్యాద్వాయువయాద్గాయత్ర్యా వ్రతతోఘహా. 2

ముచ్యతే పాతకై సర్వెర్జప్త్వా త్రిరఘమర్షణమ్‌ | వేదజప్యాద్వాయు యమాద్గాయత్ర్యా వ్రతతో7 ఘహా. 3

ముణ్డనం సర్వకృచ్ఛ్రేషు స్నానం హోమో హరేర్యజిః | ఉత్థితస్తు దివా తిష్ఠేదుపవిష్ట స్తథా నిశి. 4

ఏతద్వీరాసనం ప్రోక్తం కృచ్ఛ్రకృత్తేన పాపహా | అష్టభిః ప్రత్యహం గ్రాసైర్యతి చాన్ద్రాయణం స్మృతమ్‌.

ప్రాతశ్చతుర్భిః సాయం చ శిశుచాన్ద్రాయణం స్మృతమ్‌ | యథాకథఞ్చిత్పిణ్డానాం చత్వారిం శచ్ఛతద్వయమ్‌.

మాసేన భక్షయేదేతత్సురచాన్ద్రాయణం చరేత్‌ | త్య్రహముష్ణం పిబేదాపస్త్ర్యహముష్ణం పయః పిబేత్‌. 7

త్య్రహముష్ణం ఘృతం పీత్వా వాయుభక్షీ భ##వేత్త్య్రహమ్‌ |

తప్తకృచ్ఛ్రమిదం ప్రోక్తం శీతైః శీతం ప్రకీర్తితమ్‌. 8

కృచ్ఛ్రాతికృచ్ఛ్రం పయసా దివసానేకవింశతిమ్‌ | గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్‌.

ఏకరాత్రోపవాసశ్చ కృచ్ఛ్రం సాన్తపనం స్మృతమ్‌ | ఏతచ్చ ప్రత్యహాభ్యస్తం మహాసాస్తపనం స్మృతమ్‌.

త్య్రహాభ్యస్తమథైకైక మతిసాన్తపనం స్మృతమ్‌ | కృచ్ఛ్రం పరాకసంజ్ఞం స్యాద్ద్వాదశాహ మభోజనమ్‌. 11

ఏకభక్తం త్య్రహాభ్యస్తం క్రమాన్నక్తమయాచితమ్‌|

ప్రాజాపత్యముపోష్యాన్తే పాదః స్యాత్‌ కృచ్ఛ్రపాదకః. 12

ఫలైర్మాసం ఫలం కృచ్ఛ్రం బిల్త్వెః శ్రీకృచ్ఛ్ర ఈరితః |

పద్మాక్షైః స్యాదామలకైః పుష్పకృచ్ఛ్రం తు పుష్పకైః. 13

పత్రకృచ్ఛం తథా పత్త్రెస్తోయకృచ్ఛ్రం జలేన తు | మూలకృచ్ఛ్రం తథా మూలైర్దధ్నా క్షీరేణ తక్రతః.

మాసం వాయవ్యకృచ్ఛ్రం స్యాత్పాణిపూరాన్న భోజనాత్‌ |

తిలైర్ద్వాదశరాత్రేణ కృచ్ఛ్రమాగ్నేయమార్తినుత్‌. 15

పక్షం ప్రసృత్యా లాజానం బ్రహ్మకూర్చం తథా భ##వేత్‌ | ఉపోషితశ్చతుర్దశ్యాం పఞ్చదశ్యామనన్తరమ్‌.

పఞ్చగవ్యం సమశ్నీ యాద్దవిష్యాశీత్వనన్తరమ్‌ | మాసేన ద్విర్నరః కృత్వా సర్వాపాపైః ప్రముచ్యతే. 16

శ్రీకామః పుష్టికామశ్చ స్వర్గకామో7ఘనష్టయే | దేవతారాధనపరః కృచ్ఛ్రకారీ స సర్వభాక్‌. 17

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే రహస్యాదిప్రాయశ్చిత్తం నామ ఏకసప్తత్యధికశతతమో7ధ్యాయః.

పుష్కరుడు చెప్పెను : మిక్కిలి శుద్ధికర మైన రహస్యాది ప్రాయశ్చిత్తమును చెప్పెదను. ఒక మాసము పురుషసూక్తము జపించినచో సర్వపాపములను నశింపచేసికొనును. అఘమర్షణసూక్తము మూడు పర్యాయములు జపించినచో సర్వపాపములనుండియు విముక్తుడగును. వేదమును జపించుటవలనను, ప్రాణాయామమువలనను, గాయత్రీజపముచేతను, వ్రతము వలనను పాపములను తొలగించుకొనును. సర్వకృచ్ఛ్రములందును ముండనము, స్నానము, హోమము, విష్ణు పూజ చేయవలెను. కృచ్ఛ్రవ్రతము చేయువాడు పగలు నిలచియు, రాత్రి కూర్చుండియు ఉండవలెను. దీనికి వీరాసన మని పేరు. ఈ విధముగ చేసినచో పాపాము లన్నియు తొలగించుకొనును. ప్రతిదినము ఎనిమిది గ్రాసముల చొప్పున తిన్నచో అది యతి చాంద్రాయణము. ప్రాతఃకాలము నాలుగు, సాయంకాలము నాలుగు గ్రాసములు తిన్నచో శిశుచాంద్రాయణము. ఎట్లు తిన్నను మొత్తము మాసములో రెండువందల నలుబది గ్రాసములు తిన్నచో సురచాంద్రాయణము. మూడు దినములు వేడి ఉదకములు, మూడు దినములు వేడిపాలు, మూడు దినములు వేడి నెయ్యి త్రాగి, మూడు దినములు వాయువును మాత్రము భక్షించవలెను. దీని పేరు ''తప్తకృచ్ఛ్రము'' ఈ పదార్థములనే చల్లనివి తీసికున్నచో అది ''శీతకృచ్ఛ్రము'' ఇరువది యొక్క దినములు పాలుమాత్రమే త్రాగి ఉన్నచో కృచ్ర్ఛాతికృచ్ఛ్రము. గోమూత్రము, గోమయము, గోక్షీరము, పెరుగు, నెయ్యి, కుశోదకము, ఒక రాత్రి ఉపవానము ఇది కృచ్ఛ్రసాంతపనము. ఈ విధముగ ప్రతిదినమునను చేసినచో ''మహా సాంతపనము'' ఒక్కొక్కటి మూడేసి రోజులు చేసినచో అతిసాంతపనము. పండ్రెండు దివసములు భోజనము లేకుండ ఉండుట పరాకకృచ్ఛ్రము. మూడు దినములు ప్రాతఃకాలము, మూడు దినములు సాయంకాలము, మూడు దినములు అయాచితాన్నము భుజించి ఉపవాసము చేసినచో అతి ప్రాజాపత్యము; దీనిలో నాల్గవ వంతు చేసిన పాదకృచ్ఛ్రము. ఒక మాసము ఫలములు మాత్రము తిన్నచో అది ఫలకృచ్ఛ్రము; బిల్వఫలములచే శ్రీకృచ్ఛ్రము. తామరగింజలతోను, ఆమలకములచేతను ఆకృచ్ఛ్రములు. పుష్పములచే పుష్పకృచ్ఛ్రము, పత్రములు తిన్నచో పత్రకృచ్ర్ఛము, ఉదకముమాత్రము త్రాగిన ఉదకకృచ్ర్ఛము, దుంపలు తిన్నచో మూలకృచ్ర్ఛము, దధి-క్షీర-తక్రములచే దధికృతచ్ఛ్రక్షీరకృచ్ఛ్ర-తక్రకృచ్ఛ్రములు. యిచేనిండు నంత మాత్రము అన్నమే ఒక మాసము తిన్నచో అది వాయవ్యకృచ్ఛ్రము. పండ్రెండు దినములు తిలలు మాత్రమే తిన్నచో అది పీడావినాశక మగు అగ్నేయకృచ్ఛ్రము. చారెడు లాజలుమాత్రమే తిన్నచో అది బ్రహ్మకూర్చము. చతుర్దశియందును, పూర్ణిమయందును ఉపవాసము చేసి పిదప పంచగవ్యములను భుజించవలెను. పిదప హవిస్సును భుజించవలెను. ఈ విధముగ మాసమునందు రెండు పర్యాయములు చేయువాడు సర్వపాపవిముక్తు డగును. శ్రీకాముడును, పుష్టికాముడును, స్వర్గకాముడును పాపవినాశార్థమై దేవతారాధనపరుడై కృచ్ఛ్రములు చేసినచో సర్వ మనోరథములను పొందును.

అగ్ని మహాపురాణమునందు రహస్యాదిప్రాయశ్చిత్త కథన మను నూటడెబ్బదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters